Training Center
-
ఫైరింగ్ శిక్షణలో అపశ్రుతి.. ఇద్దరు ‘హైదరాబాద్’ అగ్నివీరుల మృతి
నాసిక్: మహారాష్ట్రలోని దేవ్లాలీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో శిక్షణ సమయంలో చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు అగ్నివీర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ ఫైరింగ్ రేంజ్లో శుక్రవారం అగ్నివీర్లకు ఫీల్డ్ గన్ ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నారు. అనుకోకుండా పేలి తూటాలు తగలడంతో గన్నర్ గోహిల్ విశ్వరాజ్ సిన్హ్(20), గన్నర్ సైకత్(21) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని దేవ్‌లాలీలోని ఆస్పత్రికి తరలించారు. వారు అప్పటికే చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు హవల్దార్ అజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణాలుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవ్లాలీ క్యాంప్ పోలీసులు తెలిపారు. ఘటనపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. -
పారా స్పోర్ట్స్ శిబిరంలో సినీ నటి రెజీనా సందడి (ఫొటోలు)
-
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
పాక్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది. సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు. బలోచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్‌తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. -
‘మహా’ జలదృశ్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్పు తేవాలనే ఉన్నత లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పనిచేస్తోందని, దేశ రైతాంగం బాగుపడేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తోందని... కృష్ణా, గోదావరి నదులకు పుట్టినిల్లయిన మహారాష్ట్రలో ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ‘మహారాష్ట్ర, తెలంగాణ వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తుండగా నదుల్లో సుమారు 70 వేల టీఎంసీల నీరు సాగు, తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 20 వేల టీఎంసీల నీటినే ఉపయోగించుకుంటున్నాం. చైనా, ఈజిప్ట్, అమెరికా, జింబాబ్వే వంటి దేశాలు భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మన దగ్గర సరైన ప్రణాళిక లేక కరువు ఎదుర్కొంటున్నాం. తెలంగాణలో సాధించిన జల దృశ్యాన్ని మహారాష్ట్రలోనూ సా«ధించేందుకు తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తూ 4–5 భారీ ప్రాజెక్టులు నిర్మిస్తాం’అని కేసీఆర్ ప్రకటించారు. మార్పునకు మహారాష్ట్ర నాంది పలకాలి... ‘చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా అభివృద్ధి చెందుతున్నా మన నాయకులు ఓట్ల కోసమే పనిచేస్తున్నారు. దేశంలో మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఏర్పాటైంది. దేశంలో మార్పు కోసం మహారాష్ట్ర నాంది పలకాలి. దేశంలో కాంగ్రెస్ 50 ఏళ్లు, బీజేపీ 16 ఏళ్లుగా పాలిస్తున్నా తాగు, సాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. విద్వేష రాజకీయాల మూలంగానే కర్ణాటకలో బీజేపీని ఓడించి అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సమస్యలను పరిష్కరించడంతో రైతులు పూర్తి విశ్వాసం, సంతృప్తితో ఉన్నారు. రైతుబంధు, రైతు బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. దళితబంధు ద్వారా 50 వేల కుటుంబాలకు లబ్ధి జరిగింది. రైతురాజ్యం కోసం బీఆర్ఎస్ దేశవ్యాప్త ప్రయత్నాలు చేస్తోంది’అని కేసీఆర్ వెల్లడించారు. కడదాకా నిలబడే సత్తా ఉంటేనే పార్టీలో చేరండి... ‘కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు, ప్రజల కోసం ఎందాకైనా పోరాడే తెగువ ఉన్నవారే బీఆర్ఎస్లో చేరండి. మన లక్ష్యం గొప్పదనే విషయాన్ని గుర్తించి నిత్యం ప్రజలతో మమేకమై చైతన్యపరచాలి. ఒకసారి అడుగు ముందుకేస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. త్వరలో పార్టీ కమిటీలు వేసుకుందాం. డిజిటల్ రూపంలో అందించే శిక్షణ తరగతుల సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరడంతోపాటు పార్టీ కమిటీలు ఉండాలి. ఆటోలు, ట్యాక్సీలపై స్టిక్కర్లు, పాటలకు విస్తృత ప్రచారం, సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టండి’అని కేసీఆర్ సూచించారు. మహరాష్ట్ర బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జిగా దేశ్‌ముఖ్ పేరును ఖరారు చేశారు. నాందేడ్‌లో ఘన స్వాగతం... నాందేడ్‌లో రెండు రోజులపాటు జరిగే బీఆర్ఎస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. నాందేడ్‌లో శిక్షణ జరిగే అనంత్లాన్స్కు చేరుకొని శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. శివాజీ, అంబేడ్కర్, ఫూలే తదితర మహనీయుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముగ్గురేసి చొప్పున ఎంపిక చేసిన నేతలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ ముగిశాక నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లను పార్టీ బాధ్యులకు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు, మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కతిక భాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేస్తామన్నారు. శిక్షణ శిబిరం వేదికగా మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
Indian Navy: ఉమెన్–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర
శిక్షణ కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరాలు, సౌకర్యాల విషయంలో కరుణతో వ్యవహరించాలి. కళింగ గడ్డ మీద ఉన్న సువిశాల ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రం ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్ ఉమెన్ ట్రైనీలను దృష్టిలో పెట్టుకొని ‘ఉమెన్–ఫ్రెండ్లీ’ విధానానికి శ్రీకారం చుట్టింది... అగ్నివీర్ చుట్టూ రగిలిన వివాదాల మాట ఎలా ఉన్నా సైన్యంలోని వివిధ విభాగాల్లో పని చేయాలనే ఆసక్తి, ఉత్సాహాన్ని ఆ వివాదాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. నేవీలో 3,000 ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీలోకి దిగారు. వీరిలో 82,000 మంది మహిళలు ఉన్నారు. భువనేశ్వర్‌కు సమీపంలోని ప్రసిద్ధ ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రంలోకి నేవి అగ్నివీర్ ఫస్ట్ ఉమెన్ బ్యాచ్‌కు చెందిన 600 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. దాంతో మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐఎన్ఎస్. సువిశాలమైన ఐఎన్ఎస్ శిక్షణాకేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకమైన గదులు, డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని టాయిలెట్లను నిర్మిస్తున్నారు. శానిటరీ పాడ్ వెండింగ్, డిస్పోజల్ యంత్రాలను, సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. వర్కర్స్, స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా మహిళలనే నియమిస్తారు. ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనీలకు సంబంధించి శిక్షణపరమైన పర్యవేక్షణ బాధ్యతలతో పాటు వారి వ్యక్తిగత ఇబ్బందులు, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తారు. ‘ప్రైవసీతో సహా మహిళా శిక్షణార్థులకు సంబంధించి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన మార్పులు చేయనున్నాం’ అంటున్నారు నేవీ ఉన్నతాధికారి ఎం.ఏ.హంపిహోలి. స్త్రీ, పురుషులకు సంబంధించి ట్రైనింగ్ కరికులమ్‌లో తేడా అనేది లేకపోయినా తప్పనిసరి అనిపించే ఫిజికల్ స్టాండర్డ్స్‌లో తేడాలు ఉంటాయి. అగ్నిపథ్ తొలిదశలో పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్(పిబివోఆర్) క్యాడర్లో మహిళలను రిక్రూట్ చేస్తున్న తొలి విభాగం నేవి. ‘సెయిలర్స్’గా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించడం ఒక చారిత్రక అడుగు. ‘భవిష్యత్ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ప్రగతిశీలమైన అడుగులు వేస్తుంది’ అంటుంది కమాండర్ గౌరీ మిశ్రా. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నేవీకి చెందిన ఆల్–ఉమెన్ టీమ్ ‘నావిక సాగర్ పరిక్రమ’ పేరుతో ప్రపంచ నౌకాయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ‘ఇది మా వ్యక్తిగత సంతోషానికి, సాహసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చి సాహసంతో ముందుకు నడిపే చారిత్రక విజయం’ అన్నారు ‘నావిక సాగర్ పరిక్రమ’లో భాగం అయిన అయిదు మంది మహిళా అధికారులు. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ఉత్తర అరేబియా సముద్రంలో సర్వైవలెన్స్ మిషన్‌లో భాగం అయిన ‘ఆల్–ఉమెన్ క్రూ’ మరో సంచలనం. తాజా విషయానికి వస్తే... భవిష్యత్ పనితీరుకు శిక్షణ సమయం పునాదిలాంటిది. అది గట్టిగా ఉండాలంటే సౌకర్యాలు, అవసరాల విషయంలో తగిన శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మహిళా ట్రైనీల విషయంలో ‘ఐన్ఎన్ఎస్ చిలికా’ చేస్తున్నది అదే. -
పుట్టగొడుగుల్లా నకిలీ డ్రైవింగ్ స్కూళ్లు!!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నగరంలో తెల్లవారుజామున రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈమధ్య కాలంలో మద్యం తాగి అపరిమితమైన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇలా వాహనాలు నడుపుతున్న వారిలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండడం లేదని, అరకొర డ్రైవింగ్ అనుభవంతో రోడ్డుమీదకు వచ్చి ప్రమాదాలకు పాల్పడుతున్నారని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ డ్రైవింగ్ స్కూళ్లతో ఈ తరహా ఎలాంటి శిక్షణ, నైపుణ్యం,అనుభవం లేని డ్రైవర్లు వాహనాలతో బయటకు వస్తు న్నారు. దీంతో డ్రంకన్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిబంధనలకు పాతర... డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణ ప్రహసనంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణా అధికారులు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మోటారు వాహన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి డ్రైవింగ్ స్కూల్ నిర్వహణను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే అనుమతినివ్వాలి. ఇందుకోసంసదరు నిర్వాహకులు రూ.10 వేలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రవాణా శాఖకు చెల్లించాలి. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు అర్హతను కలిగి ఉంటారు. అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ (శిక్షణనిచ్చే వ్యక్తి) ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ కోసం ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీస్ తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలపై ఇక్కడ శాస్త్రీయమైన బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకొనే మెకానిజంలో కూడా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. చాలా మంది డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఎలాంటి కార్యాలయం కూడా లేకుండానే కారుపై డ్రైవింగ్ స్కూల్ బోర్డు ఏర్పాటు చేసుకొని కొంతమంది అధికారుల సహాయంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు కావాల్సిన ఫామ్–11 సంపాదిస్తున్నారు. ఇదో తరహా గొలుసుకట్టు.. అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్ స్కూళ్లు అభ్యర్ధుల నుంచి నెలకు రూ.5000 నుంచి రూ.8000 వరకు వసూలు చేసి కనీసం 30 రోజులు కూడా శిక్షణనివ్వకుండానే వదిలేస్తున్నారు. ఇలా అరకొర శిక్షణ తీసుకున్నవారు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని యథేచ్ఛగా ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు ఇలాంటి నకిలీ స్కూళ్లు నగరమంతటా బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని వినియోగదారులను మోసగిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రేటర్లో అన్ని ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూళ్లు 120 వరకు ఉంటే నకిలీ స్కూళ్లు వెయ్యికిపైనే ఉన్నట్లు అంచనా. తీవ్రంగా నష్టపోతున్నాం: కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇలాంటి నకిలీలతో తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. ఇలాంటి వాటిని ఆర్టీఏ అధికారులు నియంత్రించాలి. – శ్రీకాంత్‌రెడ్డి సామల, తెలంగాణ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్మి -
హైదరాబాద్: కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో రభస
-
కోరపళ్ల తుపాకులు
మనకు పోలీసుల, సైనికుల శిక్షణ మాత్రమే తెలుసు. వారు చేసే సాహసాలు తెలుసు. ప్రమాదాల్లో అర్పించే ప్రాణాలు తెలుసు. కాని వారితో సమానంగా వివిధ రక్షణ దళాలలో శునకాలు సేవలు అందిస్తాయి. త్యాగాలూ చేస్తాయి. కాకుంటే అవి పెద్దగా అందరికీ తెలియవు. పోలీసులకు, సైనికులకు శిక్షణ విభాగాలు ఉన్నట్టే ఈ దళాలతో పని చేసే శునకాలకు శిక్షణ ఇచ్చే విభాగం కూడా ఒకటి ఉంది. దానిని ‘ఇండియన్ ఆర్మీ రిమౌంట్ వెటర్నరి కోర్’ అంటారు. ఇది మీరట్‌లో ఉంది. ఇక్కడే భారత దేశంలోని సాయుధ రక్షణబృందాలకు అవసరమైన అశ్వాలకు, శునకాలకు శిక్షణ ఇస్తారు. ఇది కాకుండా బి.ఎస్.ఎఫ్.ఏ వాళ్ల ‘నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్’ కూడా ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల కింద నడిచే ట్రయినింగ్ సెంటర్లూ ఉన్నాయి. ఇవన్నీ విధి నిర్వహణ కోసం, ప్రజా రక్షణ కోసం శునకాలకు శిక్షణ ఇచ్చి వాటి సేవలు తీసుకుంటాయి. సి.ఆర్.పి.ఎఫ్ వారి సరిహద్దు సేవల కోసం శిక్షణ పొందిన శునకాలు ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తాయి ∙పోలీసులు, సైనికులకు శిక్షణ ఉన్నట్టే డాగ్ స్క్వాడ్‌లో పని చేసే శునకాలకూ శిక్షణ ఉంటుంది. ∙ట్రాకర్ డాగ్స్ అంటే నిందితులు వాడిన వస్తువుల వాసనను బట్టి నిందితులను వెతుక్కుంటూ వెళ్లే శునకాలకు 36 వారాలు, పేలుడు పదార్థాలను గుర్తించడం కోసం 24 వారాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడానికి 24 వారాలు, ప్రమాదాల్లో బాధితులను గుర్తించే శిక్షణ 24 వారాలు, అటవీ సంపద రక్షణకు పని చేసే వీలుగా 24 వారాలు... ఇలా శిక్షణ ఇస్తూ వెళతారు ∙ఈ శునకాలను ఉపయోగించే వ్యక్తిని (పోలీస్/సైనికుడు) డాగ్ హ్యాండ్లర్ అంటారు. డాగ్, డాగ్ హ్యాండ్లర్ ఒక జట్టుగా పని చేస్తారు. సైగలూ, శబ్దాలూ ఉపయోగించి డాగ్ హ్యాండ్లర్ వాటికి పనులు చెబుతాడు. డాగ్ హ్యాండ్లర్ జీతం 31 వేల నుంచి మొదలవుతుంది ∙మొరగడం కుక్క సహజ లక్షణం. కాని కొన్ని సందర్భాలలో అవి మొరగడం వల్ల శత్రువు అప్రమత్తం కావచ్చు. అందుకే వాటిని మొరగకుండా కూడా శిక్షణ ఇస్తారు ∙ఒక డాగ్ స్క్వాడ్ శునకం వృత్తి జీవితం 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అవి రిటైర్ అవుతాయి. ఎన్నో సేవలు... భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తప్పిపోయిన, శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఎందరినో ఈ రక్షణ శునకాలు పసిగట్టి కాపాడాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి వి.వి.ఐ.పిలు ప్రయాణించే దారులను ఈ శునకాలే మొదటగా ప్రయాణించి క్లియర్ చేస్తాయి. గతంలో భూటాన్ రాజుకు మన దగ్గర శిక్షణ పొందిన శునకాన్ని కాపలా కోసంగా ఇచ్చారు. రాజు మీద హత్యాయత్నం చేద్దామని వచ్చిన వ్యక్తి జారవిడిచిన రుమాలును వాసన పట్టిన శునకం కొన్ని మైళ్లు ప్రయాణించి మరీ ఆ దుండగుణ్ణి పట్టించింది. జమ్ము–కాశ్మీరు సరిహద్దుల్లో శత్రువు రాకను ఈ శునకాలే పసిగట్టి ఆచూకీ ఇస్తాయి. సి.ఆర్.పి.ఎఫ్ దళాలు తాజాగా తమ శునకాలకు కెమెరాలు బిగించడానికి నిర్ణయించాయి. వాటిని వదిలిపెట్టి శత్రుశిబిరాల వైపు చొచ్చుకెళ్లేలా చేసి అవి చూపిన దృశ్యాల ఆధారంగా దాడులు చేయొచ్చని ఆలోచన. తమ ధైర్యం, తెగువ, విశ్వాసంతో ఎన్నో శునకాలు ప్రజలను కాపాడటమే కాదు తమ ప్రాణాలు కూడా త్యాగం చేశాయి. వాటి త్యాగం చాలామందికి పట్టదు. పెద్దగా ప్రచారానికి నోచుకోదు. వీటిని కుక్కబతుకు కాదు. నిజంగా గొప్ప బతుకు. -
ఆ టైమ్ వచ్చింది
దాదాపు ఏడాది పూర్తి కావొచ్చింది ‘రేస్ 3’ సినిమా విడుదలై. ఒక్క జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్ప ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లంతా తమ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ బ్యూటీ తర్వాతి సినిమాపై ఇంకా ఎందుకు క్లారిటీ రాలేదబ్బా? అని బీటౌన్‌లో ఎంక్వైరీ చేసిన వారికి ‘ఆమె యాక్టింగ్ క్లాసులకు వెళుతోందని, అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఇవనా చుబ్బుక్ స్టూడియోలో’ అని తెలిసింది. చార్లైజ్ త్రోన్, బ్రాడ్‌పిట్, జేమ్స్ ఫ్రాంకో వంటి హాలీవుడ్ స్టార్లు ఈ స్టూడియోలోనే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ల తర్వాత యాక్టింగ్ క్లాసులు ఏంటి? అని జాక్వెలిన్‌ని అడిగితే.. ‘‘దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. నా కెరీర్ తొలినాళ్లలో సినిమాల గురించి అర్థం చేసుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ నేనెప్పుడూ యాక్టింగ్ క్లాసులు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ట్రైనింగ్ బాగుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశాను. ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్, ఎక్స్పరిమెంట్ .. ఇలా రెండు జానర్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చిందని తెలిసింది. అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. తాను నటించిన ‘డ్రైవ్’ గురించి మాట్లాడుతూ – ‘‘నేను, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా విడుదల ఆగిపోలేదు. త్వరలోనే ఆడియన్స్ థియేటర్స్‌లో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు జాక్వెలిన్. -
శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల మృతి
బెంగళూరు: వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలడంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిరేజ్–2000 రకం శిక్షణ యుద్ధ విమానం హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. దీంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. మంటల నుంచి బయట పడేందుకు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు యత్నించినా సాధ్యం కాలేదు. సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, పైలట్లను రక్షించేందుకు యత్నించారు. అయితే, అప్పటికే ఒక పైలట్ సజీవ దహనం కాగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగిగా గుర్తించారు. -
23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్ శిక్షణ
ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10గం.ల నుంచి సా.4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ఈనెల 24 (సోమవారం)న ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం (పండరిపురం) లో ఉ. 10 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు, అదేరోజు సా. 4 గం.ల నుంచి 7 గం.ల వరకు విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం(మొగల్రాజపురం), 25(మంగళవారం)న ఉ. 10 గం. నుంచి 12.30 గం. వరకు ఏలూరులోని అమలోద్భవి సెయింట్ మేరీస్ స్కూల్(అశోక్‌నగర్)లో డాక్టర్ ఖాదర్ వలి ఉపన్యసిస్తారు. ప్రశ్నలకు జవాబులిస్తారు. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255 22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి. 22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు. మహిళలకు ‘మిల్లెట్స్ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు. 23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ (ప్రకృతివనం), లయన్స్ క్లబ్ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్ పి.బి. ప్రతాప్‌కుమార్ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 27–28 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో శిక్షణ అటవీ వ్యవసాయ పద్ధతిపై రైతులకు ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటకలోని హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు డా. ఖాదర్ వలి తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. తాను తయారు చేసిన ‘అటవీ చైతన్య ద్రావణం’తో స్వల్పకాలంలోనే భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల బియ్యాన్ని మిక్సీతో తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. తదనంతరం బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల డా.ఖాదర్‌వలి అటవీ వ్యవసాయ మోడల్ ఫామ్ సందర్శన కూడా ఉంటుంది. వివరాలకు.. 81234 00262, 97405 31358, 99017 30600. కూరగాయలు, పండ్లు సోలార్ ప్రాసెసింగ్‌పై జనవరిలో శిక్షణ సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 2019 జనవరి 29 నుంచి 4 రోజుల పాటు సోలార్ డ్రయ్యర్లలో పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో వివిధ ఆహారోత్పత్తులను తయారు చేయడంపై శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. ‘సీడ్’ ప్రధాన కార్యదర్శి, ఆర్.శ్యామల: 040–23608892, 96526 87495. -
ఎన్ఎస్జీ రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉగ్రమూకల పీచమణిచే జాతీయ భద్రతాదళం(ఎన్ఎస్జీ) ప్రాంతీయ శిక్షణా కేంద్రం మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. 2008 నవంబర్‌లో ముంబై మహానగరంపై ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడిన అనంతరం ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఎన్ఎస్జీ ప్రాంతీయ శిక్షణా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముష్కరులను హతమార్చిన ఎన్ఎస్జీ కమాండోల పోరాట పటిమకు అప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఇదే క్రమంలో ఇలాంటి ఘటనలను దీటుగా ఎదుర్కొనేందుకు నలువైపులా ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు అవసరమని కేంద్ర సర్కారు భావించింది. అందుకనుగుణంగా దక్షిణాదిన చెన్నైతోపాటు మన రాష్ట్రంలో ఎన్ఎస్జీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.157.84 కోట్లతో 200 ఎకరాల్లో.. ఇబ్రహీంపట్నం మండలం వినోభానగర్‌లో 200 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రతిపాదించిన ఈ కమాండో శిక్షణా కేంద్రం నిర్మాణ పనులకు 2013లో అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శంకుస్థాపన చేశారు. రూ. 157.84 కోట్లతో కేంద్ర ప్రజా పనుల విభాగం నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణంలో హెలిపాడ్, ఫైరింగ్ రేంజ్, ఇండోర్ షూటింగ్ రేంజ్, స్విమ్మింగ్ ఫూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి. కాగా, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఎన్ఎస్జీ ప్రాంగణాన్ని పరిశీలించారు. -
భారత్ లో ఎయిర్ బస్ పైలట్ శిక్షణ కేంద్రం
విమానయాన రంగంలో ఉన్న ఎయిర్‌బస్ ఢిల్లీ సమీపంలో సుమారు రూ.260 కోట్లతో పైలట్, మెయింటెనెన్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయనుంది. 2018లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ సెంటర్‌కు 10 ఏళ్లలో 8,000 మంది పైలట్లు, 2,000 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎయిర్‌బస్‌కు ఇప్పటికే బెంగళూరులో మెయింటెనెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ 2007 నుంచి ఇప్పటి వరకు 2,750 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో వారానికి సగటున ఒక ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇక్కడి ఆపరేటర్లకు డెలివరీ చేసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. -
ఒంగోలులో PMKVY ట్రైనింగ్ సెంటర్
-
నిశ్శబ్ద విప్లవం
ఝాన్సీ కీ వాణి: ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు కల్పించడం మాత్రమే వీరికి న్యాయం చేయడం అవుతుందనుకుంటే పొరపాటే అవుతుంది. సమాజంలో సమాన అవకాశం ఇవ్వడం మనతోనే ప్రారంభమవుతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో మనకి ముందు తెలిసి ఉండాలి. అందుకు మనం వారిని మరింత దగ్గరగా తెలుసుకోవాలి. మన చుట్టూ వీరు రోజూ కనిపించకపోవడానికి కారణం మనం తెలిసో, తెలియకో చూపించే వివక్ష. ఒక బధిరుల, అంధుల పాఠశాలకో.. మానసికంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల కేంద్రానికో వెళ్లి చూస్తే అర్థమవుతుంది.. ఎందరి బాల్యం తమ ప్రత్యేకసామర్థ్యం వెతుక్కునే క్రమంలో కష్టపడుతోందో! వీరిలో రేపు నిజంగా ఎంతమందికి వారి ప్రతిభకి తగ్గ ఉపాధి దొరుకుతుందో అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. మన ఓర్పు, సహకారం, అర్థం చేసుకోవడం.. వీరి జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఆర్టికల్ రాద్దామని కాగితం, కలం తీసాను. పెన్ను రాయట్లేదు.. ఫ్లయిట్లో కదా ఇంక్ బిగుసుకు పోయిందేమోనని, కాస్త రాస్తే కలం కదులుతుందని రాస్తూ పోయాను. కాగితం మీద రాతలేవీ కనబడటం లేదు.. బ్లాంక్‌గా ఉంది నా మనసు లాగా! ఇంకు కనిపించని ఆ తెల్లకాగితంపై జాగ్రత్తగా చూస్తే పెన్నుతో రాసిన అచ్చులు కనిపిస్తున్నాయి. బయటికి స్పష్టత లేకపోయినా ఈ ముద్రలు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. అచ్చం అలాగే మనం పట్టించుకోని, వినిపించుకోని.. చూడని జీవితాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అస్తిత్వం కోసం పోరాటం చేసే ఆ గళాలని కనిపిస్తున్నా వినిపించుకోని నిర్లక్ష్యం మనది. వినిపించే స్వరం లేని ఈ జీవితాలకి కనిపించే గళం ఉంది. ఈ వాక్యంలోని అంతరార్థం అర్థం కావాలంటే నేను మీకు తన్వీర్ సుల్తానా గురించి చెప్పాలి. ఈ ఇరవయ్యేళ్ల మెరిసే కళ్ల అమ్మాయి ఓ టీచర్. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లో ఎంబ్రాయిడరీ నేర్పించే ఈ అమ్మాయితో ముచ్చట్లలో పడి నేను ఎంత సమయం గడిపేసానో గుర్తులేదు. ఐదుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన తన్వీర్ తన అక్కకీ, చెల్లికి పెళ్లి చేసింది. మతి స్థిమితం లేని తమ్ముడి ఆలనాపాలనా చూసుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న తల్లికి అండగా ఉంటోంది. ఇన్నింటికీ తన ఈ చిన్న ఉద్యోగమే ఊతం. ఇదేదో 80ల్లో తెలుగు సినిమా కథ కాదు. తన్వీర్ నిజ జీవితం. ఆ అమ్మాయి స్ఫూర్తిని వర్ణించాలంటే నాకు మాటలు చాలవు. ఎందుకంటే తన్వీర్‌కు మాటలు రావు. పుట్టుకతోనే బధిరురాలైన ఆమెకు మాటలు వచ్చే అవకాశం లేదు. కనిపించే గళానికి, వినిపించుకొనే మనసు కావాలి. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ నిశ్శబ్ద సంభాషణలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వినిపించకపోయినా, మాటలు రాకపోయినా ఓ టీచర్‌గా తన్వీర్ సూపర్ సక్సెస్ఫుల్. ఇక్కడ మూడు విషయాలు ప్రత్యేకంగా గుర్తించాలి. ఒకటి.. తనని తాను నమ్మిన తన్వీర్, రెండు.. తన్వీర్ ప్రతిభని గుర్తించి ఉద్యోగమిచ్చిన సంస్థ నిర్వాహకులు, మూడు.. మాట్లాడకుండా ఆమె దగ్గర పని నేర్చుకున్న శిష్యులు! వీరిలో వైకల్యం ప్రతిభకి అడ్డు అని ఎవరనుకున్నా తన్వీర్ గురించి మనం ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్లం కాదు. నిజానికి ఏ అవయవలోపమైనా, అది సామర్థ్య లోపం అని ఆలోచించే మనది అసలు వైకల్యం. ప్రత్యేక సామర్థ్యం ఉన్న వీరికి తగిన అవకాశాలు కల్పించకపోవడం వ్యవస్థ వైఫల్యం. తన్వీర్ది అదృష్టం అనేవాళ్లు కొందరుంటే.. కాదు అని ఆమెది మొండి పట్టుదల అనేవాళ్లు మరికొందరు! ఏది ఏమైనా అంత పట్టుదల, అదృష్టం రెండూ ఉన్న వాళ్లు మన చుట్టూ ఎంతమంది కనపడుతున్నారు? అలాంటి వ్యక్తులకి మన మధ్యలో చోటు కల్పించేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ఈ సందర్భంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్‌ని అభినందించాలి. కేఎఫ్సీలో కొన్ని ఔట్‌లెట్స్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తూ కస్టమర్లని డీల్ చేస్తున్న బధిర, మూగ వ్యక్తులు కనిపిస్తారు. అక్కడ మనకి వారి ప్రతిభ మాత్రమే కనిపిస్తుంది. ఇనార్బిట్‌మాల్‌లో డైలాగ్ ఇన్ ద డార్కలో అంధులు మనకి గైడ్సగా దారి చూపిస్తారు. ఆ చీకట్లో మనం వారిపై పూర్తిగా ఆధారపడిపోతాం. అప్పుడు కానీ మనకి వారి ప్రత్యేక సామర్థ్యం అర్థం కాదు. society to aid hearing impaired అనే ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేయడం వల్ల నాకు ఎంతో అవగాహన పెరిగింది. వినికిడి లోపం వల్ల కలిగే మరో శాపం మూగతనం. అవగాహనరాహిత్యం వల్ల చిన్నతనంలో సరిచేయగలిగే వినికిడి సమస్యలని కూడా అశ్రద్ధ చేయడంతో జీవితాంతం నిశ్శబ్దంతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి పిల్లలకి కలుగచేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఇటువంటి వారికి అవగాహన పెంచేందుకూ, పేదరికం వల్ల వెనుకాడే వారికి సహకారం అందించేందుకూ dr. Ec vinaykumar, dr.rambabu వంటి ENT surgeons ఆధ్వర్యంలో సజ్జల దివాకర్‌రెడ్డి, భాగీరథి, సునీత వంటి ప్రముఖులు HATఅనే సంస్థను ప్రారంభించారు. కనిపించే గళాలను వినిపించుకునే మనసుని నేర్పించిన HAT కి, తన్వర్కి ధన్యవాదాలు. ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది. ఇదే నిశ్శబ్ద విప్లవం. -
పోలీసులపై నమ్మకం పెంచండి
సిబ్బందికి కమిషనర్ హితబోధ సాక్షి, సిటీబ్యూరో: ‘సిఫారసు చేస్తేగాని మన పిల్లలు సైతం ఫిర్యాదు చేసేందుకు ఠాణా మెట్లు ఎక్కే పరిస్థితి లేదు....అలాంటప్పుడు సాధారణ ప్రజలు మనపై ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు. ఇక నుంచి మీ వ్యవహార శైలిని మార్చుకోండి...ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా పనిచేయండి’... అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. పేట్లబురుజులోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’పై జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మనల్ని (పోలీసులను) అడిగేవారు ఎవరు లేరని, మనం ఏం చెప్తే అదే నడుస్తుందనే భావనను విడనాడాలని ఆయన సూచించారు. ‘నూటికి 98 శా తం మంది ఏనాడూ పోలీసు స్టేషన్‌కు రారు... ఎప్పుడు పోలీసులతో మాట్లాడరు...వారికి మనం ఎప్పుడు అన్యాయం చేసి ఉండం... అయినా మన గురించి వారికి మంచి అభిప్రాయం లేదు... మన వద్దకు వచ్చే కొద్ది మంది బాధితులకు కూడా మనం న్యాయం చేయకపోగా, వారిని దూషించడమే దీనికి కారణం. పన్నుల రూపంలో ప్రజలు కట్టే డబ్బులతోనే మనం జీతాలు తీసుకుంటున్నాం. వారికి మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీకు ఏ అవసరం వచ్చినా అండ గా మేం ఉంటాం. సదా మీ సేవలోనే ఉన్నాం.. అనే ప్రచారాన్ని చేపట్టాలి. వారిలో భరోసా పెంచడంతో పాటు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించండి’ అని కమిషనర్ అ న్నా రు. అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమా ర్, జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంగళవారం కూడా కొనసాగనుంది. కమిషనర్ సూచనలివీ.... ఠాణాకు వచ్చిన బాధితుడితో మర్యాదగా మాట్లాడం ఫిర్యాదు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేయడం మేం చెప్పిందే వేదం అనే పద్ధతి మార్చుకోవడం ఛార్జీషీట్ సకాలంలో వేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయడం బాధితుడు ఈరోజు ఠాణాకు వచ్చినా కేసు పురోగతి చెప్పడం ప్రజలకు ఆయా ఠాణా అధికారులు సెల్ నెంబర్లు ఇవ్వడం ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆదుకుంటామని ధైర్యం చెప్పడంతో పాటు నమ్మకం కలిగించడం పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు.., దర్యాప్తు చేయరనే ప్రచారాన్ని తిప్పికొట్టడం