సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాలిక కేసును చేధించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చంద్రబాబు ఎందుకు వాయిదా వేశారు. రషీద్ కుటంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎందకు పరామర్శకు వెళ్లలేదు.
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. టీడీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును దగ్ధం చేశారు. టీడీపీ నేతలే దాడి చేసి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీసీ నేతలపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంజాయిని అడ్డుకోలేక మాపై నిందలు వేస్తున్నారు.
శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారో చెప్పాలి. ఈకేసులో నిందితుడిని, దళిత వ్యక్తిని లాకప్‌లో పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను చనిపోయాడు. ఇది లాకప్ డెత్.. ప్రభుత్వ హత్య. ఈ దారుణంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలి.
ఇక, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ తల్లికి వందనం ఏమైంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. ముందుగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ బెదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment