తెలంగాణ కేసీఆర్ జాగీరా?: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు బీజేపీని విమర్శిస్తే సహించమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ కాదంటే తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఉందా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన బీజేపీ ద్రోహం చేసినట్టా అంటూ ఆయన నిలదీశారు. కేసీఆర్ వైఖరి తెలంగాణకు అగాధంగా మారుతుందని, ఎంఎల్ఏ, ఎంపీగా పోటీ చేసి ప్రజలకు కేసీఆర్ ఏంచేస్తారని అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీకే సాధ్యమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.