kc
-
నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం !
-ప్రభుత్వానికి నెహ్రూనగర్ రైతుల అల్టిమేటం -పురుగు మందు డబ్బాలతో ఆందోళన -సీఎం, కలెక్టర్, మాండ్ర డౌన్ డౌన్ అంటూ నినాదాలు -చర్చలు జరిపిన ఆరీ్డఓ, సీఐ ముచ్చుమర్రి(పగిడ్యాల): రైతుల పరిస్థితి రోజు రోజుకు దుర్భరంగా మారుతోంది. కళ్లేదుటే నీళ్లున్నా పంటను తడుపుకోలేని పరిస్థితి. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరే కారణమని మండిపడుతున్నారు. కేసీకి తక్షణం నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టారు. పంప్‌హౌస్ వద్ద జరిగే పనులను నిలుపదల చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్చి చివరి వరకు కేసీకి సాగునీరిస్తామని ఆరుతడి పంటలు వేసుకోవాలని సీఎం, కలెక్టర్, మంత్రులు, మాండ్ర శివానందరెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నీరు దిగువన ఉండే పంప్‌హౌస్‌లోకి రాకుండా ఆటంకంగా ఉన్న అడ్డుకట్ట బండరాళ్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జాతికి ఎందుకు అంకితం చేశారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న, మినుము, జొన్న వంటి ఆరుతడి పంటలు ప్రస్తుతం కంకి దశకు చేరుకున్నాయని, ఇప్పుడు నీరు కట్టుకోకపోతే అవి చేతికి రావని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్నా నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి ఎస్ఐలు లక్ష్మీనారాయణ, బాలనరసింహులును వెంటబెట్టుకుని ఆందోళన ప్రదేశానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. జిల్లా స్థాయి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టి సీఐతో విభేదించారు. దీంతో స్పందించిన సీఐ జలవనరులశాఖ ఈఈ, ఎస్ఈ తదితర ఉన్నతాధికారులకు ఫోన్లో సమస్యను వివరించారు. దీంతో ఆర్డీఓ ఉసేన్‌సాహెబ్ హుటాహుటిన పంప్‌హౌస్ ప్రదేశానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పంప్‌హౌస్‌లోకి నీరు వదిలితే ఆయిల్, ట్రాక్టర్ ఇంజిన్ల సాయంతో పంటలకు నీరు పెట్టుకుని కాపాడుకుంటామని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. దీనిపై ఇంజినీర్ల అభిప్రాయం తీసుకొని సాయంత్రంలోగా నిర్ణయం వెల్లడిస్తామని ఆర్డీఓ చెప్పగా వారు ఒప్పుకోలేదు. చివరకు తాను ఈ ప్రాంతవాసినని, పంటలు ఎండనివ్వమని ఆయన రైతులను ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. మూడు పంటలకు నీరిస్తామని ముఖ్యమంత్రి, జిల్లా అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేపోతే ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పారు. -
కేసీకి 40 క్యూసెక్కుల నీటి విడుదల
సుంకేసుల(గూడూరు రూరల్): సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు డ్యాం జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజార్వయర్‌లో 0.225 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు. -
కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చి రైతులను ఆదుకోండి
– నంద్యాల, గోస్పాడు ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి – జేసీకి వివరించిన కేసి కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి ఎత్తపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను కోరారు. సోమవారం కమిటీ నేతలు బీవీ రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, కేశవరావు, వెంకటరామిరెడ్డి, తిరపతిరెడ్డి తదితరులు జేసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... కాలవకు నీళ్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి కేసీకి నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి జిల్లాలోని నంద్యాల, గోస్పాడు ప్రాంతంలో వివిధ పంటలు సాగు చేశారని, ఉన్నట్టుండి కేసీకి నీళ్లు బంద్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జేసీ స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. -
క‘న్నీటి’ తడి
- కర్షకులకు తప్పని సాగునీటి కష్టాలు - కేసీ కాల్వ కింద ఎండుతున్న పంటలు - పైరును కాపాడేందుకు రైతుల పాట్లు - ఆర్థికభారంతో నష్టపోతున్న అన్నదాతలు - అమలుకాని అధికార పార్టీ నేతల హామీలు ఎండిన పంటను అడిగితే అన్నదాత గుండె కోత ఏమిటో చెబుతుంది అడుగంటిన కాలువలను ప్రశ్నిస్తే టీడీపీ నేతల నయవంచన బయటపడుతుంది మొరాయిస్తున్న ఆయిల్ ఇంజన్లను నిలదీస్తే అధికారుల ఉదాసీనత తేటతెల్లమవుతుంది నెర్రలిచ్చిన నేలను కదిలిస్తే.. నీటి కోసం భూమి పుత్రుడు పడుతున్న ఆరాటమేమిటో తెలుస్తుంది ఒట్టిపోయిన తూములను పలకిరిస్తే..జారిపోతున్న రైతు కన్నీళ్లెన్నో వివరిస్తుంది!! అధికార పార్టీ నేతల మాట విని రెండో పంట సాగు చేసిన రైతుల కన్నీటి గాథ ఇది.. - మహానంది/బండి ఆత్మకూరు రెండు పంటలకు సాగునీరు అందిస్తాం. తెలుగుగంగ, కేసీ కెనాల్ కింద రైతులు నిర్భయంగా వరి సాగుచేసుకోవచ్చు. ..టీడీపీ నేతలు రైతులకు ఇచ్చిన హామీ ఇది. శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. ఒక పంటకే కాదు రెండు, మూడు, నాలుగు పంటలకైనా సాగు నీరు ఇస్తాం. - ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఇది. టీడీపీ నేతల హామీ అమలు కాలేదు. స్వయంగా సీఎం చేసిన ప్రకటనకూ దిక్కులేకుండా పోయింది. వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరిపైరు నీరు లేక నిట్టనిలువునా ఎండిపోతోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేసీ కెనాల్, తెలుగుగంగ కాల్వ కింద సుమారు 25 వేల ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. గత నెలలో కేసీ కెనాల్, తెలుగుగంగకు సాగునీరు దాదాపు 15రోజులు నిలిచిపోవడంతో రైతులు అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారం రోజుల క్రితం కేసీ కెనాల్‌కు, తెలుగుగంగకు సాగునీరు అధికారులు విడుదల చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరిపంట పూర్తయ్యే వరకు సాగునీరు విడుదల చేయిస్తామని చెప్పుకున్నారు. అంతేగాక కలెక్టర్ కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి.. రెండు పంప్‌లు, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంపులు సాగునీరు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నీరు కేసీ కెనాల్లో ఈనెల 25వ తేదీ వరకు వస్తుందని కలెక్టర్ వివరించారు. తర్వాత విడత కేసీ కెనాల్ మార్చినెలలో విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు హర్షించారు. కేసీకి నిలిచిన నీరు.. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 844 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు నుంచి సాగునీరు కేసీ కెనాల్‌కు రావడం నిలిచి పోయింది. ఈ క్రమంలో గోరుచుట్టుపై రోకలిపోటు అన్నచందంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటి విడుదలను నిలిపి వేశారు. దీంతో కేసీ కెనాల్లో సాగునీరు రావడం పూర్తిగా నిలిచి పోయింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య.. సొంత ఊరు బండిఆత్మకూరు చిన్నదేవళాపురం గ్రామం కావడంతో రైతులు ఆయన దృష్టికి సమస్యను తెచ్చారు. నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లోని రైతుల కోసం ఆయన కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించే ప్రయత్నం ఇటీవల చేశారు. అయితే కలెక్టర్.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా కనీసం ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో రైతులకు తమ సమస్యను ఏ విధంగా అధికారులకు తెలియజేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అడుగడుగునా కట్టలు.. కేసీ కెనాల్‌తో పాటు తెలుగుగంగలో కూడా వారం రోజుల నుంచి సాగునీరు విడుదల చేయడం నిలిపి వేశారు. దీంతో రైతులు కాలువలో అడుగున ఉన్న నీటిని పొలాలకు పారించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కేసీ కెనాల్, టీజీపీ ప్రధాన కాల్వల్లో కట్టలు వేసి ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు పారించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు కాల్వల్లో కట్టలు వేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో రైతులు తమ పొలాలకు సాగునీరు విడుదల చేస్తే ఎందుకు కట్టలు వేసుకుంటామని అధికారులను నిలదీస్తున్నారు. తూములకు అందని నీరు.. కేసీ కేనాల్లో నీరు పూర్తిగా అడుగంటి పోవడంతో తూములకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. కళ్లముందు పంటను వదులుకోలేక ట్రాక్టర్లకు మోటార్లను ఏర్పాటు చేసుకొని ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు పారిస్తున్నారు. కొందరు డీజిల్ ఇంజన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎకరా వరి పంటకు నీరు అందించుకునేందుకు సుమారు 8లీటర్ల డీజిల్ అవసరం. ఇందుకు రూ. 700 వరకు ఖర్చు అవుతుంది. అదనంగా శ్రమించాల్సి ఉంది. మహానంది మండలం ఉల్లిగడ్డల బొల్లవరం, తమ్మడపల్లె గ్రామాల పరిధిలో సుమారు 5వేల ఎకరాల వరి పంటను రైతులు సాగు చేశారు. అలాగే నంద్యాల మండలం పెద్దకొట్టాల, బిల్లలాపురం, కొత్తపల్లె పరిధిలో కేసీ కాల్వ నీటితో వేలాది ఎకరాల్లో వరి పంట వేశారు. కేసీలో నీళ్లు అడుగంటడంతో రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మోసపోయాం: రాజేశ్వరయ్యాచారి, బొల్లవరం రెండు పంటలకు నీరిస్తామని టీడీపీ నాయకులు చెప్పడంతో వరి వేశాం. వారు చెప్పిన మాటలు విని మోసపోయాం. తీరా పైర్లు ఒక దశలో వచ్చాక నీరు ఇవ్వకపోడంతో ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి నీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. రైతులను ఆదుకోవాలి: మురళీ, వరి రైతు నేను ఏడెకరాల్లో కేసీ కాల్వ కింద వరి వేశాను. నీళ్లు అందక పంట ఎండిపోతుంది. ఇంజన్ల ద్వారా రోజూ నీళ్లు అందించలేకపోతున్నాం. అ«ధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పంటలకు నీరుఅందేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులు మొహం చాటేయడం తగదు: ఉస్మాన్, బండిఆత్మకూరు టీడీపీ నేతలు గ్రామాల్లోకి వచ్చే రోజు ముందు సాగునీరు విడుదల చేస్తున్నారు. వారు వెళ్లిన తర్వాత సాగునీరు నిలిచి నిలిచిపోతోంది. నీరు విడుదల చేయాలని టీడీపీ నాయకులను కోరుతుంటే వారు మొహం చాటేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయి. -
కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపివేత
పగిడ్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలపివేసినట్లు ఎత్తిపోతల పథకం ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు. మళ్లీ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని శుక్రవారం ఆయన విలేకరులకు వెల్లడించారు. -
కేసీకి 130 క్యూసెక్కుల నీరు విడుదల
సుంకేసుల(గూడూరు రూరల్) : సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు బుధవారం డ్యాం అధికారులు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కేసీ ద్వారా 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.35 టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపారు. తుంగభద్రా డ్యాం నుంచి రావలసిన కోటా పూర్తయిందని, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి సుంకేసులకు నీరు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఏప్రిల్ చివరిలోపు ‘ముచ్చుమర్రి’పూర్తి
- ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ - పనుల్లో అలసత్వం ప్రదర్శించ రాదని హెచ్చరిక - కేసీ కాలువకు రెండు పంప్‌ల ద్వారా నీటి విడుదల ముచ్చుమర్రి(పగిడ్యాల): రాయలసీమకు వరదాయిని అయిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఆయన కేసీ కాలువకు రెండు పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పెండింగ్ పనులపై ఆరా తీశారు. హంద్రీనీవా కాలువకు డిజైన్ చేసిన 12 పంప్‌ల పనుల్లో ఆరు పంప్‌లను అమర్చేందుకు అర్త్‌వర్క్ పనులు పూర్తి చేశామని త్వరలోనే మోటర్లను కూర్చోబెట్టుతామని ఎస్ఈ సూర్య నారాయణస్వామి కలెక్టర్‌కు వివరించారు. ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి చేసి 16 పంప్‌లతో ప్రాజెక్ట్ అప్పగించాలని కలెక్టర్ఆదేశించారు. అయితే హంద్రీనీవా కాలువ తవ్వకం పనుల్లో రైతులు బ్రిడ్జిలను నిర్మించాలని, పొలాలకు నీరు కట్టుకునేందుకు అండర్ టన్నెల్ కాలువలు నిర్మించాలని కోరుతున్నారని ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ వాటి నిర్మాణాలకు ఎంత వ్యయం అవుతుందో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నుంచి కేసీ కాలువకు 4 పంప్‌ల ద్వారా 1300 క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. రబీ సీజన్లో కేసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఫిబ్రవరి చివరి వరకు నీరిస్తామన్నారు. సిద్దాపురం పనులు 80 శాతం పూర్తయ్యాయని ఏప్రిల్‌లోపు పెండింగ్ పనులు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జలవనురుల శాఖ ఎస్ఈ సూర్యనారాయణ, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈ బాలాజీ, తహసీల్దార్ కుమారస్వామి, ఆర్ఐ అరుణ, వీఆర్వో వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుదారులు ఆందోళన బాట
సాగునీటి కోసం కేసీ కెనాల్ ఈఈ కార్యాలయం ముట్టడి - పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన – అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంపై ఆగ్రహం నంద్యాలరూరల్: సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే కర్నూలు–కడప ప్రధాన కాల్వకు నీరు విడుదల చేయాలని బుధవారం ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లోనే వివిధ మండలాల రైతులు నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమతో మిగులు జలాలు, శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పారించి కరువును పారదోలుతున్నామన్న ముఖ్యమంత్రికి కేసీ చివరి ఆయకట్టు ఎండుతున్నా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కెనాల్ నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ముచ్చుమర్రి, ఎత్తిపోతల పథకం ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి రెండుకార్లు నీరందిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు కెనాల్‌కు నీరు నిలుపుదల చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల హామీతో కేసీ రైతులు పత్తి, మిరప, వేరుశనగ, కంది, మినుము తదితర పంటలు సాగు చేశారనా్నరు. ఇప్పుడు ఆ పంటలు ఎండుతుంటే హామీచ్చిన వారు నోరెత్తకపోవడం దారుణమనా్నరు. ఇప్పటికైనా కేసీ కెనాల్‌కు శ్రీశైల జలాశయంలోని నీటిని విడుదల చేసి ఎండుతున్న చివరి ఆయకట్టు పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జునకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, సిద్దేశ్వరం అలుగు సాధన సమితి కన్వీనర్ వైఎన్‌రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎరబోలు ఉమామహేశ్వరరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు బెక్కెం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, బంగారురెడ్డి, రామసుబ్బారెడ్డి, గుర్రప్ప, పార్థసారథిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎండుతున్న ఆశలు!
-కేసీ కెనాల్‌కు నీటి సరఫరా నిలిపి వేత – వాడిపోతున్న చివరి ఆయకట్టు పంటలు మిరప, పత్తి – ఒకతడి నీరు ఇస్తే పంట కాపాడుకుంటామని రైతుల మొర – స్పందించని కేసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చేతికొచ్చిన చివరి ఆయకట్టు పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. కెనాల్‌కు నీరు వదులుతారనే ఆశతో రైతులు ఖరీఫ్‌లో పత్తి, మిరప, వరి పంటలు సాగు చేశారు. తెగుళ్లు సోకకుండా ఎరువులు, మందులు వేసుకుంటూ కంటికి రెప్పలా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకతడి నీరందిస్తే పంట చేతికొస్తుంది. ఉన్నట్టుండి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి నీటి విడుదలను నిలిపివేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు అధికారులు. నీరులేక ఎండిపోతున్న పంటలను ఎలా కాపాడుకోవాలి తెలియక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ప్రారంభించి పదిరోజులు గడకమునుపే ట్రైల్‌రన్ మాత్రమే అంటూ అధికారులు ఎత్తిపోతల పథకం నుండి కేసీకి నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో కేసీ కెనాల్‌కు శాశ్వత నీటి హక్కు లేక వేసుకున్న ఆయకట్టు పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు, కాల్వలకు నీరు లేక అవస్థలు పడ్డ రైతులు రబీ సీజన్లో నదుల్లో నీరు ఉందన్న ధైర్యంతో పంటలు సాగు చేశారు. నంద్యాలరూరల్: నంద్యాల మండలంలో కేసీ కెనాల్ కింద మూలసాగరం, కానాల, చాపిరేవుల, బ్రాహ్మణపల్లె, పుసులూరు, పాండురంగాపురం, మిట్నాల, గుంతనాల, గోస్పాడు మండలంలోని పసురపాడు, గోస్పాడు, జూలేపల్లె, తేళ్లపురి తదితర గ్రామాల్లోని చివరి ఆయకట్టు రైతులు వరి, పత్తి, మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వరి చేతికి వచ్చింది. ఇక పత్తి, మిరపకు ఒక తడి నీరు అవసరం. ఆశలపై నీళ్లు! పత్తి, మిరపను ఆయా గ్రామాల్లో 3500 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎకరా మిరప సాగుకు లక్షరూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో కేసీకి నీటి సరఫరా నిలిపివేయడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే మిరప పంట ఎండిపోతుంది. పత్తి కాయలు పగిలిపోతున్నాయి. కేసీకి సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతన్నలు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించుకుంటున్నారు. అయినా, వారు చలించని పరిస్థితి. ఆదుకోని ముచ్చుమర్రి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి రాయలసీమలో ఎండుతున్న పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పథకం ప్రారంభోత్సవ సమయంలో ప్రకటించారు. అయితే, పట్టుమని పదిరోజులు కూడా కెనాల్‌కు నీరు వదలక ముందే నిలిపివేశారు. ఇదేమిటని అడిగితే ముచ్చుమర్రి పథకం ట్రయల్‌రన్ కోసమే కెనాల్‌కు పదిరోజులు నీరు వదిలామని అధికారులు సమాధానం చెబుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కుందూనది, వాగులు, వంకల్లో ఆయిల్ ఇంజిన్లు పెట్టి కి.మీ మేర అద్దె పైపులతో నీటిని తోడుతున్నారు. పంటలు ఎండుతున్నాయి–అబ్దుల్సుకూర్, మిట్నాల: కౌలుకు తీసుకుని 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో మిరప, 5 ఎకరాలో పత్తి పంట సాగు చేశా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చే సమయంలో కాల్వలకు నీరు బంద్ చేశారు. ఒక తడి నీరు వస్తే దిగుబడి పెరిగి నష్టాల నుంచి బయట పడతాం. పంటలు వేసుకోండి అన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఎలాగైనా కేసీకి నీరు విడుదల చేయించి ఎండుతున్న పంటలు కాపాడాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. ట్రయల్ రన్ కోసం కేసీకి నీరు విడుదల చేశాం–మల్లికార్జునరావు, కేసీ ఈఈ: ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభం కావడంతో జనవరి 25వరకు కేసీకి నీరు విడుదల జరిగింది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి కెనాల్‌కు నీరు విడుదల ట్రయల్‌రన్‌లో భాగమే. ప్రస్తుతం ముచ్చుమర్రి నుంచి నీరు రాదు. ఎండుతున్న పంటల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
నేడు జిల్లాకు కృష్ణా బోర్డు సభ్యుల రాక
కర్నూలు(సిటీ): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు బుధవారం కృష్ణా బోర్డు సభ్యులు జిల్లాకు రానున్నారు. రెండురోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిటీ సభ్యులు ఉదయం బానకచెర్ల కాంప్లెక్స్, పోతిరెడ్డిపాడు, కేసీ కాల్వ, ముచ్చుమర్రి ఎత్తిపోతుల పథకం, సుంకేసుల రిజర్వాయర్లను తనిఖీ చేయనున్నారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకున్న నీటి వివరాలను కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. -
కేసీ ఆధునీకరణకు రూ.35 కోట్లు మంజూరు
కర్నూలు (టౌన్): కేసీ కెనాల్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులను మంజూరు చేసింది. మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిపాలనా అనుమతులకు సంబంధించి జీఓ 710 జారీ చేశారు. రూ.35 కోట్లు వెచ్చించి కేసీ కెనాల్ ఆధునీకరణ ప్రాజెక్టు కింద సీసీ లైనింగ్ పనులు చేపడతారు. కిలోమీటర్ 130.100 నుంచి కి .మీ.149.670 వరకు కేసీ కెనాల్ సీసీ లైన్ పనులతో పాటు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించి కర్నూలు చీఫ్ ఇంజనీరు (ప్రాజెక్టు) తదుపరి చర్యలు చేపట్టాలని ఆ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. -
పంటలను కాపాడండి
– కేసీ ఈఈ కార్యాలయం ముట్టడించిన రైతులు నంద్యాలరూరల్: కేసీ నుంచి సాగునీరందించి ఎండిపోతున్న పైర్లను కాపాడాలని కేడీసీసీబీ డైరెక్టర్ వడ్డు ప్రతాపరెడ్డి, చిందుకూరు సర్పంచ్ వెంకటకృష్ణారెడ్డి, గడిగరేవుల ఎంపీటీసీ సభ్యుడు సత్యరాజు, తిరుపాడు సర్పంచ్ వెంకటేశ్వర్లు, చిందుకూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గోవిందరెడ్డి, కార్యదర్శి ఏరాసు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపంరెడ్డి, ఎర్రగుంటల నీటి సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గడిగరేవుల, బోధనం, తిరుపాడు, పరమటూరు, చిందుకూరు, పెసరవాయి, ఎర్రగుంట్ల, కొరటమద్ది, పులిమద్ది, కరిమద్దెల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీ కెనాల్ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా వారు మాట్లాడుతూ పైర్లు ఎండుతున్నా నీటి విడుదలకు ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని నిలదీశారు. కేసీ కెనాల్‌కు తూడిచర్ల చానెల్ ద్వారా 350 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉండగా 100 క్యూసెక్కులు విడుదల చేసి పైర్లు ఎండిపోవడానికి పరోక్షంగా అధికారులే కారణమయ్యారని ఆరోపించారు. తక్షణమే ఒక తడికి కావాల్సిన సాగునీరు అందించి 10వేల ఎకరాలకు పైగా పంటలు కాపాడాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉలుకూ పలుకూ లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పంటలను కాపాడాలన్నారు. కేసీ కెనాల్ ఏఈ చంద్రుడు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. -
మళ్లీ రెయిన్గన్లు!
- విఫలమైనా అదే ప్రయోగం - విమర్శలకు తావిస్తున్న ప్రభుత్వ చర్యలు - కంది, వరి పంటల కోసం ప్రతిపాదనలు - వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది - గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధం గతంలో ఇలా.. గతంలో రెయిన్గన్ల ద్వారా తడిపిన భూమి: 65 వేల హెక్టార్లు ఇందుకోసం వెచ్చించిన మొత్తం: రూ. 28 కోట్లు ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత ఖర్చు చేసినా..ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇలా.. జిల్లాలో అక్టోబరు నెల సాధారణ వర్షపాతం: 114. మిమీ ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం: 9 మి.మీ మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే కంది పూర్తిగా ఎండిపోతుంది. పత్తి, వరి పంటలుదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్దిష్టంగా పంటలను కాపాడే ప్రణాళికలు లేకుండా.. విఫలమైన రెయిన్గన్లను మళ్లీ తెరపైకి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంటలను కాపాడేందుకు రెయిన్గన్ల వినియోగాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. ఖరీఫ్ సీజనులో వేసి ఇంకా మిగిలి ఉన్న కంది, పత్తి, వరి పంటలను కాపాడేందుకే రెయిన్గన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏయే పంటలు ఏయే దశలో ఉన్నాయి? ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇందుకోసం ఎన్ని రెయిన్గన్లు కావాలనే వివరాలను సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం (27వ తేదీ) సాయంత్రం జిల్లా కలెక్టర్‌కు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి గతంలో ఒకసారి హడావుడిగా రెయిన్గన్లను ఉపయోగించి పంటలను కాపాడతామంటూ భారీగా నిధులు వెచ్చించినప్పటికీ ఫలితంలేకపోయింది. అయినప్పటికీ మరోసారి రెయిన్గన్లను ఉపయోగించేందుకు సిద్ధపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. కంది, వరి కోసం ప్రతిపాదనలు జిల్లాలో ఖరీఫ్ సీజనులో వేసిన కంది, పత్తి, వరి పంటలు ఇప్పుడు ఎండుముఖం పట్టాయి. ప్రధానంగా కెసి కెనాల్‌కు నీరు రాకపోవడంతో వరి పంట పరిస్థితి దారుణంగా ఉంది. కెసీ కెనాల్లో ఒక అడుగు నీరు మాత్రమే ఉంది. ఈ నీరు తూములకు ఎక్కే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ నీటిని రెయిన్గన్ల ద్వారా వరి పంటలకు తడిపేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయశాఖ కోరనున్నట్టు తెలిసింది. ఇక పత్తి పంటలను రెయిన్గన్ల ద్వారా తడిపితే ఉపయోగం లేదని కూడా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. కంది పంట జిల్లావ్యాప్తంగా లక్ష హెక్టార్లల్లో సాగయ్యింది. పత్తి పంట విషయానికి వస్తే లక్షా 63 వేల హెక్టార్లు, వరి 67 వేల హెక్టార్ల మేరకు సాగయ్యింది. ఇందులో ఇప్పుడు ఎంత మేరకు పంట ఎండుముఖం పట్టిందనే వివరాలను సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్ని రెయిన్గన్లు అవసరంమనే అంశాన్ని కూడా సమర్పించే నివేదికలో పేర్కొననున్నారు. గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధమవుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రూ. 28 కోట్లు ఖర్చు చేసినా...! గత నెలలోనే మొదటిసారిగా ప్రభుత్వం రెయిన్గన్లను భారీగా ఉపయోగించడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెయిన్గన్ల వినియోగానికి ప్రభుత్వం మూడు వందల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 65 వేల హెక్టార్లను రెయిన్గన్ల ద్వారా తడిపామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 28 కోట్లు మేరకు వెచ్చించారు. ఇందులో రూ.25 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ మరోసారి రెయిన్గన్లను తెరమీదకు తీసుకరావడం అనుమానాలకు తావిస్తోంది. నిర్దిష్టంగా పంటలను కాపాడేందుకు దీర్ఘకాలంలో చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచించకుండా తాత్కాలిక పనుల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం ఏమిటని రైతులు వాపోతున్నారు. -
కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోండి
– ఎస్ఈని కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు సిటీ: పాములపాడు మండలం మద్దూరు, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఐజయ్య మంగళవారం జల మండలిలో ఎస్ఈని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాల్వ విస్తరణ కోసం కేసీ కాలువ అక్విడక్ కూల్చి వేశారన్నారు. దీంతో సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందడం లేదన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వ నుంచి కాంట్రాక్టర్ రెండు మోటర్లు జనరేటర్ పెట్టి నీటిని ఆయకట్టుకు అందించే వారని, అయితే రెండు రోజుల నుంచి జన రేటర్ తీసేసి ఒక మోటర్ ద్వారానే నీటిని పంపు చేస్తుండడంతో పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నాయని, ఎలాగైనా నీరు ఇచ్చి పంటలకు కాపాడాలని ఎమ్మెల్యే కోరారు. కేసీ కాల్వకు సుంకేసుల నుంచి నీరు బంద్ చేయడంలో పంటలకు నీరు అందక ఎండుతున్నాయని, టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయించాలన్నారు. ఎస్ఈ స్పందించి డ్యామ్ నుంచి 1.55 టీఎంసీలకు ఇండెంట్ పెట్టామని, నీటి విడుదలకు ఈఎన్సీ అనుమతులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో ఫోన్ మాట్లాడి టీబీ డ్యామ్ నుంచి కేసీ ఆయకట్టుకు నీరు విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హంద్రీనీవా నుంచి దామగట్ల చెరువుకు శ్రీశైలం నీటిని నింపితే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బొల్లవరం, నాగటూరు చెరువులకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందఽన్నారు. ఎస్ఈ .. చిన్న నీటిపారుదల శాఖ నంద్యాల ఈఈ బాల చంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడి హంద్రీనీవా నీరు దామగట్ల చెరువు నింపేందుకు అవకాశం ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అందరి కృషితోనే నీటి విడుదల
నందికొట్కూరు: అందరి కృషితోనే కేసీకి శ్రీశైలం నీరు విడుదలైందని నందికొట్కూరు ఎమె్మల్యే ఐజయ్య అన్నారు. గురువారం మల్యాల వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కేసీ కెనాల్‌కు ఎమ్మెల్యే ఐజయ్య పూజలు నిర్వహించి అధికారికంగా రెండు పంపులతో 675 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీకి నీటి విడుదలపై ప్రాతకోట, పగిడ్యాల, లక్ష్మాపురం గ్రామాల రైతులతో కలిసి అనేక సార్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు . జిల్లా కలెక్టర్ కేసీ కెనాల్‌కు నీటి విడుదలను అధికారికంగా అట్టహాసంగా ప్రారంభించకుండా రాత్రికి, రాత్రే విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. తుంగభద్ర నీటిని కేసీ కెనాల్‌కు విడుదల చేసేందుకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. కేసీకి నీటి విడుదల గురించి అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. డిసెంబర్ చివరిలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరిందించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కేసీ కెనాల్‌కు విడుదల రైతులకు వరంలాంటిందని స్పష్టం చేశారు. బానకచర్ల వద్ద ఎస్ఆర్బీసీకి మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సంవృద్ధిగా సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్సీ నారాయణస్వామి, ఈఈ పాండురంగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా పంపుల ద్వారా కేసీకి నీటి విడుదల
– రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీరు – ఏట్టకేలకు ఫలించిన కేసీ రైతుల పోరాటం కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల పంపు నుంచి రెండు పైపుల ద్వారా మంగళవారం కేసీ కెనాల్‌కు నీటిని విదుదల చేశారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీంతో కేసీ ఆయకట్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా సాగునీటి ఇబ్బందులు వచ్చాయి. హంద్రీనీవా నుంచి రెండు పైపుల ద్వారా కృష్ణా జలాలను మళ్లిచాలని 2014లో చేసిన ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీ నేతలు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కేసీ రైతులు భారీ ఎత్తున పోరాటాలు చేశారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. హంద్రీనీవా నుంచి రెండు పంపులు ద్వారా నీరు కేసీకి మళ్లించేందుకు శరవేగంగా పనులు చేపట్టి గత నెలలో పూర్తి చేసి ట్రయల్ రన్ చేశారు. వర్షం రావడంతో ఇంత వరకు ఆయకట్టుకు నీరు ఇచ్చారు. ఎగువ నుంచి నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇటీవలే కేసీకి నీటిని బంద్ చేశారు. దీంతో పంటల స్థితిని దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల లిఫ్ట్ నుంచి రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీటిని వదిలారు. ఈ నీరు 150 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుకు అందుతుంది. 0నుంచి 67కి.మీ(మాల్యాల లిఫ్ట్ వరకు) వరకు ఉన్న ఆయకట్టుకు సుంకేసుల బ్యారేజీ నుంచి కలెక్టర్ ఆదేశాలతో 505 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. -
కేసీకి సాగు నీరు బంద్
కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో లేకపోవడంతో శనివారం..అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో కొంత నీటి ప్రవాహం వచ్చింది. దీంతో కేసీ కాల్వ 0కి.మీ నుంచి 120 కి.మీ వరకు సాగు చేసిన ఆయకట్టుకు నీరు ఇచ్చారు. అలగనూరు జలాశయంలోకి కూడా కొంత నీటిని నిల్వ చేశారు. కేసీ కింద ఈ ఖరీఫ్‌లో 40 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కాల్వకు నీరు బంద్ కావడంతో వరి సాగుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దిగువ కాల్వపై గస్తీకి కలెక్టర్ అనుమతి... తుంగభద్ర దిగువ కాలువపై పోలీసు గస్తీ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అనుమతులు ఇచ్చారు. కాలువపై 135 కి.మీ నుంచి 250 కి.మీ వరకు గస్తీ నిర్వహించేందుకు పోలీసులకు అవసరమైన వాహనాలు, తాత్కాలిక విడిది ఏర్పాట్లకు సుమారు 6 లక్షలు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు వేసి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ దృష్టికి తుంగభద్ర దిగువ కాలువపై గస్తీ ఏర్పాటుకు అనుమతించాలని ఇంజినీర్లు కోరారు. దసరా ఉత్సవాల తరువాత పోలీస్ బంద్ బస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీనిచ్చారు. -
హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు
పాములపాడు: మల్యాల ఎత్తిపోతల పథకం హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు పంపింగ్ చేయనున్నట్లు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. లింగాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులతో కలిసి తాను జిల్లా కలెక్టరును కలిశానన్నారు. మల్యాల ఎత్తిపోతల పథకంలోని హంద్రీనీవాలో రెండు పంపులు కేసీ కెనాల్లోకి మళ్లించాలని ఇటీవల కలెక్టరు, ఇరిగేషన్ అధికారులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ చేస్తారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 120 కిలో మీటరు వరకు కేసీ కెనాల్‌కు నీరందుతుందని రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పూర్తిగా మునిగి పోయిందని పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే ఆలస్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు చౌడయ్య, నాయకులు అంబయ్య, నాగేశ్వరమ్మ తదితరులు ఉన్నారు. -
వారంలోగా కేసీకి బ్యాక్‌వాటర్
నందికొట్కూరు: వారం రోజుల్లోగా కేసీ కెనాల్‌కు శ్రీశైలం బ్యాక్ వాటర్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్యాల వద్ద కేసీ కెనాల్‌కు నీరిచ్చేందుకు చేపట్టిన పనులను ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అశోకరత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆయకట్టు రైతులకు నీటి సమస్య తలెత్తకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే శనివారంలోగా నీటిని విడుదల చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల పరిశీనలో ఎంపీపీ ప్రసాదరెడ్డి, కౌన్సిలర్లు మరియమ్మ, ముర్తుజావలి, సత్తార్‌మియ్యా, టీడీపీ నాయకులు పలచాని మహేశ్వరరెడ్డి, గిరీష్‌రెడ్డి తదితరులున్నారు. -
కేసీకి నీటి విడుదలలో నిర్లక్ష్యం
పగిడ్యాల: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతున్నా కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయడంలో కలెక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. వైస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి గృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరి పంట ఎండిపోతోందని.. కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరితే వరి పంట సాగు చేయమని ఎవరి చెప్పారని ప్రశ్నించడం విచారకరమన్నారు. కేసీ ఆయకట్టు కింద కలెక్టర్ చెప్పిన పంటలే వేసుకోవాలనే కొత్త సంప్రదాయానికి టీడీపీ ప్రభుత్వం తెరదీయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్యులైన అచ్చెన్ననాయుడుకు గ్యాంగ్‌స్టర్ నయూమ్ సంబంధాలు ఉండడం శోచనీయమన్నారు. నయూమ్‌తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడిన టీడీపీ నేతలు ఆ గండం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను స్విస్ చాలెంజ్ కంపెనీకి ఇవ్వడాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టి టెండర్లను రికాల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం చంద్రబాబు తప్పిదాలకు పరాకాష్ట అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మాటలు నిరర్థకంగా మారాయన్నారు. ప్రభుత్వం విఫలం.. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్ రెడ్డి అన్నారు. గత ఏడాది ప్రకటించిన కరువు మండలాలల్లో పంట నష్టం సర్వే చేసినా ఇప్పటి వరకు ఒక్క పైసా పరిహారం రైతులకు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు జగదీశ్వరరెడ్డి, మిడుతూరు జెడ్పీటీసీ యుగంధర్‌రెడ్డి, దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు రమణయ్యశెట్టి, నాయకులు రమాదేవి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోండి
– ఎస్ఈ,సీఈని కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఐజయ్య – కేసీకి 1000 క్యూసెక్కుల నీరు విడుదల కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువ కింద సాగు చేసిన పంటలకు సాగు నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య.. శుక్రవారం జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్ సి.నారాయణ రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ ఎస్. చంద్రశేఖర్ రావులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో కేసీకి నీరు ఇస్తామని చెప్పడంతో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆయకట్టుదారులతో పాటు, మిగతా ప్రాంతాల్లోని రైతులు ఇప్పటీకే నారు మళ్లు వేసుకున్నారని, కానీ ఇంత వరకు కాల్వకు నీరు విడుదల చేయకపోవడం వల్ల పంటు ఎండిపోతున్నాయని, కాల్వకు నీరు ఇచ్చి పంటలను కాపాడాని కోరారు. కాల్వలకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. 120 కి.మీ నుంచి ఉన్న ఆయకట్టుకు శ్రీశైలం నీరు ఇస్తామంటున్నారు, కానీ 0 నుంచి 120 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఈ పంటలను కాపాడేందుకు హంద్రీనీవా నుంచి రైండు వైపులు తాత్కలికంగా కేసీ కాల్వకు మళ్లీంచాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. 0 నుంచి 120 కి.మీ వరకు ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారని అన్నారు. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆ పంటలన్ని ఎండుతున్నాయని ఎలాగైనా రైతన్నలను ఆదుకోని నీరు ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతో అధికారులు స్పందించి కలెక్టర్ అనుమతితోS కేసీకి 1058 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కాల్వకు నీటిని విడుదల చేసినందుకు అధికారులకు ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు. -
‘సుంకేసుల’కు నిలిచిన ఇన్‌ఫ్లో
సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సుంకేసుల రిజర్వాయర్‌కు నీటి చేరిక నిలిచిపోయినట్లు డ్యాం వర్క్ ఇన్స్పెక్టరు మునిస్వామి సోమవారం తెలిపారు. దీంతో కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపేసామని, డ్యాంలో 1.15 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. -
రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్
-
కేసీఆర్ దిక్కుమాలిన సీఎం
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల సమ్మె దిక్కుమాలిందంటూ మాట్లాడిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర విమర్శలు చేశారు. తమకు అన్యాయం జరిగినపుడు ఎవరైనా పోరాటం చేస్తారని, అందుకే పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మెకు అండగా సోమవారం వరంగల్‌లోని కాళోజీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే భ రించాలన్నారు.