ముచ్చుమర్రిలో 25వ తేదీ వరకు 144 సెక్షన్
Published Thu, Aug 4 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
పగిడ్యాల: మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామ శివారులో రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న రాయలసీమ పుష్కర ఘాట్‌లు వివాదస్పదమయ్యాయి. ఈ పనులను జిల్లా కలెక్టర్ నిలుపుదల చేయాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో రఘుబాబు గ్రామంలో 144వ సెక్షన్ విధిస్తున్నట్లు బుధవారం దండోరా వేయించారు. ఈనెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకూదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించుకుంటున్న పుష్కర ఘాట్ పనులకు అధికారులు అభ్యంతరాలు చెప్పడం వల్ల.. గ్రామస్తులు ప్రభుత్వంపై, జిల్లా కలెక్టర్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లడిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ కుమారస్వామిని ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement