బాబూ..రూ.2కు 20 లీటర్ల నీళ్లెక్కడ?
బాబూ..రూ.2కు 20 లీటర్ల నీళ్లెక్కడ?
Published Fri, May 12 2017 9:42 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
- ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
జూపాడుబంగ్లా: ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రూ.2కు 20లీటర్ల నీరు ఇస్తానని హామీ ఇచ్చారని, వేసవిలో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నా హామీ కార్యరూపం దాల్చలేదని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. జూపాడుబంగ్లాలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొని ప్రజలు విలవిల్లాడుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరుమెదపడం లేదన్నారు. జిల్లాకు కేంద్రమంత్రి సుజనాచౌదరి వస్తే ఆయన దృష్టికి తాగు, సాగునీటి సమస్యను తీసుకెళ్లే దమ్ము,ౖ«§ð ర్యం ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేకపోయిందన్నారు.
గ్రామాల్లో తాగునీటి కంటే మద్యం ఏరులైపారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. మద్యం విక్రయాలు పెరగటానికే గ్రామాల్లో నీటిఎద్దడి సృష్టించారా అన్నట్లుగా మారిందన్నారు. కర్నూలులో ఎనిమిది రోజులకోపర్యాయం తాగునీటిని సరఫరా చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటంతోపాటు ప్రత్యేక రాయలసీమతోనే సమస్యలు తీరుతాయన్నారు. పారుమంచాల కరుణాకరరెడ్డి, తూడిచెర్ల నాగభూషణం, మోహన్‌రెడ్డి, రషీద్‌మియ్య, చక్కెరసాహెబ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement