వేతనాలు పెంపుతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మద్దతు తెలిపారు.
హైదరాబాద్ : వేతనాలు పెంపుతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ అంటే ఇదేనా, పంతానికి వెళ్లి.. కార్మికులను చర్చలకు కూడా పిలవరా...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, తన కుమారుడు వద్ద ఉన్న శాఖల్లోనే ఇంత నిర్లక్ష్యమా అని వారు ధ్వజమెత్తారు. కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు.