hal airport
-
బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు
బెంగుళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY — ANI Digital (@ani_digital) August 26, 2023 దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని అనంతరం గ్రీస్ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరు చేరుకోగానే అయన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY — ANI Digital (@ani_digital) August 26, 2023 ఇప్పుడే నేను బెంగుళూరు చేరుకున్నాను. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. వారి అంకితభావమే అంతరిక్ష రంగంలో వారు ఇన్ని ఘనతలు సాధించడానికి కారణం.' అని రాశారు. #WATCH | Bengaluru, Karnataka | PM Narendra Modi says "I could not stop myself as I was not in the country, but I decided to visit Bengaluru first and meet our scientists right after visiting India." pic.twitter.com/fylaqqSftd — ANI (@ANI) August 26, 2023 విమానాశ్రయం చేరుకున్నాక ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి అభివాదం తెలిపిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన వేళ నేనిక్కడ లేను.. అందుకే నన్ను నేను ఆపుకోలేకపోయాను. భారతదేశంలో అడుగుపెడుతూనే శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఆయన 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' అని నినదించారు. #WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry — ANI (@ANI) August 26, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్ సింగ్
-
శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల మృతి
బెంగళూరు: వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలడంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిరేజ్–2000 రకం శిక్షణ యుద్ధ విమానం హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. దీంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. మంటల నుంచి బయట పడేందుకు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు యత్నించినా సాధ్యం కాలేదు. సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, పైలట్లను రక్షించేందుకు యత్నించారు. అయితే, అప్పటికే ఒక పైలట్ సజీవ దహనం కాగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగిగా గుర్తించారు. -
హాల్ విమానాశ్రయం వద్ద కుప్పకూలిన మిరాజ్ 2000
-
అవి చెత్త చట్టాలు : నరేంద్ర మోడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలో అనేక చట్టాలను రూపొందించారని, వాటిలో పనికి రాని చట్టాలను తొలగించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పరోక్షంగా గత యూపీఏ సర్కారును దెప్పి పొడిచారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వచ్చిన ఆయన ఇక్కడి హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తల సభలో ప్రసంగించారు. సుమారు పది వేల మంది కార్యకర్తలు పాల్గొన్న సభలో ప్రధాని ఉత్సాహంగా ప్రసంగించారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ృషి చేశారని కార్యకర్తలను ప్రశంసిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని చెప్పారు. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేశారని చెబుతూ, పేదల కోసం అలా చేశారని అప్పట్లో చెప్పుకునే వారని తెలిపారు. అయితే ఇప్పటికీ బ్యాంకుల వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని విమర్శించారు. దీని కోసమే ‘ప్రధాన మంత్రి జన ధన్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకం కింద పైసా లేకున్నా బ్యాంకు ఖాతాను ప్రారంభించవచ్చని తెలిపారు. దీని వల్ల ఇప్పటికే సుమారు నాలుగు కోట్ల మంది ఖాతాలను తెరిచారని, తద్వారా బ్యాంకుల్లో రూ.1,500 కోట్లు జమ అయ్యిందని వెల్లడించారు. ఇకమీదట పేదలు డబ్బు కోసం ధనవంతుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, వడ్డీలు, చక్రవడ్డీలు చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. బ్యాంకులు, అందులోని డబ్బు ధనికుల కోసం కాదని అన్నారు. 2 నుంచి స్వచ్ఛతా అభియాన్ దేశ వ్యాప్తంగా వచ్చే నెల రెండో తేదీ నుంచి స్వచ్ఛతా అభియాన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. విదేశాల్లో లాగా మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొత్త ఇళ్లకు వెళితే ఎలా శుభ్రం చేసుకుంటామో, ఆ విధంగా ప్రజలందరూ ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఏడాదిలో వంద గంటలు పరిశుభ్రత కోసం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశుభ్రత విషయంలో మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకుని తిరగవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు ఇవంతా చిన్న పనులేనని అంటూ, ఈ చిన్న పనులను సాధించడం ద్వారానే వారు దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లవచ్చని ఉద్బోధించారు. రైతులు ఈ దేశంలోని ధాన్యాగారాలను నింపాలని అంటూ, వారు గౌరవప్రదంగా బతకడానికి వారి జేబులను కూడా నింపాల్సి ఉందని తెలిపారు. యువకులు తమ డిగ్రీలతోనే ఉద్యోగాలు తెచ్చుకోలేరని, నైపుణ్యాన్ని సాధించాల్సి ఉందని సూచించారు. దీనిని ృష్టిలో ఉంచుకునే నైపుణ్యాభిృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఘన స్వాగతం సాయంత్రం 5.45 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ వజూభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత కుమార్, సిద్ధేశ్వర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఈశ్వరప్ప, అశోక్ ప్రృతులు ప్రధానికి స్వాగతం పలికారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని రాజ్ భవన్లో బస చేశారు.