నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఎనిమిదంతస్తుల అద్దాల మేడ.. విశాలమైన గదులు.. వివిధ వైద్య విభాగాలతో మెడికల్ కళాశా ల ఆస్పత్రి భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. అయితే నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా ఆస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. వరండాల్లో, వార్డుల్లో, రోగులు శయనించే మంచాల కింద చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది.
మొత్తంగా ఆస్పత్రిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటే అంటే అతిశయోక్తి కాదేమో! ఈ ఆస్పత్రికి ప్రతి రోజు ఇన్‌పేషెంట్లు, అవుట్‌పెషెంట్లు సుమారు 900 మంది, వారి కి సహాయకులుగా మరో 300 మంది వస్తుంటారు. ఇంతమందికి ఆస్పత్రిలో పారిశుధ్య సమస్యగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆస్పత్రిలో 72 మంది పారిశు ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 32 మందికి రెండు నెలల వేతనాలు, మరో 40 మందికి నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్ పడిపోయాయి. ఒ క్కొక్కరికి రూ. 4,030 వేతనం ఉంటుంది. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు.
దీంతో పారిశుధ్య లోపం ఏర్పడి రోగులు చెత్త కుప్పల మధ్యనే ఉండాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యామ్నా య చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందని వాపోతున్నారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వా ర్డులో మురికి నీరు, చెత్తతో వార్డు మొత్తం మూసుకుపోయింది. రోగులు దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారు. రోగుల బంధువులు ఆస్పత్రిలో ఉండలేక బ యట ఆవరణలోకి సమయం గడుపుతున్నారు. ఇది లా ఉండగా మొత్తం కార్మికుల్లో 40 మందిని నాలుగు నెలల క్రితమే తాత్కాలిక పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఈ నియామకాలకు ఇంకా ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని, దీంతో వీరికి వేతనాలకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
రెండు రోజులు సమ్మె వాయిదా..
మరో వైపు ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం, చెత్తా చెదారం పేరుకుపోవడంతో వైద్యాధికారులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఆయన చొరవతో డీసీహెచ్‌ఎస్ బాలకృష్ణరావు రెండు రోజుల్లో కార్మికుల జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. జిల్లాకు మెడికల్ కళాశాల అనుమతి ముఖ్యమైందని వివరించడంతో కార్మికులు రెండు రోజుల పాటు సమ్మెను వాయిదా వేసుకున్నారు.
చెత్త కుండిలా..
Published Sat, Mar 1 2014 2:51 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM