online banking
-
అతిపెద్ద బ్యాంక్ ఆన్లైన్ సేవలు రెండు రోజులు బంద్!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.(అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!)హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లను జూన్ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్‌గ్రేడ్ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..» ఖాతా సంబంధిత సేవలు» డిపాజిట్లు» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)» అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్స్» ఎక్స్టర్నల్/మర్చంట్ చెల్లింపు సేవలు» ఇన్స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్» యూపీఐ చెల్లింపులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్‌తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్‌లోనూ బ్యాంక్ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లను బ్యాంక్ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి. -
మీ పాస్వర్డ్ స్ట్రాంగేనా?
సాక్షి, హైదరాబాద్: ఏటీఎం, ఆన్లైన్ బ్యాకింగ్ పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు మరిచిపోతామనో..సులభంగా ఉండాలనో ...1111, 1212 తరహా అత్యంత సాధారణ పాస్వర్డ్లు పెట్టుకునే వారంతా సైబర్ నేరగాళ్లకు డబ్బులు కాజేసే అవకాశమిచి్చనవారవుతారని హెచ్చరించారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని సైబర్ దాడులలో 33% గణనీయమైన పెరుగుదల నమోదైంది. 3.4 మిలియన్ల పాస్‌వర్డ్‌ల అధ్యయనం తర్వాత పది వీక్ పాస్‌వర్డ్‌లను గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటిలో ఏదైనా సంఖ్యను పిన్ నంబర్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్)గా వాడుతుంటే..దాన్ని వెంటనే మార్చుకుని..ఇతరులు సులువుగా గుర్తించలేని పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తమ, లేదా ఇతర కుటుంబ సభ్యుల పుట్టిన సంవత్సరాలు సైతం పెట్టుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.అత్యంత వీక్ పాస్వర్డ్లు ఇవే... 1234, 1111, 0000, 1212, 7777, 1004,2000, 4444, 2222, 6969 -
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్ సేవలు స్తంభించడంపై ఎస్బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. క్లిక్ చేస్తే డేంజర్లో పడ్డట్టే!
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. కరోనా సంక్షోభంలో సైబర్ నేరస్తులు మీకు చెప్పి మరి కష్టపడ్డ సొమ్మును కాజేస్తున్నారని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో కేవైసీ పేరుతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో నుంచి డబ్బుల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తూ బ్యాంక్ ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పింది. కేవైసీ అప్డేట్ చేయండి.. లేదంటే టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది ఏది నిజమో, ఏది డూఫ్లికేటో తెలుసుకునేలోపే అనర్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఎక్కువగా జరుగుతుందని ఎస్బీఐ తెలిపింది. టెక్నాలజీపై ప్రజల్లో అవగాహాన పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. అచ్చం ఎస్బీఐ ఎస్ఎంఎస్ను పోలి ఉండే ఓ కేవైసీ డూబ్లికేట్ మెసేజ్‌ను బ్యాంక్ అకౌంట్ల వినియోగదారులకు సెండ్ చేస్తున్నారు. అందులో మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తారు. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 పొరపాటున ఎవరైనా ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే బ్యాంక్‌లో ఉన్న మనీ మాయమవుతుందని ఎస్బీఐ సూచించింది. కేవైసీ అంశంలో ఇలాంటి మెసేజ్‌ల పట్ల అవగాహన లేని ఖాతాదారులు డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ మీ ఫోన్‌కి మెసేజ్ లేదంటే మెయిల్స్ వచ్చినా వాటిని క్లిక్ చేయకుండా వదిలేయాలని. అలాంటి ఎస్ఎంఎస్లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది. చదవండి: బంగారం కొనేవారికి షాక్ !! ఆగమన్నా ఆగడం లేదు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయ్ -
హ్యాకర్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్
కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్‌లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్ అటాక్స్ చేసి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్ దాడులకు గురవుతున్నారు. సైబర్ నేరస్తులు దాడులు చేసే విధానం అయితే ఇలాంటి సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. ►ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తారు. ► వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ► బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. ► ఆ మెయిల్స్‌లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ► ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ► ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ► ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు. ► https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది. ► నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి. ► మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు ► ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు. ► ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్‌లు,పాస్వర్డ్లు మీ రహస్యం.మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్‌ను, సూచనల్ని పాటించి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండండి. -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
బ్యాంకులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాప్స్ దెబ్బ
-
ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఈ-మెయిల్ ఐడీ, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, సోషల్ మెసేజింగ్ యాప్స్ వంటి వాటికి పాస్వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. అయితే, ఇలాంటి కీలకమైన విషయాలలో ప్రజలు చాలా వరకు అజాగ్రత్తగా ఉంటారు. అందుకే, దేశంలో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరిగి పోతుంది. చాలా మంది తమ ఖాతాలను సులభంగా గుర్తు పెట్టుకోవడం కోసం సులువైన పాస్వర్డ్లు పెట్టుకుంటారు. ఈ అజాగ్రత్తే వారిని సైబర్ మోసాల బారిన పడేలా చేస్తోంది. అయితే, ఇలాంటి సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు) ఎస్బీఐ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఖాతాదారులు అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్లు కలిసి ఉండే విధంగా పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG ఖాతాదారులు నెంబర్లు, సింబల్స్ రెండింటినీ ఉపయోగించి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఉదా: AbjsE7uG61!@ ఫుల్ సెక్యూరిటీ కోసం కనీసం 8 క్యారెక్టర్లు గల పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG సాధారణంగా డిక్షనరీలో ఉండే పదాలు, సులువుగా ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఉదా: itislocked, thisismypassword ఎస్బీఐ కస్టమర్లు "qwearty" లేదా "asdfg" వంటి కీబోర్డులో వరుసగా ఉండే పదాలను వాడరాదు. దానికి బదులుగా ":)", ":/" వంటి వాటిని వాడవచ్చు. 12345678 లేదా abcdefg వంటి పాస్వర్డ్ లను అసలు పెట్టుకోరాదు. ఖాతాదారులు సులభంగా/ తేలికగా ఊహించగల పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఖాతాదారులు మీ పేరు, పుట్టినతేదీ, లేదా మీ కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన తేదీని అసలు పెట్టుకోకూడదు. ఉదా : Ramesh@1967. "మీ పాస్వర్డ్ అనేది ప్రత్యేకంగా ఉండటంతో పాటు బలంగా(Storng) ఉండే విధంగా" పెట్టుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. A strong password ensures higher levels of security. Here are 8 ways in which you can create an unbreakable password and protect yourself from cybercrime. Stay alert & #SafeWithSBI! #CyberSafety #StrongPassword #OnlineSafety #CyberCrime #StaySafe pic.twitter.com/ScSI8H5ApF — State Bank of India (@TheOfficialSBI) August 18, 2021 -
SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులను అలర్ట్ చేసింది. ఎస్బీఐ ఆన్లైన్, యోనో యాప్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోనున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని గమనించాలంటూ ట్విటర్ ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు వివరాలను షేర్ చేసింది. రేపు (జూన్ 17, గురువారం) అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపియనున్నట్టు తెలిపింది. మెయింటనెన్స్ కార్యకలాపాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఫలితంగా ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ లాంటి సేవలు అందుబాటులో ఉండవనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలపై అప్రత్తమంగా ఉండాలని కస్టమర్లకు సూచించింది. (మాకెంజీ దాతృత్వం : రూ. 20 వేల కోట్ల భారీ విరాళం) We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/Nk3crZQ2PG — State Bank of India (@TheOfficialSBI) June 16, 2021 -
గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే!
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేస్తుంది. దీనికి తోడు ఏం కావాలన్నా వెతికి పెట్టే గూగుల్ తల్లి.. ఇంకేముంది..? యువత ఇష్టారీతిన ఏ అంశం పడితే ఆ అంశాన్ని గూగుల్‌లో శోధన చేసేస్తున్నారు. అయితే, మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి గూగుల్ శోధన చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఫోన్ ద్వారా వినియోగించే వారు నేరుగా ఆ మాధ్యమం సైట్ నుంచే లాగిన్ అవ్వాలని సూచిస్తున్నారు. పోర్న్ సైట్లు అసలు ఓపెన్ చేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. 1. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వాలు అందించే పథకాలను గూగుల్‌లో శోధన చేయొద్దు. పథకాలు అందుతాయన్న భావనతో అందించే వివరాలు తీసుకొని నకిలీ సైట్ నిర్వాహకులు సులభంగా మీ ఫోన్లోకి ప్రవేశిస్తారు. తద్వారా సమాచారం తస్కరించడంతోపాటు ఇతరత్రా ఇబ్బందులూ సృష్టించే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు ఈ హెచ్చరిక చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి ఆ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలే కానీ నేరుగా పథకం పేరుతో గూగుల్ శోధన చేయొద్దని వారు చెబుతున్నారు. 2. కస్టమర్ కేర్ నంబర్లు వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులపై ఏదైనా సమాచారం కావాలనుకుంటే కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేయడం పరిపాటిగా మారింది. రుణాల విషయంలోనూ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. కొంతమంది నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు సృష్టించి వాటి ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు. దీంతో, మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు నేరుగా ఫలానా కస్టమర్‌కేర్ నంబరు అని కాకుండా సదరు సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ కేర్ నంబరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే నకిలీ నంబరుకు ఫోన్ చేసి అడిగిన వివరాలన్నీ చెప్పడం వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు. 3. యాంటీ వైరస్, సాఫ్ట్వేర్లు అధికారిక గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారానే యాప్‌లు, యాంటీవైరస్‌లు డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నేరుగా యాంటీవైరస్‌లు శోధన చేసి డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్లో వైరస్ రావడంతోపాటు సమాచారం కూడా పొగొట్టుకోవాల్సి వస్తుంది. యాంటీ వైరస్ యాప్‌ల్లో నకిలీ ఉత్పత్తులను గుర్తించలేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 4. ఆన్లైన్ బ్యాంకింగ్ గూగుల్‌లో నకిలీ బ్యాంకుల వెబ్సైట్లు ఎక్కువగా వస్తున్నాయని, మొబైల్ ద్వారా బ్యాంకింగ్ వెబ్సైట్లు వెతికే క్రమంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల అధికారిక యూఆర్ఎల్ నుంచి లాగిన్ అవడం శ్రేయస్క రం అంటున్నారు. దీనివల్ల ఐడీ, పాస్వర్డ్లు తస్కరించడం అసాధ్యమని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకింగ్ సైట్లు చూడక తప్పనిసరి పరిస్థితి అయితే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వాటిని చూడాలని సూచిస్తున్నారు. 5. షాపింగ్ ఆఫర్లు, కూపన్కోడ్లు ఇటీవల కాలంలో ఆఫర్లు ఎక్కువ కావడంతో సైబర్ మోసగాళ్లు ఆ దిశగా వినియోగదారులను వలలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. షాపింగ్ ఎక్కడ చేస్తే ఆఫర్లు బాగా ఉంటాయి, కూపన్ కోడ్లు ఎలా పొందాలని వినియోగదారులు మొబైల్ ద్వారా శోధన చేయడంతో మోసగాళ్ల పని మరింత సులభం అవుతోందంటున్నారు. నకిలీ ఆఫర్లు, కూపన్లు ఆశ చూపి బ్యాంకుల సమాచారం లాగేసుకుంటున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: సామాన్యుడిపై మరో పిడుగు ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ఎస్బీఐ వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది.(చదవండి: అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం!) మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా జత చేయవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేల కనుక మీరు ఎస్బీఐ యోనో యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అంటే చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది. We have a good news! Now SBI customers can register their nominee by visiting our branch or logging into https://t.co/YMhpMw26SR.#SBI #StateBankOfIndia #OnlineSBI #InternetBanking pic.twitter.com/AMvWhExDre — State Bank of India (@TheOfficialSBI) February 3, 2021 ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా: మీరు మీ యూజర్పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత మెను నుంచి 'రిక్వెస్ట్ & ఎంక్వైరీస్' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి. మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి. ఇప్పుడు 'ప్రొసీడ్' టాబ్‌పై క్లిక్ చేయండి. నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. -
విదేశాల్లోని వారికి నగదు పంపాలా?
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్ అవుట్వార్డ్ రెమిటెన్స్) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్ రెమిటెన్స్) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్లైన్ రెమిటెన్స్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్ అభ్యర్థనలను అదే రోజు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు. పరిమితులు.. ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లుగా ఉంది. ఆన్లైన్ కొనుగోళ్లకూ ఇదే పరిమితి అమలవుతుంది. అయితే, బ్యాంకులు ఫారిన్ రెమిటెన్స్ లావాదేవీలకు సంబంధించి పలు రకాల పరిమితులను నిర్దేశిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనిష్టంగా ఒక లావాదేవీలో 100 డాలర్లు, గరిష్టంగా 12,500 డాలర్ల వరకే పంపుకునేందుకు అనుమతిస్తోంది. రెమిట్నౌ అనే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఒక కస్టమర్ ఈ మేరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు మించిన మొత్తాల్లో విదేశాల్లోని తమ వారికి పంపించాలని అనుకుంటే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంకు అయితే ఒక కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గరిష్టంగా 25,000 డాలర్ల వరకు విదేశాలకు పంపించుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ కస్టమర్‌కు ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ పరిమితి ఒక లావాదేవీలో రూ.10 లక్షలుగా అమల్లో ఉంది. అలాగే, ఎస్బీఐ కస్టమర్లు నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత మొదటి ఐదు రోజుల్లో మాత్రం కేవలం 50,000 వరకే పంపుకోగలరు. ఇక ఎల్ఆర్ఎస్ కింద కొన్ని దేశాలకు నగదు పంపుకునే అవకాశం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిషేధించిన దేశాలు లేదా యూఎస్ ట్రెజరీ ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ కస్టమర్లకు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని వారికి నగదు పంపుకునే అవకాశం ఉండదు. ఇక కొన్ని బ్యాంకులు కొన్ని రకాల ఫారిన్ కరెన్నీ రెమిటెన్స్లకే పరిమితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు 20 కరెన్సీల్లో ఫారిన్ రెమిటెన్స్‌లను ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ కస్టమర్లు అయితే యూఎస్ డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ మారకంలో రెమిటెన్స్‌లు చేసుకోవచ్చు. కమీషన్, చార్జీలు.. బ్యాంకులు ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్‌లకు సంబంధించి మారకం రేట్లను రోజువారీగా ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఫారీన్ అవుట్వార్డ్ రెమిటెన్స్‌ల లావాదేవీలకు బ్యాంకులు చార్జీలు, కమీషన్లను వసూలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 500 డాలర్ల వరకు లావాదేవీపై రూ.500 చార్జీని వసూలు చేస్తోంది. అదే 500 డాలర్లకు మించిన లావాదేవీలపై ఈ చార్జీ రూ.1,000గా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు అయితే వివిధ కరెన్సీల్లో వివిధ రకాల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్ రూపంలో అయితే చార్జీ 11.25 డాలర్లు, బ్రిటన్ పౌండ్ రూపంలో చార్జీ 10 పౌండ్లు ఇలా చార్జీలు మారిపోతుంటాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారీన్ రెమిటెన్స్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి.. విదేశీ రెమిటెన్స్ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి..? అటువంటప్పుడు ‘డీసీబీ బ్యాంకు రెమిట్ ఫెసిలిటీ’ని పరిశీలించొచ్చు. డీసీబీ బ్యాంకు ఖాతా దారులతోపాటు ఇతరులు అందరికీ ఇది అందుబాటులో ఉన్న సదుపాయం. పైగా విదేశీ రెమిటెన్స్ లావాదేవీలకు డీసీబీ బ్యాంకు ఎటువంటి చార్జీలను లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. పాన్ కార్డు ఉన్న వారు డీసీబీ బ్యాంకులో డీసీబీ రెమిట్ సదుపాయం కోసం బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వీరికి డీసీబీ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులో ఖాతా ఉండాలి. డీసీబీ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 డాలర్ల వరకు ఒక కస్టమర్ విదేశాలకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఇంతకు మించి పంపించుకోవాలంటే డీసీబీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ కూడా ఇటువంటి సదుపాయమే. ఇతర బ్యాంకు కస్టమర్లు విదేశాలకు నగదు పంపుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఐసీఐసీఐ బ్యాంకు శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కేవైసీ వివరాలు కూడా సమర్పించాలి. మనీ2వరల్డ్ ద్వారా రెమిటెన్స్‌లపై రూ.750 కమీషన్‌గా చెల్లించాలి. ఏజెంట్లు... నెట్ బ్యాంకింగ్ సదుపాయాల్లేని వారు నాన్ బ్యాంకింగ్ ఏజెంట్ల సేవలను ఫారిన్ రెమిటెన్స్ కోసం వినియోగించుకోవచ్చు. థామస్‌కుక్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ తదితర సంస్థలను ఫారీన్ రెమిటెన్స్ సేవలకు ఆర్బీఐ అనుమతించింది. అయితే, రెమిటెన్స్ లావాదేవీల పరంగా పరిమితులు సంస్థలను బట్టి మారిపోవచ్చు. చార్జీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. థామస్‌కుక్ ద్వారా ఆన్లైన్లో 5,000 వరకు డాలర్లను పంపుకోవాలంటే అందుకు గాను 8 డాలర్ల ఫీజును చెల్లించుకోవాలి. అంతకుమించిన లావాదేవీలపై ఫీజు రూ.11 డాలర్లుగా ఉంది. పన్నులు ఉన్నాయా..? విదేశీ రెమిటెన్స్‌పై కమీషన్లు/చార్జీలు, కరెన్సీ మారకం చార్జీలను పక్కన పెడితే.. పన్నుల భారం కూడా ఉంటుంది. పన్ను వర్తించే విలువపై 18% జీఎస్టీ చెల్లించాలి. పన్ను వర్తించే విలువ కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.60,000 వరకు ఉంటుంది. కనుక ఈ మొత్తంపై జీఎస్టీ రూ.45–10,800 మధ్య చెల్లించాల్సి రావచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7లక్షలకు మించి విదేశాలకు పంపితే 5% మూలం వద్ద పన్నును వసూలు (టీసీఎస్) చేస్తారు. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెమిటెన్స్ చేస్తుంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతమే. -
ఎక్కడండీ.. ఏటీఎం?
సాక్షి, బిజినెస్ విభాగం: పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు పెరిగిపోగా, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రిక్స్ దేశాల్లో ఒక్క భారత్‌లోనే లక్ష మంది ప్రజలకు అతి తక్కువ ఏటీఎంలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోవటానికి అసలు కారణం వాటిపై బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరిగిపోవటమేనని తెలుస్తోంది. ఆర్బీఐ నిర్దేశించిన కఠిన నియమ, నిబంధనలకు తోడు... లావాదేవీలకు అవుతున్న చార్జీలను కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోవడం, ఏటీఎం కేంద్రం నిర్వహణ, సెక్యూరిటీ ఖర్చు వెరసి బ్యాంకులకు ఆర్థికంగా భారం కావడంతో, దాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గతేడాది సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్ల ఆధునికీకరణ కోసం ఆర్బీఐ ఆదేశించడం వల్ల ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రానున్న కాలంలోనూ ఏటీఎంల క్షీణత ఉంటుందని అంచనా. పెరిగిన వినియోగం... ‘‘ఏటీఎంల సంఖ్య తగ్గడం ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పిరమిడ్‌లో సామాజిక, ఆర్థికంగా దిగువవైపున ఉండే వారిపై ఈ ప్రభావం ఉంటుంది’’ అని ఏటీఎం మెషీన్ల సరఫరా కంపెనీ హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ రస్టోమ్ ఇరానీ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఏటీఎంల విస్తరణ చాలా తక్కువగా ఉందని ఇరానీ పేర్కొన్నారు. వ్యయాలు పెరిగిపోవటమనేది ఏటీఎంల నిర్వహణపై బ్యాంకులను ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే లావాదేవీలపై విధించే ఫీజు ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పరిశ్రమ కమిటీ ఆమోదం లేనిదే ఈ ఫీజులను పెంచే పరిస్థితి లేదు. బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు మన దేశంలో ఏటీఎంలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్చేంజ్ ఫీజుగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో నగదు ఉపసంహరణ లావాదేవీపై ఇవి రూ.15ను వసూలు చేస్తున్నాయి. ఇంటర్చేంజ్ ఫీజు ఏటీఎంల వృద్ధి ఆగిపోవడానికి ప్రధాన కారణమని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ తెలిపారు. బ్యాంకులు తాము సొంతంగా ఏటీఎంలను నిర్వహించడం కంటే వేరే బ్యాంకులకు ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించడం చౌకగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఫీజులను పెంచడం పరిష్కారమని అందరూ భావించడం లేదని, ఒకవేళ ఫీజులు పెంచితే ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్లకే బదిలీ చేస్తాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీఈవో ఆర్.సుబ్రమణ్యకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో డిజిటల్ లావాదేవీల పెంపు కూడా ఒకటి. మోదీ సర్కారు చేపట్టిన జన్‌ధన్ యోజన తదితర కార్యక్రమాల ఫలితంగా 2014 తర్వాత 35 కోట్ల మందికి పైగా కొత్తగా బ్యాంకు సేవలకు అనుసంధానమయ్యారు. దీంతో ఏటీఎం వంటి కనీస ఆర్థిక సేవల అందుబాటు కీలకంగా మారింది. ఏటీఎంల సంఖ్య తగ్గుముఖానికి ఇతర అంశాలూ కనిపిస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణ మరో ప్రధాన అంశం. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం కూడా ఏటీఎంలు తగ్గడానికి కారణం. ఇక దేశంలోని ప్రతి రెండు ఏటీఎంలలో ఒకటి బ్యాంకు శాఖల వద్ద ఉన్నదే. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2018 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏకంగా 1,000 ఏటీఎంలను తగ్గించుకోవడం గమనార్హం. డిజిటలైజేషన్ పెరిగిపోవడం, మొబైల్, ఇంటర్నెట్ వ్యాప్తి సామాన్యులకూ చేరువ కావడంతో భవిష్యత్తులో బ్యాంకులు శాఖలపై ఆధారపడడం తగ్గిపోనుందని ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా తెలిపారు. మొబైల్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు పెరుగుతున్నట్టు ఫెడరల్‌బ్యాంకు సీఎఫ్‌వో అశుతోష్‌ఖజూరియా తెలిపారు. గత ఐదేళ్లలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 65% పెరిగాయి. మొబైల్ బ్యాం కింగ్ జోరుతో ఏటీఎంల సంఖ్య ఇక ముందూ తగ్గనుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. -
రాష్ట్రంలో 23 పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు పోస్టల్ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 23 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లోని డాక్‌సదన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్(సీపీఎంజీ) బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ మాట్లాడారు. పేమెంట్ బ్యాంక్ శాఖలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఒకే రోజు దేశ వ్యాప్తంగా 650 పోస్టల్ బ్యాంకులు, 3,250 అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సర్కిల్లో తొలివిడతగా 115 అనుబంధ కేంద్రాలు ప్రారంభించి.. డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్టల్ ఆఫీసులకు విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కరెంట్ ఖాతాల లావాదేవీలపై ఎటువంటి పరిమితి లేదని, సేవింగ్ ఖాతాలపై మాత్రం కొంత పరిమితి ఉందని స్పష్టం చేశారు. డోర్ స్టెప్ లావాదేవీలు..: ఇంటి వద్ద నుంచే పోస్టు మ్యాన్ వద్ద ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా కొత్త ఖాతాలు ప్రారంభించవచ్చని చంద్రశేఖర్ తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్, నగదు రహిత లావాదేవీలు, కరెంట్ తదితర లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం 3 నిమిషాల్లో లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు. సేవింగ్ ఖాతాలను రూ.100తో, కరెంట్ ఖాతాలను రూ.1000లతో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తున్నామని తెలిపారు. -
స్మార్ట్ ఫోన్లపై హ్యాకర్ల కన్ను
ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలకు ఎక్కువ మంది స్మార్టుఫోన్లనే వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరస్తులు మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి మీ విలువైన సమాచారం దొంగలించే అవకాశం ఉంది. ఇటీవల వెలుగు చూస్తోన్న సైబర్ నేరాల్లో హ్యాకింగ్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను సైతం హాకింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేసి కొత్త కార్డులు జారీ చేశాయి. ఇలా మీ స్మార్ట్ ఫోన్లలోకి వైరస్ రూపంలో ఓ సాఫ్ట్వేర్నుపంపి మీ మొబైల్ లావాదేవీలపై దుండగులు ఓ కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ బారి నుంచి రక్షించుకోవాలంటే, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అల్లిపురం(విశాఖదక్షిణ): స్మార్ట్‌ఫోన్ ఆన్ చేసేటప్పుడు పాస్‌వర్డ్‌ను అడిగేలా లాక్‌సెట్ చేసుకోవాలి. చీటికి మాటికి లాక్ తీయాల్సి వస్తుందని విసుగు చెందవద్దు. ఈ లాక్ పిన్పాస్వర్డ్, ప్యాట్రన్ లాక్ ఏదైనా కావచ్చు. ఓపెన్ వైఫైతో ప్రమాదమే కొందరు వారి ఫోన్లలో ఎప్పుడూ వైఫై/మొబైల్ డేటా ఆన్‌చేసి ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పని లేదు. మొబైల్ డేటా మాట అటుంచి వైఫై ఎప్పుడూ ఆన్లైన్లో ఉందనుకోండి. ఒక్కోసారి ఓపెన్ వైఫై/ పబ్లిక్ వైఫైలకు కనెక్ట్ అయితే హ్యాకర్ల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. వారు మీ డివైస్‌ను కంట్రోల్‌ను వారి చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆటో మేటిక్ వైఫై కనెక్షన్ ఆపేయండి. డేటా ఎన్క్రిప్షన్ ఎనాబుల్ చేసుకోవాలి స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళితే అక్కడ డేటా ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీ డివైస్‌లోని సమాచారాన్నిఅంత ఈజీగా ఎవరూ తస్కరించలేరు. ఎందుకంటే డివైస్‌లోని వివరాలన్నీ 256 బిట్ లేదా 128బిట్ సెక్యూరిటీతో లాక్ అయి ఉంటాయి. వాటిని ఓపెన్ చేయడం అంత సులభం కాదు. థర్డ్ పార్టీ యాప్‌ల జోలికి వెళ్లద్దు ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ఏది వాడినా వాటిలో ఆయాస్టోర్స్లో ఉండే అప్లికేషన్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్‌కు వెళ్లి కావాల్సిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రీగా లభిస్తున్నాయని ఇతర వేరే సైట్ నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇతరసైట్లలోని యాప్‌లన్నీ 99 శాతం వైరస్లు ఉంటాయి. ఇలా థర్డ్ పార్టీ స్టోర్ల నుంచి యాప్‌లను ఏ ఇన్స్టాల్ చేసుకోవద్దు. పోర్న్ (అశ్లీల) వెబ్ సైట్లతో ముప్పు కంప్యూటర్లలో పోర్న్ దృశ్యాలు ఏ విధంగా చూసేవారో ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో అశ్లీల వీడియోలు చూడడం కూడా ఎక్కువైంది. అయితేఇలా చేయడం మీ ఫోన్ రక్షణ విషయంలో ఏమాత్రం మంచిది కాదు. అలాంటి సైట్లలో మాల్వేర్, వైరస్లు చొరబడతాయి. బ్యాంకింగ్ లావాదేవీలు చేసే ఫోన్లలో పోర్న్ సైట్ల వైపు వెళ్లకండి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల విషయంలో జర జాగ్రత్త ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్లు మీకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఏదైనా బ్యాంకు నుంచివచ్చినట్లు కొన్నిసార్లు ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్లు, ఇన్స్టంట్, పుష్ మెసేజ్‌లు వస్తుంటాయి.అయితే వాటిని ఓపెన్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సాధారణంగా ఎవరికీ బ్యాంకింగ్ డిటెయిల్స్ ఇవ్వమని ఎవరిని అడగరు.బ్యాంకులైతే ఆ పని అసలు చెయ్యవని గమనించండి. కొన్ని మెసేజ్‌లకు, మెయిల్స్‌కు లింకులు ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఏదైనా ఆఫర్వస్తుందనో, లేదంటే మరో గిఫ్ట్ వస్తుందనోమెసేజ్లో మభ్య పెడతారు. అలాంటి సందర్భాల్లో ఆ లింకులను అసలు ఓపెన్ చెయ్యవద్దు. అదిహ్యాకర్ల విసిరిన వల అని జాగ్రత్త పడండి. ఈసూచనలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఆర్థిక లావాదేవీలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. బ్రౌజింగ్ సురక్షితం బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసే ఎంటర్ చేస్తే వచ్చే అడ్రస్ ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. బ్యాంకింగ్ సంబంధిత వెబ్సైట్ అయితే సైట్ అడ్రస్‌కు ముందు http://కచ్చితంగా ఉంటుంది. అలా లేదంటే ఆ సైట్ సురక్షితం కాదని తెలుసుకోండి. వెంటనే లావాదేవీలు ఆపేయ్యండి. -
మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే నష్టపోనక్కర్లేదు
♦ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై ♦ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ♦ పది రోజుల్లోనే ఖాతాలో తిరిగి జమ ♦ ఆలస్యం చేస్తే నష్టానికి బాధ్యత వారిదే న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని వివరించింది. న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని వివరించింది. -
అమ్మో.. ఆన్లైన్
= బ్యాంకర్లకు మోదం..వినియోగదారులకు ఖేదం = పాతబకాయిలకు జమవుతున్న క్యాష్ డిపాజిట్లు = రైతులు, చేనేతల ఇబ్బందులు ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సంతోష్‌కుమార్ అత్యవసర పని నిమిత్తం స్నేహితుణ్ని రూ.15 వేలు అప్పు అడిగాడు. అతను ఆన్లైన్ ద్వారా నగదును సంతోష్ అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు తీసుకుందామని పట్టణంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లిన సంతోష్‌కు నిరాశే ఎదురైంది. ఈ మొత్తం మీరు తీసుకున్న లోన్‌కు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరిగి వచ్చేశాడు.. = ధర్మవరంలోని మాధవనగర్‌కు చెందిన శ్రీనివాసులు అనే చేనేత కార్మికుడు తాను నేసిన చీరను శిల్క్హౌస్లో విక్రయించాడు. దుకాణ యజమాని చీరకు చెల్లించాల్సిన మొత్తం రూ.12 వేలను శ్రీనివాసులు అకౌంట్‌కు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని తీసుకుందామని కెనరా బ్యాంకుకు వెళ్లగా.. లోన్‌కు జయియందని చెప్పారు. ఇంకా రూ.20 వేలు చెల్లించేవరకు మీ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకునే వీలు లేదన్నారు. దీంతో చీర తయారీకి తెచ్చిన ముడిసరుకు అప్పు ఎలా తీర్చేది, కుటుంబ పోషణకు ఏం చేసేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ధర్మవరం మండలం రావులచెరువుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి తన తోటలో పండిన టమాటాలను కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో విక్రయించాడు. మండీ యజమాని రూ.8 వేలను ఆన్లైన్ ద్వారా రామ్మోహన్‌రెడ్డి అకౌంట్‌కు జమ చేశాడు. దీంతో ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. ‘మీరు బంగారు తాకట్టుపెట్టి అప్పుతీసుకున్నారు. బంగారాన్ని సకాలంలో విడిపించుకోలేదు. దీంతో వేలం వేశాం. వచ్చిన మొత్తంతో మీరు తీసుకున్న అప్పు పూర్తిగా తీరలేదు. బకాయి రూ.5వేలు ఉంద’ని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆ మొత్తం పోగా మిగిలిన రూ.3వేలు ఇచ్చి పంపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక మీదట ఆన్లైన్ లావాదేవీలు చేయాలన్న మాట కూడా ప్రజల్ని మరింత కష్టాలపాలు చేస్తోంది. మరీముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారం చేనేత కార్మికులు, రైతులకు గుదిబండగా మారింది. వారు చేస్తున్న క్యాష్ డిపాజిట్లు గతంలో ఉన్న పాత బకాయిలకు జమ అవుతున్నారుు. ముఖ్యంగా రైతులు తాము తీసుకున్న క్రాప్, టర్మ్, సబ్సిడీ లోన్లు బ్యాంకులో తీసుకుని బకాయిలుంటే.. ఇప్పుడు తమ వద్దనున్న పెద్దనోట్లను డిపాజిట్ చేస్తే ఆ బకాయిలకు జమ అవుతున్నాయి. మొన్న ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడ్డ చాలా మంది రైతులు తమ పంట రుణాలను రెన్యూవల్ చేయలేదు. ఇటువంటి వారందరూ ఏదైనా పంట విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా తమ అకౌంట్లలోకి జమ చేయించుకుంటే.. వెంటనే పాత అప్పులకు వెళుతోంది. దీనివల్ల అత్యవసర కార్యమో..పంట సాగు చేయాలని తలపెట్టిన వారి పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. చేనేత కార్మికులది మరోసమస్య ధర్మవరంలో చేనేత కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు. వీరికి గతంలో మగ్గాలపై తీసుకున్న అప్పులు, సబ్సిడీ రుణాలకు సంబంధించిన బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చేనేత రుణమాఫీలో జాప్యం చేయడంతో రెండున్నరేళ్లకు సంబంధించిన వడ్డీ భారం పడింది. ప్రభుత్వ చేసిన రుణమాఫీ మొత్తం పోను.. వడ్డీ మొత్తం అలాగే బకాయిగా బ్యాంకుల్లో మిగిలి ఉంది. ప్రస్తుతం చేనేత కార్మికులు నగదు డిపాజిట్ చేసినా, పట్టు చీరలు విక్రరుుంచగా వచ్చిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా జమ చేయిచుకున్నా.. మొత్తం ఆ బకాయిలకు జమవుతోంది. దీంతో చేనేత కార్మికులు పడరానిపాట్లు పడుతున్నారు. చేనేత, రైతులే కాదు.. వివిధ రంగాల కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు కూడా ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. గతంలో బకాయిదారుల చుట్టూ తిరిగినా వసూలు కాని మొత్తాలు ఇప్పుడు తమ ప్రమేయం లేకుండానే వసూలు అవుతుండడంతో బ్యాంకర్లు లోలోన సంతోషపడుతున్నారు. -
పాస్వర్డ్స్ ఇప్పటికీ అవేనా..?
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఈ–మెయిల్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ దాకా, ఫేస్బుక్ నుంచి ఆన్లైన్ షాపింగ్ దాకా అనేక ఖాతాలు వినియోగిస్తుంటాం. వీటన్నిటి పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టతరమైన విషయమే! అయితే ఆన్లైన్ రూపేణా నేరాలు కొత్త రూపు సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పటికీ చాలా మంది పాస్‌వర్డ్‌లుగా వరుస నంబర్లు, ఆల్ఫాబెట్లు, మొబైల్ నంబర్లు, పేర్లను వినియోగిస్తున్నారని తేలింది. ఇలాంటి సులభతరమైన పాస్వర్డ్స్ ఆన్లైన్ కేటుగాళ్ల పనిని మరింత సులువు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీ పాస్వర్డ్ సురక్షితమేనా? – సాక్షి, ఏపీ డెస్క్ లీక్ అయిన ‘యాహూ’ డేటాబేస్‌ను విశ్లేషించగా, ఇప్పటికీ చాలా మంది ‘123456’, ‘పాస్వర్డ్’ వంటి వాటినే పాస్‌వర్డ్‌లుగా వినియోగిస్తున్నట్లు తేలింది. ఎక్కువగా వినియోగించే వాటిలో ‘ఏబీసీ123’, ‘క్వెర్టీ' వంటివి టాప్–10లో ఉన్నాయని లాన్‌కాస్టర్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు వెల్లడించారు. ఇలాంటి సులభమైన వాటిని పాస్‌వర్డ్‌లుగా ఎంచుకోవడం ద్వారా తమ ఖాతాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే వీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్ భద్రతపై అవగాహన లేకపోవడమే ఇలాంటి పాస్వర్డ్లు వినియోగించడానికి ప్రధాన కారణమని పరిశోధకులు డాక్టర్ జెఫ్ యాన్ తెలిపారు. రెడ్ సిగ్నల్ మాదిరే ఇవీనూ... ‘రోడ్డుపై రెడ్ సిగ్నల్ పడితే ఏం చేయాలో అందరికీ తెలుసు. ‘123456’ లాంటి పాస్వర్డ్లు కూడా అలాంటివే. పాస్‌వర్డ్‌కు ఇవి సరైన ఎంపిక కాదు’ అని జెఫ్ అభిప్రాయపడ్డారు. యాహూ డేటా ప్రకారం టాప్–10 పాస్‌వర్డ్‌లలో వెల్కమ్, సన్‌షైన్, ప్రిన్సెస్ వంటివి ఉన్నాయి. చాలామంది తమ పేరు, పుట్టిన తేదీ, వయసు ఉపయోగించి పాస్‌వర్డ్‌లను రూపొందించుకున్నట్లు తేలింది. అల్గారిధమ్తో అంచనా.. చైనాలోని లాన్‌కాస్టర్ యూనివర్సిటీ, పెర్కింగ్ అండ్ ఫుజియాన్ నార్మల్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం.. పాస్‌వర్డ్‌లను అంచనా వేసే ఓ అల్గారిధమ్‌ను రూపొందించింది. వీరు ఏకంగా 73 శాతం మంది సాధారణ యూజర్ల ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్‌లను దీని ద్వారా కనుగొన్నారు. ఆన్లైన్ భద్రతపై అవగాహన ఉన్న వారి ఖాతాలకు సంబంధించి సుమారు 100 ప్రయత్నాల్లో మూడొంతుల పాస్‌వర్డ్‌లను గుర్తించగలిగారు. ఏ పాస్వర్డ్ సేఫ్ కాదు: హ్యాకర్ సర్వే సైబర్ దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. బ్లాక్ హ్యాట్ 2016– హ్యాకర్ సర్వే నివేదిక ప్రకారం ఏ పాస్వర్డ్ కూడా సేఫ్ కాదని 77 శాతం మంది హ్యాకర్లు పేర్కొనడం గమనార్హం. సమాచార గోప్యతకు మద్దతునిస్తున్నట్లు 98 శాతం మంది చెప్పినప్పటికీ, ఒక వేళ డబ్బు ఇస్తే పాస్వర్డ్ హ్యాక్ చేసేందుకు సిద్ధమని సగం మంది పేర్కొన్నారు. ఇక సరదా కోసం హ్యాక్ చేస్తున్నామని 9 శాతం మంది చెప్పడం విచిత్రం! సూచనలు.. l పాస్వర్డ్ కనీసం 8 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. l వేర్వేరు ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను వినియోగించడం మంచిది. l వ్యక్తిగత సమాచారం ఉపయోగించొద్దు. l అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్లు, నంబర్లు, సింబల్స్‌తో కూడిన పాస్వర్డ్ రూపొందించుకుంటే మంచిది. l పాస్వర్డ్ మేనేజర్ వాడడం ఉపయుక్తం టాప్–10 వరస్ట్ పాస్వర్డ్స్ 1. 123456 2. పాస్వర్డ్ 3. వెల్కమ్ 4. నిన్జా 5. ఏబీసీ123 6. 123456789 7. 12345678 8. సన్‌షైన్ 9. ప్రిన్సెస్ 10. క్వెర్టీ -
అక్షరాలు మార్చి దోచేస్తారు!
► నగరంలోని వ్యాపార సంస్థల మెయిల్స్ హ్యాక్ ► ఇంటర్నెట్లో పొంచి ఉన్న ‘అకౌంట్ టేకోవర్లు’ ► ఆరు నెలల్లో 24 సంస్థలకు నేరగాళ్లు టోకరా ► రూ.12 కోట్లు స్వాహా చేసిన క్రిమినల్స్ లాటరీలు, బహుమతుల పేరుతో టోకరా వేయడం మొన్నటి స్టైల్... ఉద్యోగాలు, సెల్టవర్ల ఏర్పాటు పేరుతో ఎర వేయడం నిన్నటి పంథా... ఇవేవీ కాకుండా హ్యాకింగ్, స్ఫూఫింగ్ మెయిల్స్ ద్వారా ఏకంగా ఖాతాలనే మార్చేయడం నేటి శైలి. హ్యాకింగ్ తర్వాత స్ఫూఫింగ్... ఇలా హ్యాక్ చేసిన ఈ-మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేడయం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వీటి సర్లర్వు విదేశాల్లో ఉండటం నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ సైట్లోకి ఎంటర్ అయ్యాక సదరు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తర్వాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి ఓ లేఖ మెయిల్ చేస్తారు. అందులో అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలోకి చేరుతోంది. అకౌంట్ టేకోవర్ ఈ-మెయిల్స్ పెట్టుబడిగా ఆన్లైన్లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఇటీవల చేస్తున్న నేరం ‘అకౌంట్ టేకోవర్’. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయంలో బ్యాంక్ ‘ఖాతా’ మార్చేసి తేలిగ్గా రూ.లక్షలు, రూ.కోట్లలో స్వాహా చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో సైబరాబాద్ పరిధిలోని 24 కంపెనీలు ఈ నేరగాళ్ల బారినపడి రూ.12 కోట్లకు పైగా నష్టపోయాయి. బాధిత కంపెనీల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపార సంస్థలే టార్గెట్‌గా బాట్నెట్ ఎటాక్స్ అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్‌కు నాంది ఆయా వ్యాపార సంస్థల ఈ-మెయిల్స్ హ్యాక్ చేయడంతో ద్వారా పడుతుంది. వ్యాపార సంస్థల వెబ్సైట్ ద్వారా సైబర్ నేరగాళ్లు వాటి క్రయవిక్రయాల ఈ-మెయిల్స్‌ను గుర్తిస్తున్నారు. వీటికి వైరస్ ఎటాచ్‌మెంట్‌తో కూడిన ఈ-మెయిల్స్ పంపుతున్నారు. సాధారణంగా ఈ మెయిల్స్‌ను నిర్వహించేది అకౌంటెంట్స్ కావడంతో వారికి సైబర్ నేరాలపై అవగాహన ఉండట్లేదు. దీంతో వారు నేరుగా వీటిని ఓపెన్ చేయడంతో ఎటాచ్మెంట్ రూపంలో ఉండే వైరస్ ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతోంది. దీన్ని ‘బాట్నెట్ ఎటాక్’ అని పిలుస్తారు. దీంతో ఆ కంప్యూటర్లో ఉండే సమస్త సమాచారంతో పాటు ఈ-మెయిల్ సంప్రదింపుల్నీ నేరగాళ్లు వీక్షించే అవకాశం ఏర్పడుతోంది. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రెండు దేశాల మధ్య ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. పేర్లలో స్వల్ప మార్పు చేసి... ఆయా కంపెనీలను పోలిన పేర్లతో స్వల్ప అక్షరాల తేడాతో సైబర్ నేరగాళ్లు విదేశాల్లో సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ఆధారంగా డొమైన్లు ఖరీదు చేసి, ఆయా సంస్థల పేర్లతోనే ఈ-మెయిల్స్ సృష్టిస్తున్నారు. దీని ఆధారంగా నగదు పంపాల్సిన సంస్థకు ఈ-మెయిల్ పెడుతున్నారు. ఆదాయ పన్ను సమస్యనో, ఆడిటింగ్ కారణంగానే బ్యాంకు ఖాతా మారినట్లు అందులో పేర్కొంటున్నారు. విదేశాల్లో తెరిచిన ఖాతాల వివరాలు అందించి నగదు వాటిలో జమయ్యేలా చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని 24 కంపెనీలను టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాలను పోలెండ్, స్పెయిన్, ఫ్రాన్స్, లండన్లతో పాటు కజకిస్థాన్ల్లో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీని ఆధారంగానే పోలీసులు ఆయా దేశాల్లో సైబర్ నేరగాళ్ల ఏజెంట్లు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని కేవలం 36 దేశాలతోనే భారత్‌కు దర్యాప్తు సహకారం, నేరస్తుల మార్పిడి ఒప్పందాలున్నాయి. ఈ ఖాతాలన్నీ ఆ జాబితాలో లేని దేశాల్లో ఉండటంతో కనీసం ఖాతా తెరిచిన వారి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోంది. చిక్కకుండా జాగ్రత్తలు... సౌతాఫ్రికా దేశాల కేంద్రంగా ఈ వ్యవహారాలు సాగిస్తున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. దీంతో ఇక్కడివే, బోగస్ చిరునామాలతో తెరుస్తున్నారు. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ఆయా దేశాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామని ఈ ఏజెంట్లు అక్కడి నిరుద్యోగులకు గేలం వేస్తున్నారు. కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఖాతాలంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది. త్వరగా ఫిర్యాదు చేస్తే కొంత మేలు... ఆర్టీజీఎస్ ద్వారా దేశంలోని ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ కావాలంటే.. అది ఆర్బీఐ ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రతి బ్యాంక్‌కు ఆర్బీఐలో ఖాతాలు ఉంటాయి. వీటి ఆధారంగానే ఆర్టీజీఎస్ లావాదేవీలన్నీ సాగుతాయి. డిపాజిట్ చేసిన బ్యాంకు నుంచి నగదు ఆర్బీఐ ద్వారా అది చేరాల్సిన బ్యాంకు బ్రాంచ్‌కు చేరుతుంది. ఇందంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇక విదేశాలల్లోని బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ కావాలంటే ఆర్బీఐ స్థానంలో ఇంటర్మీడియేటరీ బ్యాంకుల ద్వారా జరుగుతుంది. దీనికి కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. ఈ సందర్భాల్లో ఎక్కడా అకౌంట్ హోల్డర్ పేరు, ఇతర వివరాల ప్రస్తావన ఉండదు. కేవలం బ్యాంకులు, వినియోగదారులకు కేటాయించిన ప్రత్యేక నెంబర్ల ద్వారానే జరిగిపోతుంది. అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్ ద్వారా మోసపోయిన వారు ఎవరైనా తక్షణం గుర్తించి ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. నగదు ఇంటర్మీడియేటరీ బ్యాంకు దాటిందంటే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే... ఇటీవల ఈ తరహా నేరాలు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరానికి చెందిన 24 సంస్థలు రూ.12 కోట్లకు పైగా నష్టపోయాయి. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ ఖాతా మారిందంటూ మీకు కస్టమర్ పంపినట్లు మెయిల్ వస్తే అనుమానించి వారిని సంప్రదించండి. మీ ఖాతా మారితే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని మీరు లావాదేవీలు నెరిపే వారికి స్పష్టంగా చెప్పండి. నిర్థారించుకోకుండా నగదు లావాదేవీలు చేయొద్దు. ఈ సంప్రదింపులకూ ఈ-మెయిల్‌ను ఆశ్రయించవద్దు. ఎందుకంటే అది అప్పటికే సైబర్‌నేరగాళ్ల చేతిలో ఉంటుంది. ఫోన్ కాల్, ఫ్యాక్స్‌ల ద్వారా ఈ నిర్ధారణ చేసుకోండి. - మహ్మద్ రియాజుద్దీన్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సైబరాబాద్ -
ఆన్లైన్ బ్యాంకింగ్ సురక్షితమేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. మన క్రికెట్ టీమ్ ఎప్పుడూ పేపర్ మీద బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్లోకి వెళ్లాకే అసలు విషయం తేలుతుంది. క్రికెట్ టీమ్‌లాగే ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారం కూడా. పేపర్ మీద, నిబంధనల పరంగా చూస్తే.. ఆన్లైన్ బ్యాంకింగ్ సురక్షితంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జరగాల్సిన తంతు జరిగిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. హైదరాబాద్‌కు చెందిన రఘు అనే వ్యక్తి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు రూ.1.23 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు ఎలా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యిందో అతనికి కూడా తెలియదు. బ్యాంక్ దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకుంటే.. ఆ డబ్బు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అకౌంట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును తిరిగి రికవరీ చేసుకోవాలంటే చాలా సమయం పట్టొచ్చు. ఇలాగే ఆన్లైన్లో ఎన్నో రకాల మోసాలు జరుగుతూవుంటాయి. ఇలాంటివాటి బారిన పడకుండా వుండాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్‌కు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు ఇవి... * ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉండాలి. * పబ్లిక్ కంప్యూటర్లలో లాగిన్ అవకపోవడం మంచిది. * మీ అకౌంట్ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. * సేవింగ్స్ అకౌంట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే అకౌంట్ నోటిఫికేషన్సను సెట్ చేసుకోవాలి. * లెసైన్స్డ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. * అవసరం లేని సమయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయాలి. * తెలియని మెయిల్స్‌ను ఓపెన్ చేయకూడదు. * ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పూర్తై వెంటనే లాగ్అవుట్ అవ్వండి. * మీ అకౌంట్లో ఏవైనా తెలియని లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. -
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్లు
లండన్: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్‌కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్మెంట్స్. పాతబడిన నంబర్ల పద్ధతికి బదులుగా సరదాగా ఉండే ఎమోజీలను పాస్ కోడ్లుగా వాడటమనేది 15-25 ఏళ్ల యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుందని సంస్థ ఎండీ డేవిడ్ వెబర్ చెప్పారు. 0-10 దాకానే ఉండే అంకెలతో పోలిస్తే 44 ఎమోజీల కాంబినేషన్లు మరింత సురక్షితంగా ఉంటాయని వివరించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాచార మార్పిడి కోసం... వివిధ రకాల హావభావాలతో కూడిన చిత్రాలను ఎమోజీలుగా వ్యవహరిస్తారు. -
హైటెక్ మోసం
* బ్యాంక్ ఖాతా నుంచి రూ. 52 వేలు స్వాహా * హైదరాబాద్‌లో లావాదేవీలు * లబోదిబోమంటున్న బాధితుడు ముత్తారం :ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న మోసగాళ్లు రోజురోజుకూ హైటెక్ తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముత్తారం మండలం బుధవారంపేట(రామయ్యపల్లి)కి చెందిన కన్నూరి సదయ్య ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ.52 వేలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం.. మంథని ఆంధ్రాబ్యాంకులో 0843100008712 నంబరుతో ఖాతా ఉంది. దీనిపై 4688 1708 4305 9785 న ంబర్ గల ఏటీఎం కార్డు ఉంది. ఇటీవలే గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయగా దానికి సంబంధించిన వాయిదా కిస్తీ చెల్లించడం అప్పుగా తెచ్చుకున్న రూ. 