Big Alert For SBI Customers: Internet Banking, UPI, YONO, YONO Lite Won’t Be Available 2 Hours - Sakshi
Sakshi News home page

SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!

Published Wed, Jun 16 2021 12:41 PM | Last Updated on Wed, Jun 16 2021 2:40 PM

SBI internet banking, YONO app, UPI wont be available for two hours  - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులను అలర్ట్‌ చేసింది. ఎస్‌బీఐ ఆన్‌లైన్‌, యోనో యాప్ సేవలు  రెండు గంటల పాటు నిలిచిపోనున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని గమనించాలంటూ ట్విటర్‌ ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులకు వివరాలను షేర్‌ చేసింది.  

రేపు (జూన్ 17, గురువారం) అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపియనున్నట్టు తెలిపింది. మెయింటనెన్స్ కార్యకలాపాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఫలితంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ లాంటి సేవలు అందుబాటులో  ఉండవనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలపై అప్రత్తమంగా  ఉండాలని  కస‍్టమర్లకు సూచించింది.  (మాకెంజీ దాతృత్వం : రూ. 20 వేల కోట్ల భారీ విరాళం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement