stench
-
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
సమస్యలకు నిలయం పెద్దాస్పత్రి
► పనిచేయని లిఫ్టులు.. గోడలపై గుట్కా మరకలు ► ముక్కు మూసుకోనిదే నోఎంట్రీ ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి అయిన రిమ్స్ సమస్యలకు నిలయంగా మారింది. చెత్త కుండీల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ముక్కు మూసుకోనిదే ఆస్పత్రిలోనికి వెళ్లే పరిస్థితి లేదు. ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడంతో రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం రోగులను పైఅంతస్తు నుంచి కిందికి, కింది నుంచి పైఅంతస్తుకు తీసుకెళ్లాలంటే అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని వార్డుల్లో గోడలు, మెట్లపై గుట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. ఆయా వార్డుల్లోని కిటికీలకు అట్ట ముక్కలతో తాత్కాళికంగా తలుపులు అమర్చారు. అపరిశుభ్ర వాతారణం కారణంగా రోగుల వెంబడి వచ్చే వారు రోగాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. పనిచేయని లిఫ్ట్‌లు రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయి. అందులో మూడు పనిచేయడం లేదు. ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుండటం, నాలుగు లిఫ్ట్‌లలో నుంచి ఏ లిఫ్ట్ ఎప్పుడు పనిచేస్తుందో సిబ్బందికే తెలియదంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పై అంతస్తుల్లో చికిత్స పొందుతున్న రోగులైతే రోజుకోసారైనా పరీక్షల నిమిత్తం కిందికి దిగాల్సి ఉంటుంది. దీంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం రోగులను తీసుకెళ్లే విధంగానైనా లిఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల బంధువులు కోరుతున్నారు. గోడలు, మెట్లపై గుట్కా మరకలు పలు వార్డుల్లోని గోడలు, మూలలు, మెట్లపై గు ట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఆ స్పత్రిలోనికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రజలను తనిఖీ చేసి మరీ వారి వద్ద ఉన్న గుట్కాలు, అంబర్ లాంటి మత్తు పదార్థాలను లోనికి అనుమతించలేదు. దీంతో ఆ సమయ ంలో ఇలాంటివి చోటుచేసుకోలేదు. ప్రస్తు తం గోడలు మరకలతో నిండుగా కనిపిస్తున్నాయి. వెదజల్లుతున్న దుర్గంధం ఆస్పత్రిలో ఎటు వెళ్లినా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డం, రోజుల తరబడి చెత్తాచెదారం నిల్వ ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ప్రజలు దుర్వాసనతో ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. నోటిపై గుడ్డను అడ్డుగా పెట్టి ఆస్పత్రిలోనికి వెళ్తున్నారు. -
చెత్త కుండిలా..
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఎనిమిదంతస్తుల అద్దాల మేడ.. విశాలమైన గదులు.. వివిధ వైద్య విభాగాలతో మెడికల్ కళాశా ల ఆస్పత్రి భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. అయితే నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా ఆస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. వరండాల్లో, వార్డుల్లో, రోగులు శయనించే మంచాల కింద చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మొత్తంగా ఆస్పత్రిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటే అంటే అతిశయోక్తి కాదేమో! ఈ ఆస్పత్రికి ప్రతి రోజు ఇన్‌పేషెంట్లు, అవుట్పెషెంట్లు సుమారు 900 మంది, వారి కి సహాయకులుగా మరో 300 మంది వస్తుంటారు. ఇంతమందికి ఆస్పత్రిలో పారిశుధ్య సమస్యగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆస్పత్రిలో 72 మంది పారిశు ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 32 మందికి రెండు నెలల వేతనాలు, మరో 40 మందికి నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్ పడిపోయాయి. ఒ క్కొక్కరికి రూ. 4,030 వేతనం ఉంటుంది. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పారిశుధ్య లోపం ఏర్పడి రోగులు చెత్త కుప్పల మధ్యనే ఉండాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యామ్నా య చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందని వాపోతున్నారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వా ర్డులో మురికి నీరు, చెత్తతో వార్డు మొత్తం మూసుకుపోయింది. రోగులు దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారు. రోగుల బంధువులు ఆస్పత్రిలో ఉండలేక బ యట ఆవరణలోకి సమయం గడుపుతున్నారు. ఇది లా ఉండగా మొత్తం కార్మికుల్లో 40 మందిని నాలుగు నెలల క్రితమే తాత్కాలిక పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఈ నియామకాలకు ఇంకా ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని, దీంతో వీరికి వేతనాలకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెండు రోజులు సమ్మె వాయిదా.. మరో వైపు ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం, చెత్తా చెదారం పేరుకుపోవడంతో వైద్యాధికారులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఆయన చొరవతో డీసీహెచ్ఎస్ బాలకృష్ణరావు రెండు రోజుల్లో కార్మికుల జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. జిల్లాకు మెడికల్ కళాశాల అనుమతి ముఖ్యమైందని వివరించడంతో కార్మికులు రెండు రోజుల పాటు సమ్మెను వాయిదా వేసుకున్నారు.