వారంలోగా కేసీకి బ్యాక్‌వాటర్‌ | back water to kc | Sakshi
Sakshi News home page

వారంలోగా కేసీకి బ్యాక్‌వాటర్‌

Published Sun, Sep 4 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

back water to kc

నందికొట్కూరు: వారం రోజుల్లోగా కేసీ కెనాల్‌కు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్యాల వద్ద కేసీ కెనాల్‌కు నీరిచ్చేందుకు చేపట్టిన పనులను ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు అశోకరత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆయకట్టు రైతులకు నీటి సమస్య తలెత్తకుండా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే శనివారంలోగా నీటిని విడుదల చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల పరిశీనలో ఎంపీపీ ప్రసాదరెడ్డి, కౌన్సిలర్లు మరియమ్మ, ముర్తుజావలి, సత్తార్‌మియ్యా, టీడీపీ నాయకులు పలచాని మహేశ్వరరెడ్డి, గిరీష్‌రెడ్డి తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement