కేసీఆర్ దిక్కుమాలిన సీఎం | Manda Krishna Madiga Criticism on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దిక్కుమాలిన సీఎం

Published Mon, Aug 10 2015 2:00 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

కేసీఆర్ దిక్కుమాలిన సీఎం - Sakshi

కేసీఆర్ దిక్కుమాలిన సీఎం

సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల సమ్మె దిక్కుమాలిందంటూ మాట్లాడిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర విమర్శలు చేశారు. తమకు అన్యాయం జరిగినపుడు ఎవరైనా పోరాటం చేస్తారని, అందుకే పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మెకు అండగా సోమవారం వరంగల్‌లోని కాళోజీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే భ రించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement