విమానయాన రంగంలో ఉన్న ఎయిర్‌బస్ ఢిల్లీ సమీపంలో సుమారు రూ.260 కోట్లతో పైలట్, మెయింటెనెన్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయనుంది. 2018లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ సెంటర్‌కు 10 ఏళ్లలో 8,000 మంది పైలట్లు, 2,000 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎయిర్‌బస్‌కు ఇప్పటికే బెంగళూరులో మెయింటెనెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ 2007 నుంచి ఇప్పటి వరకు 2,750 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో వారానికి సగటున ఒక ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇక్కడి ఆపరేటర్లకు డెలివరీ చేసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది.