chagalamarri
-
నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత
సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మృత్యుంజయుడు ఆ బాలుడు
Boy Rescued From the Debris of a Collapsed Building in Chagalamarri: పై చిత్రంలో మట్టి శిథిలాల మధ్య రోదిస్తున్న బాలుడి పేరు చరణ్.. ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లి శుక్రవారం సాయంత్రం చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తన స్వగృహానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు వంట రూంలో ఉండగా.. చరణ్ మరో రూంలో సోఫాలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దె తడిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో చరణ్ ఉన్న గది కూలిపోయింది. శిథిలాల కింద బాలుడు కూరుకుపోయాడు. తండ్రి పుల్లయ్య అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతికష్టం మీద బాలుడిని బయటకు తీశారు. చరణ్ స్వల్ప గాయాలతో బయట పడడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
జగన్ సీపిఎస్ రద్దు హామీపై టీచర్ల హర్షం
-
చాగలమర్రిలో కానిస్టేబుల్ వీరంగం
-
చాగలమర్రిలో కానిస్టేబుల్ వీరంగం
- ఏటీఎం వద్ద ఖాతారుడిపై వీరంగం - చెయ్యి విరిగి ఆసుపత్రి పాలు - హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపిన అధికారులు చాగలమర్రి: ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూలో ఉన్న ఓ ఖాతాదారుడిపై హెడ్‌కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్బీఐ వద్ద బుధవారం ఉదయం 9 గంటలకే జనం బారులుదీరారు. ఒక్కొక్కరు రెండు, మూడు కార్డులతో వచ్చి డబ్బులు డ్రా చేస్తుండటంతో క్యూ ముందుకు కదలక అప్పటికే ఖాతాదారులు విసిగిపోయారు. 11.30 గంటల సమయంలో హెడ్‌కానిస్టేబుల్ రాజాహుసేన్ క్యూను కాదని వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోతూ ఒక కార్డుతోనే విత్‌డ్రా చేయించాలని బందోబస్తుగా ఉన్న కానిస్టేబుల్‌ను ఆదేశించాడు. అయితే .. ఎస్ఐ సార్ రెండు కార్డులతో తీసుకోమని, చెప్పారని.. ఇప్పుడు మీరు వచ్చి ఒక సారి మాత్రమే డబ్బులు తీసుకోవాలని చెబితే ఎలా అంటూ క్యూలో ఉన్న ఖాతాదారుడు సుధాకర్ ప్రశ్నించారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. మాటామాట పెరిగి యువకుడిపై దాడి చేయడంతో చెయ్యి విరిగింది. పక్కన ఉన్న వారందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన యువకుడిని కేరళా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ మోహన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని విచారించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. -
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
చక్రవర్తులపల్లె(చాగలమర్రి): అప్పులబాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చక్రవర్తులపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి (45), తిరుపాలమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి సంతానం లేదు. గ్రామంలోని తన నాలుగు ఎకరాల పొలంలో పంటలు సాగు చేస్తూ జీవిస్తున్నారు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో మినుము, ఎకరాలో వరి పంటను సాగు చేశాడు. సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో తెగుళ్లు సోకడంతో మందులు, ఎరువులకు పెట్టుబడి లేక భార్యాభర్తలు రెండు రోజులుగా తీవ్ర ఆందోళన చెందారు. గత ఏడాది తీసుకొన్న అప్పులు తీరక, కొత్త అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి గురువారం తెల్లవారు జామున పొలాని వెళ్లి అక్కడే పురుగు మందు సేవించి అపస్మారక స్థితిలో పడి పోయాడు. పక్క పొలాల్లో కూలీలు గమనించడంతో హుటా హుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలుకు తరలించారు. కోలుకోలేక కొద్దిసేపటికి మృతి చెందాడు. రామకృష్ణారెడ్డి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. చాగలమర్రి పోలీసులు కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులపై దాడులు సరికాదు
చాగలమర్రి: కార్యాలయాల్లో అధికారులు పనులు చేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు పాల్పడకూడదని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ అంజనేయులును దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తహసీల్దార్ అంజనేయులుపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా ఎస్పీకి తెలియజేశామన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసిన పోలీసు శాఖాధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు.సమస్యలు పరిష్కరించాలని సహకార సంఘం అధ్యక్షుడు రఘనాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు మస్తాన్‌రెడ్డి, నరసింహారెడ్డి, దేశంరెడ్డి, వీరభద్రుడు, బాబు, సుబ్బారెడ్డిలు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, సీఐ దస్తగిరి బాబు, తహసీల్దార్లు శ్రీనివాసులు, షెక్‌మోహిద్దీన్, మాలకొండయ్య, ఆల్ఫ్రెడ్, రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నిరాశతో వెనుతిరిగిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారని తెలిసి రైతులు భారీగా తరలివచ్చారు. భూసమస్యలు కలెక్టర్‌కు విన్నవించాలని ఉదయం నుంచి వేచి ఉన్నారు. అయితే కలెక్టర్ సాయంత్రం 5.00 గంటలకు వచ్చారు. కేవలం 20 నిమిషాల్లో తహసీల్దార్, ఆర్డీఓతో చర్చించి రైతుల సమస్యలు వినకుండానే వెళ్లిపోయారు. దీంతో రైతులు విలేకరుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. చాగలమర్రి రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని.. చేయి తడిపితే తప్ప పనులు కావడం లేదన్నారు. -
కేసీ ఆధునికీకరణకు ప్రతిపాదనలు
చాగలమర్రి: కేసీ ప్రధాన కాలువ నుంచి పంట కాలువలు, కల్వర్టులు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు కేసీ ఏఈ మస్తాన్‌వలి మంగళవారం తెలిపారు. ఈ పనులకోసం రూ. 50 లక్షలు వ్యయం కావచ్చని అంచనా వేసి పంపామన్నారు. రాజోలి అనకట్ట వద్ద సెట్టర్ మరమ్మతులకు రూ. 5 లక్షలు, ప్రధాన కాలువ లో రెండు ర్యాంపులకు రూ. 9 లక్షలు, చాగలమర్రి చానల్ కింద సిమెంట్ కాలువ నిర్మాణానికి రూ. 10 లక్షలు, నక్కల వాగు కాలువకు రూ. 10 లక్షలు, కాన గూడురు చానల్‌కు రూ. 10 లక్షలు, కే సీ కాలువ గట్టు రోడ్ల మరమ్మతులకు రూ. 7 లక్షలు, రాజోలి అనకట్ట వద్ద రక్షణ గోడ మరమ్మతులకు రూ. 4 లక్షలతో పనులు చేస్తున్నామని వివరించారు. చాగలమర్రి పంట కాలువల మరమ్మతులకు రూ. 10 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. -
నిమజ్జనానికి వెళ్లి నలుగురి మృతి
– నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి – తిప్పనపల్లె శోకసంద్రం – మతులు కూలీల బిడ్డలు సూర్యాస్తమయ సమయం..పక్షులన్నీ గూళ్లకు చేరుతన్న వేళ..పొలాలకు వెళ్లిన కూలీలు వడివడిగా ఊరు చేరుతున్న వేళ.. తప్పెట శబ్దాలు, కళాకారుల చిందులు, ఈలలు కేకలు...ప్రథమ పూజ్యుడు నిమజ్జనానికి బయలుదేరిన వేళ.. ఆ విధికి కన్నకుట్టిందేమో.. చెరువు రూపంలో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకుంది. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల చోటుచేసుకున్న ఈ ఘటన చాగలమర్రి మండలం తిప్పనపల్లె గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కంటతడిపెట్టించింది. చాగలమర్రి: గణేశ్ నిమజ్జనం.. ఊరువాడా సందడే సందడి. ఉరకలేసే ఉత్సాహంతో పిల్లాపెద్దలు.. స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. కొందరు పనులు సైతం మానుకున్నారు. చాగలమర్రి మండలం తిప్పనపల్లెలోనూ నిమజ్జన కోలాహం బుధవారం ఉదయం నుంచే మొదలైంది. వేడుక సందడిలో అల్లరిచేసే పిల్లల గురించి పెద్దలు పట్టించుకోవడం మరిచిపోయారు. వారెక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. దీంతో వేడుకలో అపశ్రుతి దొర్లింది. నిమజ్జనం చేసే చెరువు నలుగురు చిన్నారులను మింగేసింది. గ్రామంలో దళితవాడకు చెందిన బండి ఓబులేసు(12), శ్రీహరి(13), గడ్డం రాము(12), విష్ణువర్ధన్(13).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. నిమజ్జనం సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో వీరి ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచే తోటి మిత్రులతో వేడుకలో అలా ఇలా చేయాలని చర్చించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ముందుగా ఊరి సమీపంలోని నిమజ్జన చెరువు వద్దకు చేరాలనుకున్నారు. అనుకున్నదే తడువు ఉరుకులు పరుగులు మీద కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. విగ్రహాలను నిమజ్జం చేసేందుకు ఇంకా సమయం ఉందని..అంతలోపు ఈత కొడదామని చెరువులోకి దిగారు. బుధవారం ఉదయమే తెలుగుగంగ అధికారులు చెరువుకు నీరు చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి నలుగురు చిన్నారులు అందులో చెరువులో చిక్కుకుపోయారు. భయంతో కేకలు వేయడంతో సమీపంలో పొలాల్లో ఉన్న గ్రామస్తులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ లోపు సమీపంలోనే నిమజ్జన వేడుకలో ఉన్న గ్రామస్తులు గుంపులు గుంపులుగా చెరువు వద్దకు చేరుకున్నారు. మునిగిపోతున్న చిన్నారులను వెలికి తీసి ఒడ్డుకు చేర్చారు. చాగలమర్రిలో నిమజ్జన వేడుకల్లో ఉన్న ఎస్ఐ మోహన్‌రెడ్డి సైతం విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని తన జీపులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ వారి తల్లిదండ్రులు మోటార్ సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండా మార్గమధ్యంలో మతి చెందాడు. మిగిలిన ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. విష్ణువర్ధన్ మతదేహాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు పురుగుల మందు తాగేందుకు యత్నిస్తుండగా బంధువుల అడ్డుపడి వారించారు. అందరూ కూలీల పిల్లలే.. తిప్పనపల్లె చెరువులో మృతి చెందిన చిన్నారులంతా కూలీల పిల్లలే. బండి ఓబులేసు తల్లితండ్రులు నాగేశ్వరరావు, వెంకటమ్మలు కూలీ పని చేస్తూ కుమారున్ని చదివిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా వారు పొలంలో పనులకు వెళ్లారు. వినాయక నిమజ్జం ఉండడంతో మందుగా ఇంటికి చేరుకొన్నారు. కుమారుడి మరణ వార్తవిని గుండెలు పగిలేలా రోదించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు అడపిల్లలు ఉన్నారు. మృతి చెందిన ఓబులేసు చివరి వాడు. గడ్డం రాము తల్లిదండ్రులు బలరాం, సుబ్బమ్మలు సైతం కూలీ పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడిని బాగా చదివించి ప్రయోజకున్ని చేయాలనేది వీరి లక్ష్యం. నిత్యం కూలీ పనికి వెళ్తూ..కుమారున్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. వారి ఆశలు చెరువు మింగేసింది. వారి రోదన వర్ణనాతీతం. తిరుపాలు, ధనలక్ష్మి కుమారుడు శ్రీహరి చురుకైన బాలుడు.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తమ కుమారుడు మంచి ప్రయోజకుడువుతాడని తల్లిదండ్రులు కలలు కనేవారు. ముందుగా వినాయక నిమజ్జన ప్రదేశానికి వెళతామని చెప్పి వతిరిగిరాని లోకాలకు వెళ్లాడని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతాప్‌కు విష్ణువర్దన్ ఒక్కగానొక్క కుమారుడు.. బాగా చదివేవాడు. తన కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో పురుగు మందు తాగేందుకు ప్రతాప్ ప్రయత్నించగా..అక్కడే ఉన్న బంధువులు వారించి వారికి నచ్చచెప్పారు. -
హస్టల్లోని 30 మంది బాలికలకు అస్వస్థత
కర్నూలు: కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బుధవారం ఆసుపత్రి పాలైయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసిన కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
జగన్‌తోనే ఉంటా: భూమా నాగిరెడ్డి
నంద్యాల/చాగలమర్రి, న్యూస్‌లైన్: తన రాజకీయ జీవితమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డితోనేనని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, చాగలమర్రిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రలోభాలకు లోను చేసి దుష్ట రాజకీయాలకు తెరతీశారన్నారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని.. ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానన్నారు. గిట్టని వారే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన సాగించిన అధికార పార్టీపై తమ పార్టీ పోరాడిందని, ఇకపైనా అదే పంథా కొనసాగిస్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ మారడాన్ని ప్రస్తావించగా.. వైఎస్సార్సీపీపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇంత త్వరగా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. -
అధికార పార్టీ అరెస్టుల పర్వం
చాగలమర్రి, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమ అరెస్టులకు తెరతీసింది. బలమైన అభ్యర్థులపై గెలవలేమనే భయంతో పాత కేసులను తిరగదోడుతూ సరికొత్త డ్రామాకు తెరతీస్తోంది. ఈ కోవలోనే చాగలమర్రి ఒకటో ఎంపీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న కొండుపల్లి మస్తాన్‌ను సోమవారం ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా అటవీ సెక్షన్ అధికారి ఓబులేసు, ఆరుగురు సాయుధ సిబ్బందితో సోమవారం తెల్లవారుజామున చాగలమర్రికి చేరుకున్నారు. స్థానిక ఎస్ఐ గోపాల్‌రెడ్డిని కలసి మస్తాన్ అరెస్టు విషయమై చర్చించారు. అనంతరం మస్తాన్ అరెస్టుకు యత్నించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఫారెస్టు అధికారుల వాహనాన్ని నిలువరించి రోడ్డుపైనే బైఠాయించారు. వారెంట్ చూపించాలని పార్టీ నాయకులు రఘునాథ్‌రెడ్డి, నిజాముద్దీన్, అన్సర్‌బాషా, లక్ష్మిరెడ్డిలు ఫారెస్టు అధికారి ఓబులేసును కోరారు. అందుకాయన సమాధానమిస్తూ.. రాయచోటి ఫారెస్టు పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 2011లో మస్తాన్‌వలిపై రెండు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో అరెస్టుకు వారంట్‌తో పనిలేదన్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు మస్తాన్‌ను ఎస్ఐ గోపాల్‌రెడ్డి ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా మస్తాన్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం నేపథ్యంలోనే తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కేసులకు భయపడేది లేదని.. న్యాయపరంగానే కుట్రలను ఎదుర్కొంటానన్నారు. ప్రజలు నీచ రాజకీయాలను గమనిస్తున్నారని.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.