
Boy Rescued From the Debris of a Collapsed Building in Chagalamarri: పై చిత్రంలో మట్టి శిథిలాల మధ్య రోదిస్తున్న బాలుడి పేరు చరణ్.. ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లి శుక్రవారం సాయంత్రం చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తన స్వగృహానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు వంట రూంలో ఉండగా.. చరణ్ మరో రూంలో సోఫాలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దె తడిసింది.
సాయంత్రం 6 గంటల సమయంలో చరణ్ ఉన్న గది కూలిపోయింది. శిథిలాల కింద బాలుడు కూరుకుపోయాడు. తండ్రి పుల్లయ్య అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతికష్టం మీద బాలుడిని బయటకు తీశారు. చరణ్ స్వల్ప గాయాలతో బయట పడడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment