malyala
-
Karimnagar: రూ.3 వేల కోసం ప్రాణం తీసుకున్నాడు
సాక్షి, జగిత్యాల: తండ్రి రూ.3 వేలు ఇవ్వలేదని, క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన అప్పాల మల్లేశ్–జల దంపతులకు కుమార్తె, కుమారుడు వికాస్(19) ఉన్నారు. కూతురికి వివాహం కాగా కుమారుడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం తల్లి జల వ్యవసాయ పనులకు వెళ్లింది. తండ్రి గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా వికాస్ తనకు రూ.3 వేల కావాలని అడిగాడు. ఇప్పుడు తన వద్ద లేవని, సాయంత్రం వచ్చాక ఇస్తానని చెప్పి, మల్లేశ్ గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన వికాస్ క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి, ఉరేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్
సాక్షి, కరీంనగర్(మల్యాల): అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నాడు.. యూట్యూబ్ స్టార్ అనిల్ జీల. టీచర్ కావాల్సిన వ్యక్తి యాక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. మారుమూల పల్లెనుంచి వచ్చిన వ్యక్తి తనప్రతిభతో దేశంలోనే నంబర్‌వన్ వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. అంకితభావం, పట్టుదల, స్వయంకృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. జన్మనిచ్చింది దర్గాపల్లి అయితే యూట్యూబ్ వైపు అడుగులు నేర్పింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. నటుడు, ఎడిటర్, సినీ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న ట్రెండ్ సెట్టర్ అనిల్‌పై సండే స్పెషల్.. వ్యవసాయ కుటుంబం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి చెందిన జీల మల్లేశం–నిర్మల పెద్ద కుమారుడు అనిల్. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. ఆది నుంచి అన్నింటిలో ముందుండాలనే సంకల్పం, క్రమశిక్షణతో అందరి మన్ననలు పొందాడు అనిల్. స్వయం కృషితో తనదైన లోకాన్ని సృష్టించుకున్నాడు. సెల్‌ఫోన్ వాడటం తెలిసిన యువతకు అనిల్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ చోట తనదైన ముద్ర అనిల్ జీల జీవితంలో ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు హోటల్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు టీ అమ్మేవాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 8గంటల వరకు హోటల్లో పనిచేస్తూ చదువుకుని పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్లో సైతం టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు. అనంతరం బుక్స్టాల్లో సేల్స్ బాయ్‌గా పనిచేసి తన ఆలోచనలకు పదును పెడుతూ సామాన్యులకు పుస్తకాలను చేరువ చేశాడు. చదవండి: నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం అనిల్ జీల కరీంనగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో టీటీసీ పూర్తిచేశాడు. అనంతరం జమ్మికుంటలోని ఆవాసంలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తనలోని నటనా ఆసక్తి, ఆలోచలనకు రూపం ఇస్తూ, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణ ప్రారంభించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలనే తనలోని ఆలోచనలకు అనుగుణంగా ఆచరిస్తూ విద్యార్థులకు బోధించాడు. అనంతరం లంబాడిపల్లికి వచ్చి షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ప్రారంభించి తనలోని నటనతో ప్రపంచాన్ని మెప్పించాడు. వ్లాగ్ నుంచి సినిమాల వైపు.. అనిల్ సహజసిద్ధ నటన పల్లెటూరి సామాన్యుల నుంచి సినీ ఇండస్ట్రీని సైతం ఆకర్షించింది. హాస్యం, జానపద పాటలు, డాక్యుమెంటరీ ఇలా అన్నిరకాల కేటగిరీల్లో ప్రతిభ కనబర్చాడు. దీంతో యువకులకు క్రేజీ హీరోగా మారాడు. అనిల్ ఏది చేసినా ట్రెండింగ్‌గా మారడంతో ట్రెండింగ్ స్టార్‌గా ముద్రపడింది. గతంలో హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించాడు. ఎస్ఆర్ కల్యాణ మండపంలో ప్రధానపాత్రలో, డిగ్రీ కాలేజ్, ఫ్రెషర్ కుక్కర్, అర్ధ శతాబ్దం వంటి సినిమాల్లో సైతం నటించాడు. పెళ్లిలో సైతం ప్రత్యేకతే.. అనిల్ పెళ్లి సైతం ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ యాసలో రాసిన పత్రిక వైరల్‌గా మారింది. ‘శుభలేకలో శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు స్థానంలో శానిటైజర్ ఫస్టు.. మాస్కు మస్టు.. సోషల్ డిస్టాన్స్ బెస్ట్ అంటూ కరోనా కాలంలో పాటించాల్సిన నియమాలు రాశారు. తల్వాలు పడ్డంక ఎవరింట్ల ఆళ్లే బువ్వ తినుండ్రి. బరాత్ ఉంది కాని ఎవరింట్ల వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుండ్రి. కట్నాలు మాత్రం గూగుల్ పే, ఫోన్ పే చేయుండ్రి’ అంటూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కట్నాల రూపంలో వచ్చిన సుమారు రూ.80వేలకు మరో రూ.20వేలు కలిసి కరోనా కాలంలో బాధపడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు అనిల్ జీల. ఇండియాలో నంబర్ 1 అనిల్ అడుగడుగునా అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపనతో ముందుకుసాగుతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఇండియా మొత్తంలో జీ5 నిర్మించిన అన్ని వెబ్‌సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకెల్లా అనిల్ నటించిన హలో వరల్డ్ వెబ్‌సిరీస్ నంబర్ 1గా నిలిచింది. ఇప్పటికే మై విలేజ్ షోలో సుమారు 100 షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించాడు. హుషారు పిట్టలు వెబ్ సిరీస్‌లో సైతం నటించి మెప్పించాడు. ఒకరిని మించి ఒకరు అనిల్ జీల వ్లాగ్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు, వీక్షకులుండగా సెలబ్రిటీలకు ఇచ్చే గ్రీన్సైన్ లభించింది. అలాగే అతడి జీవిత భాగస్వామి ఆమని చేసే రీల్స్, ప్రమోషన్ పాటలకు సైతం వీక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రాంకు 1.17 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. వీరి అనురాగానికి ప్రతీకైన ఆరునెలల మేధాన్‡్ష ఇన్‌స్టాగ్రాంకు సైతం 3,000 మంది ఫాలోవర్సు ఉండడం విశేషం. అనిల్ వ్లాగ్‌కు సబ్స్క్రైబర్లు: 7.70 లక్షల మంది నటించిన షార్ట్ ఫిల్మ్స్ : 100 ఇన్‌స్టాగ్రాంకు ఫాలోవర్లు: 3.80 లక్షల మంది వీక్షకులు: 25 లక్షల మంది -
యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న‘ ధూంధాం’.. పల్లె నుంచి ప్రపంచస్థాయికి..
తెలంగాణ యాస.. పక్కా పల్లెటూరి భాష.. చిల్.. బ్రో.. యో..యో.. పదాలకు ఇప్పుడు ఈ గ్యాంగ్ బ్రాండ్ అంబాసిడర్. మారుమూల పల్లెటూరు నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారీ చిచ్చరపిడుగులు. ఏడేళ్ల పిల్లాడి నుంచి డెబ్బైఏళ్ల ముసలావిడ వరకు టాలెంట్ ఎవరిసొత్తు కాదంటూ.. ప్రతిభకు చదువుకు సంబంధం లేదని తమ నటనతో చాటి చెబుతున్నారు. వీడియో విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్‌తో అదరగొడుతున్నారు. ఉన్న ఊరిలోనే లొకేషన్లు వెతుక్కుంటూ ఏకధాటిగా షూటింగ్‌లు చేస్తున్నారు. నాలుగేళ్ల కాలంలోనే 17.57కోట్ల అభిమానులను సంపాదించుకున్న జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ‘ధూం..ధాం’ పోరగాళ్లపై సండే స్పెషల్.. – మల్యాల(చొప్పదండి) ► యూట్యూబ్ చానల్ ధూంధాం ► ప్రారంభం: 2018 ► తీసిన వీడియోలు: 150 ► చందాదారులు: 8.50లక్షల మంది ► వీక్షకులు: 17.57 కోట్ల మంది ► చానల్లో యాక్టర్లు: 11 మంది.. ప్రారంభం ఇలా.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన అలువాల రాజు 2018లో ధూంధాం యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. షూటింగ్‌లకోసం డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. లంబాడిపల్లిలోని మట్టిలోనే సహజ నటన ఉంది. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ‘కికికికిక్’ ద్వారా పేరు సంపాదించిన తిరుపతి కీరోల్గా రసూల్, భీమన్న, గవాస్కర్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్, రాజవ్వ తమ సహజసిద్ధ నటనతో ‘ధూంధాం’లో ఆకట్టుకుంటున్నారు. ప్రజల జీవన విధానమే కథలుగా తెరకెక్కిస్తున్నారు. లంబాడిపల్లి ప్రకృతి, పరిసరాలనే షూటింగ్‌లకు ఆవాసం చేసుకుంటున్నారు. 150 వీడియోలు.. 17.57 కోట్ల వీక్షకులు ధూంధాం చానల్ ద్వారా ఇప్పటివరకు 150 వీడియోలు చిత్రీకరించారు. వీటిలో గ్రామంలో జులాయిగా తిరిగే వ్యక్తి సైన్యంలో చేరి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీడియో గంట 40 నిమిషాలు, మల్లిగాడు గంట 30నిమిషాల నిడివి గల వీడియోలతో చానల్ ప్రాచూర్యం పొందింది. కౌసుగాళ్లు, మల్లిగాడు, హోలీ, జవాన్ జర్నీ, చిల్ బ్రో, బడి దొంగలు, దుబాయ్ నుండి వస్తే.. పిలువని పేరంటానికి పోతే.. పల్లెటూరి ప్రేమకథ, ఆర్టీసీ బస్, విలేజ్ ఫ్యాషన్, కొత్తబండి, ఐఫోన్ వంటి 150వీడియోలు తీయగా, ఇప్పటి వరకు 17.57కోట్ల మంది వీడియోలను వీక్షించారు. చిల్ బ్రోలో రసూల్‌గా నటించిన మణివర్షిత్ డైలాగులతో చానల్‌కు ఆదరణ పెరిగింది. ఒకే రోజు 3లక్షల మంది వీక్షకులు చూశారు. మరో వీడియో హోలీకి ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతిభకు పట్టం ధూంధాం చానల్ టీంలో ఎవరూ పెద్దగా చదువుకున్నవారు లేరు. ఎవరి పనివారు చేసుకుంటూనే నటిస్తున్నారు. స్వయం ఉపాధితో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు రాజు. ఈ యువకుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేయగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, మల్లిగాడులో నటించిన గవాస్కర్ అదే తోవలో నడిచాడు. పిల్లి తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ నటిస్తున్నాడు. పిల్లలందరూ బడికిపోయే వారే. చిచ్చరపిడుగులు ధూంధాం చానల్లో 11మందిలో ఆరుగురు చిన్నారులే. పిల్లల సహజ నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బడికి వెళ్లే వయసులోనే సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు రసూల్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్. ప్రతీ నెలా వారి పాత్రలకు అనుగుణంగా కొంతమొత్తం వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు. డైలాగ్ కింగ్ అంటరు మాది లంబాడిపల్లి. అమ్మానాన్న పెంట సురేశ్, రాజమణి. తాటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న. బడికి పోయి వచ్చినంక నటిస్తున్న. ఎంత పెద్ద డైలాగ్ అయిన ఆగకుండా చెప్పుత. డైలాగ్ కింగ్ అంటరు నన్ను. వీడియోల్లో నటిస్తే వచ్చే డబ్బు ఇంటికి ఆసరాగా ఉంటోంది. అమ్మానాన్న కూడా ప్రోత్సహిస్తున్నారు. – సూరజ్, ఏడో తరగతి ఎవుసం చేసుకుంటూనే.. పదో తరగతి సదివిన. ఇప్పటి దాకా 80వీడియోల్లో నటించిన. రోజూ ఎవుసం పనిచేసుకుంటూనే వీడియోలు చేస్తా. ఆర్టీసీ బస్ మొదటి వీడియో పేరు తెచ్చింది. ఆర్మీ జవాన్ వీడియో మంచి పేరు తెచ్చింది. అందరం ఒకే కుటుంబంగా ఉంటాం. అన్నదమ్ముల్లా మెదులుతాం. – పిల్లి తిరుపతి, లంబాడిపల్లి అమ్మానాన్నప్రోత్సాహం వీడియోలు తీయాలని ఉందని చెబితే అమ్మానాన్న నర్సవ్వ, చంద్రయ్య రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహించారు. డిగ్రీ మధ్యలోనే ఆపేశా. నటించాలనే కోరికతో చానల్ ప్రారంభించిన. స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ నేనే చేస్తా. నటించడం కన్నా డైరెక్షన్ చేయడం చాలా అవసరం అనిపించింది. ఇప్పటి వరకు 150 వీడియోలు తీసిన. – అలువాల రాజు, ధూంధాం చానల్ నిర్వాహకుడు సదువుకుంటు.. సంపాదిస్తున్న మాది గంగాధర మండలం కురుమపల్లి. అమ్మానాన్న తొట్ల తిరుపతి, లావణ్య. చానల్ ప్రారంభం నుంచి నటిస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మమ్మ ఊరు లంబాడిపల్లి. ఇక్కడే ఉండి చదువుకుంటున్న. ఇప్పటి వరకు సుమారు 70వీడియోల్లో నటించా. సదువుకుంటూనే వీడియోల్లో నటిస్తున్న. వచ్చే ఆదాయంతో అమ్మానాన్నకు ఆసరాగా ఉంటున్నా. – రసూల్(మణివర్షిత్) -
గంగవ్వను గెలిపించేందుకు ఓటు
మల్యాల(చొప్పదండి): ఎండిన డొక్కను అడిగితే.. గంగవ్వ పేరు చెబుతుంది. పుట్టీపుట్టగానే తల్లి ఒడికి దూరమైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని వారి ప్రేమకు దూరమైంది. పలక, బలపం చేతబట్టకపోయినా ఇంగ్లిష్ నేర్చింది. ఐదేళ్లలోనే పెళ్లిపీఠలపై కూర్చుంది. కన్నీళ్లు.. కష్టాలే తోడునీడగా పెరిగింది. ఇక జీవితం అయిపోయిందనుకున్న తరుణంలో మై విలేజ్ షో.. గంగవ్వలోని తెలంగాణ గడుసుతనాన్ని..యాసను. భాషను ఒడిసిపట్టింది. మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసి, ప్రపంచపు నలుమూలలకు పరిచయం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా దేశాలతోపాటు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి గంగవ్వ ఆరాధ్యదైవమైంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముదుసలి వాళ్లు సైతం గంగవ్వ అంటే తెలియని వారు లేరు. కష్టాల కడలిని దాటుకుంటూ లంబాడిపల్లి నుంచి బిగ్‌బాస్ షో వరకు వెళ్లిన బహుదూరపు బాటసారి గంగవ్వ. గంగవ్వను గెలిపించేందుకు ఓటు మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నామినేషన్ కోసం వేలాదిమంది ఇతర దేశాల్లోని అభిమానులు, స్థానికులు, తెలంగాణ భాషా ప్రేమికులు ఆన్లైన్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సంప్రదాయం..కట్టు..బొట్టు..అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన గంగవ్వ ఫొటో వాట్సాప్ స్టేటస్‌లలో, ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలిపించేందుకు యూట్యూబ్ గంగవ్వ ఫాలోవర్స్ తపన పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు వారుసైతం తమతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులుసైతం ఓటు వేస్తున్నారు. ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్.. లంబాడిపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శ్రీరాం శ్రీకాంత్ పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను పల్లెల్లోని అనుబంధాలు, ప్రేమలు, పండుగలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2012లో ‘మై విలేజ్ షో’ ఛానల్ ప్రారంభించాడు. ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతమైన లంబాడిపల్లిలోని పచ్చని పొలాలు, పండుగలను యూట్యూట్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన ఇంటి పక్కనే ఉన్న గంగవ్వతోపాటు స్థానికులతో షార్ట్ ఫిల్మŠస్లో నటింపజేశారు. సుమారు 200 షార్ట్ ఫిల్మŠస్లో నటించింది. గంగవ్వ అమాయకత్వం..తెలంగాణ తిట్లు..భాష..యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పల్లె ప్రజల్లో ఇంటి మనిషిగా మారిపోయింది. ఇక వెనకకు తిరిగిచూడలేదు. గంగవ్వకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. గంగవ్వ ఎక్కడ కనపడినా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆమె సహజనమైన నటనను సినిమా దర్శకులను సైతం ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం కల్పించారు. ఇస్మార్ట్ జోడీ వంటి టీవీ ప్రోగ్రాంలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి జ్ఞాపిక అందుకున్నారు. -
కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు
సాక్షి, చొప్పదండి(పెద్దపల్లి) : నవమాసాలు మోసిన తల్లి కడుపుతీపిని చంపుకుంది. ఎంత కష్టమొచ్చిందో ఆ తల్లికి.. కన్నబిడ్డలను బావిలో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అభం.. శుభం తెలియని చిన్నారులు ఒక వైపు.. తల్లి శవం మరోవైపు తేలియాడడం చూసిన ప్రతీ మనసు చలించింది. సర్వాపూర్ ఘొల్లుమంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన స్వప్న తన ఇద్దరు కూతుళ్లతోపాటు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల వేధింపులతో.. కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలు స్వప్న తల్లి లచ్చవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేందర్ కథనం ప్రకారం.. గంగాధర మండలం ర్యాలపల్లి అనుబంధ గ్రామం కురుమపల్లెకు చెందిన గుంటి ఓదెలు–లక్ష్మి పెద్ద కూతురు స్వప్నకు మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన ఆది బక్కయ్య–ఎల్లవ్వ పెద్ద కుమారుడు నరేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు అహల్యశ్రీ, నాలుగు నెలల బిన్నీ ఉన్నారు. భర్త నరేశ్, అత్తామామలు బక్కయ్య, ఎల్లవ్వ, మరిది శేఖర్ కట్నం కోసం స్వప్నను వేధిస్తుండేవారు. పలుసార్లు గొడవ జరుగగా, స్వప్న తల్లిగారింటికి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు బుజ్జగించి తిరిగి అత్తగారింటికి పంపారు. అయినా వేధింపులు ఆగలేదు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వప్న ఇద్దరు కూతుళ్లను తీసుకుని మల్యాలలో నిర్వహిస్తున్న లేడీస్ ఎంపోరియం వద్దకు వెళ్తున్నాని చెప్పింది. ఇంటికి తిరిగి రాలేదు. మండల శివారులోని వ్యవసాయ బావిలో ఇద్దరు కూతుళ్లను పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం రైతు వ్యవసాయ బావి వద్దకు వచ్చి చూడగా విషయం వెలుగుచూసింది. స్థానికులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాలను పైకి తీయడంలో యువకుల సాయం.. మల్యాల మండల కేంద్రం శివారులోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే వందలాదిమంది ప్రజలు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. బావిలోని శవాలను పైకి తీయడంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. బావిలో నుంచి శవాలను తీసేందుకు మండల కేంద్రానికి చెందిన పోచంపల్లి మల్లయ్యకు యువకులు సహకరించారు. ఇద్దరు కూతుళ్లతో సహ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదనే వార్తా దావనంలా వ్యాపించడంతో వివిధ గ్రామాల నుంచి వందలాదిమంది సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను చూసి కంటనీరు పెట్టారు. ఎమ్మెల్యే పరామర్శ.. ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంఘటనా స్థలానికి వెళ్లారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మల్యాల, పెగడపల్లి, కొడిమ్యాల ఎస్సైలు ఉపేంద్రచారి, జీవన్, శివకృష్ణ ఉన్నారు. -
మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య
మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మతి స్థిమితంలేని ఓ యువతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ముస్కు శ్యామల(21) అనే యువతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి లచ్చవ్వ కూతురిని పలు హాస్పిటల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం తల్లి లచ్చవ్వ బీడీలు ఇచ్చేందుకు కంపెనీకి వెళ్లగా శ్యామల తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టగా అప్పటికే 90 శాతం కాలిపోయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా ఆమె అప్పటికే మృతిచెందింది. -
కాకతీయ కాల్వకు గండి
-
కాకతీయ కాల్వకు గండి
మల్యాల/పెగడపల్లి/గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాల్వకు మంగళవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు రావటంతో రాకపోకలు స్తంభించాయి. మానాల గ్రామం దమ్మక్క చెరువులోకి నీళ్లు వెళ్లే తూము డీ-65 వద్ద కాకతీయ ప్రధాన కాల్వకు ఈ గండిపడింది. దీంతో దమ్మక్క చెరువు నిండి సమీప పొలాలు నీటమునిగాయి. మానాల, మ్యాడంపల్లిల్లో వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దమ్మక్క చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి చేరాయి. ఈ కాలనీకి చెందిన 300 కుటుంబాలను అధికారులు తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసి న శిబిరానికి తరలించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ గేట్లు మూసివేయడంతోపాటు నీటి ఉధృతి తగ్గించేందుకు పలుచోట్ల తూముగేట్లు తెరిచారు. సాయంత్రం మ్యాడంపల్లిలోని కల్వర్టు తెగి.. గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గండి పూడ్చే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. పెగడపల్లి మండలం సుద్దపల్లి కోయ చెరువు నిండి గండి పడింది. ఆదుకుంటాం: ఈటల, చీఫ్‌విప్ కొప్పుల ఎస్సారెస్పీ కాల్వకు గండి పడటంతో పంటలు నష్టపోరుున రైతులతోపాటు ఇతరత్రా నష్టపోరుున బాధితులను ఆదుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ కాలువ డీ-65 తూము గండిని ఆయన పరిశీలించారు. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలో నీళ్లు చేరిన ఇళ్లను పరిశీలించారు. పునరావాస శిబిరంలో ఉన్న బాధితులను పరామర్శించారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో పరిస్థితిని సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు. -
వారంలోగా కేసీకి బ్యాక్‌వాటర్
నందికొట్కూరు: వారం రోజుల్లోగా కేసీ కెనాల్‌కు శ్రీశైలం బ్యాక్ వాటర్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్యాల వద్ద కేసీ కెనాల్‌కు నీరిచ్చేందుకు చేపట్టిన పనులను ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అశోకరత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆయకట్టు రైతులకు నీటి సమస్య తలెత్తకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే శనివారంలోగా నీటిని విడుదల చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల పరిశీనలో ఎంపీపీ ప్రసాదరెడ్డి, కౌన్సిలర్లు మరియమ్మ, ముర్తుజావలి, సత్తార్‌మియ్యా, టీడీపీ నాయకులు పలచాని మహేశ్వరరెడ్డి, గిరీష్‌రెడ్డి తదితరులున్నారు. -
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
మల్యాల: తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మల్యాల మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. కొంపల్లె చెరువు నిండినప్పటికీ తాగునీరు సరఫరా చేయకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెలు, బకెట్లతో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు, నాయకులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎసై ్స జమీరొద్దీన్ మహిళలకు నచ్చజñ ప్పినా వారు రాస్తారోకో విరమించలేదు. సర్పంచ్ నేళ్ల అరుణ భర్త నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 26 వరకు సీపీడబ్ల్యూ స్కీం ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూత్‌ఫోరం మండల ప్రతినిధి కొక్కుల రఘుబాబు మహిళల రాస్తారోకోకు మద్దతు తెలిపారు. -
హంద్రీనీవాకు నీరు విడుదల
మిడుతూరు(నందికొట్కూరు): హంద్రీనీవా కాల్వకు శుక్రవారం నంద్యాల ఎంపీఎస్పీవైరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య..నీరు విడుదల చేశారు. నందికొట్కూరు మండలం మల్యాల మొదటి ఎత్తిపోతల పథకం వద్ద 9వ పంపునకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. స్విచ్ ఆన్ చేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ జలంధర్ మాట్లాడుతూ.. కష్ణానది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షం కురువడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరి, శ్రీశైల జలాశయ నీటి మట్టం మధ్యాహ్నానికి 834.20 అడుగులు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం హంద్రీనీవాకు ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, హంద్రీనీవా సామర్థాన్ని బట్టి విడతల వారిగా ఏడు పంపుల వరకూ నీటిని విడుదలచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు, డోన్ టీడీపీ నియోజకవర్ట ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, మాండ్రశివానందరెడ్డి, ఈఈ పురుషోత్తంరెడ్డి, డీఈలు ప్రసాద్, పాండురంగయ్య, ఏఈలు మల్లికార్జున, విజయ్‌కిశోర్, నందికొట్కూరు మార్కేట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, నాయకులు వెంకట్రామిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. -
ఆలయ కోనేరులో మృతదేహం
మల్యాల : కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో ఓ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. కోనేరును శుభ్రం చేస్తుండగా.. సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం బయటపడింది. వ్యక్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
మల్యాల (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మాల్యాల మండల సమీపంలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతురాలు వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం హెచ్ఆర్ కోటకు చెందిన లచ్చమ్మ(50)గా గుర్తించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. -
అంజన్నకు భక్తాభిషేకం
కొండగట్టు అంజన్న క్షేత్రంలో చిన్నహనుమాన్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మల్యాల, న్యూస్‌లైన్ : కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానం భక్త జన సంద్రమైంది. సోమవారం చిన్నహనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆంజనేయస్వామి దీక్షాపరులు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జిల్లా నలుమూలలనుంచే కాకుండా నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది దీక్షాపరులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. అంజన్న సన్నిధానంలో దీక్షలు విరమించి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండపైన నీటి ఎద్దడి ఉండడంతో ట్యాంకర్లద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు దేవస్థాన ఈవో గజరాజు తెలిపారు. వేకువజాము నుంచే దర్శనం వేలాది మంది భక్తులు తరలిరావడంతో సోమవారం వేకువజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు వేకువజామున 4గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించారు. కోనేటిలో స్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. కల్యాణకట్ట భవనంలో అర్చకులు దీక్షవిరమణ నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఎప్పటిలాగే తలనీలాల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఘాట్‌రోడ్డు వెంట చలివేంద్రాలను ఏర్పాటుచేశారు. కొండపై అదనంగా స్వామివారి ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. జయంతి రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీతో వ్యాపారులు వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మల్యాల ఎస్సై వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు. -
కొండంతా కాషాయం
నేడు హనుమాన్ జయంతి మూడు రోజుల పాటు ఉత్సవాలు ముమ్మరమైన ఏర్పాట్లు కొండగట్టుకు చేరుకుంటున్న దీక్షాపరులు మల్యాల, న్యూస్‌లైన్: కొండగట్టు గిరులు కాషాయ వర్ణమవుతున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు దీక్షాపరులు కొండకు చేరుకుంటున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తర లి రానున్నారు. ఇప్పటికే వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు వారం రోజులగా కొండగట్టుకు వస్తూ దీక్షలను శ్రీస్వామివారి సన్నిధానంలో విరమిస్తున్నారు. మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు క్యూలైన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ కొండగట్టుకు వచ్చి వసతులను పరిశీలించారు. ఘాట్‌రోడ్డును వన్‌వేగా మార్చడంతో పాటు ఆలయంలో మూడు రోజుల పాటు ఎలాంటి ఆర్జిత సేవలు ఉండబోవని ఈ వో గజరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుం టున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.