ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రస్తావించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి టికెట్ల నిర్ణయం, మేనిఫెస్టో అంశాలు చివరి నిమిషంలో ప్రకటిస్తున్నారని, ఈసారి ముందుగానే ప్రకటించాలని వర్కింగ్ కమిటీలో కోరినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టో ఎన్నికల ప్రచారం మొదలైన తరువాత విడుదల చేయడం కారణంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నట్లు కమిటీకి వెల్లడించిట్లు తెలిపారు.
మేనిఫెస్టో ఆధారంగా ప్రజల్లోకి వెళ్లితే బాగుంటుందని, దానిలో ప్రజలకు ఏం ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకుంటారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా రైతులందరికి పంట బీమా కల్పించేలా, రైతుల మీద భారం పడకుండా ఓ బీమా పథకాన్ని తీసుకురావాలని వర్కింగ్ కమిటీకి సూచించినట్లు వెల్లడించారు. పార్టీ నేతలు రహస్యంగా మాట్లాడుకునే విషయాలను మీడియాకి తెలియజేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని.. అలాంటి నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేసినట్లు ఉత్తమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment