తెలంగాణ సీఎం కేసీఆర్ కొరివితో తలగోక్కునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కొరివితో తలగోక్కునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉప్పల్ పరిధిలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ శనివారం కిషన్‌రెడ్డి ప్రసంగించారు.
కార్మికులు ఉద్యమాలు చేస్తే ఉద్యోగం ఊడబెరుకుతామన్న సీఎం, ఉద్యమం చేసే ఉద్యోగం సంపాదించాడని పరోక్షంగా పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, లేకుంటే బీజీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని ఆయన హెచ్చరించారు.