
జగన్‌తోనే ఉంటా: భూమా నాగిరెడ్డి
నంద్యాల/చాగలమర్రి, న్యూస్‌లైన్: తన రాజకీయ జీవితమంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనేనని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, చాగలమర్రిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రలోభాలకు లోను చేసి దుష్ట రాజకీయాలకు తెరతీశారన్నారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని.. ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే ఉంటానన్నారు. గిట్టని వారే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన సాగించిన అధికార పార్టీపై తమ పార్టీ పోరాడిందని, ఇకపైనా అదే పంథా కొనసాగిస్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ మారడాన్ని ప్రస్తావించగా.. వైఎస్సార్‌సీపీపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇంత త్వరగా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.