కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో పర్యటన పర్యటించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను సీఎం.. జాతికి అంకితం చేయనున్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకనపల్లిలో పశువుల హాస్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇక్కడే నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.