డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా | MSR India enters into forging to tap aerospace & defence industry | Sakshi
Sakshi News home page

డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా

Published Tue, May 3 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా

డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా

రూ.20 కోట్లతో తయారీ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఎంఎస్‌ఆర్ ఇండియా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ రంగానికి అవసరమైన ప్రత్యేక విడిభాగాల తయారీకై యూరప్ నుంచి అత్యాధునిక కోల్డ్ ఫోర్జింగ్ మెషీన్‌ను దిగుమతి చేసుకుంది. భారత్‌లో అరుదైన మెషీన్లలో ఇది ఒకటని కంపెనీ వెల్లడించింది. అన్ని రకాల ఫోర్జింగ్, ఎక్స్‌ట్రూషన్ పనులకు దీనిని వినియోగించొచ్చు. సొంతంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సైతం నెలకొల్పినట్టు ఎంఎస్‌ఆర్ ఇండియా తెలిపింది.

ఇక జీడిమెట్లలో ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. మెషినరీకి రూ.8 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.12 కోట్లను కంపెనీ వెచ్చిస్తోంది. నెల రోజుల్లో ఉత్పాదన ప్రారంభం అవుతుంది. కొత్త యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్‌తోపాటు వాహన విడిభాగాలు, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్, కంజ్యూమర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ పరికరాల తయారీ రంగంపైనా సంస్థ దృష్టిసారిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement