బనశంకరి/కర్ణాటక: సీడీ కేసులో ఉన్న అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. ఇప్పటికి ఐదారుమందిని పిలిపించి విచారించి సమాచారం సేకరించింది. అనుమానిత వ్యక్తి ర.26 లక్షల నగదు తీసుకున్నట్లు తేలింది. మరో వ్యక్తి విలువైన కారు కొనుగోలుకు యత్నించారని తెలిసింది. ఇప్పటికి 8 మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసింది. కొందరి ఇళ్లపై దాడిచేసి కంప్యూటర్లు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది.
దొరకని సూత్రధారులు
నిత్యం సిమ్‌కార్డులు మార్చడం, ప్రాంతాలు మారుతూ సంచరిస్తున్న మాజీ మంత్రి వీడియో సీడీ సూత్రధారులు పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత 4 సిట్ బృందాలు గాలిస్తున్నారు. సీడీలో ఉన్న యువతితో ఇద్దరు సూత్రధారులు కలిసి ఉన్నారని అనుమానిస్తున్నారు. గోవా, తిరుపతి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వెతికినా ఫలితం లేదు. ఒక్కో ఊరిలో కొత్త సిమ్‌లు కొని వాడి పడేస్తున్నారు. ఫోన్ చేశాక స్విచ్చాఫ్ చేస్తున్నారు. దీంతో కనుక్కోవడం కష్టమవుతోందని అన్నారు.
యువతి ప్రైవేటు ఉద్యోగిని
యువతికి సూత్రధారులతో మంచి పరిచయాలు ఉన్నాయని సిట్ పోలీసులు భావిస్తున్నారు. ఒక నిందితునికి ఆమె క్లాస్‌మేట్ అని తెలిసింది. బెంగళరులో ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.30 వేల వేతనంతో ఉద్యోగం చేసేది. కన్నడ సంఘాల్లో చురుగ్గా పనిచేసేదన్నారు. మీడియా వారితోనూ సంబంధాలు కలిగి ఉండేదని తేల్చారు.
చదవండి: అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు
రాసలీలల కేసు: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’
Comments
Please login to add a commentAdd a comment