dissolves
-
హిమాచల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌లో పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలు రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్ పీసీసీ యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో తెలిపారు. Congress dissolved the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/zfXcnb2S2o— ANI (@ANI) November 6, 2024కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. -
వార్ కేబినెట్‌ను రద్దు చేసిన నెతన్యాహూ
టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్‌ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్‌లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్‌లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి. దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్‌లు వార్ కేబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది. బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు. -
మస్క్ సంచలనం, పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ బోర్డును మొత్తం రద్దు చేశారు. డైరెక్టర్ల బోర్డును రద్దు తరువాత ప్రస్తుతం మాస్క్ ఏకైక డైరెక్టర్‌గా కొనగుతున్నారు. అక్టోబర్ 31, సోమవారం సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని.. ఇది వారికి మరో ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: Bank of Baroda కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు -
సీడబ్ల్యూసీని రద్దు చేసిన రాహుల్
న్యూఢిల్లీ: సోనియా హయాంలో ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ రద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులుండే తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ త్వరలో నిర్వహించే పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలోనూ ఉన్నారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న అమరిందర్ సింగ్, విలాస్ ముత్తెంవార్, ఆర్కే ధావన్, శివాజీరావ్ దేశ్‌ముఖ్,, ఎంవీ రాజశేఖరన్, మొహ్సినా కిద్వాయితోపాటు ప్రత్యేక ఆహ్వానితులను కమిటీ నుంచి మినహాయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ శనివారం సమావేశమై ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నియామకాన్ని ప్లీనరీ లాంఛనంగా ఆమోదించటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లవుతుంది. ప్లీనరీ మార్చి 16 లేదా 17 తేదీల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్లీనరీ ముగిశాక తిరిగి కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటవుతుంది. దీనిని ప్లీనరీలో కానీ, ఆ తర్వాత కానీ ఎన్నుకుంటారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని 25 మంది సభ్యుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కాకుండా 12 మందిని ఎన్నుకుంటారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
-
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనమైంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ రద్దుతో మూడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది.