అందరి కృషితోనే నీటి విడుదల
అందరి కృషితోనే నీటి విడుదల
Published Thu, Oct 13 2016 10:09 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
నందికొట్కూరు: అందరి కృషితోనే కేసీకి శ్రీశైలం నీరు విడుదలైందని నందికొట్కూరు ఎమె్మల్యే ఐజయ్య అన్నారు. గురువారం మల్యాల వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కేసీ కెనాల్‌కు ఎమ్మెల్యే ఐజయ్య పూజలు నిర్వహించి అధికారికంగా రెండు పంపులతో 675 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీకి నీటి విడుదలపై ప్రాతకోట, పగిడ్యాల, లక్ష్మాపురం గ్రామాల రైతులతో కలిసి అనేక సార్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు . జిల్లా కలెక్టర్ కేసీ కెనాల్‌కు నీటి విడుదలను అధికారికంగా అట్టహాసంగా ప్రారంభించకుండా రాత్రికి, రాత్రే విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. తుంగభద్ర నీటిని కేసీ కెనాల్‌కు విడుదల చేసేందుకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. కేసీకి నీటి విడుదల గురించి అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. డిసెంబర్ చివరిలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరిందించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కేసీ కెనాల్‌కు విడుదల రైతులకు వరంలాంటిందని స్పష్టం చేశారు. బానకచర్ల వద్ద ఎస్‌ఆర్‌బీసీకి మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సంవృద్ధిగా సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌సీ నారాయణస్వామి, ఈఈ పాండురంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement