కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చి రైతులను ఆదుకోండి
కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చి రైతులను ఆదుకోండి
Published Tue, Feb 14 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
– నంద్యాల, గోస్పాడు ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి
– జేసీకి వివరించిన కేసి కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు
కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి ఎత్తపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను కోరారు. సోమవారం కమిటీ నేతలు బీవీ రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, కేశవరావు, వెంకటరామిరెడ్డి, తిరపతిరెడ్డి తదితరులు జేసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... కాలవకు నీళ్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి కేసీకి నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి జిల్లాలోని నంద్యాల, గోస్పాడు ప్రాంతంలో వివిధ పంటలు సాగు చేశారని, ఉన్నట్టుండి కేసీకి నీళ్లు బంద్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జేసీ స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.
Advertisement
Advertisement