కేసీ ఆధునీకరణకు రూ.35 కోట్లు మంజూరు | 35cr for kc modernization | Sakshi
Sakshi News home page

కేసీ ఆధునీకరణకు రూ.35 కోట్లు మంజూరు

Published Wed, Nov 16 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

కేసీ కెనాల్‌ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులను మంజూరు చేసింది.

కర్నూలు (టౌన్‌):  కేసీ కెనాల్‌ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులను మంజూరు చేసింది. మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పరిపాలనా అనుమతులకు సంబంధించి జీఓ 710 జారీ చేశారు. రూ.35 కోట్లు వెచ్చించి కేసీ కెనాల్‌ ఆధునీకరణ ప్రాజెక్టు కింద సీసీ లైనింగ్‌ పనులు చేపడతారు. కిలోమీటర్‌ 130.100 నుంచి కి .మీ.149.670 వరకు కేసీ కెనాల్‌ సీసీ లైన్‌ పనులతో పాటు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించి కర్నూలు చీఫ్‌ ఇంజనీరు (ప్రాజెక్టు) తదుపరి చర్యలు చేపట్టాలని ఆ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement