కేసీ ఆధునికీకరణకు ప్రతిపాదనలు | proposals for k.c.renovations | Sakshi
Sakshi News home page

కేసీ ఆధునికీకరణకు ప్రతిపాదనలు

Published Tue, Sep 13 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

కేసీ ఆధునికీకరణకు ప్రతిపాదనలు

కేసీ ఆధునికీకరణకు ప్రతిపాదనలు

చాగలమర్రి: కేసీ ప్రధాన కాలువ నుంచి పంట కాలువలు, కల్వర్టులు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు కేసీ ఏఈ మస్తాన్‌వలి మంగళవారం తెలిపారు. ఈ పనులకోసం రూ. 50 లక్షలు వ్యయం కావచ్చని అంచనా వేసి పంపామన్నారు. రాజోలి అనకట్ట వద్ద సెట్టర్‌ మరమ్మతులకు రూ. 5 లక్షలు, ప్రధాన కాలువ లో రెండు ర్యాంపులకు రూ. 9 లక్షలు, చాగలమర్రి చానల్‌ కింద సిమెంట్‌ కాలువ నిర్మాణానికి రూ. 10 లక్షలు, నక్కల వాగు కాలువకు రూ. 10 లక్షలు, కాన గూడురు చానల్‌కు రూ. 10 లక్షలు, కే సీ కాలువ గట్టు రోడ్ల మరమ్మతులకు రూ. 7 లక్షలు, రాజోలి అనకట్ట వద్ద రక్షణ గోడ మరమ్మతులకు రూ. 4 లక్షలతో పనులు చేస్తున్నామని వివరించారు. చాగలమర్రి పంట కాలువల మరమ్మతులకు రూ. 10 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement