కుప్పకూలి కాలిపోతున్న మిరేజ్ యుద్ధవిమానం
బెంగళూరు: వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలడంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిరేజ్–2000 రకం శిక్షణ యుద్ధ విమానం హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. దీంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది.
మంటల నుంచి బయట పడేందుకు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు యత్నించినా సాధ్యం కాలేదు. సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, పైలట్లను రక్షించేందుకు యత్నించారు. అయితే, అప్పటికే ఒక పైలట్ సజీవ దహనం కాగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment