maintenance
-
గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్‌డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది. -
కలియుగానికి ఇదో ఉదాహరణ
చండీగఢ్: వృద్ధురాలైన తల్లికి మనోవర్తిగా(Maintenance) నెలకు రూ.5 వేలు ఇవ్వాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై పంజాబ్ హరియాణా హైకోర్టు(Punjab & Haryana High Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలియుగంలో జరుగుతున్న విపరీతాలకు ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించింది. సంగ్రూర్ కుటుంబ న్యాయస్థానంలో మూడు నెలల్లోగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. అది చాలా తక్కువ మొత్తమని తెలిపింది. మనోవర్తి మొత్తం పెంచాలంటూ పిటిషనర్ తల్లి ప్రత్యేకంగా ఎలాంటి విజ్ఞాపన చేయలేదని కూడా పేర్కొంది. 77 ఏళ్ల వృద్ధురాలి భర్త 1992లోనే చనిపోయారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకున్న సుమారు 30 ఎకరాల భూమిని పిటిషనర్ అయిన మరో కుమారుడు, చనిపోయిన కుమారుడి పిల్లలు పంచుకున్నారు. 1993లో మనోవర్తి కింద వృద్ధురాలికి రూ.లక్ష ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కూతురు వద్దే ఉంటోంది. తన పోషణ భారం కుమార్తె మోయాల్సి రావడంతో వృద్ధురాలు సంగ్రూర్ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. తల్లి తన వద్ద ఉండటం లేదు కాబట్టి, మనోవర్తి తాను ఇవ్వాల్సిన పనిలేదని కుమారుడు వాదించాడు. తోసిపుచి్చన న్యాయస్థానం నెలకు రూ.5 వేల చొప్పున అందజేయాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశాడు. విచారణ సందర్భంగా న్యాయస్థానం..‘తన తల్లికి వ్యతిరేకంగా సాక్షాత్తూ కుమారుడే ఈ పిటిషన్ వేయడం చూసి మేం షాక్‌కు గురయ్యాం. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించినప్పటికీ, ఎలాంటి ఆదాయ వనరుల్లేని వయో వృద్ధురాలైన తల్లిని పెళ్లయి మెట్టినింట్లో ఉంటున్న ఆమె కుమార్తె వద్ద వదిలేయడం దురదృష్టకరం. కలియుగంలో జరిగే వైపరీత్యాలకు ఈ కేసు సిసలైన ఉదాహరణ’అని వ్యాఖ్యానించింది. -
22న యూపీఐ సేవలు బంద్!.. హెచ్డీఎఫ్సీ ప్రకటన
స్మార్ట్‌ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత దాదాపు చాలామంది లావాదేవీల కోసం 'ఫోన్‌పే, గూగుల్ పే' వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. అయితే తాజాగా హెచ్డీఎఫ్సీ ఖాతాను.. యూపీఐ పేమెంట్స్ యాప్‌లకు లింక్ చేసుకున్నవారికోసం బ్యాంక్ ఓ సందేశం అందించింది.బ్యాంక్ అందించిన సందేశం ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 2:30 AM నుంచి 7 AM వరకు.. హెచ్డీఎఫ్సీ ఖాతాకు లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవు. అంటే 4:30 గంటలు యూపీఐ సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. తన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సిస్టం మెయిటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది.హెచ్డీఎఫ్సీ ప్రకారం.. ఆ సమయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నవారు.. ప్రైమరీ అకౌంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీని లింక్ చేసి ఉంటే.. అత్యవసరం అనుకుంటే మార్చుకోవడం మంచింది. లేకుంటే 7 గంటల తరువాత యూపీఐ సేవలను యదావిధిగా కొనసాగించవచ్చు.చదవండి: 'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్కేవలం హెచ్డీఎఫ్సీ అకౌంట్ మాత్రమే ఉన్నవాళ్లు.. ముందుగానే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా ప్రయాణం సమయంలో, లేదా ఇతర అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఏ సమయంలో యూపీఐ పనిచేయదనే విషయాన్ని కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ మెయిల్ ద్వారా తెలియజేసింది. -
భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది. -
కార్ల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్సీ మోడల్ ధర రూ. 2 లక్షల వరకు, టాప్ ఎండ్ మెర్సిడెస్–మేబాక్ ఎస్ 680 లగ్జరీ లిమోజిన్ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏటా డిసెంబర్లో జరిగేదే.. ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్‌ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు. సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ మహాజన్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. -
Viral Video: ఉడుత పళ్లకు ఇంత ట్రీట్మెంటా?
-
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్‌పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
లిఫ్ట్‌లో ఇరుక్కుంటున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో 20 ఫోర్లకు పైనే నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లలోనే కాకుండా ఇల్లు, కార్యాలయం, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడయినా.. మెట్లపైనుంచి నడిచివెళ్లే వారికంటే.. లిఫ్ట్ ఎక్కడుందా అని వెతికేవారే ఎక్కువ. బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లలో ఉండేవారు, కార్యాలయాల్లో పనిచేసేవారు వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతినిత్యం లిఫ్ట్‌లు వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల లిఫ్ట్‌లు పనిచేయక అందులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆగస్టు 3న ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 137లో జరిగిన ఓ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు 45 నిమిషాలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్ వాడకం అన్నది నిత్య జీవితంలో భాగమైంది. అయితే లిఫ్ట్ వాడకం, దాని నిర్వహణ తదితర అంశాలపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 329 జిల్లాల్లో 42 వేల మందిని సర్వే చేసింది. ఇందులో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మంది మహిళలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గత మూడేళ్లలో తమ గృహ సముదాయంలో లేదా కార్యాలయంలో తాము కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారని 58 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు. లిఫ్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు నిర్ణయించాలా? కచ్చితమైన నిబంధనలు రూపొందించాలి 76 శాతం మంది అలా చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి... అమలు కూడా సాధ్యం కాదు 24 శాతం మంది -
సాఫ్రాన్ అతిపెద్ద ‘ఎంఆర్వో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో ఉన్న ప్యారిస్ కంపెనీ సాఫ్రాన్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) కోసం అతిపెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సరీ్వసెస్ ఇండియా ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్‌లోని ఈ సెజ్‌లో లీజు ప్రాతిపదికన 23.5 ఎకరాల్లో లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ టర్బోఫ్యాన్ ఇంజన్స్ కోసం ఎంఆర్వో కేం్రద్రం రానుంది. ఏటా 100 ఇంజన్లతో ప్రారంభమై 2035 నాటికి 300 ఇంజన్లకు సర్వీస్ చేయగలిగే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. 2023 సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలై 2025లో కార్యరూపం దాల్చనుంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే నాటికి 1,000 మందికి ఉపాధి కలి్పంచనుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కేంద్రం అతిపెద్ద ఎంఆర్వో ఫెసిలిటీ కానుందని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సపోర్ట్, సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొచియే తెలిపారు. జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ పార్క్‌లో ఇప్పటికే సాఫ్రాన్ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ కంపోనెంట్ తయారీ కేంద్రాలను స్థాపించింది. -
కోర్టులో భర్త చేసిన పనికి బిత్తర పోయిన భార్య.. అసలేం జరిగిందంటే?
సేలం(తమిళనాడు): అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా భర్త తీసుకువచ్చిన సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది. సేలం జిల్లా దేవన్నక వుండనూరు కిడయూరు మెట్టూరుకి చెందిన రాజీ (57) ఓ ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాంతి. వీరు అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితిలో భరణం కోసం శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతి నెలా రూ.73,000 జీవన భృతిగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి సంగగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని (రూ.2.18 లక్షలు) వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. దీంతో బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణం సొమ్ము రూ.2.18 లక్షలను రూ.10 నాణేలుగా 11 బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి ఆమెను భర్త అవమానించాడని కోర్టు సిబ్బంది మండిపడ్డారు. -
లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న మొదట్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు, అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమ కాల్వపై ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియపరిచారు. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టి 1980–81 వరకు నడిపించారు. తర్వాత వీటిని నిర్వహించడం తమ వల్ల కాదనీ, ప్రభుత్వమే నిర్వహించాలనీ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్ట్మెంట్కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడీసీ ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లై సరిగ్గా లేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జున సాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకూ రైతులందరినీ వెంట తీసుకొని 2007లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మరికొంత మంది నాయకులూ పాల్గొన్న ఈ పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఇది ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి కలుగజేసింది. ఫలితంగా... సెపరేట్ ఫీడర్ లైన్ నిర్మాణం జరిగి 18 గంటలు కరెంట్ సప్లై అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. అయినా తర్వాత కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది. 2013–14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీ కరణ పనులకు వరల్డ్ బ్యాంక్ అందించిన 4 వేల కోట్లలో రూ. 100 కోట్లు కేటా లిఫ్టుల మరమ్మతులకు కేటాయించారు. ఈ నిధులతో 50 శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్కు, తర్వాత ఐబీ డిపార్ట్మెంట్కు అప్పగించారు. బాధ్యత ఏ శాఖకు ఇచ్చినా శాశ్వత సిబ్బందిని మాత్రం నియమించలేదు. పైగా ఐబీ శాఖకు ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేదు. ఈనాడు ఈ లిఫ్టులన్నీ పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనూ; 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లోనూ; వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అమలు మర చారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు; తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పజెప్పాలి. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నల్లగొండ ఐబీసీఈ ఆఫీసు ముందు నేడు (జూన్ 27) ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. (క్లిక్: శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?) - జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు -
అయితే రిపేర్లు.. లేకుంటే చోరీలు!
సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: యువతతోపాటు సాధారణ ప్రజానీకానికి వ్యాయామం పట్ల అవగాహన పెంచడం, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఓపెన్ జిమ్’లు నిరుపయోగంగా మారిపోతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా.. పరికరాలు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి. ఉన్న పరికరాల్లో కూడా బేరింగ్స్‌లో గ్రీజు, ఆయిల్ వంటివి వేయకపోవడం సరిగా పనిచేయడం లేదు. ఇక కొన్నిచోట్ల పరికరాలు దొంగల పాలవుతుంటే.. ఇంకొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు ఓపెన్ జిమ్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. లైట్లు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతోనూ జనం ఓపెన్ జిమ్లవైపు రాని పరిస్థితి కూడా ఉంది. దశల వారీగా అన్ని పట్టణాల్లో.. వేలకు వేలు చెల్లించి ప్రైవేటు జిమ్‌లకు వెళ్లలేని వారికి ప్రయోజనం కలిగేలా రాష్ట్రం లో 2018 నుంచి ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, తర్వాత 51 పట్టణాల్లో 307 జిమ్‌లను చేపట్టారు. అప్పటి నుంచీ దశల వారీగా.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటిలో పరికరాల ఏర్పాటు, నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీలకే అప్పగించారు. మున్సిపాలిటీలు సివిల్ వర్క్, టైల్స్ వంటివి సిద్ధం చేస్తే.. కాంట్రాక్టర్లు వ్యాయమ పరికరాలు అమర్చుతున్నారు. మంచి పరికరాలతో.. ఓపెన్ జిమ్‌లలో ఒక్కోచోట రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి పరికరాలను అమర్చారు. పలుచోట్ల ఖరీదైన పరికరాలనూ ఏర్పాటు చేశారు. అబ్డామినల్ రైడర్, వర్టికల్ షోల్డర్ పుల్, లెగ్ ఎక్స్టెన్షన్, కర్ల్ మిషన్లు, షోల్డర్ ట్విస్టర్లు, పుల్ చైర్స్, చెస్ట్ పుష్ మిషన్లు వంటివి అమర్చారు. కొత్తలో యువకులతోపాటు నడి వయస్కులు, మహిళలు ఓపెన్ జిమ్‌లకు వచ్చినా.. తర్వాత వాటి నిర్వహణ లోపం, యంత్రాలు పాడైపోవడంతో వారిలో ఆసక్తి తగ్గిపోయింది. చాలాచోట్ల పిల్లల ఆటస్థలాలుగా ఓపెన్ జిమ్‌లు మారిపోయిన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లే నిర్వహణ చూడాల్సి ఉన్నా.. జిమ్ పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనలను బట్టి.. పరికరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లే ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంది. పరికరాలు పాడైనా, తుప్పు పట్టినా సదరు కాంట్రాక్టరే కొత్తవి ఏర్పాటు చేయడమో, బాగు చేయడమో చేయాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఇది జరిగిన దాఖలాలు లేవు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓపెన్ జిమ్‌లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఓపెన్ జిమ్‌లను స్థానిక యువతకు గానీ, అసోసియేషన్లకు గానీ అప్పగిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా తీసుకున్న చర్యలు లేవు. ఎక్కడ చూసినా అంతే.. ►నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్, పాలిటెక్నిక్ కళాశాల, నాగారం, కంఠేశ్వర్ ప్రాంతాల్లో పరికరాలు దెబ్బతిన్నాయి. కామారెడ్డిలోని 5 జిమ్‌లలో నిర్వహణ లేక పరికరాలు చెడిపోతున్నాయని.. గోదాంరోడ్‌లోని జిమ్ రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ►మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మూడ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఓపెన్ జిమ్‌ను కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులు మూసివేశారు. వనపర్తిలోనూ రెండు చోట్ల వృధాగా ఉన్నాయి. గద్వాల, అయిజ పట్టణాల్లోనూ ఓపెన్ జిమ్‌ల నిర్వహణ సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. ►మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్‌నగర్ కాలనీలో ఉన్న ఓపెన్ జిమ్ నిర్వహణ సరిగా లేదు. సంగారెడ్డి జిల్లాలోనూ చాలా చోట్ల వ్యాయామ పరికరాలు దెబ్బతిన్నాయి. ►కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసినా.. నిర్వహణను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్లో ఓపెన్ జిమ్‌లోని వాకింగ్ ట్రాక్ దెబ్బతిన్నది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. ►నల్లగొండ జిల్లా పరిధిలోని చాలా జిమ్‌లలో పరికరాలు తుప్పుపడుతున్నాయి. దేవరకొండలోని జిమ్‌లలో రబ్బర్ మ్యాట్లు ఊడిపోయి అధ్వానంగా తయారయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓపెన్ జిమ్‌లో పరికరాలన్నీ చోరీకాగా మిగిలిపోయిన ఇనుప స్తంభాలివి. ఇక్కడ ఎన్టీఆర్ మినీస్టేడియం, దివ్యనగర్ మినీపార్క్, మినీ ట్యాంక్ బండ్లపై లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ రక్షణ, పర్యవేక్షణ లేక కొద్ది నెలల్లోనే పరికరాలన్నీ ఒక్కొక్కటిగా దొంగల పాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఇది. ఇక్కడ 13 వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయగా.. ఐదు పరికరాలు పాడైపోయాయి. మరమ్మతుల కోసమని వాటిని నెల రోజుల కింద తీసుకెళ్లారు. ఇప్పటికీ తీసుకురాలేదు. ఇక జిమ్ కోసం ఏర్పాటు చేసిన మ్యాట్ సరిగా లేదు. నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాయామం చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఓపెన్ జిమ్‌లో ఉన్న ‘త్రీ పర్సన్ వెయిస్ట్ ట్రైనర్’. ఒకేసారి ముగ్గురు కూర్చుని నడుమును అటూ ఇటూ తిప్పుతూ వ్యాయామం చేసే ఈ పరికరంలో సీట్లు చోరీ అయ్యాయి. అంతేకాదు ఇక్కడి స్పిన్నర్ వీల్, ఇతర పరికరాల్లోని భాగాలను ఎవరో ఎత్తుకెళ్లారు. మరికొన్ని పరికరాలు విరిగిపోయాయి. కోదాడ గాంధీపార్కులోని ఓపెన్ జిమ్‌లో పాడైపోయిన పరికరానికి తాళ్లు కట్టి వినియోగిస్తున్న దృశ్యమిది. ఒకవేళ తాళ్లు తెగిపోయి కిందపడితే ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అధికారులు వీటికి మరమ్మతులు చేయించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడే కాదు సూర్యాపేట జిల్లా పరిధిలోని ఇతర ఓపెన్జిమ్లలోనూ పరికరాలు పాడైపోతున్నాయని అంటున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైటర్‌బస్తీలోని పంచతంత్ర పార్కు ఓపెన్ జిమ్‌లో వృథాగా పడి ఉన్న చెస్ట్ ప్రెస్సింగ్ పరికరం ఇది. ఇక్కడే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చాలాచోట్ల ఓపెన్ జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. తుప్పుపట్టి విరిగిపోయాయి. ఖమ్మంలోని ఎన్ఎస్పీ కెనాల్ యూపీహెచ్ కాలనీ వాక్‌వేలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. సత్తుపల్లిలో జిమ్ పరికరాలు తుప్పుపట్టాయి. బూడిదగడ్డ ఏరియాలోని రాజీవ్ పార్కు, పాల్వంచ, కొత్తగూడెంలలో ఉన్న జిమ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ లేక పాడైపోతున్నాయి గోదావరిఖని పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌కు చాలా మంది వస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేక పరికరాలు దెబ్బతింటున్నాయి. వాకింగ్ ట్రాక్ దెబ్బతిన్నది. లైట్లు లేవు. టాయిలెట్లను శుభ్రం చేయక దుర్వాసన వెదజల్లుతున్నాయి. – గోపాల్‌రెడ్డి, గోదావరిఖని పట్టించుకునే వారేలేరు నల్లగొండలో భారీ ఖర్చుతో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని పట్టించుకునే వారు లేరు. జిమ్ పరికరాలు పాడైపోతున్నాయి. వెంటనే మరమ్మతులు చేయించాలి. – వీరబ్రహ్మచారి, నల్లగొండ -
ఆ స్తోమత లేదా? అయినా తప్పదు! భర్తకు షాక్
భర్త పెట్టే వేధింపులు భరించలేక.. దూరంగా, వేరుగా ఉంటోందామె. అయితే భర్త తనకు దూరంగా మంచి జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, కాబట్టి, తనకు మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు ఇప్పించాలని ఆ భార్య కోర్టును ఆశ్రయించింది. ఆపై పరిణామాలు ఆ భార్యకు అనుకూలంగా రాగా.. పైకోర్టును ఆశ్రయించిన భర్తకు పెద్ద షాకే తగిలింది. చాలా ఏళ్ల క్రితమే భర్తను వీడి.. దూరంగా ఉంటున్న ఆ భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ.5,133 చెల్లించాలని భర్తను ఆదేశించింది మహిళా కోర్టు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. చేదు అనుభవమే ఎదురైంది. తాను నిరుద్యోగినని, భరణంగా డబ్బులు ఇవ్వలేనని పిటిషన్లో వేడుకున్నాడు ఆ భర్త. దీనిపై ఈమధ్యే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు, భర్త నిరుద్యోగి అయినంత మాత్రాన తన భార్యను పోషించే బాధ్యత నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది. నిరుద్యోగం కారణంగా చూపి భార్యకు మధ్యంతర భరణం ఇచ్చే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని తీస్ హజారీ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ తీర్పునిచ్చారు. ‘‘భర్త నిరుద్యోగి. అది వాస్తవమే కావొచ్చు. అయినప్పటికీ భార్యకు భరణం చెల్లించే బాధ్యత నుంచి అది తప్పించలేదు. ఈ కేసులో భర్తకు మంచి విద్యార్హత ఉంది. వృత్తిపరంగా అనుభవమూ ఉంది. ఇప్పుడు ఉద్యోగం లేనంత మాత్రానా.. తర్వాతి రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించలేడా?. వైకల్యం ఏం లేదు కదా’’ అని జడ్జి భర్తను ఎదురు ప్రశ్నించారు. వరకట్న వేధింపులకు పాల్పడి మరీ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. అతడి వేధింపులు తాళలేక వేరుగా నివసిస్తూ.. నెలకు రూ.50 వేల జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, తన మెయింటెనెన్స్ కోసం కొంత ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే.. తాను ఇంటి ఖర్చులు భరిస్తున్నానని, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకుంటున్నానని, కుట్టుపని ద్వారా తన కంటే తన భార్యే ఎక్కువ సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమెకు మంచి సౌకర్యాలు అందించాలని, అది నైతిక, చట్టపరమైన బాధ్యత అని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. -
ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది. అయితే ఇది కొత్త బస్సు కాదు. డీజిల్ భారం నుంచి బయటపడేం దుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న బస్సు. అంటే డీజిల్‌తో నడిచే బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారన్న మాట. ఈ బస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చేరుకుంది. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఖర్చు తగ్గింపే లక్ష్యం ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే. అంత వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ డీజిల్ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్ బస్సుగా కన్వర్ట్ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు! ప్రస్తుతం కన్వర్షన్ ఖర్చును కూడా ఆర్టీసీ భరించలేదు. దీంతో బస్సును కన్వర్ట్ చేసిన తర్వాత నిర్ధారిత కాలం పాటు ఆ సంస్థే బస్సులను నిర్వహించుకుని, అద్దె వసూలు చేసుకుని, నిర్ధారిత కాలం తర్వాత బస్సులను ఆర్టీసీకి అప్పగించే విధానంపై ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..?
Virat Kohli: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? అంటూ మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతడి తల్లి కలిసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఆ మహిళ.. భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. ఆమెకు నెలకు రూ. 30 వేల భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ భర్త ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాడు. తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని, ఛారిటీల ద్వారా వచ్చే డబ్బుతో నెట్టుకొస్తున్నానని, తాను భరణాన్ని చెల్లించే పరిస్థితి లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. పిటిషనర్ అప్పీల్‌పై అడిషినల్ సెషన్స్ జడ్జ్ అనూజ్ అగ్రవాల్ స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లి లాంటి సెలబ్రిటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకి డైరెక్టర్‌గా ఉండి భరణం చెల్లించేందుకు డబ్బులు లేవంటే నమ్మేలా లేదని అప్పీల్‌ను తిరస్కరించారు. మెయింటెనెన్స్ తప్పనసరిగా చెల్లించాల్సిందేనంటూ పిటిషనర్‌ను ఆదేశించారు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... -
శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చాలా సమర్ధవంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సారీ్ప) ప్రశంసించింది. ప్రాజెక్టు అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖను అభినందించింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్యానల్ చైర్మన్ ఏబీ పాండ్య తెలిపారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన పాండ్య నేతృత్వంలోని డీఎస్సార్పీ.. మంగళవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ, ఈఈ తదితరులతో సమావేశమైంది. ప్రాజెక్టు స్థితిగతులు, ఆధునికీకరణపై సమీక్షించింది. ప్రాజెక్టు ప్లంజ్ పూల్‌కు 2002 నుంచి 2004 మధ్య వేసిన కాంక్రీట్ ఆ తర్వాత వచ్చిన వరదల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు డీఎస్సార్పీ గుర్తించింది. భారీ కాంక్రీట్ దిమ్మెలను ప్లంజ్ పూల్‌లో వేసి, వాటిపై అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పోయడం ద్వారా గొయ్యిని పూడుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ డిజైన్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు పంపాలని ప్యానల్ చైర్మన్ సూచించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారమే ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కొండ చరియలు విరిగి పడకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన, దిగువన కొండచరియలు విరిగి పడి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు పడకుండా మెస్, షార్ట్ క్రీటింగ్ కాంక్రీట్‌తో అడ్డుకట్ట వేస్తున్న తరహాలోనే.. శ్రీశైలంలోనూ చేస్తామని అధికారులు చేసిన ప్రతిపాదనకు డీఎస్సార్పీ ఆమోదం తెలిపింది. గ్యాలరీలో సీపేజ్‌కు అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేపట్టాలని ఆదేశించింది. రివర్ స్లూయిజ్ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, ఆప్రాన్‌కు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించింది. అధునాతన వరద పర్యవేక్షణ కార్యాలయం ప్రాజెక్టు వద్ద వరద పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఎస్సార్పీ సూచించింది. ప్రాజెక్టు అధికారులకు 40 ఎకరాల్లో గతంలో నిర్మించిన క్వార్టర్స్‌ను (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి) కూల్చివేసి, కొత్తవి నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ, క్వార్టర్స్ నిర్మాణానికి డ్రిప్ కింద రుణమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని డీఎస్సార్పీ తెలిపింది. ఈ పనులకు రూ.780 నుంచి రూ.1,000 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని పాండ్య తెలిపారు. -
Gandhi Hospital: ఆస్పత్రిలో ‘గుండె’ గోస
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్ గత పద్దెనిమిది నెలలుగా మూలనపడింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్డియాలజీ విభాగం ప్రభుత్వ, వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందక హృద్రోగులు విలవిల్లాడుతున్నారు. 2010లో ఏర్పాటు.. ► గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో కార్డియాలజీ విభాగంలో 2010లో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ కార్డియాలజీ ఓపీ, ఐపీ విభాగంలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతుంటారు. ► గుండె సంబంధ వ్యాధులను నిర్ధారించేందుకు నాలుగైదు దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) తదితర పరీక్షల్లో కొన్నిరకాల రుగ్మతలు, యాంజియోగ్రాం, పెర్యూటేనియస్ ట్రాన్సుమినల్ కొరునరీ యాంజియోఫ్లాస్ట్రీ (పీటీసీఏ), ప్రోటోన్ పంప్ ఇన్‌హేబిటర్ (పీపీఐ), ట్రెపోనిమా పల్లిడం ఇమ్మోబిలైజేషన్ (టీపీఐ) తదితర అత్యంత కీలకమైన వైద్యపరీక్షలు క్యాత్‌ల్యాబ్‌లోనే నిర్ధారణ అవుతాయి. ► క్యాత్‌ల్యాబ్ నివేదిక ప్రకారమే రోగికి స్టంట్ వేయాలా? శస్త్రచికిత్స నిర్వహించాలా? అనేది నిర్ణయిస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించక క్యాత్‌ల్యాబ్ మెషీన్ పలుమార్లు మొరాయించింది. కాలపరిమితి ముగిసిన క్యాత్‌ల్యాబ్ మెషీన్ మరమ్మతులకుæ లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, కొత్తది సమకూర్చుకోవడం మేలని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య యంత్రాలు, పరికరాల కొనుగోలు, నిర్వహణ బాధ్యతల కేటాయింపులను తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. ► వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన హరీష్‌రావు స్పందించి నూతన క్యాత్‌క్యాబ్ ఏర్పాటు చేసి నిరుపేద హృద్రోగుల గుండె చప్పుడు ఆగిపోకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించాం గాంధీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్ పని చేయని విషయాన్ని ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించాం. కాలపరిమితి ముగిసిన గాంధీ క్యాత్‌ల్యాబ్ మరమ్మతులకు రూ. 45 లక్షలు, ఏడాది నిర్వహణకు మరో రూ. 30 లక్షలు అవసరం. రూ.75 లక్షలు వ్యయం చేసే బదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న నూతన క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ విషయాలన్ని నివేదిక రూపంలో అందించగా నూతన క్యాత్‌ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి నిరుపేద హృద్రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నిర్వహణలో లోపాలతోనే ఫేస్బుక్ డౌన్
లండన్: ఫేస్బుక్ దానికి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని గంటలు పని చెయ్యకపోవడానికి నిర్వహణ సమస్యలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ పని చెయ్యకపోవడానికి కారణం సంస్థలో జరిగే తప్పిదాలేనని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్ జనార్ధన్ తన బ్లాగ్ స్పాట్లో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కి చెందిన కంప్యూటర్లు, రౌటర్లు, డేటా సెంటర్లు, కనెక్టింగ్ కేబుల్స్‌ని ఇంజనీర్లు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారని ఆ సమయంలో జరిగిన తప్పిదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల సేపు సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ‘‘ప్రతీ రోజూ ఇంజనీర్లు చేసే నిర్వహణలో భాగంగానే ఒక కమాండ్ ఇచ్చారు. అయితే ఎవరూ ఊహిం చని విధంగా దాని వల్ల నెట్వర్క్ మొత్తం డౌన్ అయింది’’ అని ఆయన తెలిపారు. -
ఆర్భాటంగా ఆరంభం.. రెండేళ్లు గడుస్తున్న అలంకారప్రాయం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్భాటంగా ఆరంభించిన ఏసీ బస్షెల్టర్లు మౌలిక వసతులు కొరవడి వెలవెలబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఇవి మేడిపండు చందంగా మారాయి. వీటిలో ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. రెండేళ్లుగా అలంకారప్రాయంగానే ఉన్నాయి. గ్రేటర్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లతో పాటు ఇటీవల దిల్సుఖ్నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత, 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం సదుపాయం, బస్‌పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ అరకొర సదుపాయాలే తప్ప ఎక్కడా ప్రయాణికులకు ఇవి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ బోర్డులేవీ.. ► బస్సుల రాకపోకలను తెలిపే ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం మార్గాల్లో ప్రతి రోజు వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు బస్ షెల్టర్లలో వేచి ఉండలేకపోతున్నారు. బస్సుల కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ► బస్సుల టైం టేబుల్, అనౌన్స్మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్ప్లే ఏర్పాటుపై అటు గ్రేటర్ ఆరీ్టసీ, ఇటు జీహెచ్ఎంసీ ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దాహమేస్తే దిక్కులేదు.. ► చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్òÙల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకి తెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటిన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ, కాఫీ, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. కానీ ఇప్పటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు. ► ఏ ఒక్క బస్ షెల్టర్‌లో ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో బస్షెల్టర్లలో దుర్గంధం వ్యాపిస్తోందని, వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కానీ వినియోగానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. కానీ అవి ఇప్పుడు అలంకారప్రాయంగానే ఉన్నాయి. నిర్వహణ కొరవడింది. -
వినియోగదారులకు 'హ్యుందాయ్' శుభవార్త, తక్కువ ధరకే..
హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ‘‘షీల్డ్ ఆఫ్ టస్ట్ర్ సూపర్’’ పేరుతో మెయింటెనెన్స్ సర్వీసులను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్త కారుకు ఐదేళ్లు గడువు లేదా 50వేల కిలోమీటర్ల దూరం సేవలను అందిస్తామని తెలిపింది. బ్రేక్‌లు, క్లచ్, వైపర్, బెల్ట్‌తో సహా మొత్తం 14 ప్రధాన భాగాల రిపేర్లు ఈ సర్వీసు పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్‌కు చెందిన 10 మోడళ్లలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వాహన నిర్వహణ వ్యయ నియంత్రణ లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. -
SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులను అలర్ట్ చేసింది. ఎస్బీఐ ఆన్లైన్, యోనో యాప్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోనున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని గమనించాలంటూ ట్విటర్ ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు వివరాలను షేర్ చేసింది. రేపు (జూన్ 17, గురువారం) అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపియనున్నట్టు తెలిపింది. మెయింటనెన్స్ కార్యకలాపాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఫలితంగా ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ లాంటి సేవలు అందుబాటులో ఉండవనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలపై అప్రత్తమంగా ఉండాలని కస్టమర్లకు సూచించింది. (మాకెంజీ దాతృత్వం : రూ. 20 వేల కోట్ల భారీ విరాళం) We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/Nk3crZQ2PG — State Bank of India (@TheOfficialSBI) June 16, 2021 -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఆన్లైన్ సేవలు 3 రోజల పాటు పనిచేయవని బ్యాంకు తెలిపింది. రేపట్నుంచి వరుసగా 3 రోజులు మే 21, 22, 23 రోజుల్లో మెయింటెనెన్స్ కారణంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ట్వీట్లో తెలిపింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయి. మే 31 వరకు ఇది అమలులో ఉండనుంది. చదవండి: Paytm: ఎల్పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021 -
ఒక్కరూ లేరు, వింటే చోద్యం.. చూస్తే ఆశ్చర్యం
ఆదిలాబాద్‌టౌన్: ఆ ఆసుపత్రిలో వైద్యుడు లేడు. అయినా ఆసుపత్రి నిర్వహణకు అనుమతి కావాలని జిల్లా వైద్యాధికారులకు దరఖాస్తు చేరింది. ఆ దరఖాస్తును పరిశీలించిన వైద్యాధికారులు ఆసుపత్రిని పరిశీలించేందుకు సోమవారం వెళ్లగా.. అక్కడి వివరాలు తెలుసుకుని నివ్వెరపోవడం వారి వంతైంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఓ జాతీయ నాయకుడి పేరిట ఆస్పత్రి కొనసాగుతోంది. దీనికి గతనెలలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి అనుమతి కోసం దరఖాస్తు వెళ్లింది. ఆ దరఖాస్తును పరిశీలించిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఆస్పత్రి తనిఖీకి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో వారు సూచించిన వైద్యుడు లేనేలేడు. దీనిపై ఆరా తీయగా.. గతంలో నిర్మల్‌లో ఓ వైద్యుడి వద్ద పనిచేస్తున్న వ్యక్తి.. సదరు వైద్యుడి సర్టిఫికెట్లతో అనుమతికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నిర్మల్ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఎంహెచ్ఓ సదరు ఆసుపత్రి నిర్వహణకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను వివరణ కోరగా ఆస్పత్రి నిర్వహణకు గత నెల దరఖాస్తు చేసుకున్నారని, సంబంధిత వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అనుమతి నిరాకరించామని తెలిపారు. వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో పత్రాలు సమర్పిస్తే అనుమతి ఇస్తామని, నిబంధనలను అతిక్రమించి ఆస్పత్రి నిర్వహణ చేపడితే చర్యలు చేపడతామని తెలిపారు. చదవండి: కారుపైన యువకుడి పుషప్స్.. ఊహించని ట్విస్ట్ -
సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ఆర్టీసీ రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని నిర్ణయించింది. ఇందుకోసం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కేటాయించింది. ఆ సంస్థ సిటీ బస్సు డీజిల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ ఇంజన్‌గా మార్చి మూడు నెలలపాటు దాని పనితీరును పరిశీలించనుంది. ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ వ్యయాన్ని డీజిల్ బస్సు నిర్వహణ వ్యయంతో పోల్చి చూపనుంది. అది అనుకూలంగా ఉంటే మిగతా బస్సులను కూడా అలా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు టెండర్లు పిలిచి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చే సంస్థకు కన్వర్షన్ బాధ్యత అప్పగించాలన్నది ఆర్టీసీ ఆలోచన. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తే ఒక్క హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో డీజిల్ రూపంలో అవుతున్న రూ. 460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ. 1,926 కోట్ల వ్యయం తప్పుతుంది. ఖర్చు ఆ సంస్థనే భరించేలా.. ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల బస్సులను ఎలక్ట్రిక్ ఇంజన్లుగా మార్పిడి (కన్వర్షన్) చేసే ఖర్చు కూడా భారీగా ఉంది. ఆ భారాన్ని సైతం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. అందుకోసం ఆర్టీసీ మరో ప్రయోగం చేయాలన్న యోచనలో ఉంది. హైదరాబాద్‌లో 3 వేల బస్సులు తిరుగుతున్నాయి. వాటి రోజువారీ డీజిల్ ఖర్చు రూ. 1.30 కోట్లు. ప్రస్తుత డీజిల్ ధర ప్రకారం సాలీనా రూ. 460 కోట్లను దాటుతుంది. ఇక్కడ ఆర్టీసీకి డీజిల్ ద్వారా కిలోమీటర్‌కు రూ. 18 వరకు ఖర్చవుతోంది. అదే బ్యాటరీ బస్సుతో ఆ ఖర్చు రూ. 6 వరకే (ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న బస్సుల ఖర్చు మేరకు) అవుతుంది. అంటే కిలోమీటర్‌కు దాదాపు రూ. 12 వరకు మిగులుతుంది. దీంతో కన్వర్షన్ భారాన్ని ఆ సంస్థనే తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ఆ ఖర్చు భరించినందుకు.. ఈ మిగులుబాటు మొత్తాన్ని ఆ సంస్థ తీసుకుంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లపాటు ఆ సంస్థ ఈ మిగులు మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత బస్సులన్నీ ఆర్టీసీ సొంతమవుతాయి. కన్వర్షన్ భారాన్ని భరించకుండానే ఎలక్ట్రిక్ బస్సులు చేతికందినట్టు అవుతాయన్నది ఆర్టీసీ ఆలోచన. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఆ సంస్థకు ఇచ్చినా.... టెండర్లు పిలిచే నాటికి మరింత యోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. -
సీ ప్లేన్కు బ్రేక్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఎంతో అట్టహాసంగా అక్టోబర్ 31 న అహ్మదాబాద్–కెవాడియా మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సేవలు నెలలోనే ఆగిపోయాయి. మెయింటెనెన్స్ కోసం నిర్వాహకులు సీ–ప్లేన్‌ను మాల్దీవులకు పంపించారు. అయితే నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సీప్లేన్ సేవలు కనీసం 15 రోజుల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పౌర విమానయాన విభాగం డైరెక్టర్ అజయ్ చౌహాన్ మాట్లాడుతూ, సీప్లేన్ ఫ్లైయింగ్ అవర్స్ ముగిశాయని, ఈ పరిస్థితుల్లో విమానానికి సర్వీసింగ్ అవసరమని, అందుకే సీప్లేన్‌ను మాల్దీవులకు తిరిగి పంపించామని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ – కెవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) మధ్య తిరిగే సీ ప్లేన్ సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అక్టోబర్ 31న ప్రారంభోత్సవం జరిగిన తరువాత, నవంబర్ 1 నుంచి ప్రజల కోసం సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల రోజుల్లో ఇప్పటికే 3–3 రోజుల పాటు రెండుసార్లు ఈ సీప్లేన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ సమయంలో క్రూ మెంబర్స్‌కు విరామాన్ని ఇచ్చేందుకు సేవలు ఆపినట్లు అధికారులు తెలిపారు. సీ ప్లేన్ వివరాలు సిట్టింగ్ కెపాసిటీ : 19 మంది బరువు: 3,377 కిలోలు వేగం: 170 కి.మీ./గంటకు ఇంధన సామర్థ్యం: 1,419 లీటర్లు పొడవు: 16 మీటర్లు 1 ఎత్తు: 6 మీటర్లు ఇంధన శక్తి: 272 లీటర్లు / గంటకు బరువు సామర్థ్యం: 5670 కిలోలు టికెట్ ధర (ఒక్కరికి): రూ.4,0005,000 సందర్శకుల సంఖ్య రోజుకు 13వేలు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకుల సంఖ్య రోజుకు 10 వేలు -
మెయింటెనెన్స్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచం.. వారి కోసం ఏమైనా చేస్తారు. తిని తినక చాలీ చాలని బతుకులు బతుకుతూ పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు. బిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులకు బెంగే. ఉద్యోగం, పెళ్లి చేసుకుని వారు జీవితంలో స్థిరపడితే అప్పుడు తల్లిదండ్రులు కాస్త స్థిమితపడతారు. ఇక మలిదశలో పిల్లలు, మనవలతో కాలక్షేపం చేయాలనుకుంటారు. అదిగో అక్కడ వస్తుంది సమస్య. ఇన్నాళ్లు తమ కోసం రక్తం చిందించిన కన్నవారికి నాలుగు ముద్దలు పెట్టడానికి కొద్ది మందికి మనసు రాదు. వారిని చూసుకుంటే ఆస్తులు కరిగిపోతాయన్నంత బాధ. ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంతో ఒకప్పుడు నలుగురికి చేయూతనిచ్చిన వారు.. మలి దశలో మనసు చంపుకుని ఒకరి ముందు చేయి చాచే పరిస్థితిలో దీనంగా కాలం వెళ్లదీస్తుంటారు. వారి కోసం కోర్టులు చట్టలు ఉన్నాయని తెలిసినా బిడ్డల మీద ప్రేమతో ఫిర్యాదు చేయరు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ముందుకు ఓ కేసు వచ్చింది. దాని విచారణ సందర్భంగా కోర్టు తల్లిదండ్రులను పట్టించుకోని వారందరికి వర్తించేలా కీలక వ్యాఖ్యలు చేసింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడటం అంటే మీరు వారికేదో మేలు చేస్తున్నట్లు కాదు.. అసలు ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవితం వారు పెట్టిన భిక్ష అంటూ చివాట్లు పెట్టింది. వివరాలు.. మలి సంధ్యలో కుమారులు తనను పట్టించుకోవడం మానేశారు.. ప్రతి నెల మెయిన్టెనెన్స్ కింద ఇచ్చే డబ్బులు కూడా ఆపేశారు. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సోమవారం జరిగింది. జస్టిస్ ఎ.ఎమ్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. ఈ క్రమంలో ‘మీరు ఆయనకు ఎలాంటి సహాయం చేయటం లేదు. అతను మీ తండ్రి. మీరిద్దరూ ఎంఎన్సీలలో పనిచేస్తున్నారని మాకు తెలిసింది. అయితే అందుకు కారణం మీ తండ్రి అనే విషయం మర్చిపోకండి’ అంటూ పిటిషన్ దారుడి కుమారుల మీద కోర్టు విరుచుకుపడింది. అంతేకాక కొడుకులిద్దరు పూర్వీకుల ఇంటి మీద వస్తోన్న అద్దెను తీసుకోవడమే కాక తండ్రిని ఇంటి నుంచి బయటకు గెంటాశరని తెలిసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తండ్రి వల్లనే మీకు ఈ ఆస్తి వచ్చింది. అలాంటిది ఆయన ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కోర్టు వారిని ప్రశ్నించింది. (చదవండి: అరెస్ట్ చేయకపోవడం సీరియస్ విషయం!) ఢిల్లీలోని ఒక కుటుంబానికి సంబంధించిన కేసు. ఇద్దరు కుమారులు తమ భార్య, పిల్లలతో కలిసి కరోల్ బాగ్ ప్రాంతంలోని పూర్వీకుల ఇంట్లో నివసిస్తూ.. తండ్రిని బయటకు గెంటేశారు. దాంతో ఆయన తొలుత మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో గత సంవత్సరం కుమారులు తండ్రి జీవనాధారానికి 7,000 రూపాయలు చెల్లించాలని ట్రిబ్యునల్ తెలిపింది. కాని కుమారులు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007 లోని కొన్ని నిబంధనల ప్రామాణికతను వారు సవాలు చేశారు. వారి పిటిషన్‌ను పరిశీలించడానికి హైకోర్టు అంగీకరించింది, ట్రిబ్యునల్ ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. దాంతో తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ధర్మాసనం కొడుకులు తమ తండ్రి బాగా జీవించేలా మంచి ఏర్పాట్లు చేయాలని కోరింది. నెలకు 7,000 రూపాయలు సరిపోవు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మంచి మొత్తంతో రావాలని సూచించింది. సోమవారం, కుమారుల తరఫు న్యాయవాది తండ్రికి ప్రతి నెలా 10,000 రూపాయలు చెల్లిస్తారని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కొడుకులిద్దరు పూర్వీకుల ఇంటిని ఆక్రమించడమే కాక దాని నుంచి వస్తోన్న అద్దెను కూడా వారే వాడుకుంటున్నారని తెలిసి బెంచ్ బాధపడింది. (చదవండి: గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం? ) జస్టిస్ ఖాన్విల్కర్ ఈ పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను తండ్రి కోల్పోలేడని అభిప్రాయపడ్డారు. "మీరు ఆ ఇంటిని మీ స్వంతంగా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా మాకు చెప్పండి. మీరు ఇంటిని అమ్మలేకపోతే.. కోర్టు కమిషన్ని ఏర్పాటు చేసి ఇంటిని అమ్మి డబ్బును ముగ్గురికి సమానంగా పంచుతుంది" అని కోర్టు కొడుకుల తరఫు న్యాయవాదికి తెలిపింది. అంతేకాక వారం లోపు దీనికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. -
అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
న్యూఢిల్లీ: ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మధ్యప్రదేశ్ పరుగు వీరులకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అత్యవసర ట్రయల్స్ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్ గౌడ (కర్ణాటక), మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్ గుర్జార్లకు సోషల్ మీడియాలో విపరీత ఆదరణ దక్కింది. భారత్‌కు మరో ఉసేన్ బోల్ట్ దొరికాడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్ నిర్వహించగా అంచనాలను అందుకోలేదని తాజాగా కిరణ్ రిజిజు ప్రకటించారు. ‘గుర్జార్ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్ నిర్వహించగా గుర్జార్ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్‌లో జూని యర్లతోనే పోటీపడలేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్ నిర్వహించాం. అంతర్జాతీయ స్ప్రింట్ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్‌ను మించగలడంటూ దేశమంతా నమ్మింది’ అంటూ రిజిజు వివరించారు. -
క్యాబ్... రివర్స్ గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ పరిశ్రమను కరోనా వైరస్ కబళిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో క్యాబ్ బుకింగ్స్ లేకపోవటం, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, డ్రైవర్లను ఆదుకోవటం, కార్ల నిర్వహణ వంటివి కంపెనీలకు పెను భారమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు గతంలో మాదిరి క్యాబ్స్ బుకింగ్స్ ఉండవన్నది పరిశ్రమ వర్గాల అంచనా. దీంతో నిర్వహణ భారాన్ని భరించలేమని, తాము కొనసాగటం కష్టమేనని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు చెబుతున్నాయి. నిజానికిపుడు మొబిలిటీ అనేది రోజు వారి అవసరాల్లో భాగం. లాక్డౌన్ పూర్తయ్యాక పరిశ్రమ రికవరీ అయ్యే దశలో చాలా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు తాము భరించలేని స్థాయిలో ఉంటాయని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ప్రైడో, టోరా, యూటూ, రైడ్‌ఈజీ వంటి క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆయా కంపెనీలకు సుమారు రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఓలా, ఉబర్లు షేరింగ్ సర్వీస్‌ల్ని నిలిపేశాయి. హైదరాబాద్‌లో తమకున్న 15వేల లీజు వాహనాలను గోదాములకే పరిమితం చేసినట్లు ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ సలావుద్దీన్ చెప్పారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు లీజు వాహనాల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని.. లాక్డౌన్ పూర్తయ్యాక ఎవరి నంబర్ ప్లేట్ వాహనాలను ఆయా డ్రైవర్లకే అందిస్తామని ఓలా ప్రతినిధి తెలిపారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితేంటి? లాక్డౌన్ ఎత్తేసినా గతంలో మాదిరి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ ఉండవని ఓలా మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల పాటు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యమిస్తాయని, వైరస్ భయంతో కస్టమర్లు గతంలో మాదిరి షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి చోట్లకు ఎక్కువ వెళ్లరని పేర్కొన్నారు. కార్ పూలింగ్, వ్యక్తిగత వాహనాల వాడకానికే ప్రాధాన్యమిస్తారని చెప్పారు. ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. అందుకే ఓలా, ఉబర్ వంటివి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా వాహనాల్ని పూర్తిగా శానిటైజ్ చేస్తే తప్ప కస్టమర్లలో నమ్మకాన్ని తీసుకురాలేమని సల్లావుద్దీన్ తెలిపారు. వేతనాలు, ఉద్యోగుల తగ్గింపు కూడా.. డ్రైవర్లు కాకుండా దేశవ్యాప్తంగా క్యాబ్ పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులుంటారు. క్యాబ్స్ తిరగడం లేదు కనక వారి వేతనాల్లో 20 శాతం వరకు కోత పెట్టినట్లు తెలిసింది. దేశంలో 5 వేల మంది ఉద్యోగులున్న ఓ ప్రధాన క్యాబ్ కంపెనీ తమ ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారం తగ్గుతుందన్న అంచనాతో ముందే అవి ఉద్యోగుల్ని తగ్గిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ క్యాబ్ కంపెనీలో 150 మంది ఉద్యోగులుండగా వారి సంఖ్యను సగానికి తగ్గించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాత్కాలికంగా సేవలను నిలిపివేసే యోచనలో ఉన్నామని.. పరిశ్రమ మళ్లీ పుంజుకున్నాక.. రీబ్రాండ్‌తో మార్కెట్లోకి వస్తామని చెప్పారాయన. -
ఆస్పత్రిలో నియంత్రణ వ్యవస్థే లేదు..
-
రోగుల ప్రాణాలతో ఆస్పత్రుల ఆటలు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు వైద్యం అందించడంలోనే కాదు.. రోగులకు భద్రత ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుకోని ఘటనలు ఎదురైతే రోగులు, వారి బంధువులను కాపాడేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు ఉంటున్నాయి. అసలు అనేక ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థలే లేకుండా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఒక నెలల శిశువు మాడి మసై పోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో శిశువు కూడా చనిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని సమాచారం. ఆస్పత్రుల్లో కొరవడిన అగ్ని ప్రమాద నివారణ వైఫల్యానికి షైన్ పిల్లల ఆస్పత్రి ఘటన నిలువెత్తు సాక్ష్యం. తూతూమంత్రంగా విచారణ.. తాజా దుర్ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా వైద్యాధికారి నుంచి ప్రాథమిక నివేదిక కూడా వచ్చింది. కానీ అందులో ఎటువంటి స్పష్టతా లేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి కారణాలు, వైఫల్యాలపై ఎటువంటి వివరాలూ ఇవ్వలేదు. మంటలార్పేందుకు అవసరమైన 50 వేల లీటర్ల సామర్థ్యం గల అండర్‌గ్రౌండ్ నీటి ట్యాంకు ఉండాల్సి ఉంటే, 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగినదే ఉందని తేల్చారు. ఇక సదరు ఆస్పత్రికి అసలు ఫైర్ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టి ఫికెట్) లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉందని వాదిస్తున్నారు. నియంత్రణ వ్యవస్థే లేదు.. రాష్ట్రంలో 8,807 రిజిస్టర్డ్ ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వాటిలో దాదాపు 2 వేల ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థ లేకుండానే నడుస్తున్నాయి. అనుమతులన్నీ సక్రమంగా ఉన్న తర్వాతే డీఎం హెచ్‌వోలు వాటికి లైసెన్స్‌లు ఇస్తారు. కొందరు జిల్లా వైద్యాధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి కళ్లుమూసుకుని ఎడాపెడా లైసెన్స్‌లు ఇస్తున్నారు. గ్రేటర్లో మరీ ఘోరం.. గ్రేటర్ పరిధిలోని చాలా ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఎన్వోసీ లేకుండానే నడుస్తున్నాయని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డీఎంహెచ్వోలు లంచాలకు అలవాటు పడి ఎడాపెడా అనుమతులు జారీ చేస్తున్నారని పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆస్పత్రుల్లో ఫైర్ ఎన్వోసీ లేకుండా లైసెన్స్‌లు ఇవ్వవద్దని, రెన్యువల్ చేయవద్దని సర్క్యులర్ జారీ చేశారు. అయితే చాలామంది డీఎంహెచ్వోలు ఇదేం పట్టించుకోవడం లేదు. అధ్వానంగా నిర్మాణాలు రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులు ఇరుకైన గదుల్లో ఉంటున్నాయి. అందులోనూ గాలీ వెలుతురు వచ్చే అవకాశం లేని కిటికీలు, అత్యవసర పరిస్థితి తలెత్తితే బయటకు వెళ్లలేని స్థితుల్లో ఆస్పత్రుల నిర్మాణాలుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే సాధారణ పౌరుల మాదిరిగా రోగులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆస్పత్రుల్లో అత్యంత ప్రత్యేకమైన నివారణ చర్యలు తీసుకోవాలి. షైన్ ఆస్పత్రిలో నెలల చిన్నారి ఎటు పరిగెత్తగలదు? ఎంతో కీలకమైన ఆస్పత్రుల్లో కనీస ప్రమాదం నివారణ చర్యలే లేవంటే ఎంత దారుణం? -
ఐఆర్సీటీసీ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మూతపడనుంది. శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు ఐఆర్సీటీసీ సేవలను నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులకు కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 18, 2019 శనివారం, మే 19 ఆదివారం మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు. ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుంది. మరింత సమాచారం కోసం : కస్టమర్ కేర్ నంబర్లు: 0755-6610661, 0755-4090600, 0755-3934141 మెయిల్ ఐడీ: eticket@irctc.co.in సంప్రదింవచ్చని ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ప్రకటించింది. కాగా రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ మే 16, గురువారం ఉదయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ పని చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. మెయింటెనెన్స్ కారణంగా ఇప్పుడు ఈ-టికెటింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. దయచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి అన్న మెసేజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో సైట్ మెయింటెనెన్స్ విషయాన్ని ముందుగా తెలియజేయ లేదంటూ పలువురు యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
అలా అయితే భరణం అవసరం లేదు..
సాక్షి, ముంబై : భార్య సంపాదిస్తుంటే ఆమెకు తన భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని సెషన్స్ కోర్టు వెల్లడించింది. తన భార్యకు మెయింటెనెన్స్ కింద సొమ్ము ఇవ్వాలని మేజిస్ర్టేట్ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై ఎగువ కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. భార్యకు తగినంత ఆదాయ వనరులుంటే ఆమెకు మధ్యంతర మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కంది. భార్యతో విడిపోయిన నలసపోరాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై సెషన్స్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్ చేసుకున్న వ్యక్తి బార్య నెలకు రూ 17,000 నుంచి రూ 18,000 వేతనం పొందుతున్నట్టు ఆమె వేతన సర్టిఫికెట్ వెల్లడిస్తోందని, అయితే ఆమెకు నెలకు రూ 6000 మెయింటెనెన్స్ చెల్లించాలని విఖ్రోలి మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో ఆమె ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోలేదని సెషన్స్ కోర్టు పేర్కొంది. ప్రాధమిక ఆధారాల ప్రకారం ఆమెకు తగిన జీవనోపాధి ఉన్నందున మధ్యంతర నిర్వహణ ఖర్చులకు అర్హురాలు కాదని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు చెల్లించాల్సిన రూ రెండు వేల మెయింటెనెన్స్ ఉత్తర్వులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సెషన్స్ కోర్టు తెలిపింది. కాగా, భార్య సంపాదనాపరురాలైతే ఆమెకు భర్త జీతంలో నుంచి భరణం చెల్లించనవసరం లేదని గతంలోనూ పలు కోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మాజీ భార్య ఆరోపణలపై హీరో ఆవేదన
హాలీవుడ్లో లాంగ్ రిలేషన్షిప్ కొనసాగించిన జంట ‘బ్రాంజెలీనా’(బ్రాడ్ పిట్+ఏంజెలినా జోలీ).. అనూహ్య కారణాలతో విడిపోయిన విషయం విదితమే. ఆ కారణాల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అసలు కారణంపై మాత్రం ఇద్దరిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే పిల్లల పోషణార్థం బ్రాడ్ పిట్ తమకు ఇంత వరకు నయా పైసా చెల్లించలేదని ఏంజెలీనా జోలీ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. బ్రాడ్ పిట్ స్పందించాడు. ‘ఆమె చేసే ఆరోపణల్లో నిజం కాదు. విడాకుల పిటిషన్ సమయంలోనే ఆమె 9 మిలియన్ డాలర్ల దాకా భరణం చెల్లించాను. కేవలం నాపేరును చెడగొట్టేందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు. మీడియా దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఆమె ఇలా చేస్తోంది ’ అని బ్రాడ్ పిట్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన ఇప్పించాడు. ఇదిలా ఉంటే పిట్ ప్రకటనపై ఏంజెలీనా ఇంకా స్పందించలేదు. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ చిత్ర షూటింగ్లో మొదలైన వీళ్ల ప్రేమ.. 9 ఏళ్లపాటు సహజీవనంగానే సాగింది. 2014లో వీళ్లు వివాహం తీసుకోగా.. రెండేళ్ల తర్వాత(2016లో) విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు మొత్తం ఆరుగురు పిల్లలు(దత్తత) ఉండగా.. ప్రస్తుతం వాళ్లంతా తల్లి సంరక్షణలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పిల్లలను జాయింట్ కేరింగ్‌కు అప్పగించాలని ‘పిట్’ ఓ పిటిషన్ కూడా దాఖలు చేయటం గమనార్హం. కొడుకు వయసున్న అమ్మాయితో... -
’చిల్లర’ మనోవర్తి...!
లాయర్ల బుర్ర ఎంత షార్ప్‌గా, నేర్పుగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ... ఓ న్యాయవాది తనదైన శైలిలో మాజీ భార్యపై కక్ష తీర్చుకున్నాడు. విడాకుల తర్వాత నెలకు రూ.25 వేల చొప్పున మనోవర్తి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సదరు లాయిర్ పట్టించుకోవడం లేదంటూ మాజీ భర్తపై ఆ యువతి పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఆ లాయర్ ప్రాక్టీస్ బాగా నడుస్తోందని, అంతే కాకుండా అతడి పేరిట ఆస్తులు కూడా ఉన్నాయంటూ విన్నవించింది. ఈ నేపథ్యంలో గతంలో పేర్కొన్న విధంగా నెలకు రూ. 25 వేల మనోవర్తి చెల్లించాలని ఆ న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే అసలు డ్రామా అంతా చోటుచేసుకుంది. ఈ మనోవర్తిని నాలుగు వందరూపాయల నోట్లతో పాటు మిగతా మొత్తం (రూ.24,600) ఒకటి, రెండు రూపాయి నాణాలతో కూడిన చిల్లర రూపంలో ఓ సంచిలో పెట్టి అక్కడి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్ అందజేశాడు. తనను వేధించేందుకు ఇదొక కొత్త పద్ధతి అని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని ఆ యువతి వాదించింది. తమ కేసు ఎనో్నసార్లు వాయిదా పడిన తర్వాత ఇప్పుడు చిల్లర రూపంలో డబ్బు ఇవ్వడం న్యాయం కాదని పేర్కొంది.. అయితే తన చర్యను న్యాయవాది సమర్థించుకుంటూ డబ్బును కేవలం వంద, ఐదువందలు, రెండువేల నోట్ల కరెన్సా రూపంలోనే ఇవ్వాలని ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి పెట్టి లేదని వాదించాడు. ఈ నాణేలను లెక్కించేందుకు తను ముగ్గురు సహాయకులను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చాడు. నాణేల లెక్కింపునకు సమయం సరిపోక జిల్లా కోర్టు జడ్జీ చివరకు కేసును వాయిదా వేయాల్సి వచ్చింది. -
కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్..
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
గోల్మాల్
ఇది చంద్రన్న విలేజ్ మాల్స్‌లో లభిస్తున్న బెల్లం. కేవలం 450 గ్రాముల నల్లటి బెల్లం ఎంఆర్పీ ఏకంగా రూ.42 ఉంది. దీన్ని ఆఫర్ కింద రూ.37కు అమ్ముతున్నారు. అదే బహిరంగ మార్కెట్లో మొదటి రకం బెల్లం కిలో రూ.48కే లభిస్తోంది. ఒక్క బెల్లమే కాదు.. చింతపండు, ఇతర నిత్యావసర వస్తువులదీ ఇదే పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 54 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. డీలర్లు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్ ఏర్పాటు చేయాలంటే డీలరుకు 200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు ఉండాలి. అది కూడా రోడ్డుకు వంద మీటర్లలోపు ఉండాలి. ఇప్పటివరకు అతికష్టం మీద ఆరు మాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని కర్నూలు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరులో ప్రారంభించారు. ఇవి కూడా వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్‌కు రిలయన్స్ సంస్థ సరుకులు సరఫరా చేస్తోంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులనూ మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాల్స్‌కు సరఫరా అవుతున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరీముఖ్యంగా బెల్లం, చింతపండు, శనగపప్పు, మినపపప్పు, చక్కెర, పామోలిన్ ప్యాకెట్లు తదితర వస్తువుల నాణ్యత, ధరల పట్ల వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. నాణ్యత బాగుంటే ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. అయితే.. సరుకులు నాసిరకంగా ఉండడం, ధర కూడా ఎక్కువ కావడంతో వినియోగదారులు మాల్స్ వైపు వెళ్లడం లేదు. దీంతో డీలర్లు వాటిని మూసి ఉంచుతున్నారు. ఊరించి నష్టాల ఊబిలోకి.. చంద్రన్న విలేజ్ మాల్స్‌ను నిర్వహించే డీలర్లకు సరుకుల అమ్మకాలపై ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మొదట్లో ఊరించారు. షాపును మాల్గా తీర్చిదిద్దేందుకు అయ్యే ఖర్చును వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం మూడు శాతం కమీషన్‌తో సరిపుచ్చుతున్నారు. కర్నూలు ప్రకాశ్‌నగర్‌లోని రేషన్‌షాపు నంబరు 50లో చంద్రన్న విలేజ్ మాల్‌ను మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్ చేసిన వ్యయంలో 50 శాతం మొత్తాన్ని ఎనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని రిలయన్స్ సంస్థ ఒత్తిడి తెస్తోంది. డీలర్‌కు ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మభ్యపెట్టి మూడు శాతంతో సరిపుచ్చుతోంది. పైగా బయటి మార్కెట్ కంటే తక్కువ ధర ఉండి.. డిమాండ్ ఉన్న వస్తువులను సరఫరా చేయడం లేదు. నాణ్యత లేని, అధిక ధరలు ఉన్న సరుకులను మాత్రమే సరఫరా చేస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఇదెలా సాధ్యమో? చంద్రన్న విలేజ్‌మాల్‌కు సరఫరా చేసే 25 గ్రాముల సబ్బు ఎంఆర్పీ రూ.5గా నిర్ణయించారు. దీన్ని ఆఫర్ కింద రూ.4.70కి విక్రయించాల్సి ఉంది. డీలరుకు వేస్తున్న ధర రూ.5.40. పైగా నెలకు రూ.2 లక్షల విలువైన వస్తువులను సరఫరా చేస్తామని చెప్పిన రిలయన్స్ సంస్థ అడ్డగోలుగా ధరలు పెంచి తూతూ మంత్రంగా సరుకులు ఇస్తోంది. నిర్వహణ భారంగా మారింది షాపు డిజైన్ చేసిన ఖర్చు మొత్తం భరిస్తామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఖర్చులో 50శాతం 8శాతం వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. 8శాతం కమీషన్ ఇస్తామని చెప్పి 3శాతం మాత్రమే ఇస్తున్నారు. మార్చిలో రూ.1,193, ఏప్రిల్‌లో రూ.3,002 మాత్రమే కమీషన్ వచ్చింది. కరెంటు బిల్లు రూ.800 దాకా వస్తోంది. షాపును శుభ్రం చేయడానికి రూ.1,200 ఇవ్వాల్సి వస్తోంది. కమీషన్ ఏ మూలకూ చాలడం లేదు. పైగా డిమాండ్ ఉన్న వస్తువులు సరఫరా చేయరు. డిమాండ్ లేని సరుకులు మాత్రం అడగకపోయినా ఇస్తున్నారు. ఇలాగైతే ఈ మాల్‌ను నిర్వహించడం కష్టం. – కరుణాకర్గుప్త, 50వ షాపు డీలర్, కర్నూలు -
రాజధానిలో నయా ట్రాఫిక్
భువనేశ్వర్ : నగరంలో అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణను కేంద్రీకృతం చేయడం కొత్త వ్యవస్థ ధ్యేయం. ఈ వ్యవస్థలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయి స్మార్టసిటీల్లో తొలిసారిగా భువనేశ్వర్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కావడం విశేషం. ట్రాఫిక్ నియంత్రణతో రహదారి దుర్ఘటనల నివారణకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. భువనేశ్వర్ అభివృద్ధి సంస్థ (బీడీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆ సంస్థ ఇటీవల ట్విటర్లో ప్రాథమిక సమాచారం జారీ చేసింది. నగరంలో మారు మూల ప్రాంతాల్లో ట్రాఫిక్ రవాణాపట్ల ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ట్రాఫిక్ వ్యవస్థతో పాటు అత్యవసర సేవల్ని కూడా ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తారు. పలు ప్రపంచ దేశాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతోంది. కమాండ్ కేంద్రంలో భారీ తెరతో సీసీటీవీ కెమెరాతో అనుసంధానపరిచిన వ్యవస్థ పనిచేస్తుంది. నగరంలోని మారుమూల ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలిక ఈ తెరపై ప్రదర్శితమవుతుంది. నగరవ్యాప్తంగా జన సందోహిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానపరుస్తారు. స్మార్ట్‌సిటీగా గుర్తింపు సాధించిన నగరంలో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా నిత్యం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ప్రతిష్టంభనతో తరచూ రహదారి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కొనసాగుతున్న సౌర శక్తి ట్రాఫిక్ వ్యవస్థను విస్తరించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భువనేశ్వర్ నగర అభివృద్ధి సంస్థ పేర్కొంది. -
తల్లిదండ్రుల జోలికెళ్తే...
సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007కి కీలక సవరణలు చేసింది. తల్లిదండ్రుల(60 ఏళ్లపైబడిన వారిని)ను నిర్లక్ష్యం చేసినా లేక వేధించినా ఇది వరకు మూడు నెలల శిక్ష విధించేవారు. కానీ, తాజా ముసాయిదా చట్టం ప్రకారం దానిని ఆరు నెలలకు మార్చారు. అంతేకాదు తల్లిదండ్రులకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నెల రోజుల శిక్ష విధించేలా సవరణలు చేశారు. ఈ మేరకు ట్రిబ్యూనల్స్‌కు అధికారాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది ఓ సర్వేలో వెల్లవైన వివరాల ప్రకారం.. 44 శాతం మంది వృద్ధులు తమ పిల్లలు తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. దుర్భషలాడటం, చెయ్యి చేసుకోవటం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని చాలా మంది తెలిపారు. దీంతో ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు దత్తత తీసుకున్న వారిని, అలుళ్లు, కోడళ్లు, మనవళ్లు-మునిమనవరాళ్లను కూడా వారసుల జాబితా పరిధిలోకి తీసుకురానుంది.ఈ చట్టం అమలులోకి వస్తే గనుక నిస్సహయులైన వృద్ధులకు వారి వారి వారసులు రూ.10 వేల నెలనెలా భరణంగా చెల్లించటం తప్పనిసరి అవుతుంది. -
బీఓజే వడ్డీరేట్లు యధాతథం
టోక్యో: బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీలో తటస్థ వైఖరినే అవలంబించింది. శుక్రవారం చేపట్టిలో పాలసీ రివ్యూలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ద్రవ్యోల్బణాన్ని పెంచే లక్ష్యంతో, జపాన్ బ్యాంకు శుక్రవారం విధాన మార్పులను కొనసాగించలేదు. ద్రవ్యోల్బణాన్ని ఎత్తివేసే లక్ష్యంతో ద్రవ్య ఉద్దీపన కొనసాగించింది. చాలామంది ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే జపనీస్ ప్రభుత్వ బాండ్ దిగుబడి లక్ష్యంతో 10 సం.రాల బాండ్ రేటు జీరోశాతం వద్ద, స్వల్పకాలిక బాండ్లను 0.1శాతంగాను నిర్ణయించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆరునెలల్లో మూడు సార్లు వడ్డీరేట్లు పెంచిన అనంతరం జపాన్ సెంట్రల్ బ్యాంక్ అల్ట్రా-ఈజీ వైఖరిని తీసుకుంది. -
మెయింటెనెన్స్ పోస్టుల మోసం
► అంగట్లో సరుకులు లాగా అమ్మకాల జోరు ► ఒక్కో పోస్టుకు రూ.3లక్షలు పైగానే.. ► ఒక్క పోస్టు కూడా భర్తీ కాదంటున్న సీఈ ► ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులు జారీ ► నమ్మి మోసపోవద్దంటున్న ఆర్టీపీపీ సీఈ శ్రీరాములు ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో మెయింటెనెన్స్ పోస్టుల అమ్మకాల మాయాజాలం తాజాగా వేడిపుట్టిస్తోంది. చెట్టును చూపించి కాయలు అమ్మినట్లుగా అసలు ఇంతవరకు నోటిఫికేషన్ పడలేదు.. అసలు ఆ ఊసేలేదు.. కానీ కొందరు స్వార్థపరులు అత్యాశతో ఈ అమ్మకాల వ్యవహారానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే..త్వరలో ఆర్టీపీపీలో కాంట్రాక్టు పద్ధతిన మెయింటెనెన్స్ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రచారం రావడంతో వాటి కోసం రాజకీయ నాయకులు, కొన్ని కార్మిక సంఘాల నాయకులు కౌంటర్లను తెరిచారు. డబ్బులిస్తే పోస్టును వేయిస్తామంటూ లక్షలు వసూలు చేయడం ప్రారంభించారు. వారి హడావుడితో ఒక్కొక్క పోస్టు రూ.3లక్షలు పైగానే పలుకుతోంది. కొందరు అమాయకులు ఇప్పటికే వారి మాయమాటలకు బలైపోయారు. ఇదిగోఅదిగో అంటు డబ్బులు ఇచ్చిన వారికి దళారులు నానా కథలు చెబుతున్నారు. అధికారపార్టీ నేతలే దళారులు! గతంలో ఆర్టీపీపీలో మెయింటెనెన్స్ పోస్టులను భర్తీ చేశారు. అయితే అప్పుడు నానారభస జరిగి పోస్టుల భర్తీని నిలిపివేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారి టీడీపీ పాలన వచ్చింది. డబ్బులిస్తే పోస్టులు వేయిస్తామని కొందరు అధికారపార్టీ నాయకులు దళారుల అవతారం ఎత్తారు. వారితో పాటు ఆర్టీపీపీలో పనిచేసేవారు కూడా అమ్మకాల్లో ఉన్నారు. వీరి చేతిలో చాలామంది అమాయకులు మోసపోయారు. ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న వారే అనగా కార్మిక సంఘాలు నడుపుతున్న వారిలో కొందరు నేతలు కూడా పోస్టులు ఇప్పిస్తామని డబ్బులను వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఇటీవల పోస్టు ఇస్తామని నమ్మించి ఆర్టీపీపీలోని ఓ ఉద్యోగి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ బాధితుడు మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఆదేశాలు రాలేదు అసలు పోస్టులు భర్తీచేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాక ఏన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఏపీ జెన్కో తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టీపీపీలో మెయింటెనెన్స్ పోస్టులు భర్తీ జరగదని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెయింటెనెన్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ విషయం తెలియని అమాయకుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చి మోసపోవద్దు. ఆర్టీపీపీలో పోస్టుల భర్తీలేదని, ఎవరు కూడా దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. మెయింటైన్స్ పోస్టుల భర్తీ ఏపీజెన్కో, ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతాయి. ఆ పోస్టుల భర్తీలో కూడా భూనిర్వాసితులకు ప్రథమ ప్రా«ధ్యానత ఉంటుంది. మెయింటైన్స్ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేదని అసలు భర్తీ జరగదు. దళారులను నమ్మి మోసపోయి డబ్బులు ఇవ్వొద్దు. –శ్రీరాములు, ఆర్టీపీపీ సీఈ, ఎర్రగుంట్ల -
వేధించే సంతానాన్ని వెళ్లగొట్టవచ్చు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: తమను వేధించే సంతానాన్ని ఆ తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించివేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వారు నివసిస్తున్న ఇల్లు సొంతమా, అద్దెదా అనే విషయం పట్టించుకోనక్కరలేదంది. ఇంటిపై తల్లిదండ్రులకు న్యాయపర హక్కులు ఉన్నంత వరకూ వారిని వేధించే వయోజనులైన పిల్లలను ఆ ఇంటి నుంచి పంపొచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల ఇంటి నుంచి తమను వెళ్లగొట్టాలని 2015లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాగుబోతు అయిన మాజీ పోలీసు, అతని సోదరుడు వేసిన పిటిషన్ పై ఈ తీర్పిచ్చింది. తాము మెయింటెనెన్స్ కోసం డబ్బు కోరకపోయినా.. కేవలం శారీరకంగా వేధించామనే ఆరోపణలపైనే ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిందని ఆ సోదరులు కోర్టులో వాదించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007ను ట్రిబ్యునల్ అతిక్రమించిందని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. వృద్ధులు తమ ఇంటిలో ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించడానికి.. శారీరకంగా, మానసికంగా వేధించే సంతానాన్ని ఇంటినుంచి వెళ్లగొట్టే ఆదేశాలు ట్రిబ్యునల్ ఇవ్వవచ్చని పేర్కొంది. -
ఎత్తిపోతల ఖర్చు తగ్గిద్దాం
నీటిపారుదల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఇందుకు ఇకపై ‘ఎనర్జీ ఆడిటింగ్’ నిర్వహించాలని, ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లకు కచ్చితంగా కెపాసిటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. పంపులు నడవని సమయంలో కూడా డిస్కమ్‌లు భారీగా బిల్లులు వడ్డిస్తున్నారుు. దీంతో అలాంటి ఎత్తిపోతల పథకాలకు మినహారుుంపు అంశంపై డిస్కమ్‌లతో ఓ అవగాహనకు రావాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దేవాదుల, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, ఎల్లంపల్లి, అలీసాగర్ గుత్ప వంటి ఎత్తిపోతల పథకాలకు 1,378 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటోంది. యూనిట్ ఖర్చు రూ.5 మేర ఉన్నా విద్యుత్ వినియోగానికి గానూ రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న 287 ఎత్తిపోతల పథకాలకు ఏటా 40 నుంచి 50 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. రూ.50 కోట్లు చెల్లిస్తున్నారు. నీళ్లు లేని సందర్భాల్లో పంపులు నడవకున్నా డిస్కమ్‌లు లోడ్ చార్జీల పేరిట డిస్కంలు భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారుు. నిజానికి ఎత్తిపోతల పథకాలు కేవలం 3 నుంచి 4 నెలలు పాటే పనిచేస్తారుు. మిగతా సమయంలో అవి పనిచేయకున్నా కనీస చార్జీల పేరిట డిస్కమ్‌లు బిల్లు వసూలు చేస్తున్నారుు. ఈ చార్జీలను తొలగించాలని ట్రాన్సకోను కోరగా.. అది తమ పరిధిలో లేదని ఈఆర్సీ తేల్చాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈఆర్సీ సమావేశం ఉన్నందున అంతకుముందే ఈఆర్సీకి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. బోర్డులో చర్చ: సోమవారం ఐడీసీ చైర్మన్ ఆద శంకర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో ఎత్తిపోతల పథకాల్లో నిర్వహణ ఖర్చును తగ్గించుకునే అంశంపై చర్చ జరిగింది. -
అధ్యయన కేంద్రాల అక్రమార్జన
- ‘మెయింటెనెన్స్’ పేరిట వసూళ్ల పర్వం - ఒక్కో విద్యార్థిపై రూ.3వేల నుంచి రూ.5వేలు అదనపు భారం - రూ.15వేలు కడితే పరీక్ష రాయాల్సిన పని కూడా లేదట! - మూడు పువ్వులు ఆరు కాయలుగా విద్యా వ్యాపారం ........................................................... కర్నూలు జిల్లాలోని ఒక అధ్యయన కేంద్రంలో ప్రణతి అనే విద్యార్థిని దూరవిద్య ద్వారా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కేంద్రం నిర్వాహకులు ఆమెకు ఫోన్ చేసి డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు ఉంటాయని, రూ.3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజు మొత్తం చెల్లించేశాం కదా, ఇదెందుకు అని అడిగితే పరీక్షల నిర్వహణకు సవాలక్ష ఖర్చులు ఉంటాయని, ఎందరినో ప్రభావితం చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అడిగిన డబ్బులు చెల్లించకపోతే హాల్‌టికెట్ ఇవ్వబోమన్నారు. ఒక్క ప్రణతి విషయంలోనే కాదు... సింహభాగం దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు అందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. ........................................................... ఎస్కేయూ : ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని ఎస్కేయూ ఉన్నతాధికారులు ఆయా అధ్యయన కేంద్రాలకు ముందస్తుగా అందించారు. ఈ నేపథ్యంలో వాటి నిర్వాహకులు మెయింటెనెన్స్ పేరిట వసూళ్లు మొదలెట్టేశారు. కోర్సు ఫీజు కట్టిన విద్యార్థి అదనంగా రూ.3 వేల నుంచి రూ.5వేలు కడితేనే కానీ హాల్‌టికెట్ ఇచ్చేది లేదంటున్నారు. హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచకుండా నేరుగా అధ్యయన కేంద్రాలకు పంపుతుండటం వల్ల వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మరీ విడ్డూరం ఏమిటంటే.. ఒక్కో పేపరుకు రూ.3 వేలు చొప్పున 5 పేపర్లకు రూ.15 వేలు కడితే విద్యార్థులు పరీక్షలు కూడా రాయాల్సిన పని లేదట. నిర్వాహకులే వారి స్థానంలో మరొకరిని పంపి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు ఇలా ఏటా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 212 అధ్యయన కేంద్రాలలో 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి వచ్చే నికర ఆదాయం కన్నా అధ్యయన కేంద్రాల అక్రమార్జన కనీసం అంటే రెట్టింపు ఉంటుందనేది పరిశీలకుల అంచనా. ఫీజులో 20 శాతం ఇస్తున్నా... ప్రతి డిగ్రీ అడ్మిషన్‌కు విద్యార్థి వర్సిటీకి చెల్లిస్తున్న కోర్సు ఫీజులో 20 శాతం అధికారికంగా అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. ఇవి కాక పరీక్ష నిర్వహణ కేంద్రానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులూ వర్సిటీ చెల్లిస్తుంది. అయినప్పటికీ వారు విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు. వీటిపై ఎస్కేయూ దూరవిద్య విభాగం పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలూ లేకపోలేదు. గతేడాది కొన్ని పరీక్ష కేంద్రాలకు మాత్రమే పరిశీలకులను నియమించారు. వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అధ్యయన కేంద్రాల అక్రమార్జన యథేచ్ఛగా సాగింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు దూరవిద్య విభాగం అధికారులు తగిన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
పసిడి మెరుపులు..ట్రెండ్ ఇక పై పైకే!
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది. ప్రపంచవ్యాపితంగా బంగారు 0.14 శాతం, వెండి ధర 0.44 శాతం పెరుగుదలను నమోదుచేసింది. గత నాలుగు సెషన్లనో రూ .400 లాభపడింది.గత వారమంతా లాభాల్లో కొనసాగిన పసిడి ధరలు క్రమంగా నిలదొక్కుకుంటున్నాయి. గ్లోబల్ ట్రెండ్ , వివాహ సీజన్ లో నెలకొన్నడిమాండ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు వరసగా ఐదవ సెషన్ లోనూ లాభపడ్డాయి. శనివారం పది గ్రాముల బంగారం రూ 100 రూ 31.150 వద్ద పాజిటివ్ ధోరణితో ఉంది. దేశరాజధానిలో 99.9 స్వచ్ఛతబంగారం 10 గ్రాములు రూ 31.150 గా ఉంది. వెండి కూడా రూ .350 పెరిగి కిలో రూ. 44,000 స్థాయి వద్ద స్థిరంగా ఉంది. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో అంతర్జాతీయ మార్కెట్లో గత వారం 1266 డాలర్ల దగ్గర మొదలైన ఔన్స్ పసిడి ధర వారాంతానికల్లా 1300 డాలర్లను అధిగమించింది. నాణాల తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ కారణంగా మళ్లీ వెండి ధరలు పుంజుకోనున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. దేశీయంగా కూడా నిరంతర కొనుగోళ్లతో సెంటిమెంట్ బలంగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ఆధిక్యంలోకి రావడంతో పసిడికి డిమాండ్ ఊపందుకుందని విశ్లేషిస్తున్నారు. -
దీపా నిర్ణయంతో షాక్ తిన్నత్రిపుర సర్కారు
-
ఆ బీఎండబ్ల్యూ కానుక.. తిరిగి ఇచ్చేస్తుందట!
రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన కానుకను మెయింటెన్ చేయలేక తిరిగి ఇచ్చేద్దామనుకుంటోంది దీపా కర్మాకర్. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్ బహూకరించిన సంగతి తెలిసిందే. ఈ కారును భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో దానిని తిరిగి చాముండేశ్వరినాథ్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది. అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అంతేకాకుండా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్ కప్ కోసం దీప సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మెయింటెన్స్ భరించే స్థోమత ఆమె వద్ద లేదని, అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని ఆమె ప్రాక్టీస్ మీద దృష్టిపెట్టడంతో దీనిని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని, అందుకే తిరిగి ఇచ్చేద్దామని భావిస్తున్నదని దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. కారు తిరిగి ఇచ్చేద్దామన్న నిర్ణయం నిజానికి దీపది కాదని, కానీ దీప కుటుంబం, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. -
పెళ్లి కాని పెళ్లి...
అన్‌మ్యారీడ్ మ్యారేజ్ పెళ్లి కాని పెళ్లిలో సుఖాలెన్ని? కష్టాలెన్ని? తంతుకి తాళం వెయ్యక్కర్లేదు. తాళి అడ్డం రాదు. మెట్టెలు ఇబ్బంది పెట్టవు. అదేంటో... ఒక రకమైన ఫ్రీడమ్! పెళ్లికాకపోయినా పెళ్లయిన ఫీలింగ్! పెళ్లయినా పెళ్లికాని థ్రిల్లింగ్. కానీ మొగుడు కాని ఆ మొగుడు తోక లేపితే? గుర్రుమంటే? కరుస్తానంటే? క్యా కర్నా? ఏం చేయాలి? డోన్ట్ వర్రీ. ‘సుప్రీం’ మొట్టికాయలు వెయ్యొచ్చు. సహజీవనం కూడా పెళ్లిలాంటి పెళ్లే. ‘ఇప్పుడేడిస్తే ఏమొస్తదే? పాతభావాలు, చాదస్తపు పద్ధతులంటూ మమ్మల్ని తన్ని వెళ్లిపోయావ్? అరే.. మీనాన్న ఎంత బతిమాలాడు.. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని మా ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నాం తల్లీ.. కాని ఇలా వద్దు.. పెళ్లితో ఒకింటి వారవండి అని! విన్నావా? మీ అన్నయ్య ఎంత నచ్చజెప్పాడు.. అర్భాటంగా నచ్చకపోతే గుడిలో అయినా పెళ్లి చేస్తాం.. పోనీ రిజిష్టర్ మ్యారేజ్ అయినా అని! చస్ పొండి.. గుడి.. దండలు మార్చుకోవడం ఇదంతా పెళ్లే కదా.. అసలు మాకు ఆ తంతే వద్దు పొమ్మంటుంటే...’ ‘అవును అన్నాను.. నా నెత్తిమీద జేజమ్మ కూర్చుందప్పుడు.. తప్పయింది.. క్షమించండి.. బుద్ధి వచ్చింది.. మీ కాళ్లు పట్టుకోనా’... మేనత్త మాటలను మధ్యలోనే తుంచేస్తూ ఆవేశంగా తన ఆవేదనను వెళ్లగక్కింది వారిజ. వారిజ వేదన అర్థమైంది ఆమె మేనత్తకు. రెండు మోకాళ్ల మధ్య తల దాచుకొని పొట్టలో దాగిన దుఃఖాన్ని వెళ్లగక్కుతున్న వారిజ పక్కన కూర్చుంది మేనత్త. ఆ పిల్ల తలమీద చేయివేసి చిన్నగా నిమురుతూ... ‘వారిజా.. పుట్టెడు కష్టంతో నా గడపలోకి అడుగుపెట్టావనే చిన్నచూపుతో అనలేదే. అప్పుడు మా మాట వినుంటే మా బంగారానికి ఈ రోజు ఈ అవమానం జరిగేది కాదు కదా అనే బాధతో అన్నాను’ అంది. అంతే ఆ సాంత్వనకు అత్తను అల్లుకుపోయింది వారిజ. ‘ఊరుకో.. ఏడిస్తే జరిగిన అవమానం సన్మానంగా మారదు.. ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం.. మీ అన్నయ్యకు చెప్పమంటావా?’ అనునయంగా కోడలి వీపును తడుముతూ అన్నది వారిజ మేనత్త. ‘లేదత్తా.. మీ మాటలను ఖాతరు చేయకుండా చేసిన తప్పును నేనే కరెక్ట్ చేసుకుంటా.. అన్నయ్యకేం చెప్పకు. ఒక్క హెల్ప్ చేయి చాలు’ అని. ‘ఏంటే..’ అంతే అనునయం ఆమె మేనత్త మాటల్లో.‘నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేవరకు నాకు, నా కూతురికి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వు చాలు అత్తా’ అంటూ రెండు చేతులు జోడించింది వారిజ. ఆమె చేతులను పట్టుకుంటూ ‘అవేం మాటలే? నేను మీ అమ్మలాంటిదాన్ని కానా? షెల్టర్ ఇవ్వమని అడగడమేంటి? నీ హక్కు. నీ ఇష్టమొచ్చినన్నాళ్లు ఉండొచ్చు.. అసలు ఎప్పుడూ ఉండిపో ఎవరొద్దాన్నారే!’ అంటే కళ్లనీళ్లతో అక్కున చేర్చుకుంది వారిజను. అసలేం జరిగింది? అనాథ పిల్లలు, వృద్ధుల కోసం నడుపుతున్న ఓ ఎన్జీవోలో పనిచేస్తోంది వారిజ. అదే ఎన్జీవోలో పనిచేసే సురేష్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఏంటి అనే ప్రస్తావన వచ్చింది వాళ్ల మధ్య ఒకరోజు.. ‘వారిజా.. నాకు ఈ పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం లేదు. రోజూ గొడవ పడుతూ, ఒకరి మీద ఒకరు కారాలు మీరియాలు నూరుకుంటూ వందేళ్ల శత్రువులుగా ఒకే రూఫ్ కింద ఉండడం ఎంత నరకం చెప్పు? అసలు అదేం లైఫ్?’ అన్నాడు. ‘నిజమే.. కాని పెళ్లి ఓ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్లా మారిపోయింది. ఇప్పుడు నువ్వు, నేను వ్యతిరేకిస్తే మారిపోదు కదా’ అంది వారిజ. ‘వ్యతిరేకించొద్దు. అలాగని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదుకదా’ అన్నాడు. ‘అంటే? అర్థంకానట్టు అడిగింది. వారిజకు దగ్గరగా వస్తూ ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ‘మనమిద్దరం ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఇరుక్కోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో కలకాలం కలిసి ఉందాం’ అన్నాడు. ఆ కాన్సెప్ట్ వారిజకూ నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పింది. సురేష్ అంటే వారిజకున్న ప్రేమపట్ల ఆమె ఇంట్లో వాళ్లెవరికీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి సురేష్ చెప్పిన ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ థాట్ పట్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘అసలు ఈ పిల్ల ఆ పిల్లాడి మాయలో పడి.. తన భవిష్యత్ గురించి పట్టించుకోవట్లేదు. ఏ భరోసాలేని ఆ బంధాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తోంది? ఇరువైపు పెద్దలు, మంత్రాలు, మంగళ సూత్రాధారణ, వందలమంది అతిథుల సమక్షంలో జరిగే పెళ్లంటేనే విలువ లేనివాడు కేవలం నోటి మాటే నమ్మకంగా సాగే కాపురాన్ని మాత్రం ఎలా గౌరవిస్తాడు అనే ఆలోచనలేదేంటి నాన్నా చెల్లికి’ అంటూ వారిజ అన్నయ్య వాపోయాడు. వారిజ తల్లి తల్లడిల్లింది. తండ్రి అయితే చెప్పి చెప్పి విసిగి పోయాడు. మేనత్తా ససేమీరా అంది. ‘మీరంతా ఇంకా పాత చింతకాయ పులుపునే ఆస్వాదిస్తున్నారు’ అంటూ కొత్త దారి వైపు పరుగుతీసింది వారిజ సురేష్ చేయి పట్టుకొని! పాప పుట్టేదాకా... కొత్తలో చాలా బాగా ఉంది. అరమరికల్లేకుండా ఉంటూనే ఎవరి స్పేస్ వాళ్లు తీసుకుంటూ కాపురం చేయడం... భలే అనిపించింది వారిజకు. వాళ్ల నాన్న దగ్గర అమ్మకు దక్కని గౌరవం సురేష్ దగ్గర తనకు దక్కుతున్న ఫీలింగ్.. గర్వంగా ఉండింది. కాలం గడుస్తోంది. పాప పుట్టింది. మెల్లగా అభద్రత మొదలవసాగింది వారిజకు. కారణం.. సురేష్‌లో వచ్చిన మార్పే. ఇంటిని, ఇల్లాలిని, పాపనూ పట్టించుకోవడం మానేశాడు. ఎన్జీవోలో ఉద్యోగం వదిలి ఏదో కార్పోరెట్ కంపెనీలో చేరాడు. జీతం బాగానే వస్తోందని తెలిసింది వారిజకు.. కాని ఎంతో భర్త చెప్పలేదు. ఆయన జీవన శైలీ మారింది. ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలంటూ తప్పతాగి తెల్లవారు జామున ఎప్పుడో ఇంటికి చేరేవాడు. కారు కొన్నాడు. ఈఎమ్ఐలు.. ఇతర లోన్లూ ఎక్కువయ్యాయి. దేనికీ లెక్క చెప్పట్లేదు. ఇంటి బాధ్యత అంతా వారిజ నెత్తిన పడింది. ఓపిక పట్టినన్నాళ్లూ పట్టి ఒకరోజు నిలదీసింది. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’ అన్నాడు సురేష్. ఇంకా గట్టిగా మాట్లాడితే.. ‘అసలు నువ్వెవరు? నేనెందుకు నీ ఇంటి బాధ్యత మోయాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘నేను నీ భార్యను’ అంది ఆవేశంగా వారిజ. ‘అని ఎక్కడుంది? సాక్ష్యమేంటి?’ అన్నాడు నింపాదిగా. ఖంగు తిన్నది. ‘అవును.. మన పెళ్లయినట్టు.. నువ్వు నా భార్య అన్నట్టు, ఇది నా బిడ్డే అన్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురా.. ఒప్పుకుంటా.. అంతేకాని ఇట్లా పెళ్లాంలా పెత్తనం చేయకు.. నా జోలికి రాకు’ అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చంటిదాన్ని దగ్గర తీసుకొని ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయింది వారిజ. సురేష్ స్నేహితుడి ద్వారా అతని అడ్రస్ కనుక్కొని వెళ్లింది. అక్కడా ఇదే అవమానం. తనకు వచ్చే జీతంతో ఇంటి అద్దె, పాప పెంపకం.. ఖర్చులు.. భరించలేకపోయింది. ఎటూ దిక్కుతోచని స్థితిలో మేనత్త ఇంటికి చేరింది. న్యాయం కోసం... మేనత్తను తీసుకొని అడ్వకేట్‌ను కలిసింది వారిజ. ఆమె కథంతా విన్న అడ్వకేట్ ముందుగా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేయించింది. దాని ద్వారా వారిజ రెసిడెన్షియల్ ఆర్డర్స్, మెయిన్టెనెన్స్ సాధించుకుంది. కోర్టులో కూడా సురేష్ వారిజ తన భార్యకాదని, పాప తన లెజిటిమేట్ చైల్డ్ కాదని సిగ్గు లేకుండా వాదించాడు. అయితే వారిజ గతే ఏడేళ్లుగా భార్యభర్తలుగా ఒకే రూఫ్ కింద కలిసి జీవిస్తున్నామని, ఆ బిడ్డ తమ బిడ్డే అని సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచడంతో తోక ముడిచాడు సురేష్. - సరస్వతి రమ సహజీవనంలో భార్యకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహిత మహిళకు ఎలాంటి హక్కులుంటాయో సహజీవన బంధంలోని మహిళకూ అలాంటి హక్కులే ఉంటాయి. మోసపోయినా, హింసకు గురైనా కోర్టును ఆశ్రయించవచ్చు. పోషణ భృతి పొందవచ్చు. వారి పిల్లలకు ఆస్తి హక్కులూ సంక్రమిస్తాయి. సహజీవనంలో పురుషుడు మధ్యలో వదిలేసి వెళితే మహిళా భాగస్వామికి చట్టబద్ధంగా ప్రశ్నించే, నిలదీసే అధికారం ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించినా అది పెళ్లే అవుతుంది. కొందరు సహజీవన బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు సహజీవనం అని దేన్నంటారు? ఇద్దరూ మేజర్లై ఉండాలి, అవివాహితులై ఉండాలి, విడాకులు పొందిన వారైనా, వితంతువులైనా అయి ఉండాలి, కొన్ని యేళ్లు నిరంతరాయంగా కలిసి జీవించాలి. అంతేకాని భార్య ఉండగా మరో స్త్రీతో, భర్త ఉండగా మరో పురుషుడుతో సంబంధం ఏర్పర్చుకుంటే అది సహజీవనం కాదు. మొన్నటి వరకు వివాహిత మహిళలకే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎమ్‌టీపీ) యాక్ట్ ప్రకారం అబార్షన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవలకాలంలో సహజీవనంలోని మహిళలకూ ఆ వెసులుబాటు కల్పించేలా చట్టాన్ని సవరించారు. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
అపోలో చేతిలో ఇక అర్బన్ హెల్త్సెంటర్లు
– ఈ–యూపీహెచ్‌సీలుగా రూపాంతరం – వచ్చే నెల నుంచే నిర్వహణ బాధ్యతలు మదనపల్లె సిటీ : చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలను దక్కించుకున్న అపోలో కార్పొరేట్ సంస్థ ఆధీనంలోకి తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా వెళుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి అపోలో సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు నడవనున్నాయి. ఐటీ ఆధారిత సేవలతో ఈ–యూపీహెచ్‌సీలు (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు )గా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రి అపోలోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్జీవోలతో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో తిరుపతిలో 5, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 2, మదనపల్లెలో ఒక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో ఉంటున్న ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు 2000వ సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ కోసం ఆరోగ్యశాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్లలో అపోలో సంస్థకు దక్కింది. దీంతో ఆ సంస్థ వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, డేటా ఆపరేటర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లు అపోలో అప్పగించి తద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. అయితే కార్పొరేట్ సంస్థ మురికివాడల్లో ప్రజలకు తగిన వైద్యం అందుతుందా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
రేపు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్యార్థులకు త్వరలో జరిగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్)కు సంబంధించి నిర్వహణపై చర్చిం చేందుకు స్థానిక కొత్తూరు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. రేపు ఆంగ్ల బోధనోపాధ్యాయులకు శిక్షణ జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న ఇంగ్లిషు టీచర్లకు బుక్కపట్నం డైట్ కళాశాలలో బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 18 వరకు ధర్మవరం, పెనుకొండ డివిజన్లకు, 20 నుంచి 24 వరకు అ నంతపురం, గుత్తి డివజన్ల పరిధిలోని టీచర్లు హాజరుకావాలని సూ చించారు. గతంలో ఆంగ్లపరీక్ష రాసిన ప్రతి ఉపాధ్యాయుడు త ప్ప కుండా శిక్షణకు హాజరుకావాలని, ఈ పరీక్షకు గైర్హాజరైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు తప్పక హా జరుకావాలని తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల జాబితా పంపండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు జాబితా, మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య వివరాలు ఎంఈఓలకు అందజేయాలని హెచ్ఎంలను డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో ఆదేశించారు. ఎంఈఓలు, మండలస్థాయిలో నిర్దేశించిన కమిటీ సభ్యులు బుధవారం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించే సమావేశానికి వివరాలతో హాజరుకావాలని సూచించారు. మీడియం, పాఠశాలల వారీగా మండలంలో ని 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టు వారీగా మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన పాఠశాల, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. -
ఆ మాజీ సీఎం భార్యకు నెలకు రూ.15 లక్షలివ్వాలట
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా తాను తన బిడ్డల జీవనం కోసం నెలకు రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్లెక్కింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేసిన తర్వాత తాను పిల్లలతో సహా రోడ్డున పడ్డానని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయిందని, తమ పోషణార్ధం నెలకు రూ.15లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె పిటిషన్లో డిమాండ్ చేశారు. అక్బర్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నెల రోజులకే ఆమె ఈ పిటిషన్ వేయడం గమనార్హం. నిర్వహణా ఖర్చుల కింద తనకు తన ఇద్దరు పిల్లలకు నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని, కొత్తగా ఓ నివాసంలో ఉండేందుకు నెలకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాయల్ తల్లిదండ్రుల దయ వల్ల ఆమె స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నారని, వారి జీవితం చాలా దుర్భరంగా ఉందని పిటిషన్లో చెప్పారు. గతంలో తమకు జెడ్ జెడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ ఉండేదని, ఇప్పుడది కాస్త పోవడంతో భద్రతకు కూడా భంగం ఏర్పడిందని చెప్పారు. అయితే, దీనిపై బదులు ఇవ్వాల్సిందిగా నగరంలోని ఫ్యామిలీ కోర్టు ఒమర్ కు నోటీసులు పంపించింది. కేసు విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. -
నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా సైయంట్
♦ 2020 నాటికి 3 రెట్ల ఆదాయం.. ♦ 18,000లకు ఉద్యోగుల సంఖ్య ♦ సైయంట్ ఫౌండర్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా నిలవాలని సైయంట్ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో డిజైన్, బిల్డ్, మెయింటెయిన్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కంపెనీ ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 1991లో జియోస్పటికల్ సర్వీసులతో ప్రారంభమై విభిన్న విభాగాలకు విస్తరించామన్నారు. 21 దేశాలు, 38 కేంద్రాలతో మొత్తం 13,200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్లకు ఎగసిందన్నారు. 1997లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కు 300 రెట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్లలో బిలియన్ డాలర్.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ రూ.3,100 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి ఆదాయం మూడు రెట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు సైయంట్ ఎండీ కృష్ణ బోధనపు తెలిపారు. రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ రంగాలు రానున్న రోజుల్లో మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. తాము సేవలందిస్తున్న రంగాల్లోని స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మొత్తం 18,000లు దాటొచ్చని అంచనాగా చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఏడాది నియామకాలు 1,000 దాకా ఉండొచ్చని అన్నారు. -
వైఎస్సార్ వర్ధంతిని వాడవాడలా నిర్వహించాలి
హుజూర్నగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2న వాడవాడలా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానికంగా జరిగిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిం చి ప్రజల హృదయాల్లో దైవంలా నిలిచారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణాలు, ఆరోగ్యశ్రీ, 104 వంటి పథకాల ద్వారా అనేక మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ఆయన మరణాన్ని నేటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్తయ్య, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి సుతారి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు జడ రామకృష్ణయాదవ్, మండల మహిళ అధ్యక్షురాలు పశ్య మల్లేశ్వరి, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంభం శివ పాల్గొన్నారు. -
పుత్తడిలో కొనుగోళ్ల జోరు
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అన్న వార్తలతో పుత్తడికి డిమాండ్ బాగా పెరిగింది. విదేశీమార్కెట్ లో విలువైన లోహాల ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా శుక్రవారం నాటి పసిడి ధరలు పుంజుకుంటున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు లాభాల్లో ఉన్నాయి. శ్రావణమాసం, రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో జ్యువెల్లరీ మార్కెట్ల లో ధరలు ఊపందుకున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ లో బంగారం వర్తకుల నిరంతర కొనుగోళ్లు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని అప్‌వర్డ్ ట్రెండ్ నెలకొందని తెలిపారు. దేశరాజధానిలో 99.9 , 99.5 స్వచ్ఛత బంగారం గత మూడు సెషన్స్‌లో 100 రూపాయలకు పైగా లాభపడింది. పది గ్రా. రూ 31.250 చొప్పున పలుకుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 31,465 వద్ద ఉంది. అటు నేటి మార్కెట్ లో బంగారం, వజ్రాభరణాల సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా గీతాంజలి జెమ్స్ కొనుగోళ్ల మద్దతుతో కాంతులీనుతోంది. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అమెరికా ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంటుందన్న అమెరికా ప్రకటనతో డాలర్ పుంజుకుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో 0.5శాతం నష్టపోయి ఔన్స్ బంగారం 1346 డాలర్ల దగ్గర ఉంది. ఇక వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. రక్షబంధన్ ను సందర్భంగా నిన్న (గురువారం) మార్కెట్లకు సెలవు. -
నాటిన మొక్కలకు పర్యవేక్షణ కరువు
పశువులకు ఆహారంగా మారుతున్న వైనం పట్టించుకోని అధికారుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పర్యావరణ ప్రేమికులు కొండపాక: వర్షాలు సమృద్దిగా కురవాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే పరిష్కారమని గుర్తించిన ప్రభుత్వం హరితహారం చేపట్టింది. దీని కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అయితే నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయకపోవడంతో ఎండిపోతున్నాయి. అంతేకాకుండా మేకలు, గొర్రెలకు ఆహారంగా మారాయి. అధికారులు గట్టిచర్యలు తీసుకుని హరితహారం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. హరితహారం కోసం మండలంలో ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో ఆరు నర్సరీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి నుంచి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు మొక్కలు సరఫరాచేస్తున్నారు. ఈజీఎస్ కింద ఖమ్మంపల్లిలో లక్ష మొక్కలు పెంపకం చేపట్టగా, కొండపాక, లకుడారం, వెలికట్ట, మేదినీపూర్, కుకునూరుపల్లి, మర్పడ్గ కేంద్రాల్లోని ఒక్కొక్క నర్సరీలో 75 వేల మొక్కలపెంపకం చేపట్టారు. మండల వ్యాప్తంగా 4.70 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా తయారుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, దేవాలయ ప్రాంగణాలు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్లపై సుమారు నాలుగు లక్షల మొక్కలు నాటినట్లు ఇంచార్జి ఎంపీడీఓ ఆనంద్‌మేరీ వివరించారు. ఈ మొక్కలను ఈజీఎస్ పథకంలో నాటడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నాటిన మొక్కలను సంరక్షించే చర్యలను మాత్రం అధికారులు, పాలకులు గాని చర్యలుతీసుకోకపోవడంతో మేకలకు ఆహారంగా మారాయి. దుద్దెడ నుంచి మర్పడ్గ, సిర్సనగండ్ల నుంచి ఓదన్చెర్వుల మార్గంలో నాటి మొక్కలు సంరక్షించకపోవడంతో ఎండు పుల్లలుగా మారిపోయాయి. వాటిని చూసిన ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై శీతకన్నువేయడం సరికాదని తప్పుబడుతున్నారు. వెంటనే తగుచర్యలు తీసుకుని మిగిలిన మొక్కలను కాపాడాలని కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించాలి మొక్కలు నాటారు మంచిదే కానీ పెరిగే వరకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. గతంలో వృక్షాలు అధికంగా ఉండటంతో వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రస్తుతం చెట్లు లేక వర్షాలు పడటంలేదు. అందుకే వరుస కరువు పరిస్థితి. - లక్ష్మి, కొండపాక కంచే ఏర్పాటు చేయాలి ఈజీఎస్ పథకంలో చాలా మొక్కలు నాటారు. వాటి రక్షణకు చుట్టూ కంచె పెట్టించాలి. లేకపోతే మేకలు, పశువులు మేయడం ఖాయం. చర్యలు తీసుకోకుండా ఎంతో ఖర్చు పెట్టి మొక్కలు పెట్టిస్తే ఏం లాభం. వెంటనే కంచె ఏర్పాటు చేసేలా చూడాలి. - బాలవ్వ, వెలికట్ట ట్యాంకర్ల ద్వార నీరందిస్తాం... సకాలంలో వర్షాలు కురువాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం పథకాన్ని చేపట్టింది. నాటిన మొక్కలు ఎండిపోకుండా చేసేందుకు ఈజీఎస్ సిబ్బందితో సర్వేబుల్ రిపోర్టులను అప్లోడ్ చేయిస్తుంది. పూర్తి కాగానే ట్యాంకర్ల ద్వారా నీరందించడంతో పాటు రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - ఆనంద్‌మేరీ, ఇంచార్జి ఎంపీడీఓ -
అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఈనెల 6వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని డీఈఓ చంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి ఉత్సహాలు నిర్వహించాలని డిప్యూటీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
మిసెస్ మొగుడు
నేటి మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లానికి ఆదాయం ఉన్నా మొగుడి పెత్తనమే చెల్లుతుంది. పెళ్లాలు పేరుకే ఆర్థికంగా స్వతంత్రులు. నిజానికి - దే ఆర్ జస్ట్... ‘మిసెస్ మొగుళ్లు’. ఆఫీస్‌కి వెళ్తూ ఇప్పటికీ భర్త దగ్గర చిల్లర కోసం చెయ్యి సాచాల్సిందే. ‘‘ఆడవాళ్లకు కంట్రోల్ ఉండదు. ఏది చూసినా కొనేయాలనుకుంటారు. ఎక్కడపడితే అక్కడ ఖర్చు పెట్టేయాలనుకుంటారు.వీళ్లకేమైనా ఫ్రెండ్సా? తాగుళ్లా? బజార్లలో తిరుగుళ్లా? మగాళ్లకైతే ఖర్చుంటుంది కానీ పెళ్లాలకేముంటుంది’’ అని కొట్టి పారేస్తున్నారు మొగుళ్లు! మొగుళ్లు ‘మిస్’ అవుతున్న మ్యాటర్ ఒకసారి గుర్తు చేద్దామని ఈ ‘మిసెస్ మొగుడు’. ఈ ముగ్గురూ మధ్యతరగతి మహిళలే! భర్తల కన్నా ఎక్కువే చదువుకున్నారు. భర్తల కొలువులకు దీటైన ఉద్యోగాలే చేస్తున్నారు. నళిని బ్యాంక్ ఎంప్లాయ్. శైలజ కలక్టరేట్లో చేస్తోంది. శిరీష సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయినా డబ్బుల కోసం అంత కటకట ఏంటి? వాళ్లకు కావల్సినవి వాళ్లు కొనుక్కోలేని దుస్థితి ఏంటి? కుటుంబ అప్పుల భారమేమన్నా మోస్తున్నారా? కాదు! మరి ఎందుకంత సర్దుబాటు? వాళ్ల సంపాదన వాళ్ల చేతుల్లో లేదు కాబట్టి. ఈ రోజుల్లో జీతాలన్నీ పర్సనల్ అకౌంట్లోనే కదా పడేది? నిజమే కాని ఆ అకౌంట్లోంచి మనీ డ్రా చేసే ఏటీఎమ్ కార్డ్ వీళ్ల చేతుల్లో ఉండదు. వాళ్ల ఆయనల జేబుల్లో ఉంటుంది. అదేంటి? ఈ ఆశ్చర్యాన్నే భార్యల ఏటీఎమ్కార్డ్స్ను మెయిన్టైన్ చేస్తున్న కొంతమంది భర్తల దగ్గర కనబరిస్తే... ‘ఉద్యోగం చేయడం వేరు. జీతాన్ని మేనేజ్ చేయడం వేరు. సెకండ్‌ది ఆడవాళ్లకు చేతకాదు. అందుకే ఏటీఎమ్‌ను మా దగ్గర పెట్టుకుంటాం’ అన్నారు. అయినా వాళ్లకేం ఖర్చుంటుంది? బయట తినడాలు, ఫ్రెండ్స్‌తో మందుకొట్టడాలు ఉండవ్ కదా మనీకార్డ్ క్యారీ చేయడానికి? వాళ్లకు కావల్సిన డబ్బు ఇస్తుంటాం’ అని ముక్తాయింపు ఇచ్చారు. ఖర్చులకు ఆడ, మగ తేడానా? ఎన్నో ఏళ్ల నుంచి ఆడవాళ్లే ఏలుతున్న ఇళ్లు ఉన్నాయి. మగవాళ్లు సంపాదనపరులుగా ఉన్నా ఆర్థిక వ్యవహారాలు, ఇంటి బాధ్యతలను స్త్రీలే చూసుకున్న ఉదాహరణలూ చాలానే కనపడ్తాయి. అంతెందుకు ముందు చెప్పుకున్న మూడు సంఘటనల్లోని మొదటి ఇద్దరూ పెళ్లికి ముందునుంచే ఉద్యోగస్తులు. తండ్రులకు ఆర్థికసహాయం అందించిన అమ్మాయిలే. శైలజ అయితే ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుంది. పైగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డ మరుసటి రోజు నుంచే తోబుట్టువుల చదువు బాధ్యతనూ తీసుకుంది. తండ్రి ఇంటి కోసం చేసిన అప్పు భారాన్ని కొంత మోసింది. ‘ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడడం నాకు నచ్చదు. అవమానంగా కూడా ఫీలవుతాను. అలాంటిది నేను సంపాదిస్తూ కూడా పదీపరకకు నా భర్త మీద ఆధారపడ్డం ఇన్సల్టింగ్గా ఉంటోంది. ప్రతి పదిరోజులకు ఒకసారి 250 నుంచి మూడు వందల వరకు ఆయనే నా పర్స్‌లో డబ్బు పెడ్తుంటారు. చాలా సార్లు అయిదు రోజులకే అయిపోతుంటాయవి. అప్పుడే అయిపోయాయా అని లెక్కలు అడిగితే ఏం చెప్తాం? ఖర్చులకు కూడా ఆడ, మగ అనే తేడా ఏంటి? మా సంపాదన మాకివ్వడానికే లెక్కలు అడుగుతారు... వాళ్ల జీతమెంతో కూడా చెప్పరు. మా పెళ్లయి 22 ఏళ్లవుతోంది. పెళ్లయ్యేటప్పటికీ మా వారి జీతమెంతో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియదు. ఒకటి రెండు సార్లు అడిగితే ‘నీకేం లోటయిందని లెక్కలడుగుతున్నావ్?’ అన్నారు. తను మాత్రం నా జీతభత్యాలు, నా ప్రమోషన్స్ వగైరాలు తెలుసుకున్నాకే సంబంధం ఖాయం చేసుకున్నారు’ అంటూ తన ఆర్థికస్వతంత్రలేమిని వివరించారు శైలజ. వర్కింగ్ విమెన్ వ్యధ చాలామంది వర్కింగ్ విమెన్ వ్యధ ఇదే! ఆర్థిక భద్రతకోసమే కదా స్త్రీలూ ఉద్యోగాలు చేసేది. మరి ఆ సంపాదనకూ మొగుడే హక్కుదారయ్యాక స్త్రీకి భద్రత, ఆర్థికస్వాతంత్య్రం ఎలా వచ్చినట్టు?’ అన్నది కొంతమంది ఉద్యోగినుల ప్రశ్న. ‘మహిళలకు ఆర్థికవ్యవహారాలు చూసుకోవడం రాదు అన్నది అపవాదు మాత్రమే. వీళ్ల నుంచి డబ్బు లాక్కోవడానికి మగవాళ్లు.. మొగుళ్లు చూపిస్తున్న బహానా మాత్రమే’ అని వాళ్ల విమర్శ, వాదన. అనూరాధ అనే గవర్నమెంట్ టీచర్ ఆర్థికస్వేచ్ఛలేమి బాధితురాలే. ఆమె భర్త కూడా టీచరే. ఇల్లు కట్టుకున్నారు. లోన్ తన పేరుమీదే తీసుకున్నాడు కాబట్టి ఇంటి రిజిస్ట్రేషన్ ఆయన పేరుతోనే అయిపోయింది. భర్త జీతం భారీమొత్తంలో కట్ అవుతుండడంతో ఆమె జీతాన్నే ఇంటి కోసం ఖర్చుపెట్టేది. ఈలోపల ఆడబిడ్డ పెళ్లి కుదిరింది. అప్పుడు ఆమె చేత లోన్‌కి అప్లయ్ చేయించి పెళ్లి చేశాడు. తర్వాత భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చాయి. విడిపోయేంతగా. ఆమె అప్పులతో బయటకు వచ్చింది. ఆయన ఇంటితో లాభపడ్డాడు. అభద్రతతో మానసిక ఆరోగ్యం దెబ్బతింది అనూరాధకు. అందుకే తనకు తెల్సిన పెళ్లికాబోయే అమ్మాయిలందరికీ ఒకటే సలహాఇస్తుంది అనూరాధ ‘మీ జీతం మీ దగ్గరే పెట్టుకోండి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లోనూ మీ పేరూ ఉండేలా చూసుకోండి. లేకపోతే మన డబ్బుని మనమే మొగుడి దగ్గర ముష్టి అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది’ అని! సంపాదిస్తున్నా భార్యలకు తమ డబ్బుమీద అధికారం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా విస్తృత ఉదాహరణలు అవసరం లేదేమో! కాంక్రీట్వనం... చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళుతోంది శిరీష. అసలు తను ఉద్యోగంలో చేరగానే మొదటి జీతంతో అమ్మకు, నాన్నకు బట్టలు కొని పంపాలనుకుంది. ఆర్నెల్లయినా ఆ ఆశ తీరలేదు. మదర్స్‌డేకి, మొన్న ఫాదర్స్డేకీ గి్ఫ్ట్స్ కొని పంపాలనుకుంది. అదీ కుదరలేదు. కనీసం ఇప్పుడైనా అమ్మకు, నాన్నకు ఇష్టమైనవి పట్టుకెళ్లాలి. తమ్ముడికి ఓ మొబైల్ కొనివ్వాలి... రాజి వాళ్లకు హైదరాబాద్ గాజులంటే చాలా ఇష్టం. తీసుకెళ్లాలి... ఓ వారం ముందునుంచి ప్లాన్ చేసుకుంది. ఏదీ కాలేదు. నానమ్మకు హైదరాబాద్ ద్రాక్షలంటే ఇష్టం. కనీసం అవైనా... ‘హైదరాబాద్‌లో ద్రాక్షతోటలేవి? అంతా కాంక్రీట్ వనమేనని మీ నానమ్మకు చెప్పు. అంతగా పళ్లు తీసుకెళ్లాలనుకుంటే మీ ఊళ్లో బస్ దిగాక బస్టాండ్‌లో అరటిపళ్లు కొని పట్టుకెళ్లు. బస్ చార్జెస్ పోనూ... ఇదిగో ఇవి దగ్గరపెట్టుకో. నానమ్మకు అరటిపళ్లు లాంటి ఏవో ఖర్చులుంటాయి కదా ఉంచు’ అంటూ ఉదారంగా ఆయన తన బ్యాగ్‌లో వం...ద... రూపాయలు సర్దాడు! ఉక్రోషం, కోపం ముంచుకొచ్చాయి శిరీషకు. యాభై రూపాయలే... చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తున్నారు మానస, శైలజ. కొనాల్సిన అవసరాలు చాలా కనపడ్డా తన పర్స్‌లో మనీ అకౌంట్ అంచనాకొచ్చి కేవలం చెప్పుల జతకే పరిమితమైంది శైలజ. బాగా నచ్చాయి. పెద్దగా బేరం ఆడకుండానే ఓకే చేసేసుకుంది. ఆత్రంగా పర్స్ తీసింది. కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి. మౌనంగా పర్స్ క్లచ్ క్లోజ్ చేసి... భయ్యా.. అభీ యాద్ ఆయా.. ఇస్ కలర్ మే ఏక్ జోడా మేరే పాస్ హై... అంటూ అక్కడ లేని కలర్ గురించి వాకబు చేసింది. ‘వో తో నయ్యే అమ్మా...’ అన్నాడు చెప్పుల షాప్ అతను. నిట్టూర్చి బయటకు నడిచింది. మగవాళ్ల స్వభావంగా... ఉద్యోగం చేస్తున్న భార్యల జీతభత్యాల మీద పెత్తనం చేస్తున్న భర్తలను స్వభావమనే కోణం నుంచి అర్థంచేసుకోవాలి. సహజంగానే మగవాళ్లది ఆధిపత్యధోరణి. అది ఆర్థికవ్యవహారాల నుంచే వచ్చింది. కాబట్టి కాలం మారినా వాళ్ల స్వభావం మారలేదు. పురుషులకు, మహిళలకు ఒకేరకమైన అవసరాలుంటాయనుకోవడం లేదా మహిళలకు అవసరాలేముంటాయి అనుకోవడం తప్పు. ఇదే భార్యభర్తల మధ్య స్పర్థలకు దారితీస్తుంది. ఆర్థికస్వేచ్ఛలేదనే భార్య బాధ, తను మాత్రమే కుటుంబ బాగోగుల బాధ్యతలను నెత్తినేసుకోగలడు అనే భర్త తత్వం చివరకు ఆ కుటుంబాన్ని కలహాల్లోకి నెడుతున్నాయి. కాలానికి తగ్గట్టు మగవాళ్లూ తమ స్వభావాన్ని మార్చుకోవాలి. కుటుంబ ఆర్థికవ్యవహారాల పట్ల తామూ అంతే బాధ్యతగా ఉంటామన్ని విషయాన్ని భార్యలూ చెప్పాలి. - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ బూడిదలో పోసిన పన్నీరు ఆర్థికస్వాతంత్య్రం లేని ఉద్యోగినులు దాదాపు 70 శాతం మంది ఉంటున్నారు. కుటుంబ క్షేమాన్ని ఆశించే భర్తలు భార్యల సంపాదన మీద అధికారం తీసుకుంటున్నా వాళ్లు చేసే ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు, పొదుపులకు సంబంధించిన వివరాలను భార్యలకు చెప్పడం లేదు. వీళ్లూ అడగడం లేదు. దాంతో ఆర్థిక విషయాల మీద భార్యలకు పట్టు రావడంలేదు. ఈలోపు కుటుంబపెద్దకు హఠాత్తుగా జరగరానిదేదైనా జరిగితే ఆ కూడబెట్టిన ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. - రజని భీమవరపు,ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ ముప్పై సార్లు వెదికినా... ఉదయమే రావాల్సి ఉండి.. బాక్స్ తెచ్చుకోలేదు. ఆకలి నకనకలాడుతోంది. బాయ్‌తో తినడానికి ఏదైనా తెప్పించుకుందామని డబ్బుల కోసం బ్యాగ్ తెరిచింది నళిని. మూడు కంపార్ట్మెంట్లున్న ఆ బ్యాగ్‌ను ముప్పైసార్లు వెదికింది. అయిదు రూపాయల కాయిన్ తప్ప పదుల నోట్లు కనపడలేదు. కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆకలి బాధతో కాదు.. అవమాన భారానికి! -
అరచేతిలో ఆర్థిక సేవలు..!
♦ ఉచితంగానే పొదుపు నిర్వహణ సేవలందిస్తున్న 5నాన్స్.కామ్ ♦ ఎంఎఫ్, ఎఫ్డీ, డిబెంచర్లు, బాండ్లు.. వంటి కొనుగోళ్లకూ అవకాశం ♦ 6 నెలల్లో 10 వేల మందికి సేవలు; హైదరాబాద్ వాటా 15 శాతం ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో 5నాన్స్.కామ్ కో-ఫౌండర్ దినేష్ రోహిరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మన దేశంలో ఆర్థిక నిర్వహణ అనేది పద్మవ్యూహాన్ని ఛేదించడం లాంటిది. ఎందుకంటే ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ డిపాజిట్స్, బంగారం, బాండ్లు, వడ్డీ పథకాలు.. ఇలా పొదుపు సాధనాల జాబితా పెద్దదే మరి. ఇందులో రిస్క్‌లేని పెట్టుబడులేంటి? ఎందులో ఎంత పొదుపు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ కావాలో సరిగ్గా విశ్లేషించడం ఒక్కోసారి ఆర్థిక నిపుణులకూ సాధ్యంకానిది. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉన్న ఈ ఆర్థిక నిర్వహణ లోటును పూడ్చటమే వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు ఈ మిత్రద్వయం. ముంబై కేంద్రంగా గతేడాది నవంబర్‌లో 5నాన్స్.కామ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సంస్థ సేవలను, విస్తరణ ప్రణాళికలను 5నాన్స్.కామ్ కో-ఫౌండర్ దినేష్ రోహిరా ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆయనింకా ఏమంటారంటే.. నేను, అజయ్ అర్జిత్‌సింగ్ ఇద్దరం హెచ్‌పీ కంపెనీలో 20 ఏళ్లకు పైగానే కలసి పనిచేశాం. ఓసారి రిలయన్స్ మనీ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సమయంలో కస్టమర్లకు, సంస్థకు మధ్య దూరాన్ని గుర్తించాం. అంటే ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ సంఘటితలేమి, కస్టమర్లతో కమ్యూనికేషన్ గ్యాప్.. వంటి అంశాలన్నమాట. టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. ఆర్థిక నిర్వహణకు సంబంధించి మాత్రం దూరం తగ్గట్లేదని తెలుసుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ టెక్నాలజీ ద్వారా ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ, దూరం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదనేది గ్రహించాం. ఆర్థిక వ్యవహారాల్లో వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది? మారుతున్న ప్రజల ఆలోచనలు.. వారి ఆర్థిక స్థితిగతులేంటి? వంటి విషయాలపై దేశవ్యాప్తంగా సర్వే చేసి ఒకే వేదికగా ఆర్థిక సేవల నిర్వహణ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. టెక్నాలజీ అభివృద్ధి, ఉద్యోగుల నియామకం, మార్కెటింగ్ వంటివాటి కోసం ఏడాది పాటు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో గతేడాది నవంబర్‌లో ముంబై కేంద్రంగా 5నాన్స్.కామ్‌ను ప్రారంభించాం. 5నాన్స్.కామ్ ప్రత్యేకతేంటంటే.. బంగారం, వడ్డీ పథకాలు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు వంటి పెట్టుబడి సాధనాలన్నింటి సమాచారమూ ఒకే వేదికగా ఉచితంగా పొందొచ్చు. రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి ఉత్పత్తులనూ కొనుగోలు చేయొచ్చు. కస్టమర్ ఆర్థిక వ్యవహారాలన్నీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఏదైనా ఆర్థిక సేవల ఉత్పత్తుల కొనుగోళ్ల సమయంలో కేవైసీ ఆటోమేటిక్‌గా చెక్ చేస్తారు. సంబంధిత ఉత్పత్తికి సంబంధించిన మొత్తం నేరుగా అమ్మకందారు ఖాతాలోనే జమ అవుతుంది. అంటే ఉత్పత్తి సంస్థకు, కొనుగోలుదారునికి మధ్య నేరుగా ఒప్పందం జరుగుతుంది. 5నాన్స్.కామ్ ఓ ఫ్లాట్‌ఫాం మాత్రమేనన్నమాట. రిజిస్టరైతే చాలు.. 5నాన్స్.కామ్ వెబ్సైట్లో కస్టమర్ తమ పేరును రిజిస్టర్ చేసుకోగానే ఆటోమెటిక్‌గా తమ ఖాతా రెడీ అవుతుంది. మొబైల్‌కి వచ్చే పాస్‌వర్డ్‌తో ఎవరి ఖాతాను వారే నిర్వహించుకోవచ్చు. మొదటిసారి కస్టమర్ లాగిన్ అయినప్పుడు కస్టమర్ ప్రొఫైల్, ఆదాయ, వ్యయాలు, ఆర్థికపరమైన లక్ష్యాలు, ఆదాయ అంచనాలు, ఇతర ఖర్చుల వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి పొదుపు పథకాలు చేస్తే బాగుంటుందో 5నాన్స్.కామ్ సలహాలు, సూచనలు ఉచితంగా అందిస్తుంది. అవసరమైతే అందుబాటులో ఉన్న ఉత్పత్తులను సూచిస్తుంది కూడా. అంటే మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ డిపాజిట్లు, బాండ్లు, రుణాలు, క్రెడిట్ కార్డుల వంటివన్నమాట. ఇందుకోసం 40 ఆర్థిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా కొనుగోళ్లను బట్టి 2 శాతం వరకు కమీషన్ ఉంటుంది. హైదరాబాద్ వాటా 15% ప్రారంభించిన 6 నెలల్లో దేశవ్యాప్తంగా మా సేవలను 10 వేల మంది వినియోగించుకున్నారు. ఇందులో హైదరాబాద్ వాటా 15% వరకూ వుంటుంది. ఈ ఏడాది చివరినాటికి మొత్తం 3 లక్షల యూజర్లకు చేరుకోవాలనేది లక్ష్యం. ఉత్పత్తుల సంఖ్యనూ పెంచనున్నాం. జీవిత/ కారు/ ఇళ్లు బీమా, పన్ను దాఖలు, స్థిరాస్తి, పెన్షన్ పొదుపు ఉత్పత్తులన్నమాట. 3 నెలల్లో ఈ సేవలన్నీ అందుబాటులోకొచ్చేస్తాయి. 3 నెలల్లో 15 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ.. ‘‘ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవలే ఏంజిల్ రౌండ్లో భాగంగా గ్లోబల్స్ వెంచర్స్, ఎస్పైర్ ఎమర్జింగ్ ఫండ్ సంస్థలు 3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. టెక్నాలజీ అభివృద్ధి, ఉత్పత్తుల విస్తరణ నిమిత్తం మరో 15 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు సంస్థాగత పెట్టుబడిదారులతో చర్చిస్తున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తామని’’ దినేష్ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి'
అహ్మదాబాద్: పద్దెనిమిదేళ్లు దాటిన కొడుకు బాధ్యతను తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వయసుకు వచ్చిన కుమారులకు వారి సంపాధన వారే చూసుకోవాలని చెప్పొచ్చని తెలిపింది. అయితే, ఆ కొడుకు మానసికంగా, శారీరకంగా బలహీనమైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. కానీ, కూతురు విషయంలో ఈ నిబంధన వర్తించదని, ఆడపిల్ల మైనారిటీ తీరినా ఆమె వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులే చూసుకోవాలని చెప్పింది. గుజరాత్లో వైద్యుడిగా పనిచేస్తున్న దినేశ్ ఓజా అనే వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. 2006లో ఆయనకు తన భార్యకు విడాకులు అయ్యాయి. ఆ సమయంలో 18 ఏళ్లు వచ్చే వరకు కొడుకు బాధ్యతను ఆ వైద్యుడే చూసుకోవాలని అలహాబాద్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో అతడు తన కుమారుడికి 18 ఏళ్లురాగానే 2013 అక్టోబర్ నెల నుంచి చెల్లింపులు ఆపేశాడు. ఈ చర్యతో తన మాజీ భార్య మరోసారి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా హైకోర్టును ఆశ్రయించండని చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు వెళ్లగా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏతల్లిదండ్రులయినా కేవలం 18 ఏళ్ల వరకు కుమారుడిని చూసుకుంటే సరిపోతుందని అన్నారు. -
భారత్ లో ఎయిర్ బస్ పైలట్ శిక్షణ కేంద్రం
విమానయాన రంగంలో ఉన్న ఎయిర్‌బస్ ఢిల్లీ సమీపంలో సుమారు రూ.260 కోట్లతో పైలట్, మెయింటెనెన్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయనుంది. 2018లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ సెంటర్‌కు 10 ఏళ్లలో 8,000 మంది పైలట్లు, 2,000 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎయిర్‌బస్‌కు ఇప్పటికే బెంగళూరులో మెయింటెనెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ 2007 నుంచి ఇప్పటి వరకు 2,750 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో వారానికి సగటున ఒక ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇక్కడి ఆపరేటర్లకు డెలివరీ చేసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. -
విమానాలకు భారీ డిమాండ్
♦ వచ్చే 20 ఏళ్లలో 1,740 విమానాలు కావాలి ♦ భారత్‌ది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు ♦ బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ కేశ్కర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తగ్గిన ఇంధన ధరలు దేశీ విమాన కంపెనీలకు లాభాలను కురిపిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. 2013లో విమానాల నిర్వహణ వ్యయంలో ఇంధనం వాటా 49 శాతంగా ఉంటే అది ఇప్పుడు 23 శాతానికి పడిపోయిందని బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ కేశ్కర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగటు విమాన టికెట్ ధరలు తగ్గడం కూడా ఈ పరిశ్రమ వేగంగా విస్తరించడానికి ఒక కారణమని చెప్పారు. ‘‘రెండేళ్ల క్రితం సగటు టికెట్ ధర రూ.7,492 ఉండేది. అపుడు కంపెనీలకు టికెట్‌పై రూ.256 నష్టం వచ్చేది. కానీ ఇపుడు సగటు టికెట్ ధర రూ.5,734కి తగ్గింది. దీంతో టికెట్‌కు రూ.632 చొప్పున లాభం వస్తోంది. అందుకే విమానయాన సంస్థలు కొత్త విమానాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’’ అని వివరించారాయన. ఇండియాలో ఉన్న ఈ డిమాండ్‌ను అందుకోవాలంటే వచ్చే ఇరవై ఏళ్లకు 1,740 కొత్త విమానాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు కేశ్కర్ తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 16 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. ‘‘దేశీయ ప్రయాణికుల సంఖ్యలో గతేడాది 21 శాతం వృద్ధి నమోదయింది. ఈ రేటు ప్రపంచంలోనే అత్యధికం. 2014లో 6.6 కోట్లుగా ఉన్న ప్రయాణీకుల సంఖ్య 2015లో 8 కోట్లకు చేరుకుంది. ప్రాంతీయ విమాన సేవలు విస్తరిస్తుండటంతో చిన్న విమానాలకు మంచి డిమాండ్ వస్తోంది’’ అన్నారు. నాగపూర్‌లో తాము ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) యూనిట్ గత జూన్ నెల నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు. -
టోకున ఆహార ధరలు భగ్గు..
♦ డిసెంబర్లో 8 శాతంపైకి.. ♦ మొత్తం టోకు సూచీ మాత్రం ♦ ‘క్షీణత’లోనే; మైనస్ 0.73 శాతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిందన్నమాట. నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. ఈ ధరల స్పీడ్ డిసెంబర్లో ఏకంగా 8.17 శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో పెరుగుదల ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణం. ఆహార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే... రానున్న కొద్ది నెలల్లో సూచీ మొత్తం క్షీణతలోంచి బయటకు వస్తుందని అంచనా. 2014 నవంబర్ నుంచి క్షీణతలో కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం... ఆహార ధరల తీవ్రత దృష్ట్యా గడచిన నాలుగు నెలల నుంచి కొంచెంకొంచెంగా పైకి వస్తోంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.48% పెరిగింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ఈ రేటు 8.17 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 5.2%. పప్పు దినుసుల ధరలు వార్షికంగా చూస్తే... భారీగా 56% ఎగశాయి. ఉల్లి ధరలు 26% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 21 శాతం ఎగశాయి. -
కోర్టులో మాజీ భార్యపై కోపంతో ఊగుతూ..
అహ్మదాబాద్: విడిపోయిన భార్యకు ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఆమె కోర్టుకు ఎక్కడం విడిపోయిన భర్తకు తెగ చిరాకును తెప్పించింది. కోర్టులోనే ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని నాణెముల రూపంలో విసుగ్గా అందించి లెక్కపెట్టుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌లో పృధ్వీ ప్రజాపతి, రమీలాబెన్ అనే మహిళ భార్యాభర్తలు. వారు కొన్ని కారణాల వల్ల 2011 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య కోర్టును ఆశ్రయించింది. తను బతికేందుకు ఖర్చుల నిమిత్తం కొంత చెల్లించాలని ఆమె కోర్టుకు విన్నవించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. పృథ్వీ నెలకు సంపాదిస్తున్న రూ.4వేలల్లో రూ.1500 ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తొలుత బాగానే చెల్లించిన అతడు 2014లో చెల్లించడం మానేశాడు. దీంతో ఆమె మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఫలితంగా అతడిని కోర్టు మరోసారి బోనులో నిలబెట్టడంతో ఆగ్రహానికి లోనైన అతడు రూ.10 వేలను ఓ బ్యాగులో నాణేల రూపంలో తీసుకొచ్చి ఆమెకు అందించి లెక్కపెట్టుకో అంటూ విసుగ్గా వెళ్లిపోయాడు. -
వితంతు కోడళ్లూ భరణానికి అర్హులే
లీగల్ కౌన్సెలింగ్ నేను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి ఏడాది అయినా గడిచిందో లేదో దురదృష్టవశాత్తూ మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి నేనూ, బాబూ అనాథలమైనాము. ఇప్పుడు బాబుకు మూడేళ్లు. మాది కులాంతర వివాహం కావడంతో నాకు పుట్టినింటి నుంచి ఏ అండా లేదు. అత్తింటి వారేమో మా కొడుకే పోయాక మీకూ మాకూ ఇక సంబంధం ఏమిటని నన్ను ఈసడించుకుంటున్నారు. నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. అటు పుట్టింటి అండాలేక, అత్తింటి ఆదరణా లేక చాలా ఇబ్బందిపడుతున్నాను. మా అత్తమామలు ధనవంతులు. ఏ బాధ్యతలూ లేనివారు. నాకు ఆస్తికోసం వారితో పోట్లాడటం ఇష్టం లేదు. మా ఇద్దరికీ నెలవారీ ఖర్చులకు సరిపడా మెయింటెనెన్స్ ఇస్తే చాలు. నాకు ఏదైనా ఆధారం దొరికాక అది కూడా అక్కరలేదు. నన్ను ఏం చేయమంటారు? కోడలిని పోషించవలసిన బాధ్యత అత్తమామలకు లేదా? - ఒక సోదరి, హైదరాబాద్ మీ పరిస్థితి దయనీయం. మీ ఆత్మగౌరవం హర్షణీయం. వితంతువైన కోడలు అత్తమామలనుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. మీరే కాదు, మీ బాబు కూడా. మీరు ఆశ్రయించవలసిన చట్టం ది హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్ట ప్రకారం తనను తాను పోషించుకోలేని, పోషణకు ఏ ఆధారమూ, ఆస్తిపాస్తులూ, ఆదాయమూ లేని వితంతువైన కోడలు మామగారి నుంచి సెక్షన్ 19ను అనుసరించి మెయింటెనెన్స్‌ను పొందవచ్చు. మీరు వెంటనే కోర్టును ఆశ్రయించండి. మీ వారికి రావలసిన ఆస్తిని కూడా మీ మామగారు ఇవ్వలేదు. కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చే అవకాశం కూడా ఉంది. నేను నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈలోగా నా భర్త, మా ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వత మనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ కంసెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసేనాడు 10 లక్షలు డి.డి. ఇస్తామని, విడాకులు మంజూరు చేసేనాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు? - సౌమ్య, విశాఖపట్నం మీరు చెప్పిన విషయాలు పిటిషన్లో రాసుకోవాలి. భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిన తర్వాతనే ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒకవేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ కావచ్చు. నా పేరు మంగ్లీ. నా మాజీ భర్త పేరు జామియా. మేము ఒక ట్రైబల్ తండాకు చెందినవారం. మాకు ఒక పాప ఉంది. కొన్ని కారణాల వల్ల మేమిరివురము మా తండా పెద్దల కుల పంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మారు మనువు చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాప కూడా నా దగ్గరే ఉంది. నా భర్త బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసి వెళ్తానని అడిగితే అంగన్వాడి స్కూల్ దగ్గరకు రమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలపాల్జేసి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయవలసిందిగా ప్రకటించమని కోర్టును ఆశ్రయించాడు. నేనసలు మొదటి భర్త నుండి విడాకులు తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి. - మంగ్లీ, ఆదిలాబాద్ అతని వాదనలో నిజం లేదు. మీ రెండవ వివాహం చెల్లుతుంది. ఎందుకంటే మీరు మొదటి భర్త నుండి తీసుకున్నది ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు/తెగలకు’ వారి ఆచారాలను, సంప్రదాయాలను తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి కులపెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29 (2) హిందూ వివాహ చట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఉన్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో ఉంటే చట్టం దానిని రక్షిస్తుంది అని అర్థం. కనుక మీరు మీవారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీ వర్షన్‌కు ఫేవర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్వారు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చారు. 1999 (6) ఎఎల్డి 413 (డిబి). మా పెళ్లయ్యి పాతికేళ్లయింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వారు బ్యాంక్‌మేనేజర్. ఇటీవలే వి.ఆర్.ఎస్ తీసుకున్నారు. నా సమస్యేమిటంటే, పెళ్లయినప్పటినుంచి ఇన్ని సంవత్సరాల వరకు నేను మా వారిని, పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాను. కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఆనందాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేశాను. నేను చేసిన పనులను మా వారు ఏనాడూ గుర్తించక పోగా ఎప్పుడూ ఏదో ఒక దానికి దెప్పి పొడిచేవారు. నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించేవారు కాదు. పిల్లల కోసమే నేను ఆయన పెట్టిన హింసలను ఇన్నాళ్లూ ఓపిగ్గా భరించాను. అయితే ఇటీవల కాలంలో ఆయన నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ఫిట్‌గా ఉన్నాననీ, ఈ వయసులో కూడా అమ్మాయిలు తనంటే పడి చస్తున్నారనీ నన్ను తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తున్నారు. నేనది సహించలేకపోతున్నాను. ఆయన ఉనికి కూడా భరించలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎ. సావిత్రి, విజయవాడ ఈ వయసులో మిమ్మల్ని ఆయన మీద కేసు పెట్టమని కానీ, విడాకులివ్వమని కానీ నేను మీకు సలహా ఇవ్వలేను. కానీ మీకు ఒక పరిష్కారం సూచించగలను. మీరు మొట్టమొదట మీ వారి ఉనికిని భరించలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఆయనతో కలిసి ఉండలేకపోతున్నారు. అతని మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు పై కారణాలన్నీ వివరిస్తూ, ఫ్యామిలీ కోర్టులో జుడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటిషన్ వేయండి. సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దీనిని విడాకులు లేకుండా విడిపోవడం అంటారు. కోర్టువారు విచారణ తర్వాత విడివిడిగా జీవించడానికి మీకు డిక్రీ ఇస్తారు. ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు. ఆస్తిహక్కులకు ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరక సంబంధాలు మాత్రం రద్దవుతాయి. ఇద్దరూ కలిసి జీవించే హక్కు తాత్కాలికంగా రద్దవుతుంది. అయితే ఒకే ఇంట్లో నివసించకుండా మీరు విడివిడిగా జీవించవలసి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంతరార్థం ఏమిటంటే పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మరలా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వడం. మీ భర్త తన ప్రవర్తనను మార్చుకుని, మిమ్మల్ని సక్రమంగా చూస్తానని మీకు నమ్మకం కలిగిస్తే, మీరు మరలా అతనితో మీ వివాహ బంధాన్ని కలుపుకుని కలిసి కాపురం చేయవచ్చు. ప్రయత్నించి చూడండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
వైట్ ‘టాప్’ రోడ్లు
వైట్‌టాపింగ్ రోడ్లతో తగ్గనున్న ఆర్థిక భారం 30 ఏళ్ల వరకూ తగ్గనున్న నిర్వహణ వ్యయం జీహెచ్ఎంసీకి ఎంతో లాభం ప్రయోగాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మాణం సిటీబ్యూరో: గ్రేటర్లో అధునాతన వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ బడ్జెట్లో ప్రస్తుతం సింహభాగం నిధులను రోడ్లకే వెచ్చిస్తున్నారు. అందులోనూ సగటున సుమారు రూ.250 కోట్లు ఏటా బీటీ రోడ్ల రీ కార్పెటింగ్, పాట్‌హోల్స్ మరమ్మతుల వంటి పనులకే వినియోగిస్తున్నారు. వైట్‌టాపింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే ఏటా దాదాపు రూ.5.5 కోట్ల వంతున జీహెచ్ఎంసీకి ఆదా కానుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా 1.కి.మీ.రోడ్డును సీఎంఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. 30 ఏళ్లపాటు మన్నికగా ఉండే ఈ రహదారులతో జీహెచ్ఎంసీకి సుమారు రూ.22 వేల కోట్ల ఖర్చు తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఎస్ఆర్డీపీ పనుల అంచనా వ్యయం రూ. 20,600 కోట్లు. అంటే వైట్‌టాపింగ్ వినియోగంతో మిగిలే నిధులతో ఎస్సార్డీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయవచ్చు. ఏటా రూ.250 కోట్లు జీహెచ్ఎంసీలో అన్ని రకాల రోడ్ల విస్తీర్ణం 8803.48 కి.మీ.లు. వీటిలో బీటీ రోడ్లు 4052.79 కి.మీ. ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చూపుతున్నారు. ఈ నిధులతో అన్ని రోడ్లకూ మరమ్మతులు చేయడం లేదు. కేవలం వీఐపీలు సంచరించే ప్రాంతాలు.. ప్రధాన రహదారుల్లో మాత్రమే చేస్తున్నారు. అన్ని మార్గాల్లో చేస్తే ఈ వ్యయం ఇంకా పెరుగుతుంది. వైట్‌టాపింగ్ రోడ్లకు, బీటీ రీకార్పెటింగ్‌కు అంచనా వ్యయంలో తేడా సగటున ఇలా... ►వైట్‌టాపింగ్ రోడ్డు కి.మీ.కు వ్యయం దాదాపు రూ.2 కోట్లు ►ఇవి 30 ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి. ఎలాంటి మరమ్మతులు అవసరం లేదు. ►నిర్వహణ వ్యయం ఉండదు. ప్రయాణం సాఫీగా ఉంటుంది. ►బీటీ రీకార్పెటింగ్/మరమ్మతులకు కి.మీ.కు వ్యయం ఏడాదికి దాదాపు రూ.25 లక్షలు. ►ఈ లెక్కన 30 ఏళ్లకయ్యే వ్యయం రూ.7.5 కోట్లు. ►కి.మీ. రహదారిని పరిగణనలోకి తీసుకుంటే వైట్‌టాపింగ్, బీటీ రీకార్పెటింగ్/మరమ్మతుల మధ్య వ్యత్యాసం రూ.5.5 కోట్లు ►4 వేల కి.మీ. రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే జీహెచ్ఎంసీ ఖజానాపై రూ.22 వేల కోట్లు భారం తగ్గుతుంది. ►అంటే సంప్రదాయ పద్ధతిలో రీకార్పెటింగ్/మరమ్మతుల స్థానే వైట్‌టాపింగ్ చేస్తే జీహెచ్ఎంసీ ఖజానాకు ఎంతో మిగులు మాత్రమే కాక.. ►సదరు నిధులతో ఎస్సార్డీపీ ప్రాజెక్టు పనులను కూడా చేపట్టవచ్చు. ►ఏటా రోడ్ల నిర్వహణ.. రీ కార్పెటింగ్ పేరిట రూ.వందల కోట్లు వ్యయమవుతున్నా.. రోడ్లు మూణ్నాళ్లకే కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. వైట్ టాపింగ్‌తో ఈ సమస్య ఉండదు. ►1. కి.మీ. వైట్ టాపింగ్ పని వారంలో పూర్తి చేయవచ్చు. అదే సీసీ వేయాలంటే నెలలు పడుతుంది. ►హైదరాబాద్ లాంటి నగరాల్లో నెలల తరబడి ట్రాఫిక్ మళ్లింపు అసాధ్యం. దీన్నిబట్టిఅన్నివిధాలుగా వైట్ టాపింగ్ మేలు ►వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. దీనివల్ల 50శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ►వాహనాలు స్లిప్ కాకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. పర్యావరణ హితం. ►గుంతలు, కుదుపులు లేనందున వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. ► తారురోడ్డు పైభాగాన్ని 5 అంగుళాల మందం తొలగించి వేయవచ్చు. ►ఎం 40 గ్రేడ్ సిమెంట్ కాంక్రీట్‌ను వినియోగిస్తారు. ►ఎలాంటి రోడ్డు తవ్వకాలు లేనప్పుడు మాత్రమే 30 ఏళ్లు మన్నిక. ►సిమెంటు మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంజారాహిల్స్ రోడ్ నెం.10లో జీహెచ్ఎంసీకి ఎలాంటి ఖర్చు లేకుండా కి.మీ. రోడ్డును వైట్‌టాపింగ్ చేస్తున్నారు. సిటీ సెంటర్మాల్ చౌరస్తా నుంచి రెయిన్బో ఆస్పత్రి మీదుగా జహిరా నగర్ చౌరస్తా వరకు దీనిని నిర్మిస్తున్నారు. బెంగళూరు, చెన్నయ్‌లో... ఇప్పటి వరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మాత్రమే మనకు తెలుసు. కొంత మందం బీటీ, మరికొంత మందం సీసీతో అధునాతన రోడ్లకు అల్ట్రాటెక్ సమన్వయంతో సిమెంటు కంపెనీల సమాఖ్య రెండేళ్ల క్రితమే ముందుకు వ చ్చింది. రోడ్డు పనులకు అప్పట్లో ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. తొలుత లక్డీకాపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు వైట్‌టాపింగ్ రోడ్డు వేస్తే బాగుంటుందని జీహెచ్ఎంసీ అధికారులు భావించారు. ఆమేరకు సీఎంఏకు తెలియజేశారు. పనులు ప్రారంభించేందుకు ట్రాఫిక్ మళ్లింపు అవసరమని సీఎంఏ పేర్కొంది. దీనికి ప్రత్యామ్నాయం సూచించాల్సిందిగా ట్రాఫిక్ విభాగాన్ని జీహెచ్ఎంసీ కోరింది. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో మళ్లింపు కుదరదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కాచిగూడ స్టేషన్ వద్ద రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ ట్రాఫిక్‌పై అధ్యయనం, మళ్లింపు ఆలస్యమైంది. హైదరాబాద్‌తో పాటు సీఎంఏ ప్రతిపాదించిన మరో రెండు నగరాలు బెంగళూరు, చెన్నయ్‌లలో ఈలోగా రోడ్ల నిర్మాణం పూర్తయిపోయింది. రెండేళ్ల తర్వాత నగ రానికి మళ్లీ అవకాశం లభించింది. ఈ రోడ్డు నిర్మాణానికి సిమెంట్, ఇసుకతో పాటు ఫ్లైయాష్, పాలిమెరిక్ ఫైబర్ వినియోగిస్తారు. అన్ని మార్గాల్లోనూ... నగరంలోని రోడ్లన్నింటి కీ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించాలనేది జీహెచ్ఎంసీ యోచన. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే అన్ని మార్గాల్లోనూ వైట్టా పింగ్ చేయించే ఆలోచనలో కమిషనర్ సోమేశ్ కుమార్ ఉన్నారు. నగరాల్లో వైట్‌టాపింగ్ ఎంతో అనువైనదని ఈఎన్సీ ధన్సింగ్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఇప్పటికే వైట్‌టాపింగ్‌కు మొగ్గు చూపుతుండగా, మంగళూరులో దాదాపు అన్ని రోడ్లకూ దీన్నే వినియోగిస్తున్నారని సీఎంఏ ప్రతినిధులు తెలిపారు. మైసూర్లోనూ త్వరలోనే 150 కి.మీ.ల మేర వైట్‌టాపింగ్ పనులు జరుగనున్నాయని చెప్పారు. వైట్‌టాపింగ్ రోడ్లకు మన్నిక అధికం భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి బంజారాహిల్స్: నగరంలో వైట్‌టాపింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సిటీ సెంటర్మాల్ చౌరస్తానుంచి జహిరానగర్ చౌరస్తా వరకు కిలోమీటర్ మేర రోడ్డు వేస్తున్నారు. సిమెంటు తయారీదారుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ ం పనులను గురువారం భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల వరకు మన్నిక ఉండే ఈ వైట్‌టాపింగ్ రోడ్లు అతి తక్కువ కాలంలో పూర్తవుతాయని చెప్పా రు. సుమారు * 1.80 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, పూర్తిగా సిమెంటు తయారీదారుల సంస్థ ఈ రోడ్డును నిర్మిస్తోందని ఆయన వివరించారు. నగరంలోనే మొట్టమొదటి ప్రయోగాత్మక రోడ్డుగా ఈ రోడ్డును వేస్తున్నామని వెల్లడించారు. ఆరు రోజుల్లో ఓ వైపు రోడ్డు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ట్రాఫిక్ రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. -
మంజూరిచ్చారు... చేతులెత్తేశారు!
నల్లగొండ ఎంఆర్ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద మంజూరు కావాల్సిన నిధులకు రాజకీయ గ్రహణం పట్టింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వానికి కొత్తగా రాజకీయ చిక్కులు కూడా తోడయ్యాయి. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులను సంతృప్తి పర్చేందుకు కోట్ల రూపాయల పనులు నామినేషన్ మీద కట్టబెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...జిల్లావ్యాప్తంగా 59 మండలాల్లో 2,399 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు మరమ్మతు చేసేందుకు 1562 పనులకు ఏప్రిల్‌లో మంజూరిచ్చారు. ఈ నిధులతో రహదారులు లేని ప్రాంతాల్లో మట్టిరోడ్ల నిర్మాణం, కంకర రోడ్ల మీద మట్టిపోయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు కదల్లేదు. వేసవి కాలంలోనే పనులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా కూడా చేపట్టలేదు. ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పనులు ఆమోదించి నిధులు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయలేదు. అదీగాక ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు నామినేషన్ మీద పనులు చేయాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ల తీర్మానాలు తప్పనిసరి చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే ఎక్కువ మంది ఉన్నందున తీర్మానాలు ఇచ్చేందుకు వారినుంచి అభ్యంతరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యత్యాసం లేకుండా నిధుల పంపకాలు చేశారు. కానీ పనులు ప్రతిపాదనలు పంపడంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ల ప్రమేయం లేకుండా చే యడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పనులు రద్దుకు మొగ్గుచూపు..! జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.49 కోట్లు మంజూరు చేశారు. అయితే దీంట్లో కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు నిధుల పంపకాల్లో రూ.2 కోట్లు కోత పెట్టారు. ఈ మేరకు కోత పెట్టిన నిధులను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి రూ.6 కోట్లు, మాజీ పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గానికి రూ.5 కోట్లు అదనంగా ఇచ్చారు. మిగిలిన నియోజక వర్గాలకు ఒక్కోదానికి రూ.4 కోట్లు చొప్పున మంజూరు చేశారు. నిధుల మంజూరీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తలెత్తిన ‘తీర్మానం’ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ప్రజా ప్రతినిధులు ఇరకాటంలో పడినట్లు సమాచారం. ఈ సమస్య అపరిష్కృతంగా ఉండగానే ప్రభుత్వానికి నిధుల జాడ్యం పట్టుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలంగా ఆర్థికశాఖ అన్ని రకాల చెల్లింపులు నిలిపేసింది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లులకే ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంఆర్ఆర్ గ్రాంట్‌కు నిధులు వస్తాయన్న నమ్మకం అధికార వర్గాల్లో లేకుండా పోయింది. ఇప్పుడున్న తాజా ఆర్థిక ఇబ్బందులను బట్టి చూస్తే మంజూరు చేసిన పనులను ప్రభుత్వం రద్ధు చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదు - ఉమామహేశ్వర్‌రెడ్డి, పీఆర్ ఎస్ఈ ఎంఆర్ఆర్ పనులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. జిల్లా మంత్రి ఆమోదం పొందేందుకు ఫైల్ పంపాం. వర్షాలకు పనులు ప్రారంభిస్తే బయటి వైపు నుంచి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో మొదలు పెట్టలేదు. మంత్రి ఆమోదం పొందగానే పనులు ప్రా రంభించేందుకు చర్యలు చేపడతాం. -
‘పబ్లిక్‌హెల్త్’కు పట్టణ నీటి బాధ్యత!
మున్సిపాలిటీలను తప్పించనున్న ప్రభుత్వం ‘పబ్లిక్ హెల్’్తకు నీటి పథకాల ఆస్తులు, బాధ్యతలూ బదలాయింపు 3,386 కొత్త పోస్టుల కోసం{పతిపాదనలు హైదరాబాద్: పట్టణాల్లో నీటి సరఫరా బాధ్యతల నుంచి మున్సిపాలిటీలను పూర్తిగా తప్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నీటి సరఫరాలో మున్సిపాలిటీల ఘోర వైఫల్యం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాల్లో ఈ బాధ్యతలను ‘పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం’ (పీహెచ్ఈడీ)కు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు పీహెచ్ఈడీ కేవలం తాగునీరు, మురుగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకే పరిమితమైంది. పీహెచ్ఈడీ నిర్మించిన పథకాల నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) బాధ్యతలు మున్సిపాలిటీలు చూసేవి. అయితే, మున్సిపాలిటీల ఇంజనీర్లకు సరైన అర్హతలు, అనుభవం, నైపుణ్యం లేకపోవడంతో పట్టణ నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు మునిసిపాలిటీల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు, ఇతరత్రా పనుల బాధ్యతలు కూడా మున్సిపల్ ఇంజనీర్లే చూస్తుండడంతో నీటి సరఫరాపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోని నీటి సరఫరా పథకాల సామర్థ్యం క్షీణించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో నీటి పథకాల పర్యవేక్షణ, నిర్వహణ లోపాల వల్ల ఇంటేక్ వెల్స్ నుంచి ముడి నీటి సరఫరా, శుద్ధి చేసిన నీటి సరఫరా, పైప్లైన్లు, పంపింగ్ వరకు అంతటా లోపాలున్నట్లు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో నీటి సరఫరాను ‘పీహెచ్ఈడీ’ విభాగానికి బదలాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పట్టణ నీటి సరఫరా బాధ్యతలు స్వీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కావాల్సిన అదనపు పోస్టులపై ఇటీవల సీఎంఓకు ప్రతిపాదనలు సమర్పించారు. మునిసిపాలిటీల అధీనంలో ఉన్న ఇంటేక్ వెల్స్, నదులు, కాల్వలు, వేసవి నిల్వ ట్యాంకులు, ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్, పంపింగ్ పరికరాలు, పంపింగ్ మెయిన్స్, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర మౌలిక సౌకర్యాలను పీహెచ్ఈడీకు బదలాయించాలని కోరారు. ఈ అవసరాల కోసం 3,386 కొత్త పోస్టులు కావాలని ప్రతిపాదించింది. జల మండలి తరహాలో.. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పట్టణాల్లోని నీటి సరఫరాను ‘పీహెచ్ఈడీ’ విభాగాధిపతి, చీఫ్ ఇంజనీర్ నేరుగా పర్యవేక్షిస్తారు. మునిసిపల్ కమిషనర్ల, మునిసిపల్ ఇంజనీర్ల జోక్యం ఉండదు. హైదరాబాద్‌లో నీటి సరఫరా పర్యవేక్షిస్తున్న జల మండలి తరహాలో ఈ వ్యవస్థ పనిచేయనుంది. ప్రతి జిల్లాకో సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను నియమించడంతో పాటు రెండు డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. నల్లా కనెక్షన్ల జారీ, బిల్లుల వసూళ్లు సైతం ఇదే విభాగం చూడనుంది. -
నేడు, రేపు మెట్రో రెడ్‌లైన్‌కు అంతరాయం
- మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగానే - 9, 10 తేదీల్లో 18 నిమిషాలకొక రైలు సాక్షి, న్యూఢిల్లీ: వారాంతం రోజుల్లో చేపట్టనున్న మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగా తీస్‌హజారీ - ఇందర్‌లోక్ స్టేషన్ల మధ్య మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ శని, ఆది వారాల్లో రెడ్ లైన్ (లైన్ 1)పై ఉన్న ఈ రెండు స్ట్టేషన్ల మధ్య రైళ్లు సింగిల్ లైన్‌పై నడుస్తాయి. దీంతో మధ్యలో ఉన్న మూడు స్టేషన్లు -పుల్బంగష్, ప్రతాప్‌నగర్, శాస్త్రీ నగర్ స్టేషన్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి. మరమ్మతు పనుల కారణంగా 9వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు, పదో తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దాదాపు 18 నిమిషాలకొక రైలు నడుస్తుందని మెట్రో ప్రతినిధి తెలిపారు. పుల్బంగష్, ప్రతాప్‌నగర్ మెట్రో స్టేషన్ల మధ్య కొనసాగుతున్న మెయిం టెనెన్స్ పనుల కారణంగా వారాంతం రైలు సేవలు ప్రభావితం కానున్నట్లు ఆయన చెప్పారు. ‘సాధారణంగా మెయింటెనెన్స్, మరమ్మతు పనులను తాము రాత్రి పూట చేపడుతుంటాం. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. అయితే కొన్ని సార్లు రైళ్లు నడిచే వేళల్లో కూడా మెయింటెనెన్స్ పనులు చేపట్టాల్సి వస్తుంది. అప్పుడు తాము ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే వేళల్లో పనులు చేపడతాం’ అని మెట్రో ప్రతినిధి తెలిపారు. -
'చెత్త' బజార్లు!
హైదరాబాద్: ఓ వైపు 'స్వచ్ఛ భారత్' అంటూ సర్కార్ హడావుడి చేస్తుంటే... మరోవైపు పారిశుద్ధ్యంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చిత్తశుద్ధి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే పలు రైతుబజార్లలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఇవి అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రోజుల తరబడి చెత్తను తొలగించని కారణంగా దుర్గంధం వెదజల్లుతూ వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి చెత్తను ఏరోజుకారోజు తొలగించకపోవడంతో ఆ ప్రాంతం దుర్గంధమయమైంది. వినియోగదారులు ముక్కు మూసుకొని కూరగాయలు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు ముక్కుకు గుడ్డకట్టుకొని అక్కడే విక్రయూలు సాగిస్తున్నారు. ఇక్కడ పోగయ్యే చెత్తను ఒక్కరోజు తొలగించకపోరుునా మరునాడు పరిస్థితి దుర్భరంగా తయూరవుతోంది. కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఇక్కడి చెత్తను తొలగించడంపై కాంట్రాక్టర్ శ్రద్ధ చూపట్లేదని తెలుస్తోంది. నెలకు సుమారు రూ.55 వేలకు పైగా బిల్లు చెల్లిస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో రైతుబజార్లో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీనికితోడు అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్స్‌ను ఏరోజు కారోజు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కూరగాయలు కుళ్లిపోరుు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర ఆకుకూరలు, కూరగాయల వ్యర్థాలు ఎర్రగడ్డ రైతుబజార్లో అడుగడుగునా కన్పిస్తున్నాయి. అన్నింటా అదే పరిస్థితి... నగరంలోని మిగతా రైతుబజార్లలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇలాగే ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో చెత్త తొలగింపు కాంట్రాక్టును కొత్తగా చేపట్టిన వ్యక్తి తగినంతమంది సిబ్బందిని నియమించట్లేదని తెలిసింది. ఇక్కడ పెద్దమొత్తంలో పోగయ్యే చెత్తను బయటకు తరలించే బాధ్యతను కూడా అతనికే అప్పగించారు. అయితే... ఈ తరలింపు ఒక్కరోజు ఆగినా పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ప్రైవేటు కాంట్రాక్టర్లు తగినంత వేతనం ఇవ్వట్లేదన్న కారణంతో పలు రైతుబజార్లలో పనిచేస్తున్న స్వీపర్లు మధ్యలోనే మానేస్తున్నారు. దాంతో సరూర్‌నగర్, అల్వాల్, వనస్థలిపురం, మీర్పేట్, ఫలక్‌నుమా రైతుబజార్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. తగినంతమంది సిబ్బంది లేని కారణంగా 2, 3 రోజులకోసారి ఈ పనులు జరుగుతుండటంతో పలు రైతుబజార్ల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారుతోంది. యూజర్ చార్జీకి డిమాండ్ రైతుబజార్లలో పోగయ్యే చెత్తను తొలగించేందుకు యూజర్ చార్జీలు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతుబజార్ల నుంచి చెత్తను ఉచితంగానే తొలగిస్తున్నా.... హైద రాబాద్ పరిధిలోని ఎర్రగడ్డ రైతుబజార్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.2వేలు జీహెచ్ఎంసీ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రైతుబజార్లు కూడా యూజర్ఛార్జీ చెల్లిస్తేనే డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేస్తామని అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్లు తెగేసి చెబుతుండటంతో రైతుబజార్ సిబ్బంది బిక్కమొహం వేస్తున్నారు. -
రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం
►రూ.384 కోట్లతో 11,212 రోడ్ల అభివృద్ధి ►14,657 కిలోమీటర్ల మేర మట్టి పనులు హైదరాబాద్: మొరం, మట్టి పనుల పేరుతో కోట్లాది నిధులను రోడ్లపై వెదజల్లేందుకు రంగం సిద్ధమైంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో భాగంగా భారీ ఎత్తున మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన చేపట్టాలన్న సాకుతో పార్టీ శ్రేణులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ద్వారాలు తెరిచింది. ఇందుకోసం ఇటీవలే రూ. 384.61 కోట్లను సర్కారు కేటాయించింది. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్(ఎంఆర్ఆర్) గ్రాంటు నుంచి ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో రాష్ట్రవ్యాప్తంగా 11,212 రోడ్ల మరమ్మతుల్లో భాగంగా దాదాపు 14,657.23 కిలోమీటర్ల మేర మట్టి, మొరం పోసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులు కావడంతో నిబంధనల ప్రకారం వీటిని నామినేషన్ పద్ధతిన అప్పగిస్తారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ పేరిట తీర్మానం చేసిన కాంట్రాక్టర్లే ఈ పనులు దక్కించుకుంటారు. దీంతో మండల, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీ నేతలకు పనుల పండుగ మొదలైంది. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే తతంగం కావడంతో నిధులన్నీ ‘గులాబీ’ కాంట్రాక్టర్లకే పంచిపెట్టనున్నారు. మొరం, మట్టి పోసే పనులు కావడంతో ఆనవాళ్లు లేకుండా ఈ నిధులను పార్టీ కార్యకర్తలకు ఫలహారంగా పంచి పెట్టడం ఖాయమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ విభాగం ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.20 లక్షలకు మించి అంచనా వ్యయమయ్యే రోడ్ల పనులను సైతం రూ.5 లక్షల విలువైన పనులుగా విభజించిన తీరు ఈ పంపకాల లోగుట్టును బయటపెడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలంలో గంగాపూర్ నుంచి బీర్నాడీ ఎర్రచింతల్ వరకు రూ.15.88 లక్షల ఖర్చుతో అంచనా వేసిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పనులను నాలుగు బిట్లుగా విడగొట్టారు. రూ.5 లక్షల అంచనా వ్యయం దాటకుండా ఒకే పనిని నాలుగు పనులుగా మంజూరీ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి నుంచి కొండన్నపేట రోడ్డు పనులను రూ.5 లక్షలు మించకుండా మూడు బిట్లుగా విడగొట్టారు. ఇదే తీరుగా ప్రతి జిల్లాలో వందలాది పనులను వేలాది పనులుగా విభజించి పంపిణీకి అనువుగా పరిపాలక ఉత్తర్వులను జారీ చేశారు. కార్యకర్తలకు కరువు తీరా.. గతంలో మండలం యూనిట్‌గా పనులను విభజించి కోటికిపైగా అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ విభాగం రూపొందించిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదించింది. భారీ ప్యాకేజీలతో బడా కాంట్రాక్టర్లు, బీటీ హాట్‌మిక్స్ ప్లాంట్లు ఉన్న వారు మాత్రమే టెండర్లలో పాల్గొనే లా నిబంధనలను సవరించింది. దీంతో రాజకీయ నేతలకు సంబంధించిన కాంట్రాక్టు ఏజెన్సీలే ఈ పనులను సునాయాసంగా దక్కించుకున్నాయి. దీనికితోడు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను పంచుకునేందుకు అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే పోటీపడ్డారు. దీంతో గ్రామస్థాయిలో చోటామోటా కాంట్రాక్టర్లకు పనుల కరువు ఏర్పడింది. కిందిస్థాయి కార్యకర్తల్లోని అసంతృప్తిని గమనించిన సర్కారు తాజాగా గ్రామీణ రోడ్ల పనులకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం మరమ్మతు చేపట్టే రోడ్లలో 30 శాతం ఇప్పటికే కంకర(మెటల్) రోడ్లుగా మారాయి. ఇప్పటికే రూ.225.11 కోట్లతో ఈ రోడ్ల అభివృద్ధి జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈజీఎస్ అప్‌గ్రేడేషన్ పేరుతో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. అయితే ఇప్పటికే మెటల్ రోడ్లుగా మారిన వాటిని సైతం తాజాగా మట్టి పనులు చేపట్టే రోడ్ల జాబితాలో ఉన్నాయి. వీటిని రద్దు చేస్తారా లేక మట్టి పోసినట్లు బిల్లులు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే చేపట్టిన పనులుంటే రద్దు చేయాల్సి ఉంది. కానీ నిధుల పంపిణీ కోసమే చేపట్టిన పనులు కావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పంచాయతీరాజ్ విభాగం అధికారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లా రోడ్ల సంఖ్య కిలోమీటర్లు నిధులు(రూ. కోట్లలో) ఆదిలాబాద్ 1,169 1,363.20 43.87 కరీంనగర్ 1,386 1,833.03 53.43 ఖమ్మం 883 978.70 33.02 మహబూబ్‌నగర్ 1,587 2,421.56 51.98 మెదక్ 1,340 1,458.09 48.08 నల్గొండ 1,562 2,399.59 49.00 నిజామాబాద్ 1,059 1,207.77 33.99 రంగారెడ్డి 933 1,269.91 28.69 వరంగల్ 1,293 1,725.38 42.55 ----------------------------------------------- మొత్తం 11,212 14,657.23 384.61 ---------------------------------------------- అధికార పార్టీ శ్రేణులకు పనుల పండుగ రోడ్ల మరమ్మతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఫలహారంలా నిధుల పంపిణీకి ఎత్తుగడ రూ.5 లక్షల్లోపు బిట్లుగా పనుల విభజన నామినేషన్ పద్ధతిన గులాబీ నేతలకు కట్టబెట్టే వ్యూహం -
ఉత్తిపోతలే...!
నిర్వహణ లోపంతో వట్టిపోయిన లిఫ్ట్‌లు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సన్న, చిన్నకారు రైతుల అభివృద్ధి లక్ష్యంగా బలహీనవర్గాలు, షెడ్యూల్డు కులాలు, తెగలకు లబ్ధి చేకూర్చేందుకు నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. సమష్టి వ్యవసాయ పథకం కింద ఎగువ తట్టు, కరువు పీడిత ప్రాంతాల కు సాగునీరందించడం ఈ ఎత్తిపోతల పథకాల ఉద్దేశం. ఐడీసీ పర్యవేక్షణ లో పం, రైతు సొసైటీల్లో రాజకీయాలు, నిధుల లేమి, విద్యుత్‌కోతలు లిఫ్టుల నిర్వహణకు అడ్డంకిగా తయారయ్యా యి. దీంతో మహబూబ్‌నగర్ లాంటి క రువుపీడిత ప్రాంతాలకు సాగునీరందించాల్సిన లిఫ్టులు మూతపడ్డాయి. ఐడీసీ లెక్కల ప్రకారం జిల్లాలో 1980 నుంచి ఇప్పటివరకు రూ.164.64 కోట్లతో 45 ఎత్తిపోతలు నిర్మించారు. 82,267 ఎకరాల ఆయకట్టుకు లిఫ్టులు సాగునీరందించేలా ప్రణాళిక రూపొందిం చారు. 10వేల ఎకరాల లోపు ఆయకట్టున్న లిఫ్టుల నిర్వహణ ఆరంభంలో ఐడీసీ స్వయంగా నిర్వహించేది. అయితే లిఫ్టుల నిర్వహణ తలకుమించిన భారం కావడంతో 1995లో ఆయకట్టు రైతులతో కూడిన సొసైటీలకు అప్పగించా రు. సొసైటీ నిర్వహణలో రాజకీయాలకు తోడవడం తో చాలాచోట్ల లిఫ్టులు మూతపడ్డాయి. ఏళ్లతరబడి సొసైటీల ఎన్నికలు జరగకపోవడంతో పంపుసెట్ల మరమ్మతులు, కాల్వల్లో పూడికతీత వంటి పనులు మూలనపడ్డాయి. లి ఫ్టుల నిర్వహణకు డెడికేటెడ్ పవర్ లై న్సు (ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్లు) ఏర్పాటు చేసి రోజుకు కనీసం 16 గంటలు నిరంతర విద్యు త్ సరఫరా చే యాల్సి ఉంది. ఎల్టీ లైన్లున్న చోట విద్యుత్ కోతలతో నిర్దేశిత ఆయకట్టులో పావువంతుకు కూడా ప్రయోజనం చేకూరడం లే దు. ఎల్టీ లైన్లకు ఉచితవిద్యుత్ ఇస్తున్నామనే సాకుతో కోత లు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. హెచ్‌టీ లైన్లున్న లిఫ్టులను వి ద్యుత్బిల్లుల బకాయిలు వెంటాడుతున్నాయి. ఈ యేడాది జూన్ నుంచి (రాష్ట్ర విభజన జరిగిన తర్వాత) లిఫ్టుల విద్యుత్ బకాయిలు జిల్లాలో రూ.10 కోట్ల మేర పేరుకుపోయినట్టు ఐడీసీ అధికారులు చెబుతున్నారు. చోరీలతో రైతులు బెంబేలు గతంలో ఐడీసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, ఇతర సామగ్రి చాలాచోట్ల చోరీకి గురయ్యాయి. సొంతంగా డబ్బు లు పోగు చేసి తిరిగి యంత్ర సామగ్రి కొనుగోలు చేసినా రక్షణ లేకుండా పోయింది. మరోవైపు కాల్వల పూడికతీతకు నిధులు లేకపోవడంతో క్రమం గా ఆయకట్టు కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో లిఫ్టులు మూతపడుతున్నా సొసైటీలు నిస్సహాయతను వ్యక్తం చే స్తున్నాయి. లిఫ్టులు మూతపడిన చోట కొందరు రైతులు సొంతంగా మోటార్లు కొనుగోలు చేసి కృష్ణా తీరాన ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు ఆయిల్ ఇంజన్లతో సాగు కొనసాగిస్తుండడంతో రైతులపై ఆర్థికభారం పెరుగుతోంది. యంత్రసామగ్రి చోరుల పాలు మక్తల్ మండలంలో సాగునీరందించేందుకు 1987లో రూ.76లక్షలతో కృష్ణానదిపై పస్పుల ఎత్తిపోతల పథకం నిర్మిం చారు. 3,500ఎకరాలకు రెండు దశల్లో నీటిని లిఫ్ట్ చేసేందుకు మొదటి దశ పంప్‌హౌస్‌లో ఐదు, రెండోదశలో మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా..? లేనట్టా..?
- ఆసక్తి చూపని మహిళా సంఘం సభ్యులు - గతేడాది నిర్వహణ ఖర్చులు ఇంకా చెల్లించకపోవడమే కారణం - ఖర్చులు తాము భరించి అప్పుల్లో కూరుకుపోయామని మహిళల ఆవేదన - బకాయిలు చెల్లిస్తేనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ యాచారం: డ్వాక్రా సంఘాల మహిళలు ఈ ఏడాది మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిర్వహణ బిల్లులు ఇంకా చెల్లించకపోవడమే దీనికి కారణం. తమ బకాయిలు చెల్లించాలని డీఆర్డీఏ, సివిల్ సప్లై అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం కనబడకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వారం రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం మండలంలోని చింతపట్లలో ఉన్న పీఏసీఏస్ భవనాన్ని ఇందుకోసం అధికారులు పరిశీలించారు. కొన్నిరోజుల పాటు ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి శాశ్వత గిడ్డంగి లేకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యేటా ధాన్యం నిల్వలకు కొత్త కొనుగోలు కేంద్రాలు వెతకాల్సిన పరిస్థితి. చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లో గిడ్డంగి భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో భవనాలు మాత్రం నిర్మించలేదు. అందాల్సిన బకాయిలు రూ. 5 లక్షలు చాలా వ్యయప్రయాసలు కూర్చి మహిళలు ధాన్యం కొనుగోలు చేస్తున్నా వారికి మాత్రం లబ్ధి చేకూరడం లేదు. ధాన్యం కొనుగులు కేంద్రం నిర్వహణ కింద మ హిళా సంఘాలకు చెల్లించాల్సిన కమిషన్‌ను సకాలంలో విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. గతేడాది మొక్కజొన్న, ఈ ఏడాది జూన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి చింతపట్ల డ్వాక్రా సంఘం మహిళలకు రూ.5లక్షలకు పైగా నిర్వహణ బిల్లులు అందాల్సి ఉంది. డ్వాక్రా సం ఘాల మహిళలు కూలీల ద్వారా కొనుగోళ్లు జరిపించి అప్పులుచేసి వారికి డబ్బులు చెల్లించారు. నిర్వహణ చేపడితే లాభాలు వస్తాయని ఆశపడిన మహిళలకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారి అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది మొక్కజొన్న కొనుగోలు సంబంధించి రూ. లక్ష వరకు, వరి ధాన్యం కొనుగోలు జరిపినందుకు గాను రూ.4లక్షలకుపైగా బకాయి అందా ల్సి ఉంది. నిర్వహణ బిల్లులు ఇప్పించాలని చిం తపట్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు పలుమార్లు నగరంలోని అధికారులతోపాటు స్థానిక అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిం ది. దీంతో గత బకాయిలు చెల్లిస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఈసారి ముందుకు వస్తామని మహిళ సంఘం తేల్చిచెప్పింది. దీంతో మరో వారం రోజుల్లో మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అవుతుందా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. -
సుగమం
మైసూరు దసరా కథ సుఖాంతం సంబరాల నిర్వహణపై తొలగిన అనిశ్చితి రాజ ప్రాసాదం వెలుపల సంబరాలకు రాణి ప్రమోదా ఓకే మైసూరు : రాణి ప్రమోదా దేవి రాష్ట్ర ప్రభుత్వంపై అలక వహించారనే వార్తలతో విశ్వ విఖ్యాత దసరా సంబరాల నిర్వహణపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. దసరా నిర్వహణకు తాను వ్యతిరేకం కాదని రాణి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్‌తో కలసి ఆమె గురువారం ఇక్కడ అంబా విలాస్ ప్యాలెస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ ప్రాసాదం వెలుపల దసరా నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాణి తెలిపారు. దసరా సన్నాహాలపై ఆమెలో అసంతృప్తి చోటు చేసుకుంది. దీనిని పోగొట్టడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున మంత్రి ఆమెతో భేటీ అయ్యారు. దసరా వేడుకలకు హాజరు కావాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆమె మన్నించారని అనంతరం మంత్రి తెలిపారు. జంబూ సవారీకి అంబారీని ఇచ్చేది లేదని రాణి చెప్పలేదని వెల్లడించారు. గత డిసెంబరులో శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ కన్నుమూసినందున, రాజ ప్రాసాదంలో వేడుకలు వద్దని మాత్రమే తాను చెప్పానని రాణి వివరించారు. రాజ ప్రాసాదంలో వెలుపల దసరా సంబరాల నిర్వహణకు తనకు ఎటువంటి ఆక్షేపణ లేదని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని స్పష్టం చేశారు. రాజ ప్రాసాదం విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా దసరా సంబరాలను నిర్వహిస్తామని ఇదే సందర్భంలో మంత్రి తెలిపారు. -
బో‘ధన’మేది..?
ఖమ్మం/ఇల్లెందు : ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలి. అందుకోసం నూతన సిలబస్ ప్రవేశపెట్టాం. దీంతో బట్టీ విధానానికి స్వస్తి చెప్పి కృత్యాధార పద్ధతిలో బోధన జరుగుతుంది’ అని చెప్పిన ఉన్నతాధికారులు దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయడం లేదు. బోధనోపకరణాల కోనుగోలు, పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాలకు రావాల్సిన నిధుల జాడే లేదు. ప్రతి ఏటా పాఠశాల ప్రారంభంలోనే ఇచ్చే ఈ నిధులు మూడు నెలలు గడిచినా రాకపోవడంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో బోధనోపకరణాలు కొనుగోలు చేసి పాఠాలు చెపుతుండగా, మరికొన్ని పాఠశాలల్లో మూస పద్ధతిలోనే బోధిస్తున్నారనే అరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాలలకు సున్నాలు వేయడం, ఇతర ఫర్నిచర్ మరమ్మతు, స్టేషనరీ కొనుగోలు కూడా చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో టీఎల్ఎం(బోధనోపకరణాలు) గ్రాంట్స్ కింద ఒక్కో ఉపాధ్యాయుడికి ఏడాదికి రూ.500, ముగ్గురు ఉపాధ్యాయులుంటే రూ.2 వేలు విడుదల చేస్తారు. ఈ నిధులతో ఉపాధ్యాయులు బోధనకు అవసరమయ్యే సామగ్రి, పలు రసాయనాలు కొనుగోలు చేసి బోధనోపకరణాలు తయారు చేసి విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కృత్యాల తయారీ, ఇతర వస్తువుల తయారీలో విద్యార్థులను భాగస్వాములను చేస్తే పాఠ్యాంశం చదవడం ద్వారా సాధించే లక్ష్యాలను సులువుగా అర్థం చేరుకుంటారని విద్యానిపుణులు చెపుతున్నారు. ఈ నిధుల కింద 2011-12 విద్యా సంవత్సరానికి రూ. 45,63,500 విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఈ నిధుల విషయమే మర్చిపోయారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం నాటికి భవనాలను సుందరంగా తయారు చేయాలని, బడిపండుగ కార్యక్రమంలో పాఠశాలకు సున్నాలు వేయడం, విరిగిపోయిన ఫర్నిచర్ మరమ్మతు చేయించి నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాలి. ఇందుకోసం మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఒక్కో పాఠశాలకు మూడు గదులు ఉంటే రూ. 5వేలు, అంతకంటే ఎక్కువ గదులు ఉంటే రూ.10 వేలు మంజూరు చేస్తారు. 2013-14 విద్యాసంవత్సరానికి రూ. 2,23,30,000 గత సంవత్సరం జులైలోనే అందజేశారు. ఇక నిర్వహణ ఖర్చుల కింద ప్రాథమిక పాఠశాలకు రూ. 5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 12 వేలు, ఉన్నత పాఠశాలకు రూ. 7 వేలు మంజూరు చేస్తారు. ఈ నిధులు గత విద్యాసంవత్సరంలో రూ. 2,04,47,000 జులై నెలలోనే విడుదల చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు. ఈ నిధులు పాఠశాలల పునఃప్రారంభం నాటికే అందజేస్తే తరగతి గదులకు సున్నాలు వేయించడం, రంగుల అలంకరణ, విద్యుదీకరణ వంటి పనులు పూర్తిచేసి పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే అవకాశం ఉండేదని పలువురు ఉపాధ్యాయులు అం టున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ ఈ నిధులు రాకపోవడంతో వాటికోసం వేచ్చి చూడాల్సి వస్తోందని, చేతిలో నయాపైసా లేకుంటే పాఠశాలల నిర్వహణ కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసపద్ధతిలోనే బోధన.. బోధనోపకరణాల నిధులు మంజూరు చేయకపోవడంతో జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో మూస పద్ధతిలోనే బోధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు గుణాత్మక విద్యను అందించాలని, పాఠశాల స్థాయినుంచే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవగాహన పెంపొందించాలని, అందుకోసం కృత్యాలు, బోధనోపకరణాలు, ప్రయోగాలు చేయించాలని విద్యానిపుణులు భావించారు. దీనికి అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పు చేశారు. అయితే టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో పలువురు ఉపాధ్యాయుల తమ సొంత ఖర్చులతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అలా చేయలేని వారు పాత బోధనా పద ్ధతినే అవలంభిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టీఎల్ఎం, స్కూల్ గ్రాంట్స్, మెయింటెనెన్స్ గ్రాంట్స్ విడుదల చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అక్రమ సంతానమైనా జీవన భృతి చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: అక్రమంగా పుట్టిన సంతానమైనా వారి జీవికకు అవసరమైన భృతిని తండ్రి అయిన వ్యక్తి చెల్లించాల్సిందేనని ఢిల్లీలోని ఓ కోర్టు స్పష్టం చేసింది. బిడ్డ తల్లితో సెటిల్మెంట్ ఒప్పందం చేసుకుని వేరుపడినప్పటికీ.. ఆ బిడ్డకు భృతిని ఇవ్వకుండా తండ్రి తప్పించుకోజాలరని ఈ మేరకు ఓ కేసులో కింది కోర్టు తీర్పును అదనపు సెషన్స్ కోర్టు సమర్థించింది. బిడ్డ పుట్టకముందే తల్లికి తాను రూ.50 వేలు చెల్లించి సెటిల్మెంట్ ఒప్పందం చేసుకుని వేరుపడ్డానని, అందువల్ల ఆ బిడ్డ బాగోగులు చూడాల్సిన బాధ్యత తనకు లేదంటూ పిటిషనర్ చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు. బిడ్డ జనన ధ్రువపత్రంలో తండ్రిగా అతడి పేరే ఉందని, ఇతర ఆధారాలను బట్టి చూసినా ప్రాథమికంగా ఆ బిడ్డకు పిటిషనరే తండ్రిగా తెలుస్తోందని జడ్జి అభిప్రాయపడ్డారు. డీఎన్ఏ పరీక్షకు కూడా ఆదేశించినా.. అది విచారణలో భాగమని, ప్రస్తుతం సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం.. చట్టబద్ధమైన బిడ్డ మాదిరిగానే ఆ బిడ్డకు కూడా నెలకు రూ. 2 వేల చొప్పున భృతిని చెల్లించాలని జడ్జి ఆదేశించారు. -
ఇల్లు నేలపై.. అద్దె ఆకాశంలో!
హైదరాబాద్‌లో నిలువ నీడ కష్టమైపోతోంది. వేల రూపాయలు గుమ్మరిస్తేగానీ పట్టుమని మూడు గదులు దొరకని దుస్థితి ఏర్పడింది. ఏడాదిలో నగరంలో ఇంటి అద్దెలు 20 శాతం పెరిగాయని నగరంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. నింగినంటిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులను విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను పెంపును సాకుగా చూపి ఇష్టారాజ్యంగా ఇంటి కిరాయిలు పెంచుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి 20 శాతం వరకు అద్దెలు పెరగడం మున్నెన్నడూ చూడలేదని పలువురు ఆవేదన చెందడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. - సాక్షి, హైదరాబాద్ మన రాష్ట్రం నుంచే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్‌లో నివాసముండేందుకు ఇష్టపడతారు. అందరూ ఇక్కడ సొంతిల్లు కొనేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో అద్దె ఇళ్లపై ఆధారపడతారు. దీంతో నగరంలో ఏటా అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అద్దె ఇళ్లను వెతికేందుకు ప్రత్యేకించి వ్యాపారాలు వెలిశాయంటే వీటి గిరాకీని అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో అద్దెలు.. నగరంలో ఆధునాతన సౌకర్యాలతో నిర్మితమవుతున్న అపార్ట్మెంట్లలో అద్దెలు ఆకాశంలో విహరిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ అద్దె రూ.4 వేలకు పైగానే ఉంది. డబుల్ బెడ్ రూమ్ అయితే రూ.6 వేలకు పైగా పలుకుతోంది. లిఫ్టు, మెయింటెనెన్స్ చార్జీలు అదనంగా మరో వెయ్యి వదిలించుకోవాల్సిందే. కంటోన్మెంట్, తార్నాక, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాలు, సాధారణ కాలనీల్లోనూ ఓ మోస్తరు అద్దెలు పలుకుతున్నాయి. రోజుకూలి చేసుకునే వారి ఆదాయంలో సగం ఇంటి అద్దెకే సరిపోతుండడంతో ఆర్ధాకలితో ఆలమటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజల పరిస్థితీ ఇంచుమించు ఇదే. దీనికి తోడు నగరంలో చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులు కూడా అద్దె గదులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికీ కాస్త అందుబాటులో ఉండే ఇల్లు కావాలంటే నెలకు రూ.4 వేలకు పైగానే చెల్లించుకోవాలి. లేదంటే శివారు ప్రాంతాలే గతి. విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నే కారణం.. నగరంలో ఏడాదిలో 20 శాతం ఇంటి అద్దెలు పెరిగాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి వంటి పోష్ కాలనీల్లో 2010-11 మధ్య కాలంలో సింగిల్ రూమ్ రూ.3,500 ఉండేది. కానీ ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఇంటి అద్దె రూ.5 వేలు పలుకుతోంది. ఏడాదిలో పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను పెంపు వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఇంటి యజమానులు చెబుతున్నారు. దీనికితోడు ఇంటి నిర్వహణ చార్జీలు అద్దెవాసులకు భారంగా మారుతున్నాయి. సాధారణంగా నిర్వహణ ఖర్చులను ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి వసూలు చేస్తుంటారు. ఒక్కో అపార్ట్మెంట్లో ఒక్కో తీరుగా ఉంటుంది. మలేసియా టౌన్షిప్లో అయితే చ.అ. రూ.1.75 పైసలతో పాటు నీటి బిల్లుకు మరో రూ. 500 అదనం. ఇది 2007లో రూ. 200 ఉండేది. కానీ పెరిగిన ధరల నేపథ్యంలో రుసుములను పెంచేశారు. సింగపూర్ టౌన్షిప్లో అయితే 1, 2, 3 పడక గదులకు వేర్వేరుగా నిర్వహణ రుసుములను వసూలు చేస్తున్నారు. త ్వరలోనే నిర్వహణ రుసుమును పెంచాలని సొసైటీ పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఇక సగటు జీవులుండే సాధారణ అపార్ట్మెంట్లను పరిశీలిస్తే.. నెలవారీ నిర్వహణ ఖర్చుల కింద రూ. 800 వసూలు చేసే చోట ఇప్పుడు రూ. 1,000కి పైగా చేరింది. ఇది రూ. 500 ఉన్న చోట అయితే రూ. 700లకు చేరింది. నియంత్రణేది.. పాత భవనాల అద్దె నియంత్రణ చట్టం అమలు హైదరాబాద్‌లో భూతద్ధం పెట్టి వెతికినా కనిపించదు. ఈ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తక్కువ అద్దెకు పాత భవనాలు (ప్రారంభించి 20 ఏళ్లు నిండిన) కేటాయిస్తుంటారు. పాత భవనాల వివరాలను జీహెచ్ఎంసీ సేకరించి జాబితా రూపొందిస్తుంది. దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు వీటిని కేటాయిస్తుంటారు. ఇష్టారాజ్యంగా అద్దె పెంచకుండా శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయాలన్నది ఈ చట్టం ఉద్దేశం. అందుకు విరుద్ధంగా ఎవరైనా అద్దె నిర్ణయించినా, పెంచినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది. -
‘ఆధార్’ ఉత్తర్వులు అంతా గ్యాస్
అమలు కాని ప్రభుత్వ ప్రకటనలు ఆధార్ ఉండాల్సిందేనంటున్న గ్యాస్ ఏజెన్సీలు విడుదల కాని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వినియోగదారులకు ఆన్లైన్ అవస్థలు కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు గ్యాస్‌కు ఆధార్ ముడిపెట్టొద్దని న్యాయస్థానం నేరుగా ఆదేశించినా పాలకులకు చీమకుట్టినట్టు ఉండదు.. ఆధార్ అవసరం లేదని ప్రకటనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఆందుకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం జారీ చేయదు.. ఏమో మాకు అధికారిక ఆదేశాలు రాలేదు ఆధార్ కార్డు ఆన్లైన్ చేయించుకోవాల్సిందేనంటూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ఒత్తిళ్లు.. వెరసి వినియోగదారులు అటు ఆధార్ ఆన్లైన్ చేయించలేక, ఇటు సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుక్కోలేక సతమతమవుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : గ్యాస్ సిలిండర్లు ఆరు ఇస్తామని, కాదు తొమ్మిది సరిపోతాయని, తాజాగా 12కు పెంచుతున్నామని వినియోగదారులను అయోమయానికి గురిచేసే నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రంలోని యూపీఏ సర్కార్ ఆధార్ విషయంలోనూ పొంతన లేకుండా వ్యవహరిస్తోంది. గ్యాస్ సిలిండర్ తదితర సబ్సిడీలకు ఆధార్‌తో ముడిపెట్టొద్దని ఇటీవల న్యాయస్థానాలు సైతం ఆదేశాలు ఇచ్చాయి. తాజాగా గత నెల 30న గ్యాస్‌కు ఆధారం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి రోజులు గడుస్తున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలు ఉత్త ‘గ్యాసే’నని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంవత్సర కాలంగా గ్యాస్ వినియోగదారులకు ఆధార్ లింకు సమస్య ఉన్నప్పటికీ సుమారు రెండు నెలలుగా మరింత ఒత్తిడి పెంచారు. దీంతో వినియోగదారులు ఆయా ఏజెన్సీల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ లింకు పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాము పడుతున్న కష్టాలను చూస్తూ కూడా కనీసం పట్టన ట్టు వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల ‘గ్యాస్ మంట’... జిల్లాలో విజయవాడ నగరంతో కలిపి 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 11.61 లక్షలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఆధార్ కార్డులు జారీ అయినవి 8,05,298 ఉంటే, 6,54,372 కనెక్షన్లకు మాత్రమే బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. మిగిలిన వినియోగదారులకు ఆధార్ లింక్ ప్రధాన సమస్యగా మారింది. గ్యాస్ బుక్ చేసుకుని ఏజెన్సీలకు రూ.1,215 చెల్లిస్తే ఒక్కో సిలిండర్‌కు రూ.750 సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్న మెలికఅనేక అవస్థలు తెచ్చిపెట్టింది. ఆధార్ లింక్ ఏర్పాటు చేయకముందు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను రూ.414కే గ్యాస్ సిలిండర్ అందేది. ఆధార్ లింక్ ఏర్పడిన తరువాత దాని ధర రూ.1,321కి చేరుకుంది. తాజాగా ఒకటో తేదీ నుంచి క్రూడాయిల్ ధరల తగ్గుదలతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,215 అయ్యింది. ఇప్పటికే ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సైతం గ్యాస్ రాయితీ జమకావడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు. తెరుచుకున్న గ్యాస్ ఏజెన్సీలు... కేంద్ర ప్రభుత్వ ప్రకటన తరువాత ఐదు రోజులుగా జిల్లాలోని చాలా గ్యాస్ ఏజెన్సీలకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం తరువాత ఏ ధరకు విక్రయించాలో తెలియక స్థానిక ఏజెన్సీలకు తాళాలు వేశామని పలు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. తాజాగా సోమవారం గ్యాస్ ధర తక్కువగా లభిస్తుందని ప్రతి ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. అయినా ఆన్లైన్లో వచ్చిన ధరలను బట్టి సిలిండర్ ధర రూ.1,215లకు విక్రయిస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం సైతం పాలకుల తీరుమాదిరిగానే పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం చెబుతున్నదానికి, ఆచరణకు పొంతన లేదు. ఆధార్ ఉన్నా సబ్సిడీ సక్రమంగా అందడంలేదు. ఆధార్ లింక్ చేయలేదని మొత్తం ధర వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రకటనలు వినియోగదారుల ఇబ్బందులు తొలగించేలా ఉంటే బాగుంటుంది. - మల్లెంపూడి వేదాద్రి, అనాసాగరం పనులు మానుకుని తిరుగుతున్నాం పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మేము ఆధార్‌లింక్ పుణ్యమా అని గ్యాస్ కంపెనీ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పని మానుకుని నెల రోజులుగా తిరుగుతూనే ఉన్నాం. అయినా ప్రయోజనం లేదు. ఆధార్ అక్కర్లేదని ప్రభుత్వం చెప్పింది. అదే మాట గ్యాస్ ఏజెన్సీలను అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటూ సబ్సిడీ లేకుండా వసూళ్లు చేస్తున్నారు. - షేక్ ఖాలేషా, నందిగామ ఆదేశాలు రాలేదు : డీఎస్వో గ్యాస్‌కు ఆధార్ కార్డు లింక్ అక్కర్లేదనే విషయమై అధికారికంగా ఎటువంటి ఆదేశాలూ రాలేదని జిల్లా పౌరసరఫరాల అధికారిణి పీబీ సంధ్యారాణి తెలిపారు. ఈ విషయమై సోమవారం ‘సాక్షి’ ఆమెను వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పత్రికల్లో చూశామని, వాటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా వచ్చాయా అనే విషయాన్ని గ్యాస్ కంపెనీలతో కూడా సంప్రదించినట్టు ఆమె వివరించారు. ఆదేశాలు వచ్చేవరకు ఆధార్ లింక్ నిబంధన కొనసాగుతుందని చెప్పారు. -
‘లింకు’ తెగిందా లేదా..?
‘ఆధార్’పై గందరగోళం గ్యాస్‌కు నగదు బదిలీ ఉన్నట్టా లేనట్టా? రద్దు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు వినియోగదారుల్లో అయోమయం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలా? వద్దా? నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారా? తాత్కాలికంగా నిలిపివేశారా? లేదా గడువు పొడిగించారా? ఇలా అనేక సందేహాలు ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. కేంద్ర ప్రకటన తరువాత ఆధార్ వ్యవహారం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. నగదు బదిలీ పథకానికి వివరాలను అనుసంధానం చేసుకోవాలో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం అధికారులకు అందలేదు. చమురు సంస్థలు కూడా ఆధార్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం ఒక నెల గడువు పెంచినట్లు సూత్రపాయంగా సమాచారమొచ్చినట్లు చెప్పుకొస్తున్నాయి. దానికి కూడా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నాయి. అధికారులు మాత్రం నగదు బదిలీకి అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉంటే.. గ్యాస్‌తో కేవలం ఆధార్‌ను 43 శాతం మంది అనుసంధానం చేసుకోగా, గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో 29 శాతం మంది అనుసంధానించుకున్నారు. నగదు బదిలీని నిలిపివేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని జేసీ ప్రవీణ్‌కుమార్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఒకవేళ నగదు బదిలీ పథకం అమలులో ఉంటే ఈ నెల 1వ తేదీ నుంచి అనుసంధానం చేసుకోని వినియోగదారులు నాన్ సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
కారు కోరిక తీరిందిలా...
ఏ కోరికైనా సరే! సరైన ప్లానింగ్ ఉంటే సాధించటం కష్టమేమీ కాదు. చిరుద్యోగులైనప్పటికీ అనురాధ, రాఘవ దంపతులు తమకిష్టమైన కారు కొనుక్కోగలిగారంటే ప్లానింగ్ వల్లే. ఇక్కడ కారు కొనటం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. కానీ... తాము అనుకున్న రీతిలో, అనుకున్న కారును... ఇంకా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్ మొత్తం నుంచి డౌన్‌పేమెంట్ వరకు, లోను వ్యవధి వరకు అంతా తాము ప్లాన్ చేసినట్లుగానే చేయగలిగారు వీళ్లిద్దరూ. అదెలా సాధ్యమైందో మీరూ చూడండి. ‘మా ఇద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలే. కారు కొనుక్కోవాలన్నది మా చిరకాల కోరిక. కొన్నాళ్లు ఆగినా... ఇక కొనేయాల్సిందేనని అనుకున్నాక ఎలా..? అనే ప్రశ్న తలెత్తింది. ముందు డౌన్‌పేమెంట్ గురించి ఆలోచించాం. మా ఇద్దరి జీతాల్లోంచీ నెలకు రూ.10 వేలు పక్కనపెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదని మాకు తెలుసు. అందుకని నెలవారీ వాయిదా రూ.10 వేలు మించకూడదనుకున్నాం. దాన్నిబట్టి డౌన్‌పేమెంట్‌గా ఎంత చెల్లించాలన్నదానిపైనా ఒక అవగాహనకు వచ్చాం. డౌన్‌పేమెంట్ ఎంత కావాలో తెలిసింది కనుక దానికోసం రెండేళ్లపాటు జీతాల్లో నుంచి కొంత మేర తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాం. మారుతి కారు కొనాలని ముందే అనుకున్నాం. కాకపోతే ఏ మోడల్ తీసుకోవాలన్నది మాత్రం అంత త్వరగా తేలలేదు. మా వారు దీనికోసం దాదాపు ఏడాది పాటు స్టడీ చేశారు. ప్రతి మోడల్ ఖరీదు... మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ ఆరా తీసి తెలుసుకున్నారు. మా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని... చివరకు స్విఫ్ట్ డిజైర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మొత్తం నగదు చెల్లించి కారు తీసుకునే అవకాశమెటూ లేదు. కాబట్టి రుణం తీసుకోక తప్పదు. అయితే మేం ఒక్కటే అనుకున్నాం. రుణం మూడేళ్లలో తీరిపోవాలి. ఈఎంఐ 10వేలు మించకూడదు. దాని ప్రకారమే మా ప్లానింగ్ సాగింది. ఇంకో విషయం చెప్పాలి. మేం బుక్ చేసుకున్నా కారు అంత సులువుగా రాలేదు. మారుతి ప్లాంటులో కార్మికుల సమ్మె వంటి గొడవల వల్ల డెలివరీకి దాదాపు ఏడాది పట్టేసింది. దాంతో బుక్ చేసినప్పుడున్న రూ. 7.6 లక్షల రేటు చేతికొచ్చేలోగా రెండు సార్లు పెరిగి రూ.7.8 లక్షలకు చేరింది. ఇలాంటివాటికి కూడా సిద్ధమై ఉండాలన్నది అప్పుడు తెలి సింది. మొత్తానికి ఏడాదిన్నర కిందట కారు చేతికొచ్చింది. మరో ఏడాదిన్నర గడిస్తే రుణం కూడా తీరిపోతుంది. క్రమం తప్పని పొదుపు... కొనాలనుకున్నదానిపై కొంత అధ్యయనం... బడ్జెట్ అదుపునకు ప్లానింగ్... ఈ మూడూ ఉంటే ఏదైనా కొనొచ్చని తెలుసుకున్నాం.’ - కామని అనూరాధ, హైదరాబాద్ ఇలాంటి విజయగాథలు మీకూ ఉంటే మాతో పంచుకోండి. మీ వివరాలతో సాక్షి కార్యాలయానికి లేఖ రాయండి. లేదా business@sakshi.comకి ఈమెయిల్ కూడా పంపవచ్చు. -
అమ్మను ‘చంపేశారు’
నవమాసాలు మోసి కని, పెంచిన తల్లి ఆ కొడుకులిద్దరికీ భారమైంది. ఆమె ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములు బాగోగులు చూడడం మరిచారు. బుక్కెడన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. వృద్ధాప్యంలో వండుకుని తినే ఓపిక లేని ఆమె పలుమార్లు అస్వస్థతకు గురై శనివారం రాత్రి ఈ లోకాన్ని విడిచివెళ్లింది. రామగుండం, న్యూస్‌లైన్ : రామగుండం పాతబజార్‌కు చెం దిన గద్ద రత్నయ్య- రుక్కమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రత్నయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసి కొంతకాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు రాజన్న, శ్రీనివాస్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఆస్తిని పం చుకుని తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆమెను ఒక్కదానికి పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి బయటకు పంపా రు. ఓ రేకులషెడ్డు వేసిచ్చి, ఇంటిని అద్దెకిచ్చారు. వచ్చిన డబ్బులను కలిసి పం చుకుంటున్నారు. కానీ తల్లి బాగోగులు చూడడం మరిచారు. వృద్ధాప్యంలో సత్తువ లేకుండా ఉన్న ఆమెకు ఇరుగుపొరుగు వారు అన్నం పెడుతున్నారు. పలుమార్లు అస్వస్థతకు గురైనా వారే ది క్కయ్యారు. ఇటీవల రుక్కమ్మ(70)కు జ్వరం రావడం, ఆరోగ్య పరిస్థితి మరిం త దిగజారడంతో స్థానికులు కుమారులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీ సులకు చెప్పారు. తబితా ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ ఆగస్టు 20న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఎస్సై అక్కడకు కు మారులను పిలిచి మందలించారు. తల్లి వెంట ఉండి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పారు. రెండురోజులపాటు చికి త్స చేయించిన వారు ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రుక ్కమ్మ అస్వస్థతతో కన్నుమూసింది. కుమారులపై కేసు.. కొడుకులు ఆదరించకపోవడంతోనే రుక్కమ్మ చనిపోయిందని, తమ విచారణలో ఈ విషయం వెల్లడైందని ఎస్సై శ్రీను తెలిపారు. వారిపై మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్-2007, సెక్షన్-24 కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిద్దరిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. -
ఎన్టీపీసీలో హోరాహోరీ
గోదావరిఖని, న్యూస్‌లైన్ : దక్షిణ భారతదేశంలో విద్యుత్ రంగంలో అతిపెద్దదైన రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు ఉద్యోగ సంఘం ఎన్నికల సందడి నెలకొంది. సె ప్టెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ప్లాంట్‌లో ని ఆపరేషన్స్, మెయింటనెన్స్, హెచ్ఆర్, ఫైనా న్స్, టె క్నికల్, బిజినెస్, సివిల్ తదితర 12 విభాగాలకు చెందిన 834 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో పూర్తికాగా గెలుపు కోసం ఉద్యోగ సంఘాలు ఉవ్విళ్లూరుతున్నాయి. 1980లో మొదలు ఎన్టీపీసీలో 1980 నుంచి గుర్తింపు సంఘం ఎన్నిక లు జరుగుతున్నాయి. 1979 నవంబర్ 14న అప్ప టి ప్రధాని మొరార్జీ దేశాయ్ రామగుండం ఎన్టీపీసీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణ సమయంలో పనిచేసే వంద మందితో 1980లో ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏ ర్పాటైంది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఒక్కటే ఉం డగా అందులో ఉండే 10 కీలక పదవులకు పోటీ ఉండేది. 1988లో తొలిసారిగా భారతీయ మజ్దూ ర్ సంఘ్(బీఎంఎస్)కు అనుబంధంగా మరో సం ఘాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి పదవులకు కాకుండా యూనియన్ల మధ్య పోటీ ప్రారంభమైంది. 1990లో జరిగిన ఎన్నికల్లో 1233 మంది ఉద్యోగులుండగా బీఎంఎస్ విజయం సాధించి రెండే ళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘంగా పని చేసింది. 1993లో తిరిగి ఎంప్లాయీస్ యూనియ న్ విజయం సాధించింది. ఈ యూనియన్‌లో ఉన్న కొంతమంది నాయకులు ఎవరికివారు వేరైపోయి జాతీయ కార్మిక సంఘాలకు అనుగుణంగా కార్మిక సంఘాలను ఎన్టీపీసీలో నెలకొల్పారు. అలా ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్, టీఎన్టీయూసీకి అనుబంధంగా ఎన్టీపీసీ తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూకు అనుబంధంగా ఎన్టీపీసీ యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్, హెచ్ఎంఎస్కు అనుబంధంగా ఎన్టీపీసీ డెమొక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ నెలకొల్పారు. ఎప్పుడు పోటాపోటీనే... 1995 నుంచి ఎన్టీపీసీలో అన్ని ఉద్యోగ సంఘాలు పోటీ చేయడం మొదలైంది. 1998లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీఎన్టీయూసీ బ్యానర్‌పై మిగతా సంఘాలు ఏకమై విజయం సాధించాయి. 2000లో ఐఎన్టీయూసీ, 2003లో సీఐటీయూ, 2005, 2007లో తిరిగి ఐఎన్టీయూసీ, 2010లో సీఐటీయూ (కార్మిక సంఘాల ఐక్య కూటమి) గెలుపొందాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉద్యోగ సంఘాల మధ్య గట్టి పోటీ ఏర్పడేది. కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగ సంఘం ఎన్నికలు 2010 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పరిధిలోకి ఎన్నికల నిర్వహణ వెళ్లింది.