సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment