షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌లో పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలు రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘హిమాచల్ ప్రదేశ్ పీసీసీ యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో తెలిపారు.
Congress dissolved the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/zfXcnb2S2o
— ANI (@ANI) November 6, 2024
కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment