byreddy
-
YSRCP నేత భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఊరట
-
రాజకీయ నిరుద్యోగి బైరెడ్డి
– డీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం కర్నూలు(టౌన్): రాయలసీమ పేరుతో పెట్టుకున్న పార్టీకి ప్రజల మద్దతు లేకపోవడంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ నిరుద్యోగిగా మారారని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనవసరంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అలగనూరు, మల్యాల ప్రాజెక్టుల్లో పర్సంటేజీలు రానందుకే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమపై నిజంగా ప్రేమ ఉంటే విమర్శలు మాని ప్రభుత్వా నికి మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు. -
బాబూ..రూ.2కు 20 లీటర్ల నీళ్లెక్కడ?
- ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జూపాడుబంగ్లా: ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రూ.2కు 20లీటర్ల నీరు ఇస్తానని హామీ ఇచ్చారని, వేసవిలో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నా హామీ కార్యరూపం దాల్చలేదని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. జూపాడుబంగ్లాలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొని ప్రజలు విలవిల్లాడుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరుమెదపడం లేదన్నారు. జిల్లాకు కేంద్రమంత్రి సుజనాచౌదరి వస్తే ఆయన దృష్టికి తాగు, సాగునీటి సమస్యను తీసుకెళ్లే దమ్ము,ౖ«§ð ర్యం ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేకపోయిందన్నారు. గ్రామాల్లో తాగునీటి కంటే మద్యం ఏరులైపారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. మద్యం విక్రయాలు పెరగటానికే గ్రామాల్లో నీటిఎద్దడి సృష్టించారా అన్నట్లుగా మారిందన్నారు. కర్నూలులో ఎనిమిది రోజులకోపర్యాయం తాగునీటిని సరఫరా చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటంతోపాటు ప్రత్యేక రాయలసీమతోనే సమస్యలు తీరుతాయన్నారు. పారుమంచాల కరుణాకరరెడ్డి, తూడిచెర్ల నాగభూషణం, మోహన్‌రెడ్డి, రషీద్మియ్య, చక్కెరసాహెబ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరద కాదు.. నికర కేటాయింపులే కావాలి
- సీమను సస్యశ్యామలం చేస్తామంటునే సర్వనాశం చేస్తున్నారు - వివక్షపై నోరు విప్పేనాథులే కరువయ్యారు - రాయలసీమ ప్రజా, విద్యార్థి, కుల సంఘాల సమావేశంలో బైరెడ్డి కర్నూలు సిటీ: కరువుతో అల్లాడుతున్న సీమకు కావాల్సింది వరద జలాలు కాదని, నికర కేటాయింపులే చేయాలని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ ప్రజా, విద్యార్థి, కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా సీఎం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులంతా పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ప్రకటనలు చేశారు. మరి ఎక్కడ సస్యశ్యామలం చేశారో వారే చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టు పనులను ఏళ్లుగా సాగదీస్తూనే ఉన్నారు. రాయలసీమ గురించి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. కరువుతో గుక్కెడు తాగు నీరు చిక్కని పరిస్థితి ఉన్నా స్పందించడం లేదు. మొదట పట్టిసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో కరువు సీమలో సీరులు పండిస్తామని చెప్పి, పంటలు సాగు చేశాక నీరివ్వకుండా సర్వనాశనం చేశారు. రాజధాని సీఆర్డీఏలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఒక్కటి కూడా రాయలసీమ వాసులకు ఇవ్వలేదు. ప్రశ్నిస్తే నాన్‌లోకల్ అని దరఖాస్తూలు తీసుకోకపోయినా సీమ నిరుద్యోగులు నోరు విప్పే స్థితిలో లేరు. అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను సమంగా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం మరించింది’ అని బైరెడ్డి ఆరోపించారు. కనీసం ఇప్పటీకైనా రాయలసీమలోని యువత మేల్కోని ఓటుతో బుద్ధి చెప్పాలని, రాయలసీమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని బైరెడ్డి పిలుపునిచ్చారు. దళిత సంఘాల నాయకులు బాల సుందరం, ఆర్పీఎస్ కేంద్ర కమిటీ సభ్యులు త్యాగరాజు, విద్యార్థి సంఘం, రాయలసీమ ఉద్యమ నాయకులు శ్రీరాములు, రాయలసీమ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
– బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల: రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణంతో సీమ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉద్యోగాలన్నీ కోస్తాంధ్రా వాళ్లకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సీమకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్ట సభల్లో మాట్లాడడమే లేదని విమర్శించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారు.. శ్రీశైలం జలాలను ఖాళీ చేశారన్నారు. టీటీడీలో ఏడువేల ఉద్యోగాలను అన్ని జోన్ల వారికి కేటాయిస్తూ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రాయలసీమ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గుంతకల్లుకు రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేవారు. ఉద్యోగాలు రాకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టభద్రుల అభ్యర్థి నాగార్జున రెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ, కాలమిస్టు నారాయణ స్వామి, ఆర్వీఎఫ్ అధ్యక్షుడు రాజునాయుడు పాల్గొన్నారు. -
బాబూ..! ఫ్రీజోన్‌ఫై చర్చకు సిద్ధమా
- ఆర్పీఎస్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నూనెపల్లె: ఫ్రీజోన్ ప్రకటించామని చెప్పడం కాదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ జనాభా ప్రాతిపదికన 40 శాతం ఇవ్వాలని కోరితే సీఎం చంద్రబాబు బాబు నోరుమెదపడం లేదన్నారు. ఫ్రీజోన్‌పై కొండారెడ్డి బురుజు వేదికగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టణంలోని తెలుగుగంగ అతిథి గృహంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సీమ ప్రజలను చంద్రబాబు చులకనగా చూస్తున్నాడన్నారు. అమరావతి ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ అక్కడివారికే ఇస్తూ సీమ వారిని విస్మరిస్తున్నారన్నారు. అమరావతి పరిధిలో మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారని అందులో కూడా తమ వాటా ఇవ్వాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు ధ్వంసం అయితే కంట్రోల్ బ్లాస్టింగ్ కోసం ఉద్యమించామన్నారు. రైతులు, ప్రజల సంక్షేమానికి వెనుకాడే ప్రసక్తి లేదని కేసులు, అరెస్టులకైనా సిద్ధమన్నారు. కృష్ణాబోర్డు ప్రకటించిన నీటి వాటాను వ్యతిరేకిస్తున్నామని, నీటి వాటాలో సీమ ప్రాంతానికి ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. 69 జీఓతో రాయలసీమ రైతులు నష్టపోతారని, జీఓ రద్దుకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. పట్టిసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎలా సస్యశ్యామలం చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఉద్యోగాలపై పీఎం మోడీతో పాటు సీఎం చంద్రబాబుకు మల్టీజోనల్‌పై లేఖ రాస్తే ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు. -
సీమపై సీఎం వివక్ష
- ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు సిటీ: రాయలసీమను సీఎం చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయంపై దమ్ముంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని రాయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ ప్రజలకు ఉద్యోగాల్లోనూ, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ప్రముఖ విద్యా సంస్థలను కోస్తా ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 1974లో జోనల్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సీమ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ఇటీవల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్బాబు.. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించారన్నారు. అయితే గతంలో ఇలా చేసిన ప్రకటనలకు దిక్కు లేకుండా పోయిందని..చిత్తశుద్ధి ఉంటే ఫ్రీజోన్ ప్రకటనకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. సీమలో కనీసం తాగు నీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. చట్ట ప్రకారం కేటాయించిన వాటా మేరకు నీరు అందడం లేదన్నారు. పది డిమాండ్లతో ఈ నెల 18, 19తేదీల్లో దీక్షలు చేపట్టనున్నట్లు బైరెడ్డి తెలిపారు. -
గృహ నిర్బంధంలో బైరెడ్డి
- ప్రభుత్వ దౌర్జన్యానికి నిరసనగా దీక్ష - బైరెడ్డికి సంఘీభావం తెలిపిన ప్రజలు పగిడ్యాల: సీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు బయలుదేరిన రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అడ్డుకొన్నారు. ముచ్చుమర్రి గ్రామంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా వచ్చరు. అయితే వీరు ముందుగా ముచ్చుమర్రిలోని బైరెడ్డిని చూసేందుకు క్యూ కట్టారు. ముఖ్యమంత్రి సభా వేదికను తలపించే విధంగా బైరెడ్డి ఇంటి మైదానం జనంతో కిక్కిరిసి పోయింది. ముచ్చుమర్రిలోని బైరెడ్డి ఇంటి పక్కనే రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే గ్రామ రైతులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి బైరెడ్డి.. సభా వేదికకు బయలుదేరడం గమనించిన నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడ్డుకొని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బైరెడ్డి ఇంటి ఆవరణంలోనే నాలుగు గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. బైరెడ్డి నిరసనకుజెడ్పీటీసీ సభ్యురాలు రాధమ్మ, ఎంపీపీ పుల్యాల దివ్య, సర్పంచ్‌లు శ్రీనివాసులు, దాసు, ఎంపీటీసీ సభుయలు నాగభూషణం, గోవిందమ్మ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అలాగే విద్యార్థి సంఘం నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మద్దతు తెలిపి జై రాలయసీమ అంటూ నినాదాలు చేశారు. సీమలో బాబుకు రాజకీయ సమాధి తప్పదు అధికార దర్పంతో దౌర్జన్యానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడికి రాయలసీమలో రాజకీయ సమాధి తప్పదని రాలయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. హౌస్ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం బైరెడ్డి తన ఇంటి ఆవరణంలోనే 4 గంటల పాటు వందలాది మంది కార్యకర్తలతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. సీమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన తనను పోలీసులు దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ.. ముఖ్యమంత్రి రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 69 జీవోను రద్దు చేయకుండాసీమ సస్యశ్యామలం అవుతుందంటే ఏవిధంగా నమ్మాలన్నారు. కృష్ణా నదికి వచ్చే వరద జలాలు కాకుండా నికర జలాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం తప్పా...అని ప్రశ్నించారు. అన్నిటా రాయలసీమకు అన్యాయం చేస్తున్న బాబుకు రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పొదుపు మహిళలు సభకు..రాకపోతే పెట్టుబడి నిధి రూ. 3 వేలు రావని భయపెట్టి బస్సులు ఎక్కించి తీసుకొచ్చారని విమర్శించారు. సీఎంను ప్రశ్నించే వారు లేకుండా దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజల త్యాగాల ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్ట్ , ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కృష్ణా పుష్కరాలను ముచ్చుమర్రిలో జరుగనీయకుండా అడ్డుకున్న వారికి.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అర్హత లేదన్నారు. -
నీటి ఇక్కట్లకు చంద్రబాబే కారణం
- ముచ్చుమర్రి పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారు - విలేకరుల సమావేశంలో బైరెడ్డి కర్నూలు సిటీ: కర్నూలు- కడప కాలువ పరిధిలో సాగునీటి కష్టాలకు సీఎం చంద్రబాబే కారణమని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. దీనివల్ల తుంగభద్ర డ్యాంకు నీటి సరఫరా తగ్గిపోయి కేసీ ఆయకట్టుకు ఇక్కట్లు మొదలయ్యాయన్నారు. పట్టిసీమను నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం చుక్కనీరు ఇవ్వకపోగా ప్రస్తుతం ముచ్చుమర్రి ఎత్తిపోతలను తెరపైకి తెచ్చి సీమ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీకి 39.9 టీఎంసీల నికర జలాల వాటాను వదులుకునే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. 35 వేల ఎకరాల కోసం ఏర్పాటు చేసిన పథకంతో రాయల సీమనే సస్యశ్యామలం చేస్తామని చెప్పడం దురదృష్టకరమన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే 69జీఓను రద్దు చేసి, శ్రీశైలంలో 854 అడుగుల కనీన నీటి మట్టాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల సీమకు కృష్ణా జలాలు, కోస్తాంద్రకు గోదావరి జలాలను ఇవ్వాలని, కృష్ణ పుష్కరాలను ముచ్చుమర్రిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టని సీఎం, కలెక్టర్‌కు ముచ్చుమర్రిలో పర్యటించే అర్హతనే లేదన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బైరెడ్డి వర్గీయులు
పగిడ్యాల: 50 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా సేవలు చేస్తూ వచ్చిన ఆయన వర్గీయులు నందిగారి పక్కిరెడ్డి, చిన్నమాబుసాహెబ్, బెస్త వెంకటేశ్వర్లు, ఈశ్వరప్పతో పాటు మరి కొందరు గురువారం వైఎస్సార్సీపీలోకి చేరారు. వారందరికి మండల కన్వీనర్ రమాదేవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు పార్టీలో చేరిన వారు తెలిపారు. ఆయన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు. 50 ఏళ్లుగా బైరెడ్డి వర్గీయులుగా ముద్ర వేసుకున్నా తమకు సరైన గుర్తింపు లేదన్నారు. అందువల్లే మండల కన్వీనర్ రమాదేవి ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలోకి చేరామని వెల్లడించారు. మండలంలో తమకు ఏలాంటి బాధ్యతలు అప్పగించిన సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిట్టిరెడ్డి, రమణారెడ్డి, గోవిందరెడ్డి, లక్ష్మిరెడ్డి, మహేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, భూపాల్‌రెడ్డి, డీలర్ నారాయణ, ఇస్మాయిల్, వెంకటేశ్వర్లు, అంబటి రాముడు, కోట్ల గోవిందు, చాకలి వెంకటేశ్వర్లు, శేషన్న, పుల్లన్న, క్రీస్తుదాసు, టైలర్ నాగన్న, బడికెల సవారి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీమవాసులను మోసం చేసేందుకు కుట్ర
–పవన్ డ్రామాలను నమ్మొద్దు –రాయలసీమ అభివృద్ధిని మరచిన బాబు –ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి ధ్వజం ఎమ్మిగనూరు:ఽ రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కోస్తా నేతలు కుట్రపన్నుతున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈప్రాంతంలో సభలు పెట్టి మొసలికన్నీరు కార్చడం అందులో భాగమేనని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు పవన్ వల్లవేస్తున్నారని, నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. శుక్రవారం ఎమ్మిగనూరులో కేఆర్ చిన్నరాఘవరెడ్డి ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని రాయలసీమకు దక్కనప్పుడు, హైకోర్టు వెళ్లిపోయినప్పుడు, సీమను ఎడారిని చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించుకు పోయినప్పుడు, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్లకు నీరురాక కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు పవన్‌కల్యాణ్ స్పందించి ఉంటే సంతోషించేవాళ్లమన్నారు. అనంతసభలో సీమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారన్నారు. కోస్తాకు చెందిన ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణలు సీమలో పోటీచేస్తే గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారని, వారు మాత్రం ఈ ప్రాంత వాసులను అలా ఆదరించలేదన్నారు. ఇక నుంచి ఎవరైనా ఆ ప్రాంతవాసులు, సినీహీరోలు ఇక్కడికి వచ్చి పోటీచేస్తే వారికి వ్యతిరేకంగా ఆర్పీఎస్ బరిలోకి దిగుతుందని హెచ్చరించారు. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఓట్ల కోసం అభివృద్ధిని కోస్తావైపు మళ్లించారని విమర్శించారు. విభజన తరువాత జరిగిన మొదటి స్వాతంత్ర్య వేడుకల్లో జిల్లాకు 25 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మాచాని నాగరాజు,టైలర్ రఫిక్, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకు ఉద్యమం
- సర్కారు తీరుపై బైరెడ్డి ఆగ్రహం నందికొట్కూరు: అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ విషయంలో ప్రభుత్వ వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా ప్రకటించారని, వెనబడిన రాయలసీమ జోన్లో కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. జోన్లు ఏర్పాటు చేస్తే రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతిలో 7 వేల పోస్టులుంటే ఇతర జోన్లకు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని సర్కారును నిలదీశారు. రాయలసీమ పరిధిలో 700 ఎస్ఐ పోస్టులుంటే 40 పోస్టులకు నోట్ఫికేషన్ ఇచ్చి సర్కారు చేతులు దులిపేసుకుందన్నారు. జోన్ సిస్టంపై సర్కారును నిలదీయాలని రాయలసీమ ఎమ్మెల్యేలను కోరారు. ఫ్రీ జోన్ కోసం కర్నూలులో నిరాహార దీక్ష చేపడుతునట్లు ప్రకటించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
పుష్కర భక్తులను అడ్డుకోవడం సిగ్గుచేటు
– అధికారపార్టీ నేతల తీరుపై ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బైరెడ్డి ఆగ్రహం – అధికారులు నిజాయితీగా పనిచేయాలని హితవు పాతముచ్చుమర్రి(పగిడ్యాల): పాతముచ్చుమర్రిలోని రాయలసీమ కృష్ణా పుష్కర ఘాట్‌కు తరలి వచ్చే భక్తులను అధికారుల సహాయంతో అధికారపార్టీ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. సోమవారం రాయలసీమ పుష్కర ఘాట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘాట్‌కు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించానన్నారు. దీంతో రోజురోజకు పాతముచ్చుమర్రి పుష్కరఘాట్‌కు భక్తుల సంఖ్య పెరుగుతుందని, దీన్ని ఓర్వలేక కొందరు కొణిదేల క్రాస్ రోడ్డు వద్ద దారికాచి ముచ్చుమర్రికి వద్దు నెహ్రూనగర్ ఘాట్‌కు వెళ్లాలని చెప్పడం విచారకరమన్నారు. ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకుంటూ అధికారపార్టీ నాయకుల కొమ్ముకాయవద్దని హితవు పలికారు. భక్తితో వచ్చే భక్తులకు కుళ్లు రాజకీయ ఎత్తుగడలతో మలినం చేయవద్దన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపై ప్రభుత్వానికి తప్పుడు సమాచారం పంపడం, వాట్సాప్ ద్వారా సీఎంకు ఫోటోలు పంపడం ఎవ్వరి మెప్పు కోసమని ప్రశ్నించారు. అంతరాత్మను చంపుకుని పనిచేయవద్దని, ప్రజల అభిమానాన్ని చురగొనాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, సర్పంచ్ శ్రీనివాసులు, సింగిల్‌విండో డైరక్టర్ వెంకటరామిరెడ్డి, ఆర్పీఎస్ నాయకులు కాటం చక్రధర్‌రెడ్డి, నాయుడు, కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చుమర్రిలో 25వ తేదీ వరకు 144 సెక్షన్
పగిడ్యాల: మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామ శివారులో రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న రాయలసీమ పుష్కర ఘాట్లు వివాదస్పదమయ్యాయి. ఈ పనులను జిల్లా కలెక్టర్ నిలుపుదల చేయాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో రఘుబాబు గ్రామంలో 144వ సెక్షన్ విధిస్తున్నట్లు బుధవారం దండోరా వేయించారు. ఈనెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకూదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించుకుంటున్న పుష్కర ఘాట్ పనులకు అధికారులు అభ్యంతరాలు చెప్పడం వల్ల.. గ్రామస్తులు ప్రభుత్వంపై, జిల్లా కలెక్టర్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లడిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ కుమారస్వామిని ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. -
'22న సీమవాసులకు చీకటి దినం'
-
'22న సీమవాసులకు చీకటి దినం'
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా అన్ని అంశాల్లో రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, మరోసారి దీనిని చంద్రబాబు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్బసొత్తైనట్టు రాజధాని నిర్మాణానికి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమరావతికి ఖర్చు చేస్తున్న రూ. వందలకోట్ల దుర్వినియోగంపై హైకోర్టులో 'పిల్' వేస్తామని తెలిపారు. అమరావతి శంకుస్థాపనకు ముహుర్తమైన 22వ తేదీని రాయలసీమ వాసులకు చీకటిదినంగా ఆయన అభివర్ణించారు. -
ఆత్మ గౌరవ దీక్ష చేపట్టిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి