గణతంత్ర వేడుకల్లో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడే ప్రజాహక్కులు కాలరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. పరుషంగా మాట్లాడితే పోలీసులే జోక్యం చేసుకుని జైలుకు తరలించే చట్టాన్ని తేవటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా, మీడియా చర్చల్లో పరుష వ్యాఖ్యలు చేసినా అరెస్టులు చేసేలా ప్రభుత్వం చట్టం చేస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందన్నారు.
ఈ కొత్త చట్టంతో నియంతృత్వం మరింత పెరుగుతుందని, ప్రజలు దీన్ని గుర్తించి టీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, పురపాలక శాఖలోని కొన్ని పథకాలు...ఇవన్నీ పెద్ద కుంభకోణాలని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు, సీనియర్ నేతలు శేషగిరిరావు, మేచినేని కిషన్‌రావు, ఇంద్రసేనారెడ్డి, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment