శ్రీశైలంలో 49 టీఎంసీల నీటి నిల్వ
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంతానికి 48.9898 టిఎంసీల నీరు నిల్వగా ఉంది. విద్యదుత్పాదనను ముమ్మరంగా రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 56 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు బుధవారం నుంచి నీటి విడుదలను నిలిపి వేశారు. మంగళవారం నుంచివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.841మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5.129 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 25,402 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 829.50 అడుగులకు చేరుకుంది.