
Virat Kohli: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? అంటూ మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతడి తల్లి కలిసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది.
ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఆ మహిళ.. భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. ఆమెకు నెలకు రూ. 30 వేల భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ భర్త ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాడు. తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని, ఛారిటీల ద్వారా వచ్చే డబ్బుతో నెట్టుకొస్తున్నానని, తాను భరణాన్ని చెల్లించే పరిస్థితి లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు.
పిటిషనర్ అప్పీల్‌పై అడిషినల్ సెషన్స్ జడ్జ్ అనూజ్ అగ్రవాల్ స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లి లాంటి సెలబ్రిటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకి డైరెక్టర్‌గా ఉండి భరణం చెల్లించేందుకు డబ్బులు లేవంటే నమ్మేలా లేదని అప్పీల్‌ను తిరస్కరించారు. మెయింటెనెన్స్ తప్పనసరిగా చెల్లించాల్సిందేనంటూ పిటిషనర్‌ను ఆదేశించారు.
చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే...
Comments
Please login to add a commentAdd a comment