ప్రతీకాత్మక చిత్రం
సేలం(తమిళనాడు): అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా భర్త తీసుకువచ్చిన సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది. సేలం జిల్లా దేవన్నక వుండనూరు కిడయూరు మెట్టూరుకి చెందిన రాజీ (57) ఓ ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాంతి. వీరు అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు.
ఈ పరిస్థితిలో భరణం కోసం శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతి నెలా రూ.73,000 జీవన భృతిగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి సంగగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని (రూ.2.18 లక్షలు) వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు.
చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
దీంతో బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణం సొమ్ము రూ.2.18 లక్షలను రూ.10 నాణేలుగా 11 బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి ఆమెను భర్త అవమానించాడని కోర్టు సిబ్బంది మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment