'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి' | Father must maintain son only till he's 18: Gujarat HC | Sakshi
Sakshi News home page

'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి'

Published Sat, Mar 19 2016 3:03 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి' - Sakshi

'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి'

అహ్మదాబాద్: పద్దెనిమిదేళ్లు దాటిన కొడుకు బాధ్యతను తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వయసుకు వచ్చిన కుమారులకు వారి సంపాధన వారే చూసుకోవాలని చెప్పొచ్చని తెలిపింది. అయితే, ఆ కొడుకు మానసికంగా, శారీరకంగా బలహీనమైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. కానీ, కూతురు విషయంలో ఈ నిబంధన వర్తించదని, ఆడపిల్ల మైనారిటీ తీరినా ఆమె వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులే చూసుకోవాలని చెప్పింది.

గుజరాత్లో వైద్యుడిగా పనిచేస్తున్న దినేశ్ ఓజా అనే వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. 2006లో ఆయనకు తన భార్యకు విడాకులు అయ్యాయి. ఆ సమయంలో 18 ఏళ్లు వచ్చే వరకు కొడుకు బాధ్యతను ఆ వైద్యుడే చూసుకోవాలని అలహాబాద్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో అతడు తన కుమారుడికి 18 ఏళ్లురాగానే 2013 అక్టోబర్ నెల నుంచి చెల్లింపులు ఆపేశాడు. ఈ చర్యతో తన మాజీ భార్య మరోసారి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా హైకోర్టును ఆశ్రయించండని చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు వెళ్లగా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏతల్లిదండ్రులయినా కేవలం 18 ఏళ్ల వరకు కుమారుడిని చూసుకుంటే సరిపోతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement