Sanitation workers strike
-
ముంచెత్తుతున్న చెత్త
విశాఖ సిటీ: జీవో నంబరు 279ని రద్దు చేయాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. దీంతో గ్రేటర్ విశాఖలో రహదారులపై చెత్త పేరుకుపోతోంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైనా, వీధుల్లో పారబోస్తున్నారు. ఉన్న శాశ్వత ఉద్యోగులతో కేవలం రోజుకు 700 నుంచి 750 టన్నుల చెత్తను మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించగలుగుతున్నారు. అంటే రోజుకు దాదాపు 400 టన్నుల చొప్పున రెండు రోజులకు సుమారు 800 టన్నుల చెత్త నగరంలో పేరుకుపోయింది. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రతి రోడ్డు ఓ డంపింగ్ యార్డులా మారే ప్రమాదం కనిపిస్తోంది. 700 మెట్రిక్ టన్నులు తరలిస్తున్నా.. జీవీఎంసీ పరిధిలో ఉన్న 5,236 ఒప్పంద, కాంట్రాక్ట్ కార్మికులు, 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులంతా కలిసి నగరంలో ఒక రోజుకు ఉత్పన్నమవుతున్న 1100 టన్నుల చెత్తను తరలించగలుగుతున్నారు. వీరిలో 4వేల మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో 1200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్‌తో పాటు సమ్మెలో పాల్గొనని 500 మంది ఒప్పంద కార్మికులతో అదనపు పని చేయిస్తూ జీవీఎంసీ అధికారులు సుమారు 700 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. అయినప్పటికీ 400 టన్నులు మిగిలిపోతూనే ఉంది. విషతుల్యమయ్యే ప్రమాదం రోడ్లపై పేరుకున్న చెత్తలో కూరగాయల వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోని చెత్త బుట్టలో ఈ తరహా వ్యర్థాలు నాలుగు రోజులు నిల్వ ఉంచితే కుళ్లి, పురుగులు పట్టే ప్రమాదముంది. రెండు రోజులుగా రోడ్లపై ఉన్న వ్యర్థాలు విషతుల్యమయ్యే అవకాశాలున్నాయి. ప్లాస్టిక్‌తో పాటు కుళ్లిన వ్యర్థాలు, కోడిగుడ్ల తొక్కలువంటివి ఉండటం వల్ల విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది. చికెన్ వ్యర్థాలు కుళ్లిపోతే 12 శాతం, చేపల నుంచి 8 శాతం, కుళ్లిన కోడిగుడ్ల నుంచి 4 శాతం ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశాలున్నాయి. డయాగ్జీన్లు, ప్యూరాన్ల వంటి విష రసాయనాలు విడుదలయ్యే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అదనపు సిబ్బందిని నియమించినా.. కార్మికుల సమ్మె నేపథ్యంలో చెత్తను తరలించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రైవేటు సిబ్బందిని నియమించారు. 8 జోన్లకు సుమారు 500 మందిని నియమించారు. వీరు విధుల్లోకి వచ్చిన వెంటనే కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో సీఎంహెచ్వో డా.హేమంత్‌కుమార్, ఆయా జోనల్ కమిషనర్లు పోలీసుల సహాయంతో చెత్తను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైతే మరింత మందిని ఏర్పాటు చేస్తామని సీఎంహెచ్వో తెలిపారు. చెత్త తరలింపు వాహనం అడ్డగింత ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు 42వ వార్డులో చెత్త తరలింపు వాహనాన్ని అడ్డుకున్నారు. వార్డు ప్రధాన రహదారిలో చెత్త తరలించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు జీవీఎంసీ ఏడీసీ ఫైనాన్స్ విజయ్ మనోహర్, 6వ జోన్ కమిషనర్ రమణమూర్తి, ఏఎంహెచ్ఓ మురళీమోహన్లను, వాహనాల్ని కార్మికులు అడ్డుకున్నారు. శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు అధికారులు సహకరించాలని కోరారు. చెత్తను తరలించరాదని ఆందోళన చేశారు. ఆందోళనకారులు ఎంతకీ అడ్డు తొలగకపోవడంతో అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వారితో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. -
మంత్రి నారాయణ మొండివైఖరి
నెల్లూరు సిటీ: మంత్రి నారాయణ మొండివైఖరితో పారిశుధ్య కార్మికులు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 27 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో నగరం చెత్తాచెదారాలతో నిండిపోయింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌తో మేయర్ అజీజ్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. సోమిరెడ్డి తన నివాసంలో కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపినా, మేయర్ అజీజ్ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. 279 జీఓపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మెట్టుదిగకపోవడం.. అటు కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించేదిలేదని తేల్చిచెప్పడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. సమస్య జఠిలం కార్పొరేషన్ పరిధిలో 877 మంది పారిశుధ్య కార్మికులు సొసైటీ కింద, 260 మంది కాంట్రాక్టర్ కింద, 350 మంది పర్మనెంట్ పద్ధతిలో ఉన్నారు. సొసైటీ కార్మికులను 279 జీఓలో ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పనిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల 14 నుంచి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. రోజూ 350 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారాలు నగరంలో ఉత్పత్తవుతాయి. 27 రోజులుగా 9500 మెట్రిక్ టన్నుల చెత్తలో కార్పొరేషన్ అధికారులు అక్కడక్కడా 20 శాతాన్నే తొలగించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. రెండు దఫాల చర్చలు విఫలం కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ శనివారం కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమ్మె విరమణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు మేయర్ ఇచ్చిన ముందస్తు అనుమతులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మేయర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని, తాత్కాలికంగా 279 జీఓను అమలు చేయమని చెప్పారు. అయితే అనుమతులను వెనక్కి తీసుకుంటనే సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘ నాయకులు తేల్చిచెప్పారు. అనంతరం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. 279 జీఓపై వెనక్కి తగ్గేదిలేదని, అవసరమైతే పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిద్దామని మేయర్‌కు మంత్రి చెప్పినట్లు సమాచారం. అనంతరం శనివారం రాత్రి సోమిరెడ్డి నివాసంలో కార్మిక సంఘ నాయకులతో మరో ధఫా ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే సోమిరెడ్డి నుంచి కూడా సానుకూల సమాధానం రాకపోవడంతో కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్, మంత్రి సోమిరెడ్డి చర్చలు జరిపినా ఫలితం ఉండదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మంత్రి నారాయణ మాత్రం కార్మిక సంఘాల డిమాండ్లకు వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలెవరూ సొంత నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు. మంత్రి నారాయణతో మేయర్ ఫోన్లో మాట్లాడిన సమయంలో 279 జీఓను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరులో రెండు, మూడు రోజులు ఉండి వెళ్లిపోతారని, తాము నగరంలో ఎలా తిరగాలని టీడీపీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో మాట్లాడకుండా ఇలా మొండిగా వ్యవహరిస్తే తామే నష్టపోతామని గుసగుసలాడుతున్నారు. వీరి పంతాలతో ప్రజలకే ఇబ్బందులు ఓ వైపు కార్మికులు తమ పొట్టగొట్టద్దని సమ్మె చేస్తుంటే.. మంత్రి నారాయణ మొండివైఖరి కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయకచవితి పండగను ఎలా చేసుకోవాలని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో చెత్తాచెదారాలతో ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ వ్యవస్థనుప్రైవేటీకరించేందుకే: కార్పొరేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. 279 జీఓ అమలైతే భవిష్యత్తులో పన్నుల భారం ప్రజలపై భారీగా పడనుంది. ప్రజలు కూడా కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారు. – కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడుమంత్రి పట్టించుకోకపోవడందారుణం: కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నా, మంత్రి నారాయణ, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం దారుణం. 279 జీఓకు సంబంధించి మేయర్ అజీజ్ ఇచ్చిన ముందస్తు అనుమతులను తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. – రూప్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ -
కేసీఆర్ దిక్కుమాలిన సీఎం
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల సమ్మె దిక్కుమాలిందంటూ మాట్లాడిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర విమర్శలు చేశారు. తమకు అన్యాయం జరిగినపుడు ఎవరైనా పోరాటం చేస్తారని, అందుకే పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మెకు అండగా సోమవారం వరంగల్‌లోని కాళోజీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే భ రించాలన్నారు. -
మీకు తగిన శాస్తే జరిగింది!
ప్రతిపక్షాలపై కేసీఆర్ ఫైర్ * మిమ్ముల్ని అరెస్టు చేయకపోతే ఏం జేయాలె? * సెక్రటేరియట్లో అడ్డం నిలబడితే స్టేషన్ల పెట్టక ఏం జేస్తారు? * కమ్యూనిస్టు సర్పంచులున్న చోట జీతాలు పెంచండి * తెల్లారి నుంచే మేం పెంచుతాం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్న తమ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు.. కార్మికులను రెచ్చగొట్టి దిక్కుమాలిన సమ్మె చేయిస్తున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో ధర్నాకు దిగిన ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సమర్థించారు. ‘‘ఏం పని లేక ఏదో ఒక పని కల్పించుకుని సెక్రటేరియట్‌కు వచ్చి దర్వాజకు అడ్డంగా నిలబడితే అరెస్టు చేసి పోలీస్స్టేషన్ల పెట్టక ఏంజేస్తరు? మీకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ యూనియన్ బాజీలు, పనికిమాలిన దందాలు బంద్ పెట్టండి. ఇక మీ పప్పులుడకవ్. భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదని హెచ్చరిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి, మహాసముద్రంగండి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రతిపక్షాలను ఒక్క మాట అడుగుతున్నా.. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ దిక్కుమాలిన సమ్మె చేస్తుండ్రు కదా! కమ్యూనిస్టు సర్పంచులున్న చోట కార్మికులకు జీతాలు పెంచండి. తెల్లారి నుంచే మేం కూడా పెంచుతాం. ఎందుకంటే పారిశుధ్య కార్మికులకు ఏ గ్రామానికి ఆ పంచాయతీ, ఏ మున్సిపాలిటీ కార్మికులకు ఆ మున్సిపాలిటీయే జీతాలిస్తుంది తప్ప ప్రభుత్వం కాదు. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా జీతాలు ఇస్తున్నదా?’’ అని ప్రశ్నించారు. వారి జీవితాలు నాశనం చేస్తున్నాయి.. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అడ్డగోలు సమ్మె చేస్తూ ప్రతిపక్షాలు కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నాయని సీఎం దుయ్యబట్టారు. నిన్నటి వరకు పంచాయతీల్లో జీతాల కోసం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసే అధికారం ఉండేదని, తాను దాన్ని 50 శాతం ఖర్చు చేసే అధికారమిచ్చానని చెప్పారు. కార్మికులు యూనియన్లు, ప్రతిపక్షాల మాటలు వినకుండా విధుల్లో చేరి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కార్మికులతో సమ్మె చేయించిన ప్రతిపక్షాలే వారి చేత సమ్మెను విరమింపజేయాలని కోరితే.. విపక్షాలు మాత్రం ‘సమ్మె మేం చేయించినా.. మీరే పరిష్కరించాలి’ అని చెబుతున్నాయన్నారు. అందుకే వారు కోరినా తాను ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదన్నారు. అయినా పని కల్పించుకుని సచివాలయానికి వచ్చి ధర్నా చేసి అరెస్టయ్యారన్నారు. ‘‘ప్రజలు మాకు అధికారమిచ్చిండ్రు. తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తరు. అంతవరకు ఎదురుచూడాలేగానీ.. పొద్దున లేస్తే ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఎట్లా? మీ పుణ్యమా అని జీహెచ్ఎంసీలో వెయ్యి మంది కార్మికుల ఉద్యోగాలు పోయినయ్. ఇకనైనా మీ యూనియన్ బాజీలు... పనికిమాలిన దందాలు బంద్ జేసుకోవాలె’’ అని అన్నారు. గ్రామజ్యోతి ద్వారా రూ.30 వేల కోట్లు గ్రామజ్యోతిలో భాగంగా నాలుగేళ్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు సీఎం చెప్పారు. రోడ్లు ఇతరత్రా అభివృద్ధి నిధులు కాకుండా నియోజకవర్గానికి రూ.300 కోట్ల చొప్పన ఒక్కో జిల్లాకు సగటున రూ.2,500 కోట్లు వస్తాయన్నారు. ఆ నిధులను పార్టీలతో పనిలేకుండా గ్రామాల జనాభా ఆధారంగా ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, 16 ఏళ్లపాటు పాలించిన తెలుగుదేశం నాయకులు సాగునీటి ప్రాజెక్టులను అడ్డగోలుగా డిజైన్ చేశారని విమర్శించారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తామన్నారు. కాగా, కరీంనగర్ జిల్లా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ రాత్రి 9 గంటల ప్రాంతంలో నేరుగా మెదక్‌జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తట్ట మోస్తా.. మోరీ పని చేస్తా! తాను దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరును అద్దంలా తీర్చిదిద్దేందుకు తట్ట మోస్తానని సీఎం వ్యాఖ్యానించారు. శనివారం గ్రామానికి వచ్చిన కేసీఆర్ రెండున్నర గంటలు అక్కడే గడిపారు. తొలుత గ్రామంలోని వాడవాడలా కలియదిరిగారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామసభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘‘చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్న. ఊరు ఊరంతా ఇక కదలాలి. ఊరిలో చెత్తపై యుద్ధం చేయాలి. ఈనెల 12న ఊరిని శుభ్రం చేద్దాం. ఆరోజు మీతోపాటు నేనూ వస్తా. నా వంతుగ 50 తట్టల మట్టి మోస్తా. అవసరమైతే మోరీ పని కూడా చేస్తా. పనయ్యాక నా సొంత డబ్బుతో ఊరోళ్లందరికీ భోజనాలు పెట్టిస్తా’’ అని చెప్పారు. ఇకపై ప్రతినెలా ఒకరోజు గ్రామాభివృద్ధి కోసం శ్రమదానానికి సిద్ధం కావాలని కోరారు. ఈనెల 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లెలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్రామజ్యోతి సందర్భంగా ఏమేం చేయాలో తెలియజేప్పేందుకే ఇతర జిల్లాలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెప్పారు. నువ్వు గుడుంబా అమ్ముతున్నవట గదా..? ముల్కనూర్‌లో పాడుబడ్డ బావులను, కూలిన ఇళ్లను, మురికి కాల్వలను సీఎం పరిశీలించారు. ఎల్లోజు సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వివరాలు అడిగారు. ‘సార్ మాకు ఇల్లు లేదు.. రేకుల షెడ్లో ఉంటున్నాం’ అని ఆయన చెప్పగా.. ‘తక్షణమే నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా’ అని చెప్పారు. రాజేశ్వరీ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ వస్తుందా అని ఆమెను ఆరా తీశారు. ‘పింఛన్ వస్తోంది కానీ.. బియ్యం వత్తలేవు బాంచెన్..’ అని ఆమె పేర్కొంది. ‘నీవు గుడుంబా అమ్ముతున్నవట గదా..’ అని సీఎం ఆమెను ప్రశ్నించగా ‘ఎన్నడో మూడు నెల్లకిందనే బంద్ చేసిన బాంచెన్’ అని ఆమె చెప్పగా.. ‘మళ్లీ అమ్మితే నీపై కేసుపెడతా..’ అని సీఎం పేర్కొన్నారు. -
సీఎంది మొండి వైఖరి:లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని వామపక్షాలు ధ్వజమెత్తాయి. గురువారం నుంచి సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాయి. బుధవారం మఖ్దూం భవన్లో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) సమావేశమై మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీరును ఖండించాయి. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జేఏసీ నిర్వహించనున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతున్నట్లు, 11న కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరంగల్ బరిలో గద్దర్ లేదా లక్ష్మయ్య! వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరఫున ప్రజాగాయకుడు గద్దర్ లేదా టీజేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలలో ఒకరిని పోటీకి నిలపాలని సీపీఐ,సీపీఎం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బుధవారం వామపక్షాల సమావేశంలో దీనిపై చర్చించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు. -
కార్మికుల ‘పోరు’
విధులకు హాజరవుతామన్న కొందరు.. అడ్డుకున్న మరికొందరు.. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల పోరు ఉధృతం దాల్చుతోంది. ఇప్పటికే సమ్మె 25 రోజులకు చేరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కొత్తగూడెంలో మున్సిపల్ కార్యాలయ భవనంపెకైక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. ఖమ్మంలో అధికార, ప్రతిపక్ష కార్మికుల మధ్య వివాదం తలెత్తింది. తోపులాట వరకు పరిస్థితి వెళ్లడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం సిటీ : విధుల్లో చేరతామన్న కొందరు కాంట్రాక్టు కార్మికులు, సమ్మెలో ఉన్న కార్మికుల మధ్య వివాదం నెలకొనడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధుల్లో చేరేందుకు సిద్ధమైన కార్మికులు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. సమ్మెలో ఉన్న కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం నేలకొంది. పరిస్థితి తోపులాట వరకు వెళ్లడంతో ఓ మహిళా కార్మికురాలి చేతికి గాయమైంది. చివరకు పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పూర్వాపరాల్లోకి వెళ్తే.. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొందరు నగరపాలక కార్మికులు గురువారం కొత్త కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గౌరవ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రాన్ని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా తాము శుక్రవారం నుంచి విధుల్లోకి వచ్చేందుకు అనుమతించాలని కోరు తూ ఇన్చార్జి కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. శీలంశెట్టి ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చిన సుమారు 30 మంది కార్మికులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. శీలంశెట్టితో కార్మిక సంఘాల నాయకులు విష్టు, మంద వెంకటేశ్వర్లు వాదనకు దిగారు. కేవలం జీతాల పెంపు కోసమే సమ్మె చేస్తున్నామని, విచ్ఛిన్నం చేయటం తగదని సమ్మె చేస్తున్న కార్మికులు పేర్కొన్నారు. ఒక వైపు వాదనలు జరుగుతుండగానే విధుల్లోకి హాజరయ్యేందుకు వచ్చిన కార్మికులపై సమ్మె చేస్తున్న కార్మికులు తిట్ల పురాణం అందుకున్నారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి స్పల్ప తోపులాట చోటుచేసుకుంది. దీనిలో ఒక మహిళ చేతికి గాయం అయింది. దీనిపై సమ్మె చేస్తున్న కార్మిక సంఘం నాయకులు కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ చాంబర్లో బైఠాయించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ దాడి చేసిన కార్మికుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అతనిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ వారు ఒప్పుకోలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి బైఠాయించిన కార్మికులను కార్యాలయం నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం తాము విధులకు హాజరవుతామని కొంతమంది కార్మికులు కమిషనర్ వేణుగోపాలరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్మికులే స్వచ్ఛందంగా విధులకు హాజరవుతున్నారు శీలంశెట్టి వీరభద్రం, మాజీ కౌన్సిలర్ కార్పొరేషన్లో శానిటేషన్, డ్రింకింగ్, లింకేజీ విభాగంలో పని చేస్తున్న వారందరూ సుమారు 50 మంది స్వచ్ఛందంగా విధులకు హాజరవుతున్నారు. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదు. వారంతట వారుగా హాజరైతే సమ్మె చేస్తున్న వారికి ఇబ్బంది ఏమిటి? వారంతా శుక్రవారం విధులకు వస్తారు. సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర విష్ణ, సీఐటీయూ నాయకులు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 25 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు కవ్విం పు చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి చర్యలను సహిం చేది లేదు. ఎవరైనా విధులకు హాజరైతే అడ్డుకొని తీరుతాం. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి కుట్రలు. -
కార్మికుల సమ్మె సఫలం
అరండల్‌పేట (గుంటూరు) : పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు అనే కంటే ప్రభుత్వం బలవంతంగా కార్మికులతో సమ్మెను విరమింప చేశారనడం సమంజసంగా ఉంటుంది. ఆదివారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రులు నారాయణ, అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడులతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ. 8,300కు అదనంగా రూ.2,700 పెంచి మొత్తం రూ. 11వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు తమకు సంతృప్తిని ఇవ్వలేదని, ఏఐటీయూసీ నాయకులు ఒప్పుకోవడంతోనే సమ్మె విరమించాల్సి వచ్చిందని సీఐటీయూ, ఇతర స్వతంత్య్ర సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 10వ తేదీన సమ్మె ప్రారంభించిన రెండో రోజే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని అప్పుడే రూ. 2వేలు వేతనం పెంచేందుకు ఒప్పుకున్నారని, అప్పుడే కొంచెం బెట్టు చేస్తే రూ. 2,700లకు ఒప్పుకొనేవారని జేఏసీ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయని, దీంతో తాము బయటకు వచ్చామన్నారు. ప్రభుత్వం బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసి సఫలమైందన్నారు. కార్మికులను తొలగిస్తామని, ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని మంత్రులు తేల్చి చెప్పారని, దీంతో కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మౌనం వహించాల్సి వచ్చిందని తెలిపారు. తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తేనే.. జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 6,400 మంది పారిశుద్ధ్య కార్మికులు, పొరుగు సేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మెబాట పట్టారు. నిరాహారదీక్షలు, కార్పొరేషన్, కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి ఇలా అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయా పట్టణాల్లో చెత్త, చెదారం పేరుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలతో పాటు అన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపింది. మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తర్వాతే.. ప్రభుత్వం జరిపిన చర్చల్లో పారిశుద్ధ్య కార్మికులతోపాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను స్కిల్డ్, అన్స్కిల్డ్గా గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వర్కర్లు, జీతాల పెంపుపై మంత్రి వర్గ ఉపసంఘంలో నిర్ణయించి చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. అది ఎప్పుడు జరుగుతుంది, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. -
'కొరివితో తలగోక్కునే పరిస్థితికి తెచ్చుకున్నాడు'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కొరివితో తలగోక్కునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉప్పల్ పరిధిలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ శనివారం కిషన్‌రెడ్డి ప్రసంగించారు. కార్మికులు ఉద్యమాలు చేస్తే ఉద్యోగం ఊడబెరుకుతామన్న సీఎం, ఉద్యమం చేసే ఉద్యోగం సంపాదించాడని పరోక్షంగా పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, లేకుంటే బీజీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని ఆయన హెచ్చరించారు. -
భిక్షాటన చేస్తూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన
రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న నగర పంచాయతీ పారిశుద్ధ్య, పారిశుద్ధ్యేతర కార్మికులు శనివారం ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మండల కార్యదర్శి మేడిపల్లి ఆనంద్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులు, ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతూ అణిచివేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు (ప్రకాశంజిల్లా) : తమ సమస్యలను పరిష్కరించాలని 16రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన మద్దతు తెలిపారు. శనివారం కార్మికులు దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఎస్సీ, ఎస్టీలంటే బాబుకు గిట్టదు : రాఘవులు
విశాఖపట్నం : ఎస్సీ, ఎస్టీలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు గిట్టదని, వారిపట్ల కుల వివక్షకు పాల్పడుతుంటారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. దళిత, గిరిజనులంటే సీఎం కుల వివక్ష, పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సమ్మె చేస్తున్నవారిలో ఎక్కువ శాతం మంది దళిత, గిరిజనులు అయినందునే సమ్మె విరమణకు సీఎం ఏమాత్రం ప్రయత్నించట్లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు రూపాయి జీతం చెల్లించడమంటే చంద్రబాబు తెగ బాధపడిపోతారన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. పుష్కరాల పేరుతో రాజమండ్రిలో ఉండి, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు ఖాళీ లేదనడం చంద్రబాబు పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. బిజీగా ఉండుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపి సమ్మెను విరమించే ప్రయత్నం చేయొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశం లేదని అన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని, రాజకీయపార్టీలన్నింటినీ కలుపుకుని రాష్ట్ర బంద్ చేపడతామని స్పష్టం చేశారు. పుష్కరాల్లో దుర్ఘటన పాపం చంద్రబాబు, ఆయన మంత్రివర్గానిదేనని, ఇందుకు వారు బాధ్యత వహించాలని రాఘవులు అన్నారు. -
ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!
- పదో రోజుకు పారిశుధ్య సమ్మె - ఎక్కడ చూసినా దుర్గంధం - ముసురుకుంటున్న డెంగీ జ్వరాలు విశాఖపట్నం సిటీ : మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 10వ రోజుకు చేరింది. ప్రజారోగ్య శాఖలోని కొందరు అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పనులు పురమాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్, ఔట్సోర్సింగ్ కార్మికులంతా ఒక్కసారిగా సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొందరు అధికారులకు బాధ్యతలను అప్పగించారు. నగరంలో చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లడం, మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, దోమలు వృద్ధి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం, వివాదాలు జరిగే చోట పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయడం, చెత్త తొలగింపును అడ్డుకునే వారిపై కేసులు పెట్టడం, రోజూ దినసరి కార్మికులకు పనులు అప్పగించడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియక ఎవరి సహకారం లేకుండా అన్ని పనులు పురమాయించుకోవడానికి నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సమ్మె త్వరగా ముగిస్తే ఓసారి పుష్కరాలకు వెళదామనుకుంటున్న వారికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సమ్మె ముగిసేలా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణలు..! సమ్మె మొదలవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించి చెత్తను తొలగించి సమ్మె ప్రభావం లేదని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు కూలీలను పనుల్లోకి దించాలని చేసిన ఎత్తుగడను పారిశుధ్య కార్మికులు ఆదిలోనే అడ్డుకున్నారు. కూలీలు పనులు చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన కార్మికులు పలు చోట్ల అడ్డుకుంటున్నారు. ఆదివారం కూడా అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి గుడి వద్ద, జోన్-2 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు-కూలీలకు మధ్య ఘర్షణలు జరిగినట్టు తెలిసింది. సమ్మె యథాతథం...! సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. నగరంలో ఎక్కడ చెత్తలు అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన చెత్తతో పోల్చుకుంటే రోజూ వారీగా పెరిగే చెత్తకుప్పలు మరింతగా రోడ్లను ఆక్రమించేస్తున్నాయి. ఇప్పటికే రహదారులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. -
వ్యర్థ వేదన
కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె చెత్త కుప్పలుగా పట్టణాలు తుతూమంత్రంగా {పత్యామ్నాయ చర్యలు రంజాన్ దృష్ట్యా కొన్ని చోట్ల పట్టు సడలించిన కార్మికులు జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధులు తిరుపతి నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో రోడ్లపైనే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారాయి. దీనికితోడు జిల్లాలో వర్షం కురుస్తుండడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్ధ్యంపై పెను ప్రభావం చూపుతోంది. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్మికులు మదనపల్లెలో రెండు రోజులపాటు సమ్మె సడలించారు. చిత్తూరు కార్పొరేషన్లో మేయర్ కఠారి అనురాధ జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. శ్రీకాళహస్తిలో బుధవారం సాయంత్రమే సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరారు. పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు వంట వార్పు చేసి ఆందోళన చేపట్టారు. తిరుపతి నగరంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలో యాత్రికులను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. పుంగనూరు కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రెండురోజుల్లో సమస్యను పరిష్కరించపోతే పార్టీ తరపున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుత్తూరు, నగరిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగించారు. పొంచిఉన్న వ్యాధులు పేరుకుపోయిన చెత్తకు, వర్షం తోడవడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో అతిసార, టైఫాయిడ్, విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటువ్యాధులు, జ్వరాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?
హైదరాబాద్ : వేతనాలు పెంపుతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ అంటే ఇదేనా, పంతానికి వెళ్లి.. కార్మికులను చర్చలకు కూడా పిలవరా...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, తన కుమారుడు వద్ద ఉన్న శాఖల్లోనే ఇంత నిర్లక్ష్యమా అని వారు ధ్వజమెత్తారు. కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. -
అయిదో రోజుకు కార్మికుల సమ్మె
- మంత్రి గంటాతో తేలని చర్చలు - సమ్మె విరమించేదిలేదన్న జేఏసీ నేతలు - నేటి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు:కమిషనరు విశాఖపట్నం సిటీ : మహా నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల సమ్మె మంగళవారానికి అయిదో రోజుకు చేరింది. ఔట్సోర్సింగ్,పారిశుధ్య కార్మికుల సమ్మె అయిదు రోజులుగా జరుగుతుంటే వారికి మద్దతుగా చేపట్టిన రెగ్యులర్ ఉద్యోగుల సమ్మె 010 పద్దు జీతాల కోసం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు చెందినదని, జీవీఎంసీలో జరుగుతున్న సమ్మెతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు 010 పద్దులో జీతాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.విశాఖలోనే తమ జీతాలు 010 పద్దులో ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించినా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె విరమించే అవకాశమే లేదంటున్నారు. తూతూ మంత్రంగా మంత్రి గంటా చర్చలు మంత్రి గంటా శ్రీనివాసరావు జేఏసీ నేతలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఛాంబర్లో గంట పాటు చర్చలు జరిపారు. ఆశించిన ప్రకటన మంత్రి చేయలేదు. దీంతో చర్చల్లో ఏమీ తేలలేదు. పని చే సే వారికి అడ్డుపడొద్దని మంత్రి గంటా శ్రీనివాసరావు మున్సిపల్ జేఏసీ నేతలకు సూచించారు. కమిషనర్ ఛాంబర్లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సమ్మె విష యం మున్సిపల్, ఆర్ధిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు. ఆగ్రహంగా కమిషనర్ ప్రవీణ్..! కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహంగా కనిపించారు. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన పారిశుద్ద్య కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులకు మధ్య మంగళవారం పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వతావరణం ఏర్పడేందుకు కమిషనర్ చర్యలే కారణమంటూ జేఏసీ నేతలు ఆరోపించడంతో కమిషనర్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి గంటా చర్చలప్పుడు కూడా కమిషనర్ ఆగ్రహంతోనే కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల కమిషనర్‌కు జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతీ నెలా జీతాలు ఇవ్వలేం..! రూ. 2 వేల కన్నా అదనంగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలు పెంచితే జీవీఎంసీ ప్రతీ నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించలేదని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జీవీఎంసీకి వచ్చే ఆ దాయం రూ. 550 కోట్లు అయితే అందులో ప్రతీ ఏటా జీతాలు, పెన్షన్లు కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామని జీతాలు పెంచితే రూ. 321 కోట్లకు బడ్జెట్ పెరుగుతుందని వివరించారు. వ్యాధులు ప్రబలకుం డా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో బుధవారం నుంచి చెత్తలు తొలగించనున్నట్లు ప్రకటించారు. 400 మంది ప్రైవేట్ వర్కర్లు, 25 జేసీబీలు, 52 లారీలు, 36 మంది డ్రైవర్లను రంగంలోకి దించి చెత్తను తొలగిస్తామన్నారు. రెచ్చగొడితే ఊరుకోం పారిశుద్ద్య కార్మికుల పని ఎవరైనా చేయొచ్చని అయితే రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని జీవీఎంసీ గుర్తింపు కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ వివి వామన రావు స్పష్టం చేశారు. అఖిల పక్ష నేతలందరితో కలిసి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచీ జీవీఎంసీలో అంతా సమ్మెలోకి వచ్చినట్టయ్యిందని చెప్పారు. తాగునీరు, వీధి లైట్లు తప్పా మిగిలిన అత్యవసర పనుల్లో దేనికీ కార్మికులు హాజరు కావడం లేదన్నారు. 010 పద్దుతో జీతాలు వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. -
వర్షం..చెత్త సమస్య తీవ్రం!
- మురికి కూపాలుగా మారిన కాలనీలు - డస్ట్బిన్లలో వర్షం నీరు కలిసి దుర్గంధం... - ప్రజలకు తప్పని అవస్థలు సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరంలో ఏ వీధి చూసినా చెత్తతో నిండిపోయింది. రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త దుర్గంధం వెదజల్లుతోంది. ఇక మంగళవారం కురిసిన వర్షం కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమైంది. చెత్తక్పుల్లో వర్షం నీరు చేరి రొచ్చుగా మారడంతో వాసన భరించలేకపోతున్నామని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నారు. తొమ్మిదిరోజులుగా సమ్మెలో ఉన్న జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్లను ఊడ్చకపోవడమే కాక.. ఇంటింటినుంచీ తరలించిన చెత్తను వేసేందుకు చెత్తడబ్బాలు ఖాళీ లేక ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కుమ్మరించారు. చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలు.. కుళ్లిన పదార్థాలతో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వర్షపునీరు రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో కలగలసి మురుగునీటిని తలపించింది. జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు.. మంగళవారం కార్మికులు విధుల్లోకి రావడంతో 3 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలించగలిగినప్పటికీ, వారం రోజులుగా పేరుకుపోయిన చెత్తాచెదారాలు దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులపైనే ఉంది. కాగా, సమ్మె జరుగుతున్నప్పటికీ మొదటి రెండు రోజులు మినహాయించి ప్రతిరోజూ 3 వేల టన్నుల చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సమ్మె వెనుక రాజకీయం.. జీహెచ్ఎంసీ కార్మికుల ప్రయోజనాల పేరిట సమ్మెకు ఉసిగొల్పుతున్న వారికి జీహెచ్ఎంసీకి సంబంధంలేదని, వారి రాజకీయ ప్రయోజనాల కోసం..ఇతరత్రా స్వప్రయోజనాల కోసం సమ్మె కొనసాగిస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. మల్కాజిగిరి, చార్మినార్ ప్రాంతాల్లో కొందరు చెత్తను తెచ్చి రోడ్లపై వేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. వీటిని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలుగా భావిస్తున్నామన్నారు. వాటిపై విచారణ జరిపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొంతమంది కార్మికుల వేతనాలు కూడా పూర్తిగా వారికందడంలేదని, ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంగళవారం 70 శాతానికి పైగా కార్మికులు విధులకు హాజరయ్యారని చెప్పారు. జీహెచ్ఎంఈయూ ర్యాలీ.. జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు. గోపాల్‌పై జరిగిన దాడికి నిరసనగరా ఆ సంఘం నాయకులు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోపాల్‌పై దాడి జరిపిన వారిపై తగుచర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ నాయకులు ఎంఏ జబ్బార్, బాలనర్సింగరావు, విఠల్‌రావు కులకర్ణి ఉన్నారు. -
సానుకూలంగా స్పందించనున్న కేసీఆర్!
హైదరాబాద్ : గత ఎనిమిది రోజులుగా తమ డిమాండ్ సాధన కోసం విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికుల సమ్మెను తెలంగాణ ప్రభుత్వం విరమింపచేసే ప్రయంత్రంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోన్నట్లు సమాచారం. జీతాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపై కేసీఆర్ సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు తమ అంతర్గత రాజకీయాలను పక్కనపెట్టి సహకరించాలని ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రెండోవారానికి చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్తమయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి. -
రోడ్లపై చెత్తవేస్తే జరిమానా
- ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకోవాలి - స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం - కమిషనర్ వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకునేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ సూచించారు. ఆదివారం వన్‌టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, బీఆర్పీ రోడ్డు, కొత్తపేట, చిట్టినగర్, కేదారేశ్వరపేట, రైతుబజార్, మ్యాంగోమార్కెట్ హనుమాన్‌పేట, కృష్ణలంక, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రోడ్లన్ని చెత్తమయమై ఉండటాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ సముదాయాలు, షాపింగ్ మాల్స్ నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా ఉండేలా ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సిందిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్‌కు సూచించారు. మార్కెట్లోని షాపుల యజమానులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. లేనిపక్షంలో ప్రజారోగ్య చట్టం ప్రకారం సంబంధిత షాపుల యజమానుల నుంచి అపరాధ రుసుం విధించాలన్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రజలు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయొద్దని కమిషనర్ సూచించారు. ఎవరికి వారు స్వచ్ఛంధంగా చెత్తను దగ్గర్లోని డంపర్‌బిన్స్‌లో వేయాల్సిందిగా సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా సూచించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న పబ్లిక్‌హెల్త్ వర్కర్ల డిప్యుటేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించారు. పీహెచ్ వర్కర్లు అందరూ తప్పనిసరిగా పారిశుధ్య విధులు నిర్వర్తించాలన్నారు. -
బాబోయ్ కంపు
- చెత్త..చెత్తగా మారిన సిటీ - సమ్మె విరమించని పారిశుద్ధ్య సిబ్బంది - తీవ్రమవుతున్న సమస్య - ఆందోళనలో నగరవాసులు సాక్షి, సిటీబ్యూరో: సిటీ చెత్తకుప్పగా మారింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరం దుర్గంధభరితమయింది. ఏడు రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారాయి. కాలనీలు కంపుకొడుతున్నాయి. రోగాలు ప్రబలుతున్నాయి. కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టంచేస్తున్నారు. సోమవారంతో కార్మికుల సమ్మె రెండవ వారంలోకి చేరుకోనుంది. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆదివారం పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేసి కార్మికులు నిరసన తెలిపారు. పాతనగరంలో దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టగా...పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూసారంబాగ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రజా ప్రతినిధులకు లక్షల్లో జీతాలు పెంచిన సర్కార్ రాత్రింబవళ్లు కష్టపడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించిందన్నారు. కుత్భుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద కూడా కార్మికులు దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. సనత్‌నగర్, అమీర్‌పేట్, బల్కంపేట్, శివార్లలోని యాప్రాల్ తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, దుర్గంధంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కాగా రహమత్‌నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ అధికారులు మహిళా కూలీలతో చెత్తను తరలిస్తుండగా.. రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బంది వారితో గొడవకు దిగారు. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సదరు మహిళల చీపురు కట్టలని రెగ్యులర్ కార్మికులు తగులబెట్టారు. దీంతో కొద్దిసేపు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రత్యామ్నాయంగా.. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం జీహెచ్ఎంసీకి చెందిన 466 వాహనాల్లో 1815 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరో 300 స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లు నగరంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాయన్నారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. -
భాగ్యనగరం.. చెత్తమయం..
ఏడో రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె పలు ప్రాంతాల్లో క్షీణించిన శుభ్రత చార్మినార్ ప్రాంతంలో అధికారుల స్వచ్ఛహైదరాబాద్ అడ్డుకున్న కార్మికులు.. ఉద్రిక్తత హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్త మయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి. కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టంచేస్తున్నారు. నేటికి(సోమవారంరోజున) కార్మికుల సమ్మె రెండో వారంలోకి చేరుకోనుంది. కాగా ఆదివారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతి రేకంగా దిష్టిబొమ్మలు దహనం చేసి కార్మికులు తమ నిరసన తెలిపారు. పాతనగరంలో దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు 30 మంది పారిశుధ్య కార్మికులను అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు శాలిబండ చౌరస్తా నుంచి మక్కా మసీదు, చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు రోడ్లను శుభ్రపరిచారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూసారంబాగ్ చౌరస్తాలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా రహమత్‌నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రైవేటు మహిళలతో చెత్తను తరలిస్తుండగా.. రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బంది వారితో గొడవకు దిగారు. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సదరు ప్రైవేటు మహిళల చీపురు కట్టలని రెగ్యులర్ కార్మికులు తగులబెట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా.. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం జీహెచ్ఎంసీకి చెందిన 466 వాహనాల్లో 1815 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరో 300 స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లు నగరంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాయన్నారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. -
ఛీ..
నగరం... నరకం ఎక్కడ చూసినా చెత్త కుప్పలే నేటి నుంచి వీధి దీపాలు, నీటి సరఫరా కూడా బంద్ సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఐదు రోజులుగా జీహెచ్ఎంసీలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. వీధులు, రహ దారులనే తేడా లేకుండా అన్నిచోట్లా పెద్ద ఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోయాయి. అంటు వ్యాధులు ప్రబలుతుండటంతో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ప్రైవే టు వాహనాలు.. తాత్కాలిక (ప్రైవేటు) కార్మికులు... స్వచ్ఛ యూనిట్ల సహకారంతో పనులు చేపట్టింది. సమస్యల పరిష్కారం కోసం తాము విధులు బహిష్కరిస్తుంటే... మీరెలా పనులు చేస్తారంటూ పారిశుద్ధ్య కార్మికులు వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులను అడ్డుకున్నారు. వారిపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉభయవర్గాల వారు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. మరో ఘటనలో ఒక మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కువెళ్లారు. మొత్తానికి మున్సిపల్ కార్మికుల సమ్మె ఓవైపు నగరాన్ని దుర్గంధభరితం చేయగా... మరోవైపు కార్మికుల మధ్య ముష్టియుద్ధాలకు తెరతీసింది. టోలీచౌకీ సాలార్జంగ్ కాలనీ, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం పోలీసుల వరకు వెళ్లింది. తార్నాకలో ‘సేవ్ హైదరాబాద్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా జీహెచ్ఎంసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. జీహెచ్ఎంసీ కార్మికులు తార్నాక చౌరస్తాలో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో మున్సిపల్ ఉద్యోగి జీతమ్మ విధులు నిర్వహిస్తుండగా.. ముగ్గురు ఔట్సోర్సింగ్ కార్మికులు దాడి చేశారు. ఆమె మెడలోని పుస్తెలతాడును ఎవరో తెంపుకొని వెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద చెత్త తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొని డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తెచ్చి నడిరోడ్డుపై పోసి తమ నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌లోని వివిధ కాలనీల్లో ఉన్న చెత్తాచెదారం తీసుకు వచ్చి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద డంప్ చేసి నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. వివిధ యూనియన్ల నేతృత్వంతో శనివారం ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ లోని గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ మాత్రం సమ్మె విరమించినట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులోగా కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హోంమంత్రి తెలిపినందున సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు యు.గోపాల్ స్పష్టం చేశారు. హెల్త్‌కార్డులపై కూడా హామీ లభించిందని చెప్పారు. తమ యూనియన్ కార్మికులంతా విధుల్లో చేరుతున్నట్లు వెల్లడించారు. పొంగుతున్న మ్యాన్‌హోళ్లు.. రోడ్లపై పేరుకుపోతున్న చెత్తకుప్పలతో పాటు వివిధ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. రహదారులు మురుగునీటితో నిండి...రాకపోకలకు ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. నేటి నుంచి వీధి దీపాలు, నీరు బంద్ తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చడం లేదని...ఈ నేపథ్యంలో శనివారం నుంచి వీధి దీపాలు, నీటి సరఫరా బంద్ చేస్తామని సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లు ప్రకటించాయి. పనుల తీరిదీ.. జీహెచ్ఎంసీలో నిత్యం పనిచేసే వాహనాలు.. కార్మికు లు.. తరలించే చెత్త.. శుక్రవారం పనిచేసిన వాహనాలు, కార్మికులు, తరలించిన చెత్త వివరాలిలా ఉన్నాయి. -
చెత్త కుండిలా..
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఎనిమిదంతస్తుల అద్దాల మేడ.. విశాలమైన గదులు.. వివిధ వైద్య విభాగాలతో మెడికల్ కళాశా ల ఆస్పత్రి భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. అయితే నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా ఆస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. వరండాల్లో, వార్డుల్లో, రోగులు శయనించే మంచాల కింద చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మొత్తంగా ఆస్పత్రిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటే అంటే అతిశయోక్తి కాదేమో! ఈ ఆస్పత్రికి ప్రతి రోజు ఇన్‌పేషెంట్లు, అవుట్పెషెంట్లు సుమారు 900 మంది, వారి కి సహాయకులుగా మరో 300 మంది వస్తుంటారు. ఇంతమందికి ఆస్పత్రిలో పారిశుధ్య సమస్యగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆస్పత్రిలో 72 మంది పారిశు ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 32 మందికి రెండు నెలల వేతనాలు, మరో 40 మందికి నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్ పడిపోయాయి. ఒ క్కొక్కరికి రూ. 4,030 వేతనం ఉంటుంది. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పారిశుధ్య లోపం ఏర్పడి రోగులు చెత్త కుప్పల మధ్యనే ఉండాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యామ్నా య చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందని వాపోతున్నారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వా ర్డులో మురికి నీరు, చెత్తతో వార్డు మొత్తం మూసుకుపోయింది. రోగులు దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారు. రోగుల బంధువులు ఆస్పత్రిలో ఉండలేక బ యట ఆవరణలోకి సమయం గడుపుతున్నారు. ఇది లా ఉండగా మొత్తం కార్మికుల్లో 40 మందిని నాలుగు నెలల క్రితమే తాత్కాలిక పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఈ నియామకాలకు ఇంకా ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని, దీంతో వీరికి వేతనాలకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెండు రోజులు సమ్మె వాయిదా.. మరో వైపు ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం, చెత్తా చెదారం పేరుకుపోవడంతో వైద్యాధికారులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఆయన చొరవతో డీసీహెచ్ఎస్ బాలకృష్ణరావు రెండు రోజుల్లో కార్మికుల జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. జిల్లాకు మెడికల్ కళాశాల అనుమతి ముఖ్యమైందని వివరించడంతో కార్మికులు రెండు రోజుల పాటు సమ్మెను వాయిదా వేసుకున్నారు. -
సమ్మెకు దిగిన కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న కార్మికులు నేటి నుంచి సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వీరిలో ఉన్నారు. నెలసరి కనీస వేతనం 12 వేల 5వందల రూపాయలతో పాటు పలు డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మెకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మికులతో చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపల్ శాఖ అధిపతులు అందుబాటులో లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లే కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది. -
రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల సమ్మె