నీటిపారుదల శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఇందుకు ఇకపై ‘ఎనర్జీ ఆడిటింగ్’ నిర్వహించాలని, ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లకు కచ్చితంగా కెపాసిటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. పంపులు నడవని సమయంలో కూడా డిస్కమ్‌లు భారీగా బిల్లులు వడ్డిస్తున్నారుు. దీంతో అలాంటి ఎత్తిపోతల పథకాలకు మినహారుుంపు అంశంపై డిస్కమ్‌లతో ఓ అవగాహనకు రావాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దేవాదుల, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, ఎల్లంపల్లి, అలీసాగర్ గుత్ప వంటి ఎత్తిపోతల పథకాలకు 1,378 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటోంది.
యూనిట్ ఖర్చు రూ.5 మేర ఉన్నా విద్యుత్ వినియోగానికి గానూ రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న 287 ఎత్తిపోతల పథకాలకు ఏటా 40 నుంచి 50 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. రూ.50 కోట్లు చెల్లిస్తున్నారు. నీళ్లు లేని సందర్భాల్లో పంపులు నడవకున్నా డిస్కమ్‌లు లోడ్ చార్జీల పేరిట డిస్కంలు భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారుు. నిజానికి ఎత్తిపోతల పథకాలు కేవలం 3 నుంచి 4 నెలలు పాటే పనిచేస్తారుు. మిగతా సమయంలో అవి పనిచేయకున్నా కనీస చార్జీల పేరిట డిస్కమ్‌లు బిల్లు వసూలు చేస్తున్నారుు. ఈ చార్జీలను తొలగించాలని ట్రాన్‌సకోను కోరగా.. అది తమ పరిధిలో లేదని ఈఆర్‌సీ తేల్చాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈఆర్‌సీ సమావేశం ఉన్నందున అంతకుముందే ఈఆర్‌సీకి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది.
బోర్డులో చర్చ: సోమవారం ఐడీసీ చైర్మన్ ఆద శంకర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో ఎత్తిపోతల పథకాల్లో నిర్వహణ ఖర్చును తగ్గించుకునే అంశంపై చర్చ జరిగింది.