సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా.. క్షుద్ర పూజల కలకలం రేగింది. అదీ ఏకంగా ఒక పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ స్కూల్‌లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
స్కూల్‌లోని సైన్స్ ల్యాబ్‌తోపాటు స్టోర్ రూమ్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్‌లో సీసీ ఫుటేజ్‌లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment