సాక్షి, బెంగళూరు: కన్నడనాట రాసలీలల సీడీ కేసు దర్యాప్తులో క్రమంగా కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. వీడియోలో కనిపించి పదవిని కోల్పోయిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని మంగళవారం సిట్ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో సుమారు రెండు గంటల పాటు విచారించి నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వీడియో సీడీ సంగతి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని రమేశ్ చెప్పినట్లు తెలిసింది.
ఆ వీడియోను చూపి రూ. ఐదు కోట్లను ఇవ్వాలని తనను డిమాండ్ చేశారని తెలిపారు. కానీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర పన్నారని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment