గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి: కిషన్‌రెడ్డి | Only Telangana can be developed by BJP as well as Gujarat, says Kishan reddy | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి: కిషన్‌రెడ్డి

Published Sat, Apr 19 2014 1:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Only Telangana can be developed by BJP as well as Gujarat, says Kishan reddy

*  ‘బంగారు తెలంగాణ’ మాతోనే సాధ్యం : కిషన్‌రెడ్డి
* ఏడు ‘టీ’లతో ప్రగతిపథాన రాష్ట్రం
* మోడీ విధానాల మేరకు మా ప్రణాళిక
* భారీ హామీలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో  

 
సాక్షి, హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి  ఆదర్శంగా నిలిచి, ప్రగతి సాధించిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విధానాల సమాహారంగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించారు. ‘గత జనవరిలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ‘బ్రాండ్ ఇండియా’ నిర్మాణానికి మా ప్రధాని అభ్యర్థి మోడీ  కొన్ని సూచనలు చేశారు.
 
 అందులో ఆయన ట్రెడిషన్ (సంప్రదాయం), టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం), టూరిజం (పర్యాటకం), ట్రేడ్ (వాణిజ్యం), టాలెంట్ (ప్రతిభ) ఇలా ఐదు ‘టీ’లను ప్రతిపాదించారు. వాటికి ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత), తెలంగాణ అనే మరో రెండు ‘టీ’లను జోడించి మేం ఎన్నికల మేనిఫెస్టో రూ పొందించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు దీన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు దత్తాత్రేయ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాంచంద్రరావు, శేషగిరిరావు, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో వందకుపైగా అంశాలున్నాయి. ముఖ్యమైనవి..  
  తెలంగాణలో 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా. రైతులకు 85 శాతం రాయితీతో కమ్యూనిటీ సౌరవిద్యుత్తు పంపుసెట్ల సరఫరా.  
 
 మండలానికి 2 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు. వీటితో రైతులకు పగటి వేళ ఉచితంగా విద్యుత్, ఐదేళ్లలో వాటి సామర్థ్యం 10 మెగావాట్లకు పెంపు.  వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, తెలంగాణ వ్యవసాయ నిధి ఏర్పాటు. పంటల బీమా ఎకరానికి రూ.10 వేలు.  రైతులకు ఆరోగ్య బీమా, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేల పింఛన్  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా. నదులు, సరస్సులు, కుంటలు, రిజర్వాయర్ల అనుసంధానం.  ఎండిపోయిన 30 వేల చెరువుల పునరుద్ధరణ.  రెండు ల క్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 2 వేల చెరువుల నిర్మాణం.  మూసీ ప్రక్షాళన, ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం.  
 
 ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు నామకరణం. గిరిజన వర్సి టీ, గిరిజన కమిషన్ ఏర్పాటు.  తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా 3 ఎకరాల భూమి లేదా హైదరాబాద్‌లో 200 గజాల స్థలం. దీంతోపాటు పెన్షన్.  తెలంగాణ యోధుల చరిత్రను ప్రతిబింబించేలా వరంగల్‌లో ప్రత్యేక స్మారక నిర్మాణం.  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట.  ఆరోతరగతి నుంచి ఆర్థికంగా వెనకబడిన  విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ.  ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 25 వేల మందికి, మెడిసిన్, ఎంబీఏ సెట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించిన 500 మందికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.  దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గర్భిణులకు తల్లిబిడ్డ పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున 21 నెలల పాటు పంపిణీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement