Aerospace sector
-
సాఫ్రాన్ అతిపెద్ద ‘ఎంఆర్వో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో ఉన్న ప్యారిస్ కంపెనీ సాఫ్రాన్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) కోసం అతిపెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సరీ్వసెస్ ఇండియా ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్‌లోని ఈ సెజ్‌లో లీజు ప్రాతిపదికన 23.5 ఎకరాల్లో లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ టర్బోఫ్యాన్ ఇంజన్స్ కోసం ఎంఆర్వో కేం్రద్రం రానుంది. ఏటా 100 ఇంజన్లతో ప్రారంభమై 2035 నాటికి 300 ఇంజన్లకు సర్వీస్ చేయగలిగే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. 2023 సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలై 2025లో కార్యరూపం దాల్చనుంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే నాటికి 1,000 మందికి ఉపాధి కలి్పంచనుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కేంద్రం అతిపెద్ద ఎంఆర్వో ఫెసిలిటీ కానుందని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సపోర్ట్, సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొచియే తెలిపారు. జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ పార్క్‌లో ఇప్పటికే సాఫ్రాన్ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ కంపోనెంట్ తయారీ కేంద్రాలను స్థాపించింది. -
‘ఆత్మనిర్భర్ భారత్‌కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్‌కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్‌గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ -
డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా
రూ.20 కోట్లతో తయారీ యూనిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఆర్ ఇండియా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ రంగానికి అవసరమైన ప్రత్యేక విడిభాగాల తయారీకై యూరప్ నుంచి అత్యాధునిక కోల్డ్ ఫోర్జింగ్ మెషీన్‌ను దిగుమతి చేసుకుంది. భారత్‌లో అరుదైన మెషీన్లలో ఇది ఒకటని కంపెనీ వెల్లడించింది. అన్ని రకాల ఫోర్జింగ్, ఎక్స్‌ట్రూషన్ పనులకు దీనిని వినియోగించొచ్చు. సొంతంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సైతం నెలకొల్పినట్టు ఎంఎస్ఆర్ ఇండియా తెలిపింది. ఇక జీడిమెట్లలో ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. మెషినరీకి రూ.8 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.12 కోట్లను కంపెనీ వెచ్చిస్తోంది. నెల రోజుల్లో ఉత్పాదన ప్రారంభం అవుతుంది. కొత్త యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్‌తోపాటు వాహన విడిభాగాలు, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్, కంజ్యూమర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ పరికరాల తయారీ రంగంపైనా సంస్థ దృష్టిసారిస్తుంది. -
రేపే.. మార్స్ చెంతకు మామ్!
-
రేపే.. మార్స్ చెంతకు మామ్!
ఉదయం 7:17 గంటలకు అంగారకయాత్రలో తుది ఘట్టం ఉపగ్రహంలోని ప్రధాన ఇంజన్ పరీక్ష విజయవంతం మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్ బెంగళూరు: భారత అంగారక యాత్రలో తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లోపే అంతరిక్ష రంగంలో భారత్‌కు చరిత్రాత్మక విజయం సొంతం కానుంది. సరిగ్గా రేపు(బుధవారం) ఉదయం 7:17:32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్యాన్) ఉపగ్రహం అరుణగ్రహం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించేందుకు సర్వం సిద్ధమైంది. పదినెలలుగా నిద్రాణస్థితిలో ఉన్న ఉపగ్రహంలోని ప్రధాన ద్రవ అపోజీ మోటారు(లామ్) ఇంజన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం తిరిగి మండించి విజయవంతంగా పరీక్షించింది. దీంతో అంగారక యాత్ర విజయంపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మామ్‌లోని 440 న్యూటన్ లామ్ ఇంజన్‌ను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు 4 సెకన్ల పాటు విజయవంతంగా మండించినట్లు ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు. ఈ పరీక్షలో ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 2.18 మీటర్ల చొప్పున తగ్గించామన్నారు. అంగారకుడి కక్ష్య దిశగా వెళ్లేలా ఉపగ్రహ మార్గాన్ని కూడా సవరించినట్లు తెలిపారు. అంగారకుడి చుట్టూ 5.4 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న గురుత్వాకర్షణ ప్రభావ క్షేత్రంలోకి మామ్ సోమవారం ప్రవేశించిందని, ప్రస్తుతం ఉపగ్రహం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. 24న ఉదయం అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైందన్నారు. కాగా, లామ్ ఇంజన్‌ను చివరిసారిగా గతేడాది డిసెంబరు 1న మండించారు. తర్వాత 300 రోజుల పాటు రోదసిలో నిద్రాణస్థితిలోనే ఉండటంతో దీనిని తిరిగి పనిచేయించడం అనేది అత్యంత కీలకంగా మారింది. ప్రధాన లామ్ ఇంజన్‌ను బుధవారం ఉదయం 24 నిమిషాల పాటు మండించడం ద్వారానే ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కి.మీ. నుంచి సెకనుకు 4.4 కి.మీ.లకు తగ్గించి అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అందుకే ఇది తిరిగి పనిచేయడం అత్యవసరంగా మారింది. ప్రత్యామ్నాయంగా.. ప్లాన్ బీ! ఒకవేళ అంగారకుడిని సమీపించే సమయంలో ప్రధాన లామ్ ఇంజన్ పనిచేయకపోతే..? అలాంటి పరిస్థితి ఎదురైతే గనక ప్రత్యామ్నాయంగా ప్లాన్ బీని కూడా ఇస్రో సిద్ధం చేసుకుంది. లామ్ ఇంజన్ పనిచేయకపోతే.. ఉపగ్రహంలో ఉన్న ఎనిమిది థ్రస్టర్లను ఎక్కువ సేపు మండించి అయినా మామ్‌ను అరుణుడి కక్ష్యలోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే అంగారకుడి కక్ష్యను చేరే సమయంలో మామ్ భూమికి 66.6 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా.. మార్స్‌కు ఆవలివైపు వెళుతుంది. ఫలితంగా 20 నిమిషాల పాటు దానికి భూమితో సంబంధాలు తెగిపోతాయి. మామూలుగా అయినా.. భూమి నుంచి మామ్‌కు ఆదేశాలు అందేందుకు 12 నిమిషాలు పడుతుంది. అందుకే.. మార్స్‌ను సమీపించగానే లామ్ ఇంజన్ మండటం మొదలయ్యేలా, అది పనిచేయని పక్షంలో థ్రస్టర్లు మండేలా శాస్త్రవేత్తలు ముందుగానే ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం మీద ప్లాన్ ఏ ప్రకారం వీలు కాకపోతే ప్లాన్ బీ ప్రకారం అయినా.. ఉపగ్రహం అంగారకుడి చుట్టూ దగ్గరగా 423 కి.మీ.(పెరిజీ), దూరంగా 80 వేల కి.మీ.(అపోజీ) ఉండే దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేర్చనున్నారు. మామ్ ప్రవేశాన్ని వీక్షించేందుకు మోదీ.. అరుణగ్రహం కక్ష్యలోకి మామ్ ప్రవేశించే కీలక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బెంగళూరులోని ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ‘ఇస్ట్రాక్’కు రానున్నారని సంస్థ వర్గాలు వెల్లడించాయి. మార్స్‌ను చేరిన మావెన్.. అమెరికాకు 18వ విజయం! మార్స్ వాతావరణం పైపొరలో నీరు, సీవోటూ ఎలా నాశనమయ్యాయన్న కోణంలో పరిశోధనలకు అమెరికా ప్రయోగించిన ‘మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలెటైల్ ఎవాల్యుయేషన్(మావెన్)’ ఉపగ్రహం సోమవారం ఉదయం అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇప్పటిదాకా అంగారకుడిపైకి నాసా 24 ఉపగ్రహాలను, రోవర్లను ప్రయోగించగా.. 7 విఫలమయ్యాయి. మావెన్ ప్రయోగంతో నాసాకు ఇది 18వ అంగారక విజయం. -
బంగ్లాదేశ్‌కు అంతరిక్ష రంగంలో భారత్ సహకారం
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మూడో సంయుక్త సంప్రదింపుల కమిటీ(జేసీసీ) సమావేశం శనివారమిక్కడ ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మంత్రులు సుష్మా స్వరాజ్, అబుల్ హసన్ మహమూద్ అలీలు పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో... బంగ్లాదేశ్‌కు పౌర అణు, అంతరిక్ష రంగాల్లో నైపుణ్యాన్ని అందజేసేందుకు భారత్ అంగీకరించింది. 2014 చివరి నాటికి ఢాకా-షిల్లాంగ్ బస్ సర్వీసు ట్రయల్ రన్‌ను చేపట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇరుదేశాల్లో దౌత్యపరమైన ప్రాతినిధ్యాలను పెంచేందుకు మంత్రులిద్దరూ అంగీకరించారు. అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న సరిహద్దు జిల్లాల కలెక్టర్ల సమావేశాలను ఒకసారి భారత్‌లో, మరోసారి బంగ్లాదేశ్‌లో విడతలవారీగా నిర్వహించాలన్న ప్రతిపాదననూ మంత్రుద్దరూ స్వాగతించారు. -
ఇస్రో విజయాలు జాతికి గర్వకారణం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంస ► సార్క్‌కు ఉపగ్రహాన్ని నిర్మిద్దాం ► అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలు పొరుగు దేశాలకు అందిద్దాం ► అంతరిక్ష ప్రయోగాలతో సామాన్యుడి జీవితాన్ని మార్చొచ్చు శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: స్వశక్తితో అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసుకున్న భారతదేశం మున్ముందు మరిన్ని ఎత్తులు అందుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. పేదరికం, ఉపాధి అవకాశాలు, ఆహార భద్రతలపై పోరాడుతున్న ఇరుగుపొరుగు దేశాలకు కూడా అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలను అందించేందుకు ‘సార్క్’ ఉపగ్రహాన్ని నిర్మించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలకు భారత్ అందించే అతిగొప్ప కానుక ఇదే అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం విజయవంతమైన తర్వాత శ్రీహరికోటలోని షార్‌లో మిషన్ కంట్రోల్ రూం నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇచ్చిన స్ఫూర్తితో చందమామపైకి ఉపగ్రహాన్ని పంపగలిగామని గుర్తుచేశారు. ఇటీవల మార్స్ గురించి తీసిన హాలీవుడ్ సినిమా ‘గ్రావిటీ’కి అయిన ఖర్చు కంటే మనం ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు పెట్టిన ఖర్చు చాలా తక్కువేనని ప్రధాని చతురోక్తులు విసిరారు. అంగారకుడిపైకి ప్రయోగించిన ఉపగ్రహం కొన్ని నెలల్లోనే అక్కడికి చేరుకోబోతోందని చెప్పారు. ఈ ప్రయోగాల విజయాలతో భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 26 నిమిషాల పాటు సాగిన ప్రధాని ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కొంతసేపు ఇంగ్లిష్, మరికొంతసేపు హిందీలో ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఉపనిషత్ల నుంచి ఉపగ్రహాల దాకా... ‘‘సైకిల్ మీద రాకెట్‌ను తీసుకెళ్లి ప్రయోగించే స్థాయి నుంచి ప్రారంభమైన మన అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా విజయాలు అందించే స్థాయికి చేరడం భారత జాతికే గర్వకారణం. భారతీయ సంస్కృతిలో అంతరిక్షంపై, గ్రహగతులపై లోతైన అవగాహన ఉంది. అందువల్లనే ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకూ దేశం ప్రస్థానం విజయవంతంగా సాగింది. ఈ దేశం వేల ఏళ్ల కిందటే ‘సున్నా’ను ప్రపంచానికి అందించింది. అదే లేకపోతే ప్రస్తుత విజ్ఞానం, ప్రగతి సాధ్యమయ్యే ప్రశ్నే ఉండేది కాదు. ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో వంద మైలురాళ్లను దాటి 71 ఉపగ్రహాలు, 43 ప్రయోగాలు కలిపి 114 ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉంది... అంతరిక్ష రంగం సమాజంలోని ఉన్నత వర్గాల వారికోసమే అన్న అపోహ కొందరిలో ఉంది. కానీ ఈ రంగానికి సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. జీఐఎస్ టెక్నాలజీ, స్పేస్ ఇమేజరీల ద్వారా మారుమూల కారడవుల్లో ఉన్న వారికి కూడా విద్య, వైద్యం అందించే అవకాశమేర్పడింది. భూ రికార్డులకూ స్పేస్ టెక్నాలజీ ఇస్రో శాస్త్రవేత్తలు జీపీఎస్ తరహాలో భారతీయ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. మనె ఏడాది లోపు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి దేశంలోని భూమి తాలూకు రికార్డులన్నింటినీ స్పేస్ టెక్నాలజీ ద్వారానే సిద్ధం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. మానవ వనరుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువతను అంతరిక్ష రంగంవైపు ఆకర్షితులను చేసేందుకు తగిన కార్యక్రమాలు రూపొందించాలి. ఇందుకోసం ఇంటరాక్టివ్ డిజిటల్ స్పేస్ మ్యూజియాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలి’’ అని ప్రధాని తన ప్రసంగంలో సూచనలు చేశారు. శాస్త్రవేత్తలతో ఉత్సాహంగా.... ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరంకంట్రోల్ రూమ్‌లోని శాస్త్రవేత్తలను కలసి ముచ్చటించారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సీనియర్ శాస్త్రవేత్తలను ఒకొక్కరిని పరిచయం చేయగా ప్రధాని వారితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలుకరించారు. పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రమే షార్కు చేరుకున్న ప్రధాని స్పేస్ టెక్నాలజీపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాత్రి 7:15 గంటల నుంచి షార్‌లోని పలు విభాగాలను సందర్శించి విశేషాలు తెలుసుకున్నారు. మొదట ప్రయోగవేదికపై నింగిలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ23, రెండో ప్రయోగ వేదికపై అనుసంధాన దశలో ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌తో పాటు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ప్రయోగం పూర్తయ్యాక చెన్నైకి రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ఉదయం 10.30 గంటలకు నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన ఆయన హెలికాప్టర్లో చెన్నైకి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుు, ఇస్రో రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్‌లు వీడ్కోలు పలికారు.