టీడీపీతో పొత్తుపై అసంతృప్తి వాస్తవమే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం,బీజేపీల పొత్తులపై అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు వెలువడిన వెంటనే కిషన్‌రెడ్డి కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తల ధర్నా చేపట్టారు. ఆగ్రహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలను సముదాయించే యత్నం చేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కార్యకర్తలు చాలా త్యాగాలు చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యాలయంలో గొడవ జరుగుతున్నందునే చంద్రబాబు, జవదేకర్ ప్రెస్‌మీట్‌కు వెళ్లలేకపోయానని కిషన్‌రెడ్డి తెలిపారు.