హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు
హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు
Published Sun, Sep 4 2016 9:29 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
పాములపాడు: మల్యాల ఎత్తిపోతల పథకం హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు పంపింగ్ చేయనున్నట్లు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. లింగాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులతో కలిసి తాను జిల్లా కలెక్టరును కలిశానన్నారు. మల్యాల ఎత్తిపోతల పథకంలోని హంద్రీనీవాలో రెండు పంపులు కేసీ కెనాల్‌లోకి మళ్లించాలని ఇటీవల కలెక్టరు, ఇరిగేషన్ అధికారులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ చేస్తారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 120 కిలో మీటరు వరకు కేసీ కెనాల్‌కు నీరందుతుందని రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పూర్తిగా మునిగి పోయిందని పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే ఆలస్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండలాధ్యక్షుడు చౌడయ్య, నాయకులు అంబయ్య, నాగేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.
Advertisement