ఎత్తిపోతల పథకాలపై దృష్టిసారించాలి
ఎత్తిపోతల పథకాలపై దృష్టిసారించాలి
Published Mon, Sep 26 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
మఠంపల్లి : పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మట్టపల్లి వద్ద కృష్ణానది వరద ముంపును, బాధితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన కృష్ణానదిపై బల్లకట్టులో ఆవలిభాగం ఒడ్డు వరకు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్టె ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ముఖ్యంగా పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా వందల కోట్ల రూపాయలతో నిర్మించిన వెల్లటూరు, బుగ్గమాదారం, మట్టపల్లి, పెదవీడు, అమరవరం ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. మట్టపల్లిలో పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరారు. మట్టపల్లి దేవస్థానం, గ్రామం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆయన వెంట భూక్యామంజీనాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజారెడ్డి, ఎండి.నిజాముద్దీన్, యరగాని నాగన్న గౌడ్, ఎం.ఎం.యాదవ్, బచ్చలకూరి బాబు, భాస్కర్‌రెడ్డి, యల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరావు, బుజ్జి భీముడు, పిచ్చిరెడ్డి, రవినాయక్, బాబునాయక్, హనుమ, సక్రు,వెంకటరమణ,రామయ్య,నారాయణస్వామి,శ్రీనివాసరెడ్డి,సైదిరెడ్డి తదితరులున్నారు.
Advertisement
Advertisement