ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
మల్యాల: తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మల్యాల మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. కొంపల్లె చెరువు నిండినప్పటికీ తాగునీరు సరఫరా చేయకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెలు, బకెట్లతో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు, నాయకులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎసై ్స జమీరొద్దీన్ మహిళలకు నచ్చజñ ప్పినా వారు రాస్తారోకో విరమించలేదు. సర్పంచ్ నేళ్ల అరుణ భర్త నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 26 వరకు సీపీడబ్ల్యూ స్కీం ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూత్‌ఫోరం మండల ప్రతినిధి కొక్కుల రఘుబాబు మహిళల రాస్తారోకోకు మద్దతు తెలిపారు.