హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో ఉన్న ప్యారిస్ కంపెనీ సాఫ్రాన్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్‌వో) కోసం అతిపెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సరీ్వసెస్ ఇండియా ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్‌లోని ఈ సెజ్‌లో లీజు ప్రాతిపదికన 23.5 ఎకరాల్లో లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ టర్బోఫ్యాన్ ఇంజన్స్ కోసం ఎంఆర్‌వో కేం్రద్రం రానుంది.
ఏటా 100 ఇంజన్లతో ప్రారంభమై 2035 నాటికి 300 ఇంజన్లకు సర్వీస్ చేయగలిగే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. 2023 సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలై 2025లో కార్యరూపం దాల్చనుంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే నాటికి 1,000 మందికి ఉపాధి కలి్పంచనుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కేంద్రం అతిపెద్ద ఎంఆర్‌వో ఫెసిలిటీ కానుందని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సపోర్ట్, సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొచియే తెలిపారు. జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ పార్క్‌లో ఇప్పటికే సాఫ్రాన్ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ కంపోనెంట్ తయారీ కేంద్రాలను స్థాపించింది.
Comments
Please login to add a commentAdd a comment