61,500 బ్యాంకు ఖాతాలో జమచేశాడు. ఈనెల 2న సదయ్య మొబైల్‌కు ఫోన్ వచ్చింది. తాము ఏటీఎం కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు బ్యాంకు ఖాతా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏటీఎం తీసుకున్నారా? దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తున్నారా? కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పండి అని అడిగారు. ఇదంతా నిజమేననుకున్నా సదయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. జవాబులు చెప్పిన రోజే ఆయన ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయి. అయితే భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించే గడువు రావడంతో బ్యాంక్‌లోని డబ్బులు డ్రా చేయడం కోసం వెళ్లిన ఆయనకు అసలు నిజం తెలియడంతో లబోదిబోమన్నాడు. తాను డబ్బులు డ్రా చేయకుండా ఎలా ఖాతా నుంచి డ్రా అవుతాయని మేనేజర్ నిలదీయడంతో ఆయన చెప్పిన నిజాన్ని విని సదయ్య షాక్‌కు గురయ్యాడు. ఈ నెల 2 నుంచి 5 వరకు దాదాపు రూ.52 వేలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయిన ట్లు మేనేజర్ వివరించారు. ఇట్టి డబ్బులు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ప్రాంతంలో డ్రా అయినట్లు స్పష్టం చేశారు. ఆందోళన గురైన ఆయన ముత్తారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ విషయంపైన బ్రాంచీ మేనేజర్ సత్యనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయని, అయితే ఎవరు స్వాహా చేసిన విషయం తెలియదని చెప్పారు. హైటెక్ మోసంపై తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఆన్లైన్ బ్యాంకింగ్‌కు కొత్త వైరస్ ముప్పు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలకు తాజాగా మరో వైరస్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. యూజర్ల డేటా, పాస్‌వర్డ్‌లను చోరీ చేసే ‘డెరైజా’ వైరస్ శరవేగంగా సిస్టమ్స్‌లోకి చొరబడుతోంది. ప్రమాదకరమైన ట్రోజన్ వైరస్ కోవకి చెందిన డెరైజా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్) ఆన్లైన్ బ్యాంకింగ్ కస్టమర్లను హెచ్చరించింది. అసలైన బ్యాంకుల నుంచే వచ్చినట్లు అనిపించే ఈమెయిల్స్‌లో అటాచ్మెంట్ రూపంలో ఈ వైరస్ వస్తుందని పేర్కొంది. పొరపాటున దీన్ని ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్‌లో తిష్టవేసి బ్యాంకింగ్ పాస్వర్డ్లు మొదలైన వాటిని తస్కరిస్తుందని హెచ్చరించింది. వైరస్‌తో ముప్పు ఇదీ.. సెర్ట్-ఇన్ వివరాల ప్రకారం స్పామ్ మెసేజీల కింద ఈమెయిల్లో జిప్ లేదా పీడీఎఫ్ అటాచ్మెంట్ల రూపంలో ఈ వైరస్ వ చ్చే అవకాశం ఉంది. ఈ అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేసుకుని, అందులోని ప్రోగ్రామ్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ బ్యాంకు సూచిస్తున్నట్లుగా ఈమెయిల్ సారాంశం ఉంటుంది. దానికి అనుగుణంగా జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అన్జిప్ చేసిన పక్షంలో అందులోని మాల్వేర్ ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత భద్రతకు సంబంధించిన సెటింగ్స్ అన్నింటినీ కూడా ఛేదిస్తుంది. బ్రౌజర్‌ను హైజాక్ చేయడం, కీ స్ట్రోక్స్ వివరాలను వైరస్ రూపకర్తకు చేరవేయడం మొదలైనవి చేస్తుంది. ఇది క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సహా వివిధ వెబ్ బ్రౌజర్లలో ప్రమాదకరమైన కోడ్‌ను ఈ మాల్వేర్ పొందుపరుస్తుంది. ఫలితంగా యూజరు తన బ్యాంకు వెబ్సైట్ పేరును టైప్ చేసినప్పుడు ముందుగా .. వైరస్ సర్వర్‌కు సంకేతాలు వెడతాయి. ఆ తర్వాత అసలు సిసలు బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ టైప్ చేసే వివరాలన్నీ కూడా వైరస్ సర్వర్‌కు చేరిపోతాయి. జాగ్రత్త చర్యలు.. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సెర్ట్-ఇన్ సూచించింది. డాట్ వీబీఎస్, బీఏటీ, ఈఎక్స్ఈ, పీఐఎఫ్, ఎస్సీఆర్ ఎక్స్‌టెన్షన్స్‌తో వచ్చే ఈమెయిల్ అటాచ్‌మెంట్స్‌ను బ్లాక్ చేసేలా ఈమెయిల్ సెటింగ్స్‌ను మార్చుకోవాలని పేర్కొంది. అలాగే ఇంటర్నెట్, లోకల్ ఇంట్రానెట్ సెక్యూరిటీ జోన్ సెటింగ్స్‌ను అధిక స్థాయికి పెంచుకోవాలని తెలిపింది. సాధ్యమైనంత వరకూ విశ్వసించతగని వెబ్సైట్లను బ్రౌజ్ చేయొద్దని, ఫైర్‌వాల్‌ను యాక్టివ్‌గా ఉంచాలని సూచించింది. అలాగే తెలియని ఐడీల నుంచి వచ్చే మెయిల్స్‌ను తెరవొద్దని, సాధ్యమైనంత వరకూ యాంటీ మాల్వేర్ ఇంజిన్స్‌ను స్కాన్ చేసుకుని, అప్-టు-డేట్ ఉండేలా చూసుకోవాలని సెర్ట్-ఇన్ తెలిపింది. -
సైబర్ నేరం కింద నైజీరియా దేశస్తుడి అరెస్ట్
తిరుచానూరు: సైబర్ నేరానికి పాల్పడ్డ నైజీరియా దేశస్తుడిపై తిరుచానూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలాగే అతడిని నిర్బంధించిన 16 మందిని సైతం అరెస్టు చేశారు. తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి కథనం మేరకు... నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్(39) సంపాదన కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ మ్యాక్స్‌వెల్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన వెంకటరమణ నాయుడుకు లారాజమ అనే మహిళ పేరుతో వీరు ఈ మెయిల్ పంపిం చారు. ‘జింబాబ్వేదేశం శెనగల్ పట్టణంలోని రెస్క్యూ హోమ్‌లో ఉంటున్నాను. అంతర్యుద్ధంలో మా తండ్రి మరణించాడు. ఆయనకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తి నా పేరుమీద ఉంది.. రెస్క్యూ హోమ్ నుంచి నేను బయటపడేందుకు డబ్బు అవసరం. ఆ మొత్తాన్ని పంపిస్తే నేను బయటకొచ్చి నాకు సాయం చేసినందుకు అధిక మొత్తంలో నగదు పంపిస్తా’ అని మెయిల్లో తెలిపారు. నగదును ఓ బ్యాంకు అకౌంట్లో వేయాలని తెలిపారు. దీంతో వెంకటరమణ నాయుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రూ.3.61లక్షలు చె ల్లించాడు. కొద్దిరోజుల తరువాత వెంకటరమణ నా యుడికి వారు ఒక పెట్టెను పంపించారు. అందులో అమెరికన్ డాలర్లు ఉన్నాయని, దాంతో పాటు ఒక రసాయనాన్ని పంపించామని, ఆ రసాయనంతో నో ట్లపై రుద్దితే డాలర్లుగా మారుతాయని సూచించారు. ఆ ప్రకారం వెంకటరమణనాయుడు రసాయనాన్ని రుద్దగా నల్లకాగితాలు బయటపడ్డాయి. బాధితుడు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వారికి వివరించాడు. వారు మరో రసాయనాన్ని వాడాల్సి ఉందని, దీని కోసం ఇంకా డబ్బు పంపించాలని తెలిపారు. దీంతో మోసపోయానని భావించిన వెంకటరమణనాయు డు ఎలాగైనా పోయిన డబ్బును రాబట్టుకునేందుకు పథకం పన్నాడు. ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానంటూ వారికి మెయిల్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఇమ్మాన్యుయేల్ విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. వెంకటరమణనాయుడు తో పాటు మరో 15మంది కుర్రాళ్లు అతడిని మంచి మాటలు చెప్పి తనపల్లి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. డబ్బు చెల్లించాలంటూ డిమాం డ్ చేశారు. తాను నిర్భంధానికి గురైనట్లు తెలుసుకు న్న ఇమ్మాన్యుయేల్ వెంటనే మ్యాక్స్‌వెల్‌కు జరిగిన సంగతి వివరించాడు. అతను పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి, ఎస్ఐ సూర్యనారాయణ సిబ్బంది తో కలిసి మంగళవారం అర్ధ రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తెలిసిన వివరాల మేరకు ఇమ్మాన్యుయేల్‌పై బుధవారం సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇమ్మాన్యుయేల్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు వెంకటరమణ నాయుడుతో పాటు మరో 15మంది యువకులపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